‘సవ్యసాచి’ టైటిల్‌ సాంగ్‌ | Naga Chaitanya Savyasachi Title Song | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 19 2018 12:03 PM | Last Updated on Fri, Oct 19 2018 12:04 PM

Naga Chaitanya Savyasachi Title Song - Sakshi

అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సవ్యసాచి. కార్తీకేయ, ప్రేమమ్‌ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.

నవంబర్‌ 2న రిలీజ్‌ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పూర్తిగా సంస్కృత పదాలతో సాగిన ఈ పాటకు కీరవాణి స్వరాలు అందించగా ఆయన తండ్రి శివశక్తి దత్తా, రామకృష్ణ కోడూరితో కలిసి సాహిత్యమందించారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా సీనియర్‌ నటుడు మాధవన్‌, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement