‘అంతరిక్షం’కు క్లీన్‌ ‘యు’ | Antariksham Completes Censor With U | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 15 2018 12:36 PM | Last Updated on Sat, Dec 15 2018 12:41 PM

Antariksham Completes Censor With U - Sakshi

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న తొలి తెలుగు స్పేస్‌ చిత్రం అం‍తరిక్షం. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్‌ వ్యోమగామిగా నటిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 21న రిలీజ్‌ కానుంది.

తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అంతరిక్షం సినిమా క్లీన్‌ యు సర్టిఫికేట్‌ సాదించింది. వరుణ్‌ సరసన అదితి రావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్‌ రెడ్డి, క్రిష్‌(దర్శకుడు) సంయుక్తంగా నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement