
సాక్షి, ప్రకాశం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని, అందుకు తామే ప్రత్యక్ష సాక్ష్యాలని వైఎస్సార్‌సీపీ నేతలు ముక్తకంఠంతో చెబుతున్నారు. బుధవారం కనిగిరిలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర.. సాయంత్రానికి పామూరు బస్టాండ్ వద్దకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ నేతలు ఒక్కొక్కరుగా ప్రసంగించారు.
సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్. ఆయన పాలనలోనే వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సామాజిక వర్గాలకు సీఎం జగన్ పాలనలో దక్కిన ప్రాధాన్యత, పదవులు,జరిగిన మంచి గురించి వివరించారు వాళ్లు.
రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ..
సామాజిక న్యాయం పాటించే ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. దేశానికి ఆయనొక రోల్ మోడల్. వెనుకబడిన వర్గానికి చెందిన 7 మందికి నాతో సహా రాజ్యసభకి ఆయన పంపారు. కేబినెట్,ఎమ్మెల్సీ ల కేటాయింపు లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు సింహ భాగం ఇచ్చారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ అనేది బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక వరం. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మకండి. బీసీలకు రక్షణ చట్టం తెస్తా అని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు. జగన్నన్న పాలనలో మనం బాగున్నాం.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ..
సామాజిక న్యాయం అంటే గతం లో ఎన్నికల హామీలు మాత్రమే. కానీ, ఇప్పుడది ఆచరణలో కనిపిస్తోంది. సామాజిక సాధికారతకు సజీవ సాక్ష్యం మేమే. మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు పెట్టి.. మహిళా సాధికారిత సాధించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అవినీతి రహితంగా, పేదల ప్రభుత్వంగా సమర్థవంతమైన పాలనను వైఎస్సార్‌సీపీ అందిస్తోంది. కాబట్టి.టీడీపీ మాయ మాటలు వినొద్దు.. యెల్లో మీడియా వార్తలు అసలు పట్టించుకోవద్దు.
అంతకు ముందు.. కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. నందన మారెళ్ల సెంటర్ నుండి బస్సుయాత్ర ప్రారంభమై.. పామూరు బస్టాండ్ వద్దకు చేరుకుంది. ఈ యాత్రలో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మస్తాన్ రావు, ఆంజాద్ బాషా, మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment