
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ టైటిల్‌ను పోస్ట్ చేశారు.
తన అంతరిక్ష ప్రయాణాన్ని వెండితెరపై చూపించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఫిదా, తొలిప‍్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్షం నేపథ్యంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. మూవీ టైటిల్‌ను ‘అంతరిక్షం’ అని రివీల్ చేశారు. వరుణ్ తేజ్ అంతరిక్షంలో ఉన్న ఓ ఫొటోను ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్‌గా మారింది.
ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అంతరిక్షం’ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీలో అదితి రావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయా గ్రాహకుడు. ఈ డిసెంబర్ 21న సినిమాను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Christmas 2018 release... First look poster + title announcement of Telugu film #Antariksham9000KMPH... Stars Varun Tej, Aditi Rao Hydari and Lavanya Tripathi... Directed by Sankalp Reddy... 21 Dec 2018 release. pic.twitter.com/OwSuu5bcCr
— taran adarsh (@taran_adarsh) 15 August 2018