క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
పుల్లంపేట: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. శనివారం రాష్ట్రస్థాయి అండర్–19 సాఫ్ట్‌బాల్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగం సులభంగా సాధించుకోవచ్చన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమని చెప్పారు. పుల్లంపేటలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్సీ బత్యాల చంగల్‌రాయుడు మాట్లాడుతూ క్రీడల్లో బాలికలు రాణిస్తున్నారని, తల్లిదండ్రులు దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థినులను ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు మెమొంటో అందజేశారు.
విజేతలు వీరే.. : అండర్–19 సాఫ్ట్‌బాల్ బాలుర విభాగంలో గుంటూరు జట్టు ప్రథమ, కడప జట్టు ద్వితీయ, శ్రీకాకుళం తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో కృష్ణాజట్టు ప్రథమ, విజయనగరం జట్టు ద్వితీయం, కడప జట్టు తృతీయ స్థానాల్లో నిలిచాయి. గెలుపొందిన జట్లు ఔరంగాబాద్‌లో ఈనెల 21–25వ తేదీ వరకు జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొననున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రి¯Œ్సపల్ రేణుకాప్రసాద్, సర్పంచ్ సుమతి, ఆర్‌ఐ పీఈటీ భానుమూర్తిరాజు, అండర్–19 స్టేట్ ప్రెసిడెంట్ సుబ్బరాజు, సోముబాలాజీ బాబు తదితరులు పాల్గొన్నారు.