ఫైటింగ్‌.. షూటింగ్‌ | Nagachaithanya Cinema Shhoting In Thupran | Sakshi
Sakshi News home page

ఫైటింగ్‌.. షూటింగ్‌

Published Tue, Apr 10 2018 10:53 AM | Last Updated on Wed, Aug 29 2018 5:43 PM

Nagachaithanya Cinema Shhoting In Thupran - Sakshi

ఫైటింగ్‌ సన్నివేశాల షూటింగ్‌ పర్యవేక్షిస్తున్న రామ్‌– లక్ష్మణ్‌

మనోహరాబాద్‌(తూప్రాన్‌): మండలంలోని ముప్పిరెడ్డి గ్రామ శివారులో గల బీఎస్‌ స్టీల్‌ పరిశ్రమలో ఫైటింగ్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. సోమవారం ‘సవ్యసాచి’ అనే సినిమా షూటింగ్‌లో  భాగంగా హీరో నాగచైతన్య పై పైటింగ్‌ సన్నివేశాలను ఫైటింగ్‌ మాస్టర్లు రామ్‌– లక్ష్మణ్‌లు  చిత్రీకరించారు. ఈ సందర్భంగా సినిమా ఫైట్‌ మాస్టర్లూ  మాట్లాడుతూ చందు మోండేటీ దర్శకత్వంలో సినిమాను చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఇట్టి సినిమా  భాగంలో భాగంగా ఫైటింగ్‌ సన్నివేశాలను తీస్తున్నామన్నారు. ఈ సినిమాలో నాగచైతన్య హీరో, లైన్‌ ప్రోడక్షన్‌ పీటీ గిరిధర్‌∙తదితరులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement