Sign language
-
ఓటీటీలో రవితేజ సినిమా అరుదైన ఘనత.. తొలిసారి దివ్యాంగుల కోసం
సినిమా చూడటం అంటే చాలామందికి సరదా. ఎందుకంటే ఏదో పనిచేసి అలసిపోయినా వాళ్లు.. కాసేపు అలా కూర్చొని మూవీ చూస్తుంటే వచ్చే కిక్ వేరు. కానీ దివ్యాంగులకు మాత్రం ఈ అవకాశం లేదు. కానీ ఇకపై పరిస్థితి మారింది. ఇప్పుడు వాళ్ల కోసం కూడా సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఓ తెలుగు సినిమా ఇలా అరుదైన ఘనత సాధించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా గతేడాది దసరాకి థియేటర్లలో రిలీజైంది. గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. జనాల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు ఈ సినిమాని ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లోకి ఇప్పుడు తీసుకొచ్చారు. అంటే సినిమా ప్లే అవుతుంటే మరోవైపు ఓ అమ్మాయి సైగలతో ఏం మాట్లాడుకుంటున్నారో చూపిస్తూ ఉంటుంది.దీని ద్వారా సినిమాలోని పాటలు, సౌండ్ లాంటివి వినలేకపోవచ్చు కానీ కథేంటి? డైలాగ్స్ ఏంటి అనేవి దివ్యాంగులకు కూడా తెలుస్తాయి. 'టైగర్ నాగేశ్వరరావు'తో మొదలైన ఈ ట్రెండ్.. రాబోయే రోజుల్లో మిగతా తెలుగు సినిమాల విషయంలోనూ పాటించొచ్చు.(ఇదీ చదవండి: 'జయ జయహే తెలంగాణ'.. కీరవాణి వద్దు!) A new chapter in inclusivity in Indian Cinema ✨#TigerNageswaraRao is the 𝐅𝐈𝐑𝐒𝐓 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐅𝐈𝐋𝐌 to have an OTT Release in the 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐒𝐈𝐆𝐍 𝐋𝐀𝐍𝐆𝐔𝐀𝐆𝐄 ❤️🔥Streaming now on @PrimeVideoIN 🔥https://t.co/rbR0n6vYU4 🥷Mass Maharaja @RaviTeja_offl… pic.twitter.com/koX2nFfFww— Abhishek Agarwal 🇮🇳( Modi Ka Parivar) (@AbhishekOfficl) May 27, 2024 -
సైగల చికిత్స
మూగ, వినికిడి సమస్య ఉన్న ఆ దంపతులకు లేకలేక సంతానం కలిగింది. అదీ పూర్తి ప్రసవ సమయానికి రెండు నెలల ముందుగానే. కవలల్లో పేగు సమస్యతో అబ్బాయి చనిపోయాడు. ఇక ఇప్పుడు పాప ఒక్కత్తే ఆశాజ్యోతి. కేవలం 450 గ్రాముల బరువుతో మనుగడ అవకాశాలు తక్కువ. పాపను ఎలాగైనా దక్కించుకునేందుకు ఏ విధంగానైనా ఆమెను బతికించుకునేందుకు పేరెంట్స్‌తో కమ్యూనికేట్ చేయడం తప్పనిసరి అయ్యింది.] కనీస సంభాషణల కోసం కష్టపడి పదిరోజుల్లోనే సైగల భాషనూ, సంజ్ఞాశాస్త్ర పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంలో విజయ సాధించారు అక్కడి కొందరు డాక్టర్లూ, నర్సులు. ఆ పాప ఇప్పుడు బతుకు బ్యారియర్స్‌ను బద్దలు కొట్టింది. నాలుగు నెలల వయసుకే అనేక అడ్డంకుల్ని అధిగమించింది. జీవన సమరంలో తొలి విజయం సాధించింది. విజయవంతంగా మనుగడ పోరాటం సాగిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన దంపతులు రాజ్‌కుమార్ వయసు 55 ఏళ్లు. భాగ్యమ్మకు 47. ఇద్దరూ మూగవారు. వినికిడి, మాట సమస్యలున్నాయి. అప్పటికే ఓ చిన్నారిని కోల్పోయారు. ఎలాగైనా తమకు సంతానం కావాలని కోరిక. ఎట్టకేలకు భాగ్యమ్మ గర్భవతి అయ్యింది. తన 47వ ఏట ప్రసవించింది. కానీ 28 వారాలకే ప్రీమెచ్యూర్‌గా పుట్టిన పిల్లలు. అంటే ఏడునెలలకే జరిగిన ప్రసవం. రెండు నెలలు ముందుగానే ప్రసవం కావడంతో కవలలు బాగా తక్కువ బరువుతో పుట్టారు. బాబు కేవలం 900 గ్రాములు. పాప బరువు మరీ తక్కువ. కేవలం 450 గ్రాములు!! మరో ఆసుపత్రిలో ప్రసవం తర్వాత... పుట్టీ పుట్టగానే ఆ బిడ్డలకు కొన్ని సమస్యాత్మకమైన రుగ్మతలు ఉండటంతో తల్లినీ, బిడ్డను కొండాపూర్‌లోని కిమ్స్–కడల్స్ నియోనేటాలజీ విభాగంలో చేర్చారు. ఆ విభాగం డైరెక్టర్ డాక్టర్ అపర్ణ నేతృత్వంలో చికిత్స మొదలుపెట్టారు. బాబుకు నెక్రొటైజింగ్ ఎంటరోకొలైటిస్ అనే పేగుల సమస్య ఉండటంతో శస్త్రచికిత్స తప్పలేదు. కానీ బాబు దక్కలేదు. ఎన్నో వైద్య ప్రక్రియల తర్వాత, మరెన్నో నోముల తర్వాత పండిన పంట అది. ఒడి నిండినట్టే నిండిందిగానీ... ఒడిబియ్యంలో సగం జారిపోయింది. పాప తల్లిదండ్రుల వయసుపరంగా, లేదా మరేరకంగా చూసినా ఆ బంగారు తల్లిని కాపాడుకోక తప్పని పరిస్థితి. కొంగున మిగిలింది సగం బంగారమే కావడంతో ఇప్పుడా కొంగుబంగారం మరీ మరీ అపురూపం. కానీ పాప బరువు అరకిలో కంటే మరో 50 గ్రాములు తక్కువే. వైద్యసిబ్బందికి ఇదో సవాల్‌గా మారింది. తొలినాళ్లలో కుటుంబ స్నేహితుడి సాయంతో సంభాషణలు... పాప తల్లిదండ్రులిద్దరూ మూగ, వినికిడి సమస్యలున్నవారైనప్పటికీ వైద్యులకు వారితో సంభాషించడం తప్పదు. తొలి నాళ్లలో రాజ్‌కుమార్‌కు తెలిసిన ఓ అబ్బాయే ఆ దంపతులకూ, వైద్య సిబ్బందికి మధ్య సంజ్ఞావారధిగా నిలబడ్డాడు. అతడో కాలేజీ విద్యార్థి. సంజ్ఞల భాష (సైన్ లాంగ్వేజ్) తో సంభాషణలు జరిపేవాడు. కొన్నాళ్ల సెలవు తర్వాత రాజ్‌కుమార్ తన విధులకు హాజరవ్వక తప్పనిస్థితి. తండ్రి ఆఫీసులో, తల్లి ఆసుపత్రిలో. సంజ్ఞల వారధి తన చదువుల్లో, తన పనుల్లో మరో చోట. అయినప్పటికీ ఎలాగోలా పేపర్ల మీద రాసిచూపుతూనో, వీడియోకాల్స్ ద్వారానో సంభాషణలు కొనసాగుతున్నాయి. ఇంతలో ఇంటర్ప్రెటర్గా ఉన్న వ్యక్తికి పరీక్షలు వచ్చాయి. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడేందుకు అవకాశం లేకపోయింది. ఆసుపత్రిలో చేర్చిన తొలినాళ్లలో రాజ్‌కుమార్ కొందరు వైద్యసిబ్బందికి సంకేతభాష (సైన్ లాంగ్వేజీ) నేర్పించేందుకు కొంత ప్రయత్నించారు. అప్పుడెవ్వరికీ దాని అవసరం అంతగా ఉన్నట్లు తోచలేదు. కానీ ఇప్పుడు తప్పని స్థితి! ఇక డాక్టర్లూ, వైద్యసిబ్బందీ సంభాషించక తప్పలేదు... పాపకు జరిగే వైద్య పరీక్షల గురించి తల్లిదండ్రులకు చెప్పాలి. చిన్నారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ, చేపట్టాల్సిన విధానాల్ని తల్లికి వివరించాలి. పాలు పట్టాల్సినప్పటి ప్రక్రియలను, ఆహారమివ్వాల్సిన తీరుతెన్నులను, బిడ్డను తల్లిగుండెలకు దగ్గరగా ఉంచేందుకు అనుసరించాల్సిన ‘కంగారూ కేర్’ ప్రక్రియల్ని విపులీకరించాలి. ఇందుకు ఇరువురికీ అర్థమ్యే భాష కావాలి. కానీ ఎలా? పది రోజుల్లో అవసరమైనమేరకు శిక్షణ... తొలినాళ్లలో రాజ్‌కుమార్ తమకు కొన్ని బేసిక్స్ నేర్పడానికి ప్రయత్నించడం గుర్తొచ్చింది. అంతే... చిన్నారిని కాపాడుకునేందుకు అవసరమైన మేరకు సైన్ లాంగ్వేజ్‌ను ఆయననుంచే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు మెడికల్ టీమ్‌లోని కొందరు. మొత్తం పది మంది వైద్యబృందంలో కొందరు డాక్టర్లు, మరికొందరు నర్స్లూ, ఇంకొందరు సహాయక వైద్య సిబ్బంది సంజ్ఞాభాష నేర్చుకోవడం మొదలుపెట్టారు. దాదాపు పదిరోజుల్లో సైగల భాషలోని అల్ఫాబెట్స్, సంఖ్యలూ, రోజులూ, వారాల పేర్లు, ఇతర వివరాలను కష్టపడి నేర్చుకున్నారు. కమ్యూనికేట్ చేస్తున్నారు. తొలి విజయం ఆ మృత్యుంజయురాలిదే... గత ఏడాది ఆగష్టులో ఆసుపత్రిలో చేరిన ఆ తల్లి దాదాపు మూడు నెలల పాటు (సరిగ్గా చెప్పాలంటే 79 రోజులు) ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. కేవలం 450 గ్రాములున్న ఆ చిన్నారి క్రమంగా 1200 గ్రాములకు చేరింది. నవంబరులో డిశ్చార్జ్ నాటికి ఆ పాప బరువు 1800 గ్రాములు. మనుగడ పోరాటంలో తొలి అవరోధాలన్నింటినీ అధిగమించింది... బతుకుకు అడ్డంకి లేని బరువు సాధించింది. ప్రస్తుతం తనకు 4 నెలల వయసు. డాక్టర్ల అంచనాల ప్రకారం... అందరిలాగే మరో మూడు–నాలుగు నెలల్లో ముద్దుమాటలు (బ్యాబ్లింగ్స్) మొదలుపెట్టాలి. అందుకు వైద్యపరంగా ఎలాంటి అవరోధాలూ, అడ్డంకులూ లేవు. ప్రస్తుతానికి... ముందు ముద్దులు మూటగడుతోంది. మున్ముందు మాటలు దండగట్టాల్సి ఉంది. – యాసీన్ మేము, మా సిబ్బంది అవసరమైన మేరకు సైన్లాంగ్వేజీలో పరిజ్ఞానం సంపాదించాం... పాపను రక్షించుకునేందుకు సైన్ లాంగ్వేజ్ నేర్చుకోక తప్పలేదు. కొందరిలో కొత్తభాషను నేర్చుకునే పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది కదా. అలాంటివారు ఇతరులకు నేర్పారు. ఇలా ఆ టీమ్‌లోని పదిమంది డాక్టర్లలో ఐదారుగురు, నర్సుల్లో నలుగురైదుగురు, ఇతర సిబ్బందిలో మరికొందరు... తల్లిదండ్రులకు అవసరమైన మేరకు వివరాలను సూచించేంతగా సైన్లాంగ్వేజీలో ప్రాక్టీస్ సాగించారూ, నైపుణ్యం సాధించారు. చిన్నారిని బతికించుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమయంలో కంటి పరీక్షలూ, న్యూరో... ఇలా అన్ని రకాల పరీక్షలూ నిర్వహించాం. మరీ ముఖ్యంగా వినికిడి పరీక్షలు. ఆ చిన్నారిలో ఎలాంటిలోపాలూ లేవు. అన్నీ నార్మల్. – డాక్టర్ అపర్ణ, క్లినికల్ డైరెక్టర్–నియోనేటాలజీ -
సార్... దిస్ అబ్బాయి బీట్ మీ... బట్ ఐయామ్ నాట్ తిరిగి బీట్!
అస్సాంలోని పచిమ్ నగామ్ గ్రామంలోని ‘న్యూ లైఫ్ హైస్కూల్’లో పిల్లలు ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడాలనే నిబంధన ఉంది. ఒకరోజు ఇద్దరు పిల్లలు గొడవ పడ్డారు. క్లాస్ టీచర్ వారిని పిలిపించి ‘టెల్ మీ, వాట్ హ్యాపెన్డ్?’ అని అడిగారు. ‘ఇతడు నా మెడ పట్టుకున్నాడు’ అని ఒకరు చెప్పాలనుకున్నారు. ‘ఇతడు నా తలపై పంచ్ ఇచ్చాడు’ అని మరొకరు చెప్పాలనుకున్నారు. అట్టి విషయాన్ని పూర్తిగా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో చెప్పలేక సైన్ లాంగ్వేజ్‌ను కూడా అప్పు తెచ్చుకొని కాస్తో కూస్తో ఇంగ్లిష్‌లో ఆ పిల్లలు చెబుతున్న మాటలు నెటిజనులను నవ్వుల్లో ముంచెత్తాయి. -
International Disability Day: నిశ్శబ్ద విజయం
మాట వినకపోతే మాట పలకలేము. మాటతో నిండిన ఈ ప్రపంచంలో మాట లేకపోతే శూన్యతే. సోను ఆనంద్ శర్మ ఆ శూన్యత నుంచే బయలుదేరింది. పూర్తి బధిరత్వం వల్ల మాటకు కూడా దూరమైన సోను ఈ ప్రపంచంతో బ్యాట్‌తోనే మాట్లాడాలనుకుంది. బధిర బాడ్మింటన్ క్రీడాకారిణిగా సోనువి ఘన విజయాలు. ఆ తర్వాత కోచ్‌గా మారి దేశానికి ఎందరో క్రీడాకారులనిచ్చింది. కాని ఇదంతా సులభమా? బధిరత్వం ఉంటే ఇన్ని ఆటంకాలా? దివ్యాంగుల గెలుపు కథల్లో సోను కథ ముఖ్యమైనది. ‘పూర్తిగా వినపడకపోతే ఏమవుతుందో తెలుసా?’ అని అడుగుతుంది సోను ఆనంద్ శర్మ. పూర్తిగా వినపడని వారు దానికి పూర్తి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే పూర్తిగా వినపడని వారికే ఆ బాధ తీవ్రత తెలుస్తుంది. ‘వినడం వల్లే భాష మాట్లాడతాం. వాక్యాన్ని నిర్మిస్తాం. గ్రామర్ నేర్చుకుంటాం. పూర్తి వాక్యం రాస్తాం. పూర్తిగా వినపడకపోతే మీరు మాట్లాడలేరు. రాయలేరు. గ్రామర్‌తో సరిగ్గా రాయలేరు’ అంటుందామె. 47 ఏళ్ల సోను ఆనంద్ శర్మ ‘డెఫ్లింపిక్స్’ (బధిరులకు జరిగే ఒలింపిక్స్)లో బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఈ దేశానికి పతకాలు తెచ్చింది. ఆ తర్వాత కోచ్‌గా మారి శిష్యులను తయారు చేసి పతకాలను తెస్తోంది. అయినప్పటికీ ఆమె ఒక బధిరురాలిగా వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. ‘ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తే ప్రభుత్వం పది లక్షలు ఇస్తుంది. బధిరుల ఒలింపిక్స్‌లో నేను పతకాలు సాధించాను. నా మెడల్స్ కూడా అంతకు సమానమే. అయినా నాకు డబ్బు రాలేదు’ అంటుందామె. అంతే కాదు... క్రీడాకారుల పెన్షన్లు, నజరానాలు అన్నీ కూడా అన్నీ సవ్యంగా ఉన్నవారికే. దివ్యాంగులకు వివక్షే. ‘అయినా సరే నేను నా దేశం కోసం పని చేస్తూనే ఉంటాను’ అంటుంది సోను. సైన్ లాంగ్వేజ్ ఎక్కడ? సోను ఆనంద్ శర్మది న్యూఢిల్లీ. పుట్టు బధిరురాలు. క్లాసుకు వెళితే టీచర్లకు సైన్ లాంగ్వేజ్ వచ్చేది కాదు. ఈమెకు పాఠాలు వినపడేవి కావు. ‘మన దేశంలో ఆరున్నర కోట్ల మంది పూర్తి బధిరులు లేదా పాక్షిక బధిరులు. వారిలో 50 లక్షల మంది పిల్లలు. అయినా మన దేశంలో కేవలం 700 స్కూళ్లలోనే సైన్ లాంగ్వేజ్‌లో చదువు చెప్తారు. సైన్ లాంగ్వేజ్‌ను అధికారిక భాషగా ప్రకటిస్తే సమస్య చాలామటుకు తీరుతుంది. కాని ప్రకటించరు. చదువు రాకపోతే బధిరులు జీవితాంతం ఇబ్బంది పడుతూనే ఉండాలి’ అంటుందామె. ఇప్పుడు ఆమె ఢిల్లీ టూరిజంలో ఉద్యోగం చేస్తుంది. మొత్తం డిజిటల్ కమ్యూనికేషనే జరుగుతుంది. సోను కమ్యూనికేట్ చేస్తుంది కాని భాష మెరుగ్గా ఉండదు. ‘అందుకని నన్ను ఒకలా చూస్తారు కొలీగ్స్’ అంటుందామె. 10 ఏళ్ల వయసు నుంచి పాఠాలు అర్థం కాకపోవడం వల్ల సోను బాడ్మింటన్తో ఆ వెలితి పూడ్చుకోవాలని అనుకుంది. ‘కాని మాకు మంచి కోచ్‌లు దొరికేవారు కాదు. కోచ్‌లు దొరికినా వారి దృష్టి నార్మల్ ఆటగాళ్ల మీద ఉండేది. బధిరుల మీద ఫోకస్ ఉండేది కాదు. అందుకని నన్ను నేను నమ్ముకున్నాను. రోజూ ఉదయం నుంచి రాత్రి దాకా ప్రాక్టీసు చేసేదాన్ని. మాది మధ్యతరగతి కుటుంబం. స్కూటర్ కూడా లేదు. బస్‌లో కోర్టుకు తిరుగుతుంటే మా తల్లిదండ్రులు భయపడేవారు... ఆడపిల్లనని... మాటలు రావని. మా నాన్న ఆఫీస్ నుంచి వచ్చి నా కోసం నేను ప్రాక్టీసు చేసే చోట కాచుకుని కూచునేవాడు’ అని గుర్తు చేసుకుంది సోను. ఆ శ్రమ వృథా పోలేదు. 1997 సమ్మర్ డెఫ్లింపిక్స్ నుంచి 2009 సమ్మర్ డెఫ్లింపిక్స్ వరకూ దేశం తరఫున ఆడి పతకాల పంట పండించింది సోను ఆనంద్ శర్మ. 2014 నుంచి కోచ్ శిష్యుల ద్వారా పతకాలు తెచ్చి పెడుతోంది. బధిర బాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జెర్న్లిన్ అనిక ఈమె శిష్యురాలే. ‘దివ్యాంగులను తక్కువ అంచనా వేయొద్దు. వారి సామర్థ్యాల పై సానుభూతి వద్దు. మమ్మల్ని గ్రహాంతర వాసుల్లా చూడొద్దు. మీలాగే సాటి మనుషులుగా చూడండి’ అంటుంది సోను శర్మ. వారికి అనువుగా సమాజం మారాలి. వారి కోసం కూడా ఈ సమాజం ఉంది. వారి సమాన వాటాను ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుందాం. -
‘మాకు మాటలు వచ్చు.. అయినా ఇలాగే బతుకుతాం’
International Day of Sign Languages: మనిషి అవిటితనం.. ప్రయత్నాలకు, విజయాలకు అడ్డుపడదనే విషయాన్ని ఎన్నో వ్యథలతో కూడిన కథలు నిరూపించాయి.. ఇంకా నిరూపిస్తున్నాయి కూడా. బధిరులు తమ మధ్య సంభాషణల కోసం.. సైగల భాషను ఉపయోగించుకుంటారు కదా!. అలాంటి ప్రత్యేక భాషల కోసం సెప్టెంబర్ 23ను ఇంటర్వేషనల్ సైన్ లాంగ్వేజెస్ డేగా నిర్వహిస్తోంది వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్. ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ది డెఫ్‌లో భాగంగా.. 2018 నుంచి ఈ డేని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తోంది. రోజూవారీ జీవితంలో బధిరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడం.. వాళ్లను స్వాంతన అందించడం సైగల భాషల అంతర్జాతీయ దినోత్సవ ఉద్దేశం. అయితే అన్నీ సక్రమంగా ఉన్నవాళ్లు.. ఇలాంటి సైగల భాషను ఉపయోగించాలనుకోవడం మాత్రం ప్రత్యేకమైన విషయమే. బధిరుల భాషను తమ భాషగా అలవర్చుకున్న ఊళ్లు.. ఈ భూమ్మీద ఓ పాతికకు పైనే ఉన్నాయని తెలుసా?.. వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాం.. అలీపూర్.. సైగల ద్వారా మాట్లాడుకునే భారత గ్రామం అలీపూర్!. కర్ణాటకలోని ఈ ఊరిలో ప్రస్తుతం బధిరుల సంఖ్య రెండువందలకు పైనే. అయితే ఒకప్పుడు ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండేది. పదేళ్ల క్రితం ఇక్కడ డెఫ్ సొసైటీని ఏర్పాటు చేయించి.. స్థానికులకు సైగల భాషను మిగతా వాళ్లను అలవాటు చేయించారు. అలా బధిరులు కానీవాళ్లు సైతం కమ్యూనికేషన్ కోసం సైగల భాషను అలవర్చుకున్నారు అక్కడ. గత జనాభా లెక్కల ప్రకారం.. పాతికవేలకు పైగా అలీపూర్‌లో పదివేలకు పైగా సాధారణ జనం సైగల భాషను ఉపయోగించేవాళ్లు. ఇక ఈ ఊళ్లో ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారం ఏంటంటే.. చెవులు వినిపించని వాళ్లు పరస్పరం వివాహం చేసుకోకూడదు!. అయితే ఇప్పటితరాలు మాత్రం ఈ భాషను నేర్చుకోవడానికి ఎందుకనో అంతగా ఆసక్తి చూపించడం లేదు మరి!. ఇక నాగాలాండ్‌లోని నానా బిన్ సైన్ లాంగ్వేజ్‌ను సైతం నాగా హిల్స్‌లోని ప్రజలు మాట్లాడుతుంటారు. We Sign For Human Rights.. ఈ ఏడాది International Day of Sign Languages 2021 ఇచ్చిన థీమ్ కటా కొలోక్ ఈ ఊళ్లో ప్రజలు బింకల సైన్ లాంగ్వేజ్‌ని ఉపయోగిస్తారు. ఇండోనేషియా ఉత్తర బాలి రీజియన్‌లో పక్కపక్కనే ఉండే రెండు ఊళ్ల ప్రజలు ఏడు తరాలుగా ఈ సైగల భాషను ఉపయోగిస్తున్నారు. జనాభా 3,000 అయితే.. బధిరుల సంఖ్య నలభై లోపే ఉంది. అయితే ఇక్కడ నివసించే బధిరులు.. తమ అవిటితనాన్ని దైవత్వంగా కొలుస్తుంటారు. ప్రత్యేకంగా బతుకుతుంటారు. అందుకే మామూలు జనం కూడా ఈ భాషను గౌరవిస్తూ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ భాష అందరికీ ఒకేరకంగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అందుకే కమ్యూనికేషన్ కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. అయినా కూడా పవిత్రత కారణంగా కటా కొలోక్ను ఇప్పటికీ ఉపయోగిస్తుంటారు అక్కడి జనాలు. ఎడాస్ల్.. ఘనా తూర్పు ప్రాంతంలో ఉండే కుగ్రామం. ఎడామోరోబ్ సైగల భాష ఇక్కడ పాపులర్. తమ ఊరిలో బధిరుల కోసం అక్కడి స్థానికులు రూపొందించుకున్న భాష ఇది. వంశపారంపర్యంగా కొనసాగుతూ వస్తోంది. ఘనాలో బధిరుల కోసం రూపొందించిన ఘనానియన్ సైగల భాషను మించి ప్రత్యేకంగా ఉంటుంది ఇది. కల్చర్‌కు ప్రాధాన్యం ఉండడంతో చాలా విశిష్టతను సంతరించుకుంది. అయితే డెఫ్ కమ్యూనిటీ సైతం దీనిపై ఆసక్తి చూపిస్తుండకపోవడంతో.. దాదాపు అంతరించిపోయే స్టేజ్‌కు చేరుకుంది ఎడాస్ల్ సైగల భాష. ఛాటినో సైన్ మెక్సికో ఓవాక్సాకా రాష్ట్రం శాన్ జువాన క్యూయియాషీలోని ఛాటినో గ్రామాల్లో ఛాటినో సైగల భాష పాపులర్. మెక్సికన్ సైగల భాషతో ఏమాత్రం సంబంధం లేనిది ఈ భాష. నేషనల్ సైన్స్ ఫౌండేషన్, హెల్త్ ఫౌండేషన్లు ఈ భాషను 2014లో రూపొందించాయి. బధిరులు చాలా తక్కువ మంది అలవాటు చేసుకున్న ఈ భాషను.. మిగతా స్థానికులు ఎందుకు అలవర్చుకున్నారనేది ఇప్పటికీ అంతుచిక్కదు. మార్తాస్ విన్యార్డ్ మసాచుసెట్స్(యూఎస్ స్టేట్స్) లోని ఒంటరి ఐల్యాండ్ మార్తాస్ విన్యార్డ్. ఇక్కడుండేవాళ్లలో మెజార్టీ బధిరులే. వంశపారంపర్యంగా పిల్లలు అలా పుడుతూనే వస్తున్నారు. ఒకప్పుడు అక్కడ పుట్టే నలుగురు పిల్లలో ఒకరు బధిరులే అని లెక్కలు చెప్తున్నాయి. అయితే మార్తాస్ విన్యార్డ్ సైగల భాషను మొదట్లో తిరస్కరించారు. అందుకు కారణాలు.. ఆ సైగల్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్నవాళ్లు ఎవరూ లేకపోవడం. అమెరికా సైన్ లాంగ్వేజ్‌ను నేర్పించే ప్రయత్నం. అయినప్పటికీ తాతల కాలం నుంచి వస్తున్నది కావడంతో కొందరు బలవంతంగా అయినా ఈ భాషను అలవర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బధిరుల కంటే సాధారణ ప్రజలే సైగల భాషను ఎక్కువగా ఉపయోగిస్తున్న ప్రాంతాలను పరిశీలిస్తే.. ఇజ్రాయెల్(అల్గేరియా)లో ఘర్దాయియా సైగల భాష, కెనెడా ఇన్యూయిట్, బ్రెజిల్ కా అపూర్, న్యూగినియా కైయిల్గే, టర్కీ మర్దిన్, ఇంగ్లండ్ ఓల్డ్ కెంట్, మాలి టెపుల్.. ఇంకా మరికొన్ని ఉన్నాయి. Today is International Day of Sign Languages! #IDSL Let Auslan interpreter Mikey Webb take you through a classic Ashes moment: Peter Siddle's birthday hat-trick #asportforall #IWDP pic.twitter.com/9ODSSSpSI0 — cricket.com.au (@cricketcomau) September 23, 2021 - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ చదవండి: బొంగు బిజినెస్.. మన రేంజ్ ఇది