ఓటీటీలో రవితేజ సినిమా అరుదైన ఘనత.. తొలిసారి దివ్యాంగుల కోసం | Sakshi
Sakshi News home page

Tiger Nageswara Rao OTT: దివ్యాంగుల కోసం ఓటీటీలో సరికొత్త ఫీచర్.. ఇకపై అన్ని మూవీస్

Published Mon, May 27 2024 12:18 PM

Tiger Nageswara Rao Movie Now Streaming On OTT In Indian Sign Language

సినిమా చూడటం అంటే చాలామందికి సరదా. ఎందుకంటే ఏదో పనిచేసి అలసిపోయినా వాళ్లు.. కాసేపు అలా కూర్చొని మూవీ చూస్తుంటే వచ్చే కిక్ వేరు. కానీ దివ్యాంగులకు మాత్రం ఈ అవకాశం లేదు. కానీ ఇకపై పరిస్థితి మారింది. ఇప్పుడు వాళ్ల కోసం కూడా సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఓ తెలుగు సినిమా ఇలా అరుదైన ఘనత సాధించింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)

రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా గతేడాది దసరాకి థియేటర్లలో రిలీజైంది. గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. జనాల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు ఈ సినిమాని ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లోకి ఇప్పుడు తీసుకొచ్చారు. అంటే సినిమా ప్లే అవుతుంటే మరోవైపు ఓ అమ్మాయి సైగలతో ఏం మాట్లాడుకుంటున్నారో చూపిస్తూ ఉంటుంది.

దీని ద్వారా సినిమాలోని పాటలు, సౌండ్ లాంటివి వినలేకపోవచ్చు కానీ కథేంటి? డైలాగ్స్ ఏంటి అనేవి దివ్యాంగులకు కూడా తెలుస్తాయి. 'టైగర్ నాగేశ్వరరావు'తో మొదలైన ఈ ట్రెండ్.. రాబోయే రోజుల్లో మిగతా తెలుగు సినిమాల విషయంలోనూ పాటించొచ్చు.

(ఇదీ చదవండి: 'జయ జయహే తెలంగాణ'.. కీరవాణి వద్దు!

Advertisement
 
Advertisement
 
Advertisement