సంకల్ప్‌.. ఈ సారి నేలమీదే, కానీ..! | Ghazi And Antariksham Fame Sankalp Reddy Next Movie Update | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 29 2019 10:50 AM | Last Updated on Tue, Jan 29 2019 10:50 AM

Ghazi And Antariksham Fame Sankalp Reddy Next Movie Update - Sakshi

రానా ప్రధాన పాత్రలో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమా ఘాజీ. తొలి అండర్‌వాటర్‌ వార్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడు సంకల్ప్‌ రెడ్డికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఘాజీ తరువాత రెండో ప్రయత్నంగా మరో ప్రయోగం చేశాడు సంకల్ప్‌. వరుణ్ తేజ్‌ హీరోగా స్పేస్‌బ్యాక్‌ డ్రాప్‌లో అంతరిక్షం సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది.

తాజాగా సంకల్ప్‌ తన మూడో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తొలి సినిమాను సముద్రంలో, రెండో సినిమాను అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కించిన సంకల్ప్‌ మూడో సినిమాను మాత్రం నేల మీదే చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ సినిమాలో కూడా తన మార్క్‌ కనిపించేలా అంటార్కిటికా మంచులో జరిగే పరిశోదనల నేపథ్యంలో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement