MLA koramutla
-
పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం
– దళియపల్లి, కొత్తపేట ఎంపీటీసీ సభ్యుల సభ్యత్వం రద్దు పుల్లంపేట: మరోసారి ప్రజాస్వామ్యం గెలిచింది. పార్టీ ఫిరాయింపు రాజకీయాలకు చెంపదెబ్బకొట్టి ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసింది. వివరాలలోకి వెళితే పుల్లంపేట మండలంలో అక్రమంగా పార్టీ ఫిరాయింపుదారులకు వేటుపడింది. వైఎస్సార్ సీపీ గుర్తుతో గెలిచి తెలుగుదేశం పార్టీ వారికి ఎంపీపీ ఎన్నికలో ఓటు వేసిన దళాయపల్లె ఎంపీటీసీ సభ్యురాలు వాహిదా, కొత్తపేట ఎంపీటీసీ సభ్యుడు సుబ్బరాయుడుల సభ్యత్వాన్ని ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది. 2014లో పుల్లంపేటలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో 11 ఎంపీటీసీ స్థానాలకుగానూ 8 వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించింది. కేవలం మూడు మాత్రమే తెలుగుదేశం సంపాదించుకుంది. తదనంతరం టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలకు డబ్బు ప్రలోభానికి గురిచేసి వారివైపు తిప్పుకున్నారు. గతనెలలో ఎంపీపీగా బావికాడపల్లికి చెందిన రజనీకి ప్రమాణస్వీకారం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి విప్ జారీ చేశారు. పార్టీ ఫిరాయింపపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్ విచారణ జరిపి వారి సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ నుంచి అందిన అధికారికంగా ధ్రువపత్రాలు వారికి అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే: త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుస్తారని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు బుద్ధితెచ్చుకోవాలన్నారు. ఇదే తీర్పు పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలకు వర్తిస్తుందని తిరిగిఅక్కడ ఎన్నికలు నిర్వహిస్తే జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో విజయఢాంకా మోగిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు హరినా«థ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రామనాథం, కుమార్‌రెడ్డి, బాలానాయక్, బాలునాయుడు, వెంకటసుబ్బారెడ్డి, రెడ్డయ్యరెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ది నిరోధకులా..?
-ఆకేపాటి ఆమర్నాథ్ రెడ్డి రెడ్డివారిపల్లె(రైల్వేకోడూరు రూరల్): టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులవుతారా? అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి నిలదీశారు. ప్రజల తరుపున ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష నాయకుడైన వైస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఉందన్నారు. రైల్వేకోడూరు మండలంలోని రెడ్డివారిపల్లెలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఇచ్చిన క్రిస్మస్ విందుకు ఆయన హాజరయ్యారు. పార్టీనాయకులు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోతిరెడ్డి పాడు, గాలేరు–నగిరి, హంద్రీ నీవా పనులు 80 శాతం పూర్తిచేశారని తెలిపారు. టీడీపీ యాంలో సీఎం చంద్రబాబు 20 శాతం పూర్తి చేయలేకపోగా పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు అందిస్తాం, పులివెందులకు సాగునీరు, తాగునీరు అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పూటకో మాట చెప్పడం తప్ప ఆయన రాష్ట్రానికి, జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. వైఎస్ చేసిన పనులకు గేట్లు ఎత్తారు తప్ప ఆయన గొప్ప అందులో ఏమీలేదన్నారు. ఇటీవల కడపలో జరిగిన ధర్నాకు ప్రభుత్వం దిగివచ్చి చేసిందే తప్ప జిల్లాకు ఆయన సొంతంగా చేసిందీ శూన్యమన్నారు. సోమవారం పులివేందులలో పీబీసీ రైతులు చేస్తున్న దీక్షకు అందురూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, మండల కన్వీనర్లు కోడూరు సుధాకర్‌రాజు, చిట్వేలి చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, పుల్లంపేట ముద్దా బాబుల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, క్షత్రియ నాయకులు సిద్దేశ్వరరాజు, నియోజకవర్గ అధికార ప్రతినిది ఎం.నాగేంద్ర, మెనార్టీనాయకులు ఆదాం సాహేబ్, ఎంపీటీసీలు శివయ్య, రవి కుమార్ తదితరులు హాజరయ్యారు.