ram-lakshman
-
టైగర్ యాక్షన్ ఊహాతీతంగా ఉంటుంది: రామ్ లక్ష్మణ్
‘‘రవితేజగారితో ఎన్నో చిత్రాలు చేశాం. కానీ ‘టైగర్ నాగేశ్వర రావు’ మాత్రం కొత్త అనుభూతినిచ్చింది. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్‌ని ప్రేక్షకులు నిజంగా జరుగుతున్నట్లు భావిస్తారు’’ అన్నారు ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్. రవితేజ హీరోగా, నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్స్‌గా చేసిన రామ్–లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘మేం స్టూవర్ట్‌పురం ప్రాంతంలోనే పుట్టి పెరిగాం. ‘టైగర్ నాగేశ్వరరావు’ గారి గురించి ఊహకు అందని విషయాలు విన్నాం. రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారని, దొంగతనం చేస్తానని చెప్పి మరీ చేసేవారని, చెట్లపై కూడా పరిగెత్తెవారని.. ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు వినేవాళ్ళం. సవాల్ చేసి దొంగతనం చేయడం అంత ఈజీ కాదు. అందరికీ చెప్పి దొంగతనం చేసి అక్కడ నుంచి తప్పించుకునే ఒక పాత్రని చూస్తున్నపుడు రియల్ హీరోయిజం కనిపిస్తుంది. ఆయన చెన్నై జైలు నుంచి ఎస్కేప్ అయ్యారు. ఆయనకి టైగర్ అనే బిరుదు పోలీసులు ఇచ్చారు. ఒక దొంగకి పోలీసులు బిరుదు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరమైన అంశం. మేము ఒక ఫైట్ తీసినప్పుడు రోఫ్ కడతాం, బోలెడు ఏర్పాట్లు చేస్తాం. అలాంటిది టైగర్ నాగేశ్వరరావు ఏ సాయం లేకుండా అంత ఎత్తు జైలు గోడలు ఎలా ఎక్కగలిగారు, ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ వచ్చి ఉంటుందనేది నిజంగా ఆశ్చర్యకరం. ఒక దొంగ ఇంత పాపులర్ అయ్యారంటే దాని వెనుక నేచర్ సపోర్ట్, ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అసలు ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు ? అని ఒక ప్రధాన మంత్రి దగ్గర కూడా గుర్తింపు పొందడం మామూలు విషయం కాదు. ఇంత పవర్ ఫుల్ బయోపిక్ తీసిన దర్శకుడు వంశీకి థాంక్స్ చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్ లో రవితేజ గారి సినిమా వెళ్ళబోతుంది. తప్పకుండా ‘టైగర్ నాగేశ్వరరావు’ అందరినీ అలరిస్తుంది. ఈ చిత్రానికి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాం’ అన్నారు. -
విలన్లను రఫ్ఫాడిస్తున్న చిరంజీవి
విలన్స్‌ను రఫ్ఫాడిస్తున్నారు చిరంజీవి. తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్‌తో ప్రత్యర్థుల బెండు తీస్తున్నారు. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు చిరంజీవి. ఈ షెడ్యూల్లో హీరోయిన్ శ్రుతీహాసన్ కూడా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఇందులో ఓ అండర్‌కవర్ సీనియర్ పోలీసాఫీసర్ పాత్రలో చిరంజీవి కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్నారని, తమిళ నటుడు బాబీ సింహా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహనిర్మాతలు: జీకే మోహన్, ఎమ్. ప్రవీణ్. చదవండి: రామ్‌చరణ్ లగ్జరీ ఇల్లు, ఫొటోలు వైరల్ -
బాలయ్య సినిమా నుంచి ఆ ఇద్దరూ ఔట్!
బాలయ్య-బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పుకారు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్‌గా వ్యవహరిస్తోన్న రామ్-లక్ష్మణ్‌లు సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బోయపాటి సినిమా అంటే యాక్షన్ సన్నివేశాలకు ఎంత ప్రాధన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో రామ్-లక్ష్మణ్‌లు ఇద్దరు చిత్రానికి మూల స్తంభాలని చెప్పవచ్చు. అలాంటిది ప్రస్తుతం వీరిద్దరూ బాలయ్య-బోయపాటి సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. బోయపాటితో విబేధాల కారణంగానే వీరిద్దరూ ఈ సినిమా నుంచి తప్పకున్నారని సమాచారం. వీరి స్థానంలో స్టంట్ శివ ఎంటరైనట్లు తెలిసింది. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫైట్ మాస్టర్స్‌గా రామ్-లక్ష్మణ్‌లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్తగా ఫైట్లను కంపోజ్ చేస్తుంటారు. వీరి ఫైట్లకు ప్రత్యేకంగా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. చదవండి: సాహసం: అఘోరాగా మారిన బాలకృష్ణ! -
శాశ్వత హెలిప్యాడ్ నిర్మించండి..
జోడేఘాట్‌లో శాశ్వత హెలిప్యాడ్ నిర్మించాలని సీఎం పేషి నుంచి వచ్చిన ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ జిల్లా అధికారులకు సూచించారు. ఈనెల 8న భీమ్ వర్ధంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఆయన శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. కెరమెరి : జోడేఘాట్‌లో శాశ్వత హెలిప్యాడ్ నిర్మించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ ఆదేశించారు. కెరమెరి మండలం జోడేఘాట్‌ను ఆయన శనివారం సందర్శించారు. ఈ నెల 8న జరిగే కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభా ఏర్పాట్లను పరిశీలించారు. మరో రెండు రోజుల్లో హెలిప్యాడ్ స్థలం తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మ్యూజియం ఏర్పాటుకు నిర్మిస్తున్న స్టాండ్‌ను పరిశీలించారు. గుట్టపైకి మెట్లు తయారు చేస్తామని, దాని పైభాగంలో 2, 3 ఎకరాల్లో మ్యూజియం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆయనకు వివరించారు. అక్కడి నుంచి సీఎం సభా స్థలాన్ని పరిశీలించారు. ప్రజలు కనిపించేలా ఎత్తులో నిర్మించాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని కొమురం భీమ్ విగ్రహంలాగే నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేస్తున్న స్టాండ్‌ను పరిశీలించారు. భీమ్ విగ్రహాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలన్నారు. 20 వేల మంది కంటే ఎక్కువగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో సభ కోసం అధిక స్థలం తీసుకోవాలని చెప్పారు. ప్రాంగణంలో పచ్చని కార్పెట్ పర్చాలన్నారు. 200 ఎకరాల్లో పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో స్థలం ఎంపిక చేశారా అని అధికారులను ప్రశ్నించారు. జోడేఘాట్ వాసుల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించే ఆలోచనలో సీఎం ఉన్నారని తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు తాగునీరు, భోజన వసతి కల్పించనున్నట్లు చెప్పారు. ఆశ్రమ పాఠశాలకు ప్రహరీ మంజూరు చేయాలని ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి ప్రశాంత్ పాటిల్‌ను ఆదేశించారు. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్ ముఖ్యమంత్రి సభ కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. మార్గమధ్యంలో పాట్నాపూర్ గ్రామంలో కలిసిన ఎస్పీతో మాట్లాడారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఊట్నూర్లోనే ఏర్పాటు చేయాలని గిరిజన నాయకులు మర్సుకోల తిరుపతి, లక్కేరావు, బొంత ఆశారెడ్డి, జోడేఘాట్‌లోనే ఏర్పాటు చేయాలని కొమురం భీమ్ వర్ధంతి నిర్వహణ కమిటీ చైర్మన్ కోవ దేవరావు, ఆత్రం లక్ష్మణ్ ప్రభుత్వ సలహాదారు రామ్లక్ష్మణ్ను కోరారు. స్పందించిన ఆయన యూనివర్సిటీ ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైందని, ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి చేతిలో ఉందని చెప్పారు. తాము సీఎంను కలిసి మెమోంటో ఇచ్చే అవకాశం కల్పించాలని కోరగా ఐదుగురికి అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. ఆర్డీవో రామచంద్రయ్య, ఏపీవో భీమ్,తహశీల్దార్ సిడాం దత్తు, ఎంపీడీవో సాజిత్అలీ, ఏటీడబ్ల్యువో అంబాజీ, నాయకులు యాదోరావు, తిరుపతి, మహెశ్, ఎస్సై అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఊరిలో అపు‘రూపాలు’
అమలాపురం రూరల్ : చేనేత గ్రామమైన బండారులంక కవలల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. అన్ని వయసుల కవల జంటలు 30కి పైగా ఉన్నాయి. వీరిని బయట నుంచి వచ్చే వారే కాదు.. చివరకు సహచర గ్రామస్తులు సైతం చూసి తికమకపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గ్రామంలోనే స్థిరపడిన ఈ కవలలు వివిధ రంగాల్లో స్థిరపడి రాణిస్తున్నారు. అప్పులిచ్చిన వారు ఒకరికి బదులు మరొకరిని అడగడం, పోస్టుమన్లు ఒకరికొచ్చిన ఉత్తరాలను మరొకరికి బట్వాడా చేయడం, ఒకరికి బదులు మరొకరిని పిలవడం వంటి సంఘటనలు ఇక్కడ సర్వసాధారణం. కవలలు పోలికలోనే కాదు..నడకలోనూ..నడతలోనూ.. వస్త్రధారణ, ఆహార వ్యవహారాల్లో కూడా ఒకే విధంగా ఉంటారు. వీరి ఆలోచనలు కూడా ఒకే విధంగా ఉంటాయి. గ్రామానికి చెందిన కాశి లక్ష్మీరాజ్యం-యర్రా రామరాజ్యం, పడవల రాంబాబు-లక్ష్మణరావు, ఇనుమర్తి రామభద్రరావు-లక్ష్మణరావు,చింతపట్ల హేమకిరణ్-హేమచరణ్, చింతా కృష్ణ ప్రియ-వంశీకృష్ణ, దొమ్మేటి భాస్కర రామమణికంఠ-లక్ష్మీ వైష్ణవిశ్రీ, దానిరెడ్డి సాయిరాం-లక్ష్మణదుర్గ, బండార్లంక బాబూజీ టెక్నోస్కూల్లో చదువుతున్న వి.తేజస్వి శైలు -తేజస శ్రీసాయి లు పోలికలతో పాటు చదువులోను పోటీ పడుతున్నారు. ట్రిపుల్స్ రాగిరెడ్డి లక్ష్మణ్-రాము- మోహినిపుష్ప ఒక నిమిషం తేడాలో జన్మించారు. పదో తరగతి చదువుతున్న రావేటి వెంకటేష్-శ్రీనివాస్‌లు ఒక మార్కు తేడాతోనే ముందుంటారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న కడి భాగ్యలక్ష్మి-భాగ్యలత రూపంలో ఒకేలా ఉంటారు. కవలలైన లక్ష్మీరాజ్యం, రామరాజ్యంలను గ్రామస్తులతో పాటు వారి భర్తలు కూడా గుర్తు పట్టేందుకు ఇబ్బంది పడుతుంటారు. చేనేత కార్మికులైన పడవల రాంబాబు, లక్ష్మణరావులు అచ్చుగుద్దినట్టుగా ఒకే పోలికలో ఉండడంతో వారిని పోల్చుకోవడం చాలా కష్టం. టీడీపీలో తిరిగే ఉప్పు రాంబాబు, లక్ష్మణరావులను గుర్తించడంలో ఆ పార్టీ నాయకులు కూడా తికమకపడుతుంటారు. ఇక పిల్లల విషయానికి వస్తే స్నేహితులు.. ఉపాధ్యాయులు గుర్తుపట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారు.