కణేకల్లు : రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో గెలుపే లక్ష్యంగా ఆడాలని తహసీల్దార్ ఆర్.వెంకటశేషు క్రీడాకారులకు సూచించారు. అండర్–14, అండర్–17 క్రీడాకారులకు జిల్లా కేంద్రం అనంతపురంలో ఈ నెల 22, 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా జట్టుకు కణేకల్లులో ప్రత్యేకశిక్షణ ఇచ్చింది. శుక్రవారం శిక్షణ ముగింపు సందర్భంగా ఏర్పాటైన సభలో తహసీల్దార్ మాట్లాడుతూ శిక్షణలో ఎటువంటి లోటుపాట్లురాకుండా చూసిన పీడీ గోపాల్‌రెడ్డి కషిని అభినందించారు.
ఎస్‌ఐ యువరాజు మాట్లాడుతూ ఈ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించి తిరిగి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశులు, పీడీ గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు వేలూరు మరియప్ప, సాఫ్ట్‌బాల్ అసోషియేషన్ జిల్లా ట్రెజరర్ కేశవమూర్తి, సాఫ్ట్‌బాల్ కోచింగ్ పర్యవేక్షకులు సత్యనారాయణ, హెచ్‌ఎం సూర్యనారాయణ, ఆర్డీటీ ఉరవకొండ రీజనల్ డైరెక్టర్ హనుమంతరాయుడు, ఏటీఎల్ సురేంద్ర, కోచ్‌లు షాకీర్, మల్లికార్జునలు పాల్గొన్నారు.
గెలుపే లక్ష్యంగా ఆడండి
Published Fri, Oct 21 2016 11:11 PM | Last Updated on Mon, Oct 22 2018 8:11 PM
Advertisement
Advertisement