మహేష్ థియేటర్‌లో ‘అంతరిక్షం’ ఈవెంట్‌ | Antariksham Trailer Will be Launched in Mahesh Babu Multiplex AMB Cinemas | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 6 2018 2:53 PM | Last Updated on Thu, Dec 6 2018 2:53 PM

Antariksham Trailer Will be Launched in Mahesh Babu Multiplex AMB Cinemas - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్‌లో ఏఎంబీ పేరుతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన థియేటర్లలో సినిమా ప్రదర్శనతో పాటు సినిమా ఈవెంట్లను కూడా నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లో తొలి ఈవెంట్‌ నిర్వహించుకోబోతున్న సినిమా అంతరిక్షం.

ఘాజీ ఫేం సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న అంతరిక్షం సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఏఎంబీ సినిమాస్‌లో నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 9 ఉదయం 11 గంటలకు చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినిమా ప్రముఖల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్. దర్శకుడు నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, అదితిరావ్‌ హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement