సాక్షి, కనిగిరి (ప్రకాశం): తమకు రాజకీయం అంతగా తెలియదని, పేపర్లు, టీవీలు చూడమని, కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు వేగవంతంగా ప్రవేశ పెడుతున్నందుకు థ్యాంక్యూ జగనన్న..అంటూ సినీ ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ అన్నారు. స్థానిక చిల్ట్రన్స్ హోమ్‌లో గురువారం వారు ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెల్ట్‌షాపుల నిషేధం తమకెంతో నచ్చిందన్నారు. తమ స్వగ్రామం, చుట్టుపక్కల గ్రామాల వారు బెల్ట్‌షాపుల్లో రోజూ మద్యం తాగి పొలం పనుల్లో వచ్చే డబ్బులు ఖర్చు చేస్తున్నారని, అంతిమంగా ఆ కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బెల్ట్‌షాపుల తొలగింపునకు తమవంతు ప్రయత్నం చేశామని, వాటి నిర్వాహకులతో కూరగాయల అంగళ్లు, కిరాణాకొట్లు పెట్టించినా తమ లక్ష్యం నెరవేరలేదన్నారు. అది పూర్తి స్థాయిలో అమలు కాకపోగా తమపై కొందరు వ్యతిరేకత పెంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మధ్యపాన నిషే ధంలో భాగంగా బెల్ట్‌షాపు ల రద్దుకు చర్యలు తీసుకోవడంతో తమ లక్ష్యం నెరవేరుతోందన్నారు. జగనన్నకు తాము థ్యాంక్స్ చెబుతున్నామని రామ్‌లక్ష్మణ్‌లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment