pullampeta
-
ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం
పుల్లంపేట (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలం, రెడ్డి పల్లి వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా తాండురుకు చెందిన కొందరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి, వస్తుండగా వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు దగ్గర వారు ప్రయాణిస్తున్న కారు, కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. -
పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం
– దళియపల్లి, కొత్తపేట ఎంపీటీసీ సభ్యుల సభ్యత్వం రద్దు పుల్లంపేట: మరోసారి ప్రజాస్వామ్యం గెలిచింది. పార్టీ ఫిరాయింపు రాజకీయాలకు చెంపదెబ్బకొట్టి ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసింది. వివరాలలోకి వెళితే పుల్లంపేట మండలంలో అక్రమంగా పార్టీ ఫిరాయింపుదారులకు వేటుపడింది. వైఎస్సార్ సీపీ గుర్తుతో గెలిచి తెలుగుదేశం పార్టీ వారికి ఎంపీపీ ఎన్నికలో ఓటు వేసిన దళాయపల్లె ఎంపీటీసీ సభ్యురాలు వాహిదా, కొత్తపేట ఎంపీటీసీ సభ్యుడు సుబ్బరాయుడుల సభ్యత్వాన్ని ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది. 2014లో పుల్లంపేటలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో 11 ఎంపీటీసీ స్థానాలకుగానూ 8 వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించింది. కేవలం మూడు మాత్రమే తెలుగుదేశం సంపాదించుకుంది. తదనంతరం టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలకు డబ్బు ప్రలోభానికి గురిచేసి వారివైపు తిప్పుకున్నారు. గతనెలలో ఎంపీపీగా బావికాడపల్లికి చెందిన రజనీకి ప్రమాణస్వీకారం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి విప్ జారీ చేశారు. పార్టీ ఫిరాయింపపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్ విచారణ జరిపి వారి సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ నుంచి అందిన అధికారికంగా ధ్రువపత్రాలు వారికి అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే: త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుస్తారని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు బుద్ధితెచ్చుకోవాలన్నారు. ఇదే తీర్పు పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలకు వర్తిస్తుందని తిరిగిఅక్కడ ఎన్నికలు నిర్వహిస్తే జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో విజయఢాంకా మోగిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు హరినా«థ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రామనాథం, కుమార్‌రెడ్డి, బాలానాయక్, బాలునాయుడు, వెంకటసుబ్బారెడ్డి, రెడ్డయ్యరెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సుజనాచౌదరి సభలో మహిళల గగ్గోలు!
రాజంపేట/పుల్లంపేట: రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని పుల్లంపేట రెడ్డిపల్లె చెరువుకట్ట సమీపంలో శుక్రవారం వనం-మనం కార్యక్రమం నిర్వహించారు. దీనికి కేంద్రమంత్రి వై.సుజనాచౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ముందువరుసలో ఉన్న మహిళలు ఒక్కసారిగా లేచి తమకు ప్రభుత్వపరంగా జరుగుతున్న నష్టాలు, అన్యాయాలపై నినాదాలతో నిరసన వ్యక్తంచేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని , ఫించన్ రాలేదని, పని దినాలు కల్పించాలని, కరెంటు బిల్లులు కట్టలేకున్నామని మంత్రికి వినిపించేలా అరిచారు.అయితే వీరి గురించి పట్టించుకోకుండా సన్మాన ఆనందంలో మునిగిపోయారు. 50రోజుల పనిదినాలు కల్పిస్తాం: కలెక్టరు మహిళ కేకలు విని మంత్రి సుజనా వారి పరిస్థితి గురించి తెలుసుకోవాలని జిల్లా కలెక్టరు సత్యనారాయణను ఆదేశించారు. తమ అధికారి ద్వారా తెలుసుకున్న కలెక్టరు 50రోజులు పనిదినాలు కల్పిస్తామని చెప్పారు. అయినా మహిళలు సమాధానపడలేదు. కంటతడిపెట్టిన నిరుపేదమహిళ.. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, పింఛను సౌకర్యం కల్పించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితలేకుండాపోయిందని చిన్నఓరంపాడుకు చెందిన నిరుపేద మహిళ గంగమ్మ కంటతడిపెట్టింది. ఈమెను పలకరించే నాథుడు కనిపించలేదు. నియోజకవర్గంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా సభకు తీసుకొచ్చారు. మంత్రికి స్వాగతం పలికేందుకు గంటలతరబడి ఎండలో నిరీక్షించారు. కొంతమంది గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలు మంత్రి సుజనా ప్రసంగిస్తున్న తరుణంలో సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు కృషి: సుజనా రాజంపేట: ప్రత్యేకప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి వై.సుజనాచౌదరి అభిప్రాపయడ్డారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువు కట్ట సమీపంలో వనం–మనం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప పవర్ఫుల్ జిల్లా అని కొనియాడారు.ఇక్కడ సహజవనరులు, ఖనిజాలు ఉన్నాయన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు సీఎం కృషిచేస్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. కడపలో యోగివేమన విశ్వవిద్యాలయంలో సైన్స్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో ఉక్కుపరిశ్రమ స్థాపనకు కృషిచేస్తామన్నారు. సీఎం రమేష్, పౌరసరఫరాల అభివృద్ధిసంస్ధ చైర్మన్ లింగారెడ్డి, జిల్లా కలెక్టరు సత్యనారాయణ, శాసనమండలి నేత సతీష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనువాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు మాట్లాడారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
పుల్లంపేట: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. శనివారం రాష్ట్రస్థాయి అండర్–19 సాఫ్ట్‌బాల్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగం సులభంగా సాధించుకోవచ్చన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమని చెప్పారు. పుల్లంపేటలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయుడు మాట్లాడుతూ క్రీడల్లో బాలికలు రాణిస్తున్నారని, తల్లిదండ్రులు దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థినులను ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు మెమొంటో అందజేశారు. విజేతలు వీరే.. : అండర్–19 సాఫ్ట్‌బాల్ బాలుర విభాగంలో గుంటూరు జట్టు ప్రథమ, కడప జట్టు ద్వితీయ, శ్రీకాకుళం తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో కృష్ణాజట్టు ప్రథమ, విజయనగరం జట్టు ద్వితీయం, కడప జట్టు తృతీయ స్థానాల్లో నిలిచాయి. గెలుపొందిన జట్లు ఔరంగాబాద్‌లో ఈనెల 21–25వ తేదీ వరకు జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొననున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రి¯Œ్సపల్ రేణుకాప్రసాద్, సర్పంచ్ సుమతి, ఆర్ఐ పీఈటీ భానుమూర్తిరాజు, అండర్–19 స్టేట్ ప్రెసిడెంట్ సుబ్బరాజు, సోముబాలాజీ బాబు తదితరులు పాల్గొన్నారు.