Chiranjeevi Doing High-Voltage Action Sequence In Bobby Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi-Bobby Movie: విలన్లను రఫ్ఫాడిస్తున్న మెగాస్టార్‌

Published Mon, Mar 28 2022 7:59 AM | Last Updated on Mon, Mar 28 2022 9:28 AM

Chiranjeevi Doing Action Sequence In Bobby Movie - Sakshi

విలన్స్‌ను రఫ్ఫాడిస్తున్నారు చిరంజీవి. తనదైన స్టైల్‌ ఆఫ్‌ యాక్షన్‌తో ప్రత్యర్థుల బెండు తీస్తున్నారు. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ – లక్ష్మణ్‌ కొరియోగ్రాఫ్‌ చేసిన యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు చిరంజీవి. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ కూడా పాల్గొంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని, ఇందులో ఓ అండర్‌కవర్‌ సీనియర్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో చిరంజీవి కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్నారని, తమిళ నటుడు బాబీ సింహా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహనిర్మాతలు: జీకే మోహన్, ఎమ్‌. ప్రవీణ్‌.

చదవండి: రామ్‌చరణ్‌ లగ్జరీ ఇల్లు, ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement