రన్నరప్ హైదరాబాద్ | hyderabad team as runner up in soft ball championship | Sakshi
Sakshi News home page

రన్నరప్ హైదరాబాద్

Published Tue, Jul 19 2016 2:55 PM | Last Updated on Mon, Oct 22 2018 8:11 PM

hyderabad team as runner up in soft ball championship

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలబాలికల జట్లు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్ గ్రౌండ్స్‌లో సోమవారం జరిగిన టైటిల్ పోరులో ఇరు జట్లు పరాజయం చవిచూశాయి. బాలుర ఫైనల్లో మహబూబ్‌నగర్ 3-2తో హైదరాబాద్‌పై గెలుపొందింది.

 

దీంతో మహబూబ్‌నగర్ చాంపియన్‌గా నిలిచింది. వరంగల్ జట్టుకు మూడో స్థానం లభించింది. బాలికల తుదిపోరులో మెదక్ 11-6తో హైదరాబాద్‌ను కంగుతినిపించింది. మెదక్ విజేతగా నిలువగా, రంగారెడ్డి జిల్లాకు కాంస్య పతకం దక్కింది. అనంతరం నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement