అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సవ్యసాచి. నవంబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తొలిసారిగా మాధవన్ ఈ సినిమాతో విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.
తన ఎడమ చేతి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే పాత్రలో హీరో నాగచైతన్య కనిపిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా సీనియర్ నటుడు మాధవన్, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment