rotarypuram
-
వివాహిత ఆత్మహత్య
శింగనమల: బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు.. రోటరీపురం గ్రామానికి చెందిన రాచమల్ల అనిత (28), సురేష్ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ ఎరువుల దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అనిత బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కట్నం కోసం అత్తమామలు వేధించడం వల్లే అనిత ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎస్‌ఆర్‌ఐటీకి న్యాక్ గుర్తింపు
శింగనమల: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి తెలిపారు. బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆగస్టు 21, 22, 23 తేదీల్లో కేంద్ర బృందం కళాశాలలో సౌకర్యాలు, విద్య, వసతులను పరిశీలించారన్నారు. అదేవిధంగా విద్యార్థులకు లభించిన ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించారన్నారు. అదే నెల 27న బెంగళూరులో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్‌ను ప్రకటించారన్నారు. కళాశాలను స్థాపించిన పదేళ్లలోనే ఇంతటి ఘనత సాధించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఈ విజయం సమష్టి కృషితోనే సాధ్యమైందన్నారు. జిల్లాలో ఏకైన న్యాక్ ఏ–గ్రేడు గుర్తింపు కళాశాల సీఈఓ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్టంలోని 300 ఇంజినీరింగ్ కళాశాలలో 50 కళాశాలలకు న్యాక్ అక్రిడిటేషన్ ఉందన్నారు. అనంతపురం జేఎన్టీయూ పరిధిలోని కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో 110 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా.. వీటిలో 20 కళాశాలకు న్యాక్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించిందన్నారు. ఇందులో 7 కళాశాలలకు న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు ఉండగా.. వీటిలో ఎస్‌ఆర్‌ఐటీకి కూడా చోటు దక్కిందన్నారు. జిల్లా విషయానికొస్తే న్యాక్ ఏ గ్రేడ్ కలిగిన ఏకైక ఇంజినీరింగ్ కళాశాల ఎస్ఆర్ఐటీ మాత్రమేనన్నారు. అత్యున్నత విద్యా ప్రమాణాలతో తమ కళాశాల ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుందని ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి తెలిపారు. ఎంబీఏ అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నామని.. మరో ఆరు నెలల్లో మరో అరుదైన గుర్తింపు తమ కళాశాల సొంతమవుతుందన్నారు. ఏడాదికి 150 మందికి ఉద్యోగాలు వివిధ రాష్ట్రాల్లోని అత్యున్నత సాఫ్ట్వేర్ కంపెనీల్లో తమ కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల టీపీఓ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఏడాదిలో 150 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. రీసెర్చ్‌లపై ప్రేత్యక దృష్టి సారించి ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. -
ఉద్యోగాల కల్పనలో అగ్రగామి
జేఎన్టీయూ: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) పీర్ కమిటీ సభ్యులు జేఎన్టీయూ అనంతపురం శాశ్వత అనుబంధ కళాశాల అయిన శ్రీనివాస రామానుజన్ ఇంజినీరింగ్ కళాశాల (ఎస్ఆర్ఐటీ)ను సందర్శించారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటన ఉంటుంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ విద్యతో పాటు ఉద్యోగ కల్పనలో అగ్రగామిగా నిలుస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారెడ్డి న్యాక్ పీర్ కమిటీ సభ్యులకు తెలిపారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం, వర్క్‌షాపులు, ట్రైనింగ్ ప్రోగ్రాం, ఇండస్ట్రియల్ విజిట్స్, గెస్ట్లెక్చర్స్ ఎప్పటికపుడు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ కల్పించడంతో ఉద్యోగ అవకాశాలపై అవగాహన, అవసరమైన నైపుణ్యాలపై దృష్టి పెట్టడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. ప్రతి మూడేళ్లకు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తూ అధ్యాపకులు, విద్యార్థులకు తాజాగా పరిశ్రమల్లో జరుగుతున్న పరిశోధనలపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. న్యాక్ అక్రిడిటేషన్‌కు అర్హతయ్యే వర్సిటీ శాశ్వత అనుబంధ హోదా, యూజీసీ 2 (ఎఫ్), 12(బీ) గుర్తింపు కళాశాలకు దక్కిందన్నారు. సంతృప్తి వ్యక్తం చేసిన సభ్యులు ఎస్ఆర్ఐటీ కళాశాలలోని వసతులు, ల్యాబ్‌లు, తరగతి గదులు, సెమినార్ హాలు, హాస్టళ్లు, క్యాంటీన్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సదుపాయాలను న్యాక్ పీర్ కమిటీ సభ్యులు నరేంద్ర చౌదరి (డైరెక్టర్, ఎన్ఐటీ, నాగపూర్), డాక్టర్ వినాయక్ షేట్ (గోవా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్), డాక్టర్ రాజేష్ పంత్ (చైర్మన్, ప్రిసిషన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నోయిడా) సంతృప్తి వ్యక్తం చేశారు. కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివా రెడ్డి, చైర్పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి, సీఈఓ జగన్‌తో మాట్లాడి వారికి సలహా ఇచ్చారు. -
సమాజ సేవలోనే దైవత్వం
బుక్కరాయసముద్రం : సమాజ సేవ చేయడంలోనే దైవత్వం దాగి ఉంటుందని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. శనివారం మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆలూరి నారాయణమ్మ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆలూరి సాంబశివారెడ్డి మాతృమూర్తి ఆలూరి నారాయణమ్మ 10వ వర్ధంతి సందర్భంగా బోధన, బోధనేతర ఉద్యోగులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి«థులుగా జొన్నలగడ్డ పద్మావతితో పాటు కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి హాజరయ్యారు. జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ 2007 నవంబర్‌లో ఆలూరి నారాయణమ్మ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి.. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలు, విలువలతో కూడిన ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఎస్ఆర్ఐటీ స్థాపించామన్నారు. అలాగే ప్రతియేటా పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామన్నారు. అలాగే కళాశాలలో మానవతా రక్తదాతల సంస్థ కన్వీనర్ తరిమెల అమర్నాథ్రెడ్డి, సలీం సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. అన్నదానం కూడా చేపట్టారు. కార్యక్రమంలో కళాశాల సీఈఓ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, ఆలూరి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
ఎస్ఆర్ఐటీ కళాశాల తొమ్మిదో వార్షికోత్సవం బుక్కరాయసముద్రం : రోటరీపురం సమీపాన గల శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఐటీ) కళాశాల తొమ్మిదో వార్షికోత్సవం శనివారం ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరిగింది. శ్రీసాయిబాబా నేషనల్ (ఎస్ఎస్బీఎన్) డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పీఎల్ఎన్ రెడ్డి, సినీ నటి ప్రణీత, ఎస్ఆర్ఐటీ కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి, చైర్పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి, సీఇఓ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థినీ విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఆడిపాడారు. సినీనటి ప్రణీత విద్యార్థులను ప్రోత్సహించడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా వివిధ బ్రాంచ్‌లలో కళాశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. మరింత బాగా చదువుకోవాలంటూ ముఖ్య అతిథులు ప్రోత్సహించారు. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఒక్క యువతతోనే సాధ్యమన్నారు. విద్యార్థుల స్వాగతంతో ఎనర్జీ అనంతపురం రావడం తనకు చాలా సంతోషంగా ఉందని సినీ నటి ప్రణీత అన్నారు. చాలా మంది విద్యార్థులు శుక్రవారం నుంచే ఫేస్బుక్లో తనకు స్వాగతం పలకడం సంతోషాన్ని, చాలా ఎనర్జీని ఇచ్చిందన్నారు. ఎస్ఆర్ఐటీ కళాశాలలో 60 శాతం మందికి పైగా విద్యార్థినులు చదువుకుంటుండటం హర్షనీయమన్నారు. -
కష్టపడే మనస్తత్వం అలవర్చుకోవాలి
బుక్కరాయసముద్రం : సమాజంలో ప్రతి ఒక్కరూ కష్టపడే మనస్థత్వం అలవర్చు కోవాలని ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్‌లు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ సినిమా ప్రపంచం రంగుల వలయమన్నారు. సినిమా జీవితంతో ఎవ్వరూ పోల్చుకోరాదన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి పలితాలు సాధిస్తారన్నారు. ప్రస్తుతం విద్యార్థులు పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమన్నారు. మంచి విజయాలు సాధించే ందుకు సమయం చాలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎస్‌ఆర్‌ఐటీకి యూజీసీ గుర్తింపు
జేఎన్టీయూ/బుక్కరాయసముద్రం: శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల (ఎస్ఆర్ఐటీ)కి అరుదైన గుర్తింపు లభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) 12–బీ స్థాయి నైపుణ్యాలున్న కళాశాలగా గుర్తించింది. జిల్లాలో యూజీసీ గుర్తింపు ఉన్న ఏకైక కళాశాలగా ఎస్ఆర్ఐటీ ఆవిర్భవించింది. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో 118 జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రమాణాలు, నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నట్లు యూజీసీ 33 కళాశాలలను గుర్తించింది. ఈ జాబితాలో ఎస్ఆర్ఐటీ చేరినట్లయింది. నాణ్యమైన విద్యా బోధనతో గుర్తింపు : రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడారు. ఎస్ఆర్ఐటీ కళాశాలలో విద్యార్థులకు అధునాతన సౌకర్యాలు కల్పనతో పాటు అత్యుత్తమ విద్యా భోదన అందిస్తున్నామన్నారు. ప్రతి ఏటా వందలాది మందికి క్యాంపస్ ఇంటర్వూల్లో ఎంపికవుతున్నారన్నారు. కార్యక్రమంలో కళాశాల సీఈఓ జగన్మోçßæన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.