‘‘రవితేజగారితో ఎన్నో చిత్రాలు చేశాం. కానీ ‘టైగర్ నాగేశ్వర రావు’ మాత్రం కొత్త అనుభూతినిచ్చింది. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్‌ని ప్రేక్షకులు నిజంగా జరుగుతున్నట్లు భావిస్తారు’’ అన్నారు ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్. రవితేజ హీరోగా, నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది.
ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్స్‌గా చేసిన రామ్–లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘మేం స్టూవర్ట్‌పురం ప్రాంతంలోనే పుట్టి పెరిగాం. ‘టైగర్ నాగేశ్వరరావు’ గారి గురించి ఊహకు అందని విషయాలు విన్నాం. రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారని, దొంగతనం చేస్తానని చెప్పి మరీ చేసేవారని, చెట్లపై కూడా పరిగెత్తెవారని.. ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు వినేవాళ్ళం. సవాల్ చేసి దొంగతనం చేయడం అంత ఈజీ కాదు.
అందరికీ చెప్పి దొంగతనం చేసి అక్కడ నుంచి తప్పించుకునే ఒక పాత్రని చూస్తున్నపుడు రియల్ హీరోయిజం కనిపిస్తుంది. ఆయన చెన్నై జైలు నుంచి ఎస్కేప్ అయ్యారు. ఆయనకి టైగర్ అనే బిరుదు పోలీసులు ఇచ్చారు. ఒక దొంగకి పోలీసులు బిరుదు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరమైన అంశం. మేము ఒక ఫైట్ తీసినప్పుడు రోఫ్ కడతాం, బోలెడు ఏర్పాట్లు చేస్తాం. అలాంటిది టైగర్ నాగేశ్వరరావు ఏ సాయం లేకుండా అంత ఎత్తు జైలు గోడలు ఎలా ఎక్కగలిగారు, ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ వచ్చి ఉంటుందనేది నిజంగా ఆశ్చర్యకరం.
ఒక దొంగ ఇంత పాపులర్ అయ్యారంటే దాని వెనుక నేచర్ సపోర్ట్, ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అసలు ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు ? అని ఒక ప్రధాన మంత్రి దగ్గర కూడా గుర్తింపు పొందడం మామూలు విషయం కాదు. ఇంత పవర్ ఫుల్ బయోపిక్ తీసిన దర్శకుడు వంశీకి థాంక్స్ చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్ లో రవితేజ గారి సినిమా వెళ్ళబోతుంది. తప్పకుండా ‘టైగర్ నాగేశ్వరరావు’ అందరినీ అలరిస్తుంది. ఈ చిత్రానికి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment