
దాదాపు వెయ్యిమంది ఫైటర్స్‌తో పోరాడటానికి రెడీ అవుతున్నారట రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. తాజాగా ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్ చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలిసింది.
(చదవండి: పెళ్లెప్పుడంటే! వడివేలు స్టైల్లో విషయం చెప్పేసిన కీర్తి.. ఎంతైనా మహానటి కదా!)
హైదరాబాద్ శివార్లలో ఆల్రెడీ ఈ ఫైట్ కోసం సెట్ వర్క్ కూడా పూర్తి చేశారట. ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్న ఈ క్లైమాక్స్ చిత్రీకరణ వచ్చే నెల తొలి వారం వరకూ జరుగుతుందని సమాచారం. కాగా ఈ ఫైట్ చిత్రీకరణలో దాదాపు వెయ్యిమంది స్టంట్‌మ్యాన్‌లు పాల్గొంటారట. అలాగే ‘కేజీఎఫ్’ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అండ్ అరివు ఈ క్లైమాక్స్ ఫైట్‌ను కొరియోగ్రాఫ్ చేయనున్నట్లు సమాచారం. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment