పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం | Party defector lesson | Sakshi
Sakshi News home page

పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం

Published Thu, Jan 19 2017 12:00 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం

పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం

 – దళియపల్లి, కొత్తపేట ఎంపీటీసీ సభ్యుల సభ్యత్వం రద్దు
పుల్లంపేట:  మరోసారి ప్రజాస్వామ్యం గెలిచింది. పార్టీ ఫిరాయింపు రాజకీయాలకు చెంపదెబ్బకొట్టి ఎలక‌్షన్‌ కమిషన్‌ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసింది. వివరాలలోకి వెళితే పుల్లంపేట మండలంలో అక్రమంగా పార్టీ ఫిరాయింపుదారులకు వేటుపడింది. వైఎస్సార్‌ సీపీ గుర్తుతో గెలిచి తెలుగుదేశం పార్టీ వారికి ఎంపీపీ ఎన్నికలో ఓటు వేసిన దళాయపల్లె ఎంపీటీసీ సభ్యురాలు వాహిదా, కొత్తపేట ఎంపీటీసీ సభ్యుడు సుబ్బరాయుడుల సభ్యత్వాన్ని ఎలక‌్షన్‌ కమిషన్‌ రద్దు చేసింది. 2014లో పుల్లంపేటలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో 11 ఎంపీటీసీ స్థానాలకుగానూ 8 వైఎస్సార్‌ సీపీ విజయఢంకా మోగించింది. కేవలం మూడు మాత్రమే తెలుగుదేశం సంపాదించుకుంది. తదనంతరం టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలకు డబ్బు ప్రలోభానికి గురిచేసి వారివైపు తిప్పుకున్నారు. గతనెలలో ఎంపీపీగా బావికాడపల్లికి చెందిన రజనీకి ప్రమాణస్వీకారం చేశారు. దీంతో వైఎస్సార్‌ సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి విప్‌ జారీ చేశారు. పార్టీ ఫిరాయింపపై ఎలక‌్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్‌ విచారణ జరిపి వారి సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు ఎలక‌్షన్‌ కమిషన్‌ నుంచి అందిన అధికారికంగా ధ్రువపత్రాలు వారికి అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం ఉందన్నారు.   
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే:
 త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ వివేకానందరెడ్డిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుస్తారని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు బుద్ధితెచ్చుకోవాలన్నారు. ఇదే తీర్పు పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలకు వర్తిస్తుందని తిరిగిఅక్కడ ఎన్నికలు నిర్వహిస్తే జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో విజయఢాంకా మోగిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు హరినా«థ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రామనాథం, కుమార్‌రెడ్డి, బాలానాయక్, బాలునాయుడు, వెంకటసుబ్బారెడ్డి, రెడ్డయ్యరెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement