సబ్ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు రాణించింది.
సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు రాణించింది. ఆర్మూర్‌లోని నరేంద్ర హైస్కూల్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలికల విభాగంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన బాలికల ఫైనల్లో మెదక్ జట్టు 7-5తో నిజామాబాద్‌పై గెలిచి విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో నిజామాబాద్ జట్టు 3-2తో మెదక్ జట్టును ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. రంగారెడ్డి జట్టుకు మూడో స్థానం దక్కింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ సాఫ్ట్‌బాల్ సంఘం ప్రతినిధులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.