సాక్షి, హైదరాబాద్: మినీ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలబాలికల జట్లు శుభారంభం చేశాయి. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో బాలికల జట్టు 10-0తో ఖమ్మం జట్టుపై గెలుపొందగా... బాలుర విభాగంలో హైదరాబాద్ జట్టు 12-6తో ఆదిలాబాద్ జట్టును ఓడించింది.
ఇతర బాలికల మ్యాచ్‌ల్లో నిజామాబాద్ జట్టు 6-0తో మెదక్‌పై, వరంగల్ 15-0తో కరీంనగర్‌పై, మహబూబ్‌నగర్ 15-5తో రంగారెడ్డిపై గెలిచారుు. బాలుర మ్యాచ్‌ల్లో వరంగల్ 10-1తో మహబూబ్‌నగర్‌పై, మెదక్ 18-4తో కరీంనగర్‌పై, నిజామాబాద్ 11-1తో రంగారెడ్డిపై విజయం సాధించారుు. ఈ టోర్నీని రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం ఉపాధ్యక్షుడు జి. శంకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి కె.శోభన్ బాబు, కోశాధికారి డి. అభిషేక్ గౌడ్ పాల్గొన్నారు.