kanigiri constituency
-
‘వెనుకబడిన వర్గాలకు అండగా సీఎం జగన్’
సాక్షి, ప్రకాశం: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని, అందుకు తామే ప్రత్యక్ష సాక్ష్యాలని వైఎస్సార్సీపీ నేతలు ముక్తకంఠంతో చెబుతున్నారు. బుధవారం కనిగిరిలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర.. సాయంత్రానికి పామూరు బస్టాండ్ వద్దకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ నేతలు ఒక్కొక్కరుగా ప్రసంగించారు. సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్. ఆయన పాలనలోనే వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సామాజిక వర్గాలకు సీఎం జగన్ పాలనలో దక్కిన ప్రాధాన్యత, పదవులు,జరిగిన మంచి గురించి వివరించారు వాళ్లు. రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం పాటించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశానికి ఆయనొక రోల్ మోడల్. వెనుకబడిన వర్గానికి చెందిన 7 మందికి నాతో సహా రాజ్యసభకి ఆయన పంపారు. కేబినెట్,ఎమ్మెల్సీ ల కేటాయింపు లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు సింహ భాగం ఇచ్చారు. ఫీజు రీయంబర్స్మెంట్ అనేది బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక వరం. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మకండి. బీసీలకు రక్షణ చట్టం తెస్తా అని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు. జగన్నన్న పాలనలో మనం బాగున్నాం. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం అంటే గతం లో ఎన్నికల హామీలు మాత్రమే. కానీ, ఇప్పుడది ఆచరణలో కనిపిస్తోంది. సామాజిక సాధికారతకు సజీవ సాక్ష్యం మేమే. మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు పెట్టి.. మహిళా సాధికారిత సాధించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అవినీతి రహితంగా, పేదల ప్రభుత్వంగా సమర్థవంతమైన పాలనను వైఎస్సార్సీపీ అందిస్తోంది. కాబట్టి.టీడీపీ మాయ మాటలు వినొద్దు.. యెల్లో మీడియా వార్తలు అసలు పట్టించుకోవద్దు. అంతకు ముందు.. కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. నందన మారెళ్ల సెంటర్ నుండి బస్సుయాత్ర ప్రారంభమై.. పామూరు బస్టాండ్ వద్దకు చేరుకుంది. ఈ యాత్రలో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మస్తాన్ రావు, ఆంజాద్ బాషా, మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
సీట్ల యవ్వారం..సీఎం దగ్గర బేరం!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీలో సీట్ల పోట్లాట అమరావతికి చేరింది. మంత్రి శిద్దా రాఘవరావును దర్శి నుంచే పోటీ చేయించాలంటూ శిద్దా అనుచరులు గురువారం సీఎం నివాసం వద్ద ఆందోళనకు దిగారు. శిద్దాకు ఎంపీ సీటు వద్దని, ఎమ్మెల్యే సీటు కావాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే తాము పార్టీని వదిలేందుకు సైతం సిద్ధమంటూ హెచ్చరించారు. ఈ ఆందోళనలో పెద్ద ఎద్దున శిద్దా అనుచరులు పాల్గొన్నారు. శిద్దా అనుచరులు ఏకంగా సీఎం ఇంటి ముందే ఆందోళనకు దిగడంతో విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి శిద్దాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి హుటాహుటిన సీఎం ఇంటివద్ద ఉన్న అనుచరులను అక్కడి నుంచి పంపించారు. మంత్రి శిద్దాతో పాటు ఆయన కుటుంబం ఒంగోలు పార్లమెంట్ సీట్ కంటే దర్శి నుంచి పోటీకే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ సీఎం ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని ఆదేశించడంతో ఆయనకు ఎదురు చెప్పలేక శిద్దా మౌనంగా ఉండిపోయారు. సీఎం ఆదేశం మేరకు శిద్దా ఒంగోలులో పోటీ చేసేందుకు సిద్ధపడినా దర్శి నుంచి పోటీచేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థి కరువయ్యారు. సామాజిక సమీకరణాల పరంగా తొలుత కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శికి పంపాలని సీఎం నిర్ణయించారు. అయితే ఇందుకు కదిరి బాబూరావు ససేమిరా అన్నట్లు సమాచారం. పైగా తనకు సన్నిహితుడైన చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ద్వారా కనిగిరి సీటు కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. మరోవైపు కనిగిరి సీటును ఉగ్రనరసింహారెడ్డికి ఇస్తానని తొలుత సీఎం మాట ఇచ్చారు. అయితే కదిరి బాబూరావు అంగీకరించకపోవడంతో అది వీలుకాలేదు. దీంతో దర్శికి వెళ్లాలని సుజనా చౌదరి, ముఖ్యమంత్రి.. ఉగ్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తొలుత ఎక్కడికైనా వెళ్తానని చెప్పిన ఉగ్ర అంతలోనే వెనక్కు తగ్గి కనిగిరి సీటు ఇస్తేనే పోటీ చేస్తానని సీఎంకు స్పష్టం చేశారు. దీంతో సీట్ల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. ఈ పరిణామం శిద్దాకు అనుకూలాంశంగా మారింది. ఇదే అదనుగా శిద్దా అనుచరగణం సీఎంపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగంగానే గురువారం సీఎం ఇంటి వద్ద ఆందోళన చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శి సీటు శిద్దా రాఘవరావు తనయుడు శిద్దా సుధీర్‌కు ఇస్తే ఎలా ఉంటుందన్న విషయమై ముఖ్యమంత్రి గురువారం జిల్లా టీడీపీ నేతలతో చర్చించినట్లు సమాచారం. అయితే ఒంగోలు పార్లమెంట్‌తో పాటు దర్శి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం ఇబ్బందిగా ఉంటుందని శిద్దా చెప్పినట్లు తెలుస్తోంది. ఉగ్రకు బంపరాఫర్ దర్శి నుంచి పోటీ చేస్తే మొత్తం తానే చూసుకుంటానని ముఖ్యమంత్రి ఉగ్రనరసింహారెడ్డికి బంపరాఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కనిగిరికైతే తానే డబ్బులు పెట్టుకోగలనని దర్శికి డబ్బులు పెట్టడం ఇబ్బంది అని ఉగ్ర సీఎంకు స్పష్టం చేసినట్లు సమాచారం. దర్శికి వెళ్లేవారు కనిపించకపోవడంతో అన్నీ తానే చూస్తానని ఉగ్రకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉగ్ర దర్శికి వెల్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు కనిగిరి సీటు ఎవరికివ్వాలన్నదానిపై స్పష్టత కరువైంది. బాలకృష్ణ ఒత్తిడి మేరకు కనిగిరి సీటు కదిరి బాబూరావుకు ఇస్తారని ప్రచారం జరుగుతున్నా ఉగ్రనరసింహారెడ్డి సైతం పోటీ పడుతుండటంతో చివరకు ఏం జరుగుతుందన్నది తెలియరావడం లేదు. -
కదిలొచ్చిన కనిగిరి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: బిడ్డను ఆశీర్వదించండి... తోడుగా ఉండి చల్లని దీవెనలు అందించండి.. మీ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి అన్ని సమస్యలు పరిష్కరించి అందరి కన్నీళ్లు తుడుస్తా’నంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి జనానికి భరోసా ఇచ్చారు. కనిగిరి నియోజకవర్గంలో ఎనిమిదో రోజు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడుగడుగునా పూలు చల్లి జగన్‌కు స్వాగతం పలికారు. ఆయన వద్ద సమస్యలు ఏకరువు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు తుంగలో తొక్కి అందరినీ మోసగించిందని జగన్ దృష్టికి తెచ్చారు. రైతులను, మహిళలను, యువకులతో పాటు అన్ని వర్గాల ప్రజలకిచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. జనం కష్టాలు విని స్పందించిన జగన్ మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తూనే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్‌ను తొలగించేందుకు వెలిగొండ నీటిని తరలిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, మహిళలకు అన్ని విధాలా ప్రభుత్వం సాయమందిస్తుందని ఆడబిడ్డల చదువులకు తానే ఆర్థికసాయం అందిస్తానని వృద్ధులు బాగోగుల కోసం రూ.2 వేలు పింఛన్ ఇస్తానని జగన్ అందరికీ భరోసానిచ్చారు. జగన్‌తో కలిసి నడిచిన బాలినేని, వై.వి.సుబ్బారెడ్డి ఎనిమిదో రోజు ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్యాదవ్లతో పాటు పలువురు పాదయాత్రలో కలిసి నడిచారు. జగన్‌కు సమస్యల ఏకరువు ► అగ్రిగోల్డ్ సంస్థ తమకు చెల్లించాల్సిన రూ.20 లక్షలను ఇప్పించేం దుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఏరువారిపల్లి గ్రామానికి చెందిన బాధిత మహిళలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించారు. ►కనిగిరి పాలకేంద్రం రైతులకు చెల్లించాల్సిన పాల డబ్బులు రూ.కోటి, రవాణా ఖర్చులు రూ.67 లక్షలు ప్రభుత్వం ఎగవేసిందని రైతులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ►చింతలపాలెం గ్రామానికి చెందిన కనిగిరి మున్సి పల్ పారిశుద్ధ్య కార్మికుడు వెలిగొండయ్య (32) సర్వీస్ చేసి మరణిస్తే ప్రభుత్వం అతనికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదని ఆయన సతీమణి సానం ఆదిలక్ష్మి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించారు. ►మతిస్థిమితం లేని కుమారుడు తాళ్లూరి చిన్నయ్యకు ప్రభుత్వం పింఛన్ ఇవ్వడం లేదని శంఖవరం ఎస్సీ కాలనీకి చెందిన చిన్నయ్య తల్లి జగన్ దృష్టికి తెచ్చారు. ►మంగళగిరికి చెందిన చిడిపూడి జయలక్ష్మి దంపతులు శనివారం ప్రజాసంకల్పయాత్రలో జగన్‌ను కలిసి కూతురు పెళ్లి శుభలేఖను అందజేశారు. ►శనివారం ప్రజాసంకల్పయాత్రలో చింతలపాలెం మహిళలు 101 గుమ్మడికాయలతో వైఎస్ జగన్మోహన్రెడ్డికి దిష్టి తీశారు. ►పీసీపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన పండ్ల తోటల రైతులు తమకు సాగు నీరు అందించడంతో పాటు ఈ ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి కోరారు. ►అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకు తప్ప అర్హత ఉన్న మిగిలిన వారికి ప్రభుత్వం పక్కా గృహాలు ఇవ్వడం లేదని వాగుపల్లికి చెందిన ముద్దా సుశీల మరికొందరు పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి విన్నవించారు. ►భర్త చనిపోయి ఐదేళ్లు అవుతున్నా టీడీపీ ప్రభుత్వం వితంతు పింఛన్ అందించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఏరువారిపల్లెకు చెందిన బల్లి నర్సమ్మ వైఎస్ జగన్మోహన్రెడ్డికి అర్జీ ఇచ్చారు. ►భార్యభర్తలిద్దరూ పక్షవాతానికి గురై ఆరోగ్యం సరిగా లేక ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నామని మలి వయస్సులో ఉన్న తమను ఆదుకుని ఆరోగ్యశ్రీ కల్పించాలని వీర్ల వెంకట సుబ్బమ్మ, సుబ్బయ్యలు వైఎస్ జగన్‌ను కలిసి అర్జీ ఇచ్చారు. ఎనిమిదో రోజు యాత్ర ఇలా.. ఎనిమిదో రోజు కనిగిరి నియోజకవర్గంలోని హాజీస్‌పురం నుంచి ప్రారంభమైన యాత్ర కంఠంవారిపల్లి క్రాస్, చినఇర్లపాడు క్రాస్, పేరంగుడిపాడు, చింతలపాలెం మీదుగా శంఖవరం వరకు సాగింది. భోజన విరామం అనంతరం కనిగిరి బహిరంగ సభలో పాల్గొని జగన్ మాట్లాడారు. సాయంత్రానికి టకారిపాలెం వద్దకు యాత్ర చేరుకుంది. ఎనిమిదో రోజు వైఎస్ జగన్మోహన్రెడ్డి 12.7 కి.మీ. మేర నడిచారు. -
కనిగిరిలో రూ.కోట్లు కుమ్మరించిన టీడీపీ
- అయినా.. ఓటమి తప్పదని భావించి ఆగడాలకు పాల్పడిన వైనం - పట్టణంలో పలుచోట్ల క్రాస్ ఓటింగ్ కనిగిరి, న్యూస్‌లైన్ : కనిగిరి నియోజకవర్గంలో ఓటమి భయంతో కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ కుమ్మరించింది. పోలింగ్ రోజైన బుధవారం కూడా ఒక్క కనిగిరి పట్టణంలోనే కోటి రూపాయలకుపైగా పంపిణీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఓటమి తప్పదని భావించిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో పలుచోట్ల ఆగడాలకు పాల్పడ్డారు. పామూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో దౌర్జన్యాలకు దిగారు. వీరభద్రాపురం, మోపాడు, మోపాడుబంగ్లా, అయ్యవారిపల్లి, పట్టణంలోని పాతూరు తదితర పోలింగ్ కేంద్రాల్లో అరాచకాలు సృష్టించేందుకు యత్నించారు. తమకు అనుకూలమనుకున్న కనిగిరి నగర పంచాయతీలో సైతం రెండు వార్డులు మినహా మిగతాచోట్ల ఓటర్లు బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన టీడీపీ నాయకులు.. రెండోవిడతగా ఓటుకు 500 రూపాయల చొప్పున బుధవారం రహస్యంగా పంపిణీ చేశారు. అంతేగాకుండా ఒక సామాజికవర్గానికి చెందిన ఓట్లను మొత్తంగా కొనుగోలు చేసినట్లు సమాచారం. పోలింగ్ రోజు ఇంతజరుగుతున్నా నిఘా విభాగం అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. అధికారులు, పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనిగిరి పట్టణంలో మొత్తం 28,483 ఓట్లున్నాయి. వారందరికీ రెండోవిడత కూడా డబ్బు పంపిణీ చేసినప్పటికీ గెలుస్తామన్న ధీమా లేకపోవడంతో టీడీపీ నేతలు అల్లర్లు చేసి వేరే అడ్డదారుల కోసం ప్రయత్నించారు. అయితే, అవేమీ వీలుపడకపోవడంతో పాటు క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుసుకుని దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.