kanekal
-
భార్యకు సెల్ఫీ వీడియో పంపి..ఆ తర్వాత..
సాక్షి, కణేకల్లు: తన చావుకు ఎవరూ కారణం కాదంటూ భార్యకు వీడియో సందేశాన్ని పంపి భర్త కనిపించకుండా పోయాడు. వివరాలు.. కణేకల్లు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన మల్లికార్జున, జయలక్ష్మి దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రగుంట బస్టాండ్ ప్రాంతంలో సెల్ఫోన్ల మరమ్మతు దుకాణాన్ని మల్లికార్జున నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన అతను ఈ విషయాన్ని భార్యకు కూడా తెలపలేదు. డాక్టర్ వద్దకు ఒక్కడే వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చేవాడు. మంగళవారం ఉదయం తాను దుకాణానికి వెళుతున్నట్లు ఇంట్లో తెలిపి బయటకు వచ్చిన అతను.. ద్విచక్ర వాహనంపై మాల్యం – నాగేపల్లి గ్రామాల మధ్య ఉన్న హెచ్చెల్సీ గట్టుకు చేరుకున్నాడు. అనంతరం కాలువ గట్టుపై నిల్చోని తన చావుకు ఎవరూ కారణం కాదని, ఆరోగ్యం బాగాలేకపోవడంతో జీవితంపై విరక్తితో కాలువలో దూకి చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి భార్యకు పంపాడు. ఆలస్యంగా ఈ సందేశాన్ని గమనించిన భార్య జయలక్ష్మి తీవ్ర ఆందోళనకు గురైంది. విషయాన్ని వెంటనే కుటుంబసభ్యులకు, బంధువులకు, పోలీసులకు చేరవేయడవంతో అందరూ ఆగమేఘాలపై కాలువ గట్టుకు చేరుకున్నారు. అక్కడ మల్లికార్జున ద్విచక్ర వాహనంతో పాటు సెల్‌ఫోన్, షర్ట్ లభ్యమయ్యాయి. కుటుంబసభ్యులు కాలువ వెంబడి గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అంతా క్షణాల్లోనే.. రెండు కుటుంబాల్లో అంతులేని శోకం) -
స్టేషన్‌కి చేరిన దున్నపోతు పంచాయితీ! మాదంటే..మాది అని గొడవ
ఉండేది ఒకేఒక్క దేవర దున్నపోతు.. రోజుల వ్యవధిలో రెండు గ్రామాల్లో దేవర (జాతర) ఉంది. దేవరపోతు లేకుంటే జాతరే జరగదు. ఊరి దేవర చేయకపోతే గ్రామానికి అరిష్టమని అందరూ భావిస్తున్నారు. దీంతో ఉన్న ఒక్క దేవరపోతును వదులుకునేందుకు రెండు గ్రామాల ప్రజలు ఇష్ట పడడం లేదు. దీంతో ఆ దున్నపోతు తమదంటే.. తమదంటూ గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఈ అంశాన్ని రెండు గ్రామాల పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. సాక్షి, కణేకల్లు: కణేకల్లు మండలానికి పడమట అంబాపురం, ఉత్తరాన రచ్చుమర్రి గ్రామాలున్నాయి. పదేళ్లకోసారి ఊరి దేవర జరపడం ఈ రెండు గ్రామాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఊరి దేవర జరిగిన నెల తర్వాత అమ్మవారి పేరున ఓ మూడు నెలల వయసున్న దున్నపోతును కొనుగోలు చేసి వదులుతుంటారు. ఈ క్రమంలో పదేళ్ల క్రితం ఈ రెండు గ్రామాల్లోనూ ఊరి దేవర ముగిసిన తర్వాత మళ్లీ దున్నపోతును అమ్మవారి పేరున వదిలేశారు. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్లో ఊరి దేవరకు గ్రామస్తులు పెద్త ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. పట్టుదలకు పోయిన గ్రామ పెద్దలు.. ఈ నెల 17న అంబాపురంలో, మరో రెండు నెలల్లోపు రచ్చుమర్రిలో ఊరి దేవర నిర్వహించాలని గ్రామ పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో తాము అమ్మవారి పేరుతో వదిలిన దేవర దున్నపోతు కోసం అంబాపురం గ్రామస్తులు నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో గాలించి, చివరకు బొమ్మనహాళ్ మంలడం కొలగానహళ్లిలో కనిపించిన దున్నపోతును తీసుకెళ్లి గ్రామంలోని బందులదొడ్డిలో బంధించారు. విషయం తెలుసుకున్న ఉద్దేహాళ్ గ్రామస్తులు అంబాపురానికి చేరుకుని బందులదొడ్డిలో ఉంచిన దున్నపోతును గమనించి, అది తమదని వాదనకు దిగారు. అయితే ఆ పోతు తమదేనంటూ అంబాపురం వాసులు నచ్చచెప్పడంతో వారు వెనుదిరిగారు. ఈ సమస్య సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో రచ్చుమర్రి గ్రామస్తులొచ్చి పోతు తమదేనంటూ భీష్మించారు. తాము వదిలిన దున్నపోతును ఎలా బంధిస్తారంటూ అంబాపురం గ్రామ పెద్దలను నిలదీశారు. వారం రోజులుగా ఇరు గ్రామాల మధ్య ఈ వివాదం చెలరేగుతూ వస్తోంది. ఇరు గ్రామాల పెద్దలు పట్టుదలకు పోయి విశ్వ ప్రయత్నాలు చేస్తుండడంతో పలు మార్లు పంచాయితీలూ జరిగాయి. ఎవరూ రాజీ పడలేదు. ఊరి దేవరకు తేదీ నిశ్చయించుకున్నామని, ఊరంతా సంబరాలకు సిద్ధమైన తరుణంలో ఇలా ఘర్షనకు దిగడం సరికాదంటూ అంబాపురం వాసులు అంటున్నారు. అయితే ఈ పోతును వదులుకుంటే రెండు నెలల్లోపు తమ గ్రామంలో ఊరి దేవర ఎలా జరుపుకోవాలంటూ రచ్చుమర్రి వాసులు నిలదీస్తున్నారు. దీంతో పోతును వదులుకునేందుకు ఇరు గ్రామస్తులూ సిద్ధంగా లేకపోవడంతో వివాదం మరింత ముదిరింది. స్టేషన్‌కు చేరినా తెగని పంచాయితీ.. చివరకు దేవర పోతు సమస్య కణేకల్లు పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. రెండు గ్రామాల పెద్దల మధ్య సఖ్యత కుదిర్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ పోతు తమదంటే తమదంటూ స్టేషన్లోనే రెండు గ్రామాల ప్రజలు మొండిగా వాదనకు దిగారు. దీంతో ఎవరికీ సర్ది చెప్పలేక పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు. పోతు కోసం తాము ఎందాకైనా పోతామంటూ ఒకరిపై మరొకరు సవాల్ విసురుకుంటున్నారు. ఈ క్రమంలో అంబాపురంలో రేయింబవళ్లూ దున్నపోతుకు యువకులు పహారా కాస్తున్నారు. గ్రామంలో కొత్త వ్యక్తుల కదలికలపై పటిష్ట నిఘా వేశారు. (చదవండి: -
రికార్డులకెక్కిన ‘షర్మస్’ క్రికెట్ స్టేడియం
సాక్షి, అనంతపురం: తక్కువ ఖర్చుతో మినీ క్రికెట్ స్టేడియం నిర్మించవచ్చని నిరూపించాడు కణేకల్లు కుర్రాడు. తన ప్రతిభకు పదను పెట్టి ‘ఎస్’ ఆకారంలో మినీ క్రికెట్ స్టేడియం నిర్మించి ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కాడు. వివరాల్లోకి వెళితే.. కణేకల్లులోని శ్రీ విద్యానికేతన్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మనేగర్ షర్మస్.. గతేడాది లాక్డౌన్ సమయంలో ఇంట్లో సమయాన్ని వృథా చేయకుండా మినీ క్రికెట్ స్టేడియం ఎలా నిర్మించాలో ఆలోచించాడు. ప్రస్తుతమున్న స్టేడియాలకు భిన్నంగా ‘ఎస్’ ఆకారంలో నాలుగు ఎగ్జిట్లు ఏర్పాటు చేస్తూ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండేలా ‘స్మాలెస్ట్ మోడల్ ఆఫ్ క్రికెట్ స్టేడియం’ నమూనా రూపొందించాడు. దీని కోసం రూ.20 వేల వరకు ఖర్చు చేశాడు. అనంతరం తన డెమో గురించి వివరిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వారికి మెయిల్ పంపగా.. వారు ఇటీవల దాన్ని రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు షర్మస్కు మెడల్, సర్టిఫికెట్ పంపారు. ఈ డెమాతో షర్మస్ పలు రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా స్టేడియం నిర్మాణ పేటెంట్ హక్కును కూడా పొందాడు. మంVýæళవారం కణేకల్లులో జరిగిన కార్యక్రమంలో రాయదుర్గం మార్కెట్ యార్డు చైర్పర్సన్ ఉషారాణి, శ్రీవిద్యానికేతన్ స్కూల్ కమ్ కాలేజీ కరస్పాండెంట్ రవికుమార్ అభినందించారు. స్టేడియం ప్రత్యేకతలు ఇలా.. ► క్రికెట్ రెండు వైపుల మాత్రమే(టూఎండ్స్) ఆడాలి. ► షర్మస్ స్టేడియంను 360 డిగ్రీలో నిర్మించడం వల్ల నాలుగు వైపులా ఆడొచ్చు. ► వర్షం వస్తే మ్యాచ్ ఆగినా.. వెంటనే ప్రారంభంమయ్యేలా చర్యలు. ► వర్షపు నీరు వెళ్లేందుకు కింద గ్రాస్‌కు రంధ్రాలు ఏర్పాటు చేసి డ్రైనేజీ సిస్టమ్. ► హీటింగ్ ప్యాడ్స్ ఉంచడంతో అరగంటలో గ్రౌండ్ అంతా డ్రై అయిపోతుంది. దీంతో వెంటనే ఆటనుప్రారంభించవచ్చు. ► స్టేడియంలో ఎక్కువ మంది కూర్చునేలాæ ఆడియన్స్, వీఐపీ, ఫ్లేయర్స్ కోసం కంపార్ట్మెంట్స్ ఏర్పాటు. ► లోయర్ కంపార్ట్మెంట్, మిడిల్ కంపార్ట్మెంట్, అప్పర్ కంపార్ట్మెంట్ల ఏర్పాటు. ► మిడిల్ కంపార్ట్మెంట్ ఫైబర్ గ్లాస్‌తో ఏర్పాటు చేయడంతో పాటు వీఐపీల కోసం ఈ గ్యాలరీ రూపొందించి ఏసీ ఏర్పాటు చేసేలా ప్లాన్. ► పైభాగంలో ప్రొటెక్టివ్ వాల్ నిర్మించడం వల్ల సూర్య కిరణాలు స్టేడియంలో పడవు. దీంతో ఆటకు ఎలాంటి ఇబ్బందులుండవు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పంపిన మెడల్, సర్టిఫికెట్ ప్రపంచంలోనే ఎక్కడా లేదు నేను రూపొందించిన స్టేడియం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. తొలుత నాకు ఎస్ ఆకారంలో మినీ స్టేడియం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. గూగుల్‌లో సెర్చ్ చేశాక ఇలాంటి స్టేడియం ఎక్కడా లేదని తెలిసింది. ఆ తర్వాతే నా మేథస్సుకు పదును పెట్టి ‘స్మాలెస్ట్ మోడల్ ఆఫ్ క్రికెట్ స్టేడియం’ నిర్మించాను. నా ప్రాజెక్ట్ వర్క్, స్టేడియం నమూనాను ఢిల్లీలోని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మెయిల్ ద్వారా పంపాను. వాస్తవానికి వారు వచ్చి విజిట్ చేయాల్సి ఉంది. కానీ లాక్డౌన్ కారణంగా వారు రాలేదు. దీంతో అధికారుల ఆదేశాల మేరకు నేను రోటరీ చేయించి ప్రాజెక్ట్ తీరును వివరిస్తూ పంపాను. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు అంగీకరించారు. నాకు మెడల్, సర్టిఫికెట్‌ను కూడా పంపారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారి మెయిల్లో కూడా అప్లోడ్ చేశారు. – మనేగర్ షర్మస్ -
ఖాకీల అత్యుత్సాహం
కొళాయి ఏర్పాటు విషయంలో గొడవ.. 18న కోర్టుకు హాజరైన నిందితులు.. రిమాండ్‌కు ఆదేశం విచారణ పేరుతో రెండురోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు మంత్రి మెప్పు కోసమే కస్టడీకి అంటున్న నిందితుల బంధువులు రాయదుర్గం: కణేకల్లు మండలంలో పట్టపగలే సర్పంచ్ హత్య జరిగినా, రాయదుర్గం పట్టణంలో చోరీలు పెరుగుతున్నా, లారీలకు లారీలు ఇసుక తరలిపోతున్నా పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు. చిన్నపాటి గొడవలకు పాల్పడి రిమాండ్‌లో ఉన్న వారిపై మాత్రం విచారణ పేరుతో పోలీస్ కస్టడీకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించి, భయాందోళనకు గురిచేస్తూ వివాదాస్పదమవుతున్నారు. వివరాల్లోకెళితే.. కణేకల్లు మండలం యర్రగుంట గ్రామంలో జూలై 7న తాగునీటి కుళాయి ఏర్పాటు విషయంలో ఇరువర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. ఇందులో ఒక వర్గానికి చెందిన వ్యక్తికి కాలు విరిగిపోగా, మరో వర్గానికి చెందిన వ్యక్తికి తలకు గాయమై ఆరు కుట్లు పడ్డాయి. ఇంటివద్దకు వచ్చి గొడవకు దిగారని ఈ దాడిలో తమ తండ్రి చంద్రమౌళిరెడ్డి కాలువిరిగిపోయిందని వైఎస్సార్సీపీకి చెందిన శ్రీనివాసరెడ్డి, నవీన్ కుమార్‌రెడ్డిలు కణేకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు కౌంటర్‌గా.. హత్యాయత్నం చేశారని వన్నారెడ్డి తదితరులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో భయపడిపోయిన శ్రీనివాసరెడ్డి, నవీన్ కుమార్‌రెడ్డిలు పరారయ్యారు. ఆ సమయంలో నియోజకవర్గంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బాధితుల బంధువులను విచారణ పేరుతో పట్టుకువచ్చి స్టేషన్లు మార్చిమార్చి వేధించారు. చివరకు ఆగస్టు 18న నిందితులు కళ్యాణదుర్గం కోర్టుకు హాజరు కాగా.. వీరికి జడ్జి రిమాండ్ విధించారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాయదుర్గం జడ్జికి అప్పీలు చేసి విచారణ పేరుతో ఆ ఇద్దరు యువకుల(శ్రీనివాసరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి)ను రెండురోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకోవడంపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జడ్జి రిమాండ్‌కు ఆదేశించిన తరువాత కూడా విచారణ అంటూ పోలీసులు తీసుకురావడం చిత్రహింసలకు గురిచేయడానికే అంటూ వాపోతున్నారు. మంత్రి వద్ద మెప్పు పొందడం కోసమే తమను భయబ్రాంతులకు గురిచేయడానికి పోలీసులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కణేకల్లు ఎస్ఐ యువరాజును వివరణ కోరగా రాయదుర్గం జడ్జికి అప్పీలు చేసి విచారణ నిమిత్తం రెండురోజులు కస్టడీకి తీసుకున్నది వాస్తవమేనన్నారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని జడ్జి ఆదేశించారన్నారు. విచారణకు ముందు కణేకల్లు ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించి స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు వివరించారు. -
రూ.150 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం
కణేకల్లు : కణేకల్లు మండలంలో రూ.150 కోట్లతో 400/220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ట్రాన్స్‌కో కన్‌స్ట్రక‌్షషన్ ఈఈ ఎన్.ఆనంద్ తెలిపారు. శుక్రవారం కణేకల్లుకు వచ్చిన ఆయన ఏడీ రామాంజనేయులతో కలిసి స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కణేకల్లు మండలంలో గాలిమరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో ఈ విద్యుత్‌ను సేకరించేందుకు 400/220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. గాలిమరల విద్యుత్ తీసుకోవడంతో పాటు అవసరమైతే ఇళ్లు, వ్యవసాయ రంగానికి అవుట్‌పుట్ కూడా ఇస్తామన్నారు. ఈ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి 100 ఎకరాల భూమి అవసరముందని, దీని కోసం స్థల సేకరణ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్.హనుమాపురం, సొల్లాపురం, మాల్యం గ్రామం వద్ద 100 ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. భూసేకరణ ప్రక్రీయ పూర్తి అయితే మార్కెట్ విలువ ప్రకారం రైతులకు పరిహారం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉరవకొండ మండలం మోపిడి వద్ద 400/220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఉందని ఆయన వివరించారు. సోమందేపల్లి, తాడిపత్రి సమీపంలోని తలారి చెరువు వద్ద కూడా ఇలాంటి సబ్‌స్టేషన్ నిర్మాణదశలో ఉందన్నారు. కణేకల్లు ప్రాంతంలో ఇలాంటిదే నాల్గో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. -
కనుల పండువగా చిక్కణ్ణేశ్వర రథోత్సవం
కణేకల్లు (రాయదుర్గం) : అశేష భక్త జనసందోహం మధ్య చిక్కణ్ణేశ్వరస్వామి రథోత్సవం కణేకల్లులో బుధవారం కనుల పండువగా జరిగింది. ఉదయం 9 గంటలకు సంప్రదాయబద్ధంగా రథానికి పూజలు జరిపి మడుగుతేరు లాగారు. సర్పంచ్ యు.కౌసల్య, ఉప సర్పంచ్ యు.ఆనంద్, పంచాయతీ కార్యదర్శి విజయమ్మ, పంచాయతీ పాలకవర్గం సభ్యులు మేజర్ గ్రామ పంచాయతీ తరఫున రథానికి గజమాల వేశారు. కణేకల్లు మత్స్యశాఖ సంఘం అధ్యక్షుడు చెన్నకేశవులు, గౌరవాధ్యక్షుడు పి.మాబుపీరా, జిల్లా డైరెక్టర్ పెద్ద దేవర నబీసాబ్ సంఘం సభ్యులు గజమాలను రథానికి అలంకరించారు. సాయంత్రం 5 గంటల సమయంలో రథానికి పూజలు నిర్వహించి హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామాన్ని స్మరించుకుంటూ రథాన్ని ముందుకు లాగారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆలయ ధర్మకర్త జె.ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు మారెంపల్లి మారెన్న, మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, వైఎస్సార్సీపీ సేవాదళ్ కన్వీనర్ కె.విక్రంసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో నియంత పాలన
బాబు-చినబాబుకు కమీషన్లపైనే మోజు కూలీలను కాదని తెలుగు తమ్ముళ్లకు ‘ఉపాధి’ రైతులను ఆదుకోవడంలోనూ ఘోరంగా విఫలం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత ధ్వజం కణేకల్లు : రైతు, పేదల సంక్షేమాన్ని పక్కనపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో నియంతన పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. తండ్రీకొడుకులు (చంద్రబాబు- లోకేష్) ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. మండలకేంద్రమైన కణేకల్లులో టీడీపీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వరుస కరువులతో జిల్లాలోని రైతులు, కూలీలు ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు దుర్భర జీవనం కొనసాగిస్తున్నారన్నారు. కూలీలకు ‘ఉపాధి’ కల్పించకుండా.. జేసీబీలతో పనులు చేయించి తెలుగు తమ్ముళ్ల జేబులు నింపుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అన్నదాతలు వేరుశనగ, శనగ, పత్తి, వరి తదితర పంటలు కోల్పోయి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతే ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తనయుడు లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలవలేడని భావించిన చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. జనరంజక పాలన రావాలంటే అది వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. జగన్‌పై విశ్వాసం ఉంచి వైఎస్సార్సీపీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలకు తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదువులిచ్చి ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్రమైనార్టీ సెల్ కన్వీనర్ నదీం అహమ్మద్ మాట్లాడుతూ మైనార్టీ మంత్రి లేకుండా ఉన్న ప్రభుత్వం టీడీపీ అని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరం పెంచేది, తెలుగు ప్రజలు తల ఎత్తుకునేలా చేసే పార్టీ వైఎస్సార్‌సీపీయేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మాధవరెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజనాయక్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, పార్టీ మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పాటిల్ నాగిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు ఉషారాణి, పీఏసీఎస్ అధ్యక్షులు మారెంపల్లి మారెన్న, రాయదుర్గం పట్టణ అధ్యక్షులు నబీష్, డి.హిరేహళ్, గుమ్మఘట్ట మండల కన్వీనర్లు వన్నూరుస్వామి, కాంతారెడ్డి, సేవాదళ్ కన్వీనర్ కె.విక్రంసింహారెడ్డి, నాయకులు టి.కేశవరెడ్డి, జీఎంఎస్ సర్మస్, చంద్రమోహన్‌రెడ్డి, టీఎస్ఎస్ రవూఫ్, మక్బుల్, చిన్న సర్మస్ తదితరుల పాల్గొన్నారు. మంత్రి ఇలాకాలో టీడీపీకి ఎదురుదెబ్బ కణేకల్లు : రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నుంచి 300 మంది వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మైనార్టీసెల్ రాష్ట్ర కన్వీనర్ నదీం అహమ్మద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డిల సమక్షంలో టీడీపీ నాయకులు, కణేకల్లు మత్స్యకార్మికుల సంఘం మాజీ అధ్యక్షులు పెద్దదేవర నబీసాబ్తోపాటు సయ్యద్, ఉలుకు ఫకృద్దీన్, రహముతుల్లా, బెస్త నాగరాజు, ఫకృద్దీన్, మల్లిఖార్జున, జావేద్, చోట హుసెన్, ఇమాం, వన్నూరా, జాకీర్, నబీ తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. వీరి రాకతో దాదాపు కణేకల్లులోని మత్స్యకార్మికులంతా సుమారు 90శాతం వైఎస్సార్సీపీలో వచ్చినట్లైంది. ప్రజల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, అందుకే అధికార తెలుగుదేశం పార్టీ వీడి.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీలో చేరామని పెద్దదేవర నబీసాబ్ పేర్కొన్నారు. -
ఆకతాయి వీరంగం
- బైక్, గుడిసె, పురుగుమందులు, టెంకాయలకు నిప్పు - సీపీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి గుర్తింపు - మతిస్థిమితం లేకే ఆకతాయి చేష్టలు కణేకల్లు : మండల కేంద్రం కణేకల్లులో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ద్విచక్రవాహనం, గుడిసె, పురుగుమందులు, టెంకాయలకు నిప్పు పెట్టి వీరంగం సృష్టించాడు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. సదరు వ్యక్తి మతిస్థిమితం లేకే ఈ ఆకతాయి చేష్టలు చేసినట్లు తేల్చారు. ఎస్ఐ యువరాజు తెలిపిన మేరకు... బస్టాండ్‌లోని మెయిన్‌రోడ్డులో పాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న సర్మస్వలి సమీపంలోని అప్స్టేర్లో గల ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తన బైక్ (యమహా ఎఫ్జెడ్ఎస్)ను రోడ్డుపై పార్కింగ్ చేసి ఇంట్లో నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ బైక్‌కు ఎవరో నిప్పంటించారు. బైక్‌లో పెట్రోల్ ఉండటంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఇరుగుపొరుగు చూసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. బైక్ పూర్తిగా కాలిపోయింది. ఇంకా బైక్ కంతులు కట్టాల్సి ఉందని బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఆ తర్వాత బస్టాండ్ ప్రాంతంలో లక్ష్మినరసింహస్వామి ఫర్టిలైజర్ దుకాణంలోని రూ.3లక్షలు విలువ చేసే పురుగుమందుల లోడుతో ఉన్న బొలెరో పికప్ వాహనానికి కూడా ఇదే విధంగా ఎవరో నిప్పుంటించారు. ఆ సమయంలో డ్రైవర్ వాహనంలోనే నిద్రిస్తున్నాడు. మంటల వేడికి తేరుకున్న డ్రైవర్ మూర్తి మంటలు ఆర్పాడు. అనంతరం చర్చి బయట తిప్పమ్మకు చెందిన గుడిసెకు నిప్పంటించారు. ప్రమాదం జరిగిన ఆమె చర్చిలో నిద్రపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. దీని తర్వాత టెంకాయల వ్యాపారి తిమ్మరాజు దుకాణం కూడా మంటల్లో కాలిపోయింది. దాదాపు 50 టెంకాయలు కాలిపోయాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పారు. నిందితుడిని పట్టించిన సీసీ ఫుటేజీ రాత్రి పూట బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతూ వరుసగా నాలుగు చోట్ల నిప్పు పెట్టి కలకలం రేపిన ఆకతాయి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాడు. ఫుటేజీలను పరిశీలించిన తర్వాత మణి అనే సదరు వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతనికి మతిస్థిమితం లేదని, అందుకే వరుసగా నిప్పు పెట్టుకుంటూ హల్ చేశాడని ఎస్ఐ యువరాజు తెలిపారు. -
గెలుపే లక్ష్యంగా ఆడండి
కణేకల్లు : రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో గెలుపే లక్ష్యంగా ఆడాలని తహసీల్దార్ ఆర్.వెంకటశేషు క్రీడాకారులకు సూచించారు. అండర్–14, అండర్–17 క్రీడాకారులకు జిల్లా కేంద్రం అనంతపురంలో ఈ నెల 22, 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా జట్టుకు కణేకల్లులో ప్రత్యేకశిక్షణ ఇచ్చింది. శుక్రవారం శిక్షణ ముగింపు సందర్భంగా ఏర్పాటైన సభలో తహసీల్దార్ మాట్లాడుతూ శిక్షణలో ఎటువంటి లోటుపాట్లురాకుండా చూసిన పీడీ గోపాల్‌రెడ్డి కషిని అభినందించారు. ఎస్ఐ యువరాజు మాట్లాడుతూ ఈ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించి తిరిగి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశులు, పీడీ గోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు వేలూరు మరియప్ప, సాఫ్ట్‌బాల్ అసోషియేషన్ జిల్లా ట్రెజరర్ కేశవమూర్తి, సాఫ్ట్‌బాల్ కోచింగ్ పర్యవేక్షకులు సత్యనారాయణ, హెచ్ఎం సూర్యనారాయణ, ఆర్డీటీ ఉరవకొండ రీజనల్ డైరెక్టర్ హనుమంతరాయుడు, ఏటీఎల్ సురేంద్ర, కోచ్‌లు షాకీర్, మల్లికార్జునలు పాల్గొన్నారు. -
బైబై.. గణేశా!
చవితి ఉత్సవాల్లో భాగంగా కణేకల్లులో గురువారం వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 18 అడుగుల ఎత్తు ఉన్న కాణిపాకం వినాయకుడు,15 అడుగుల ఎత్తు ఉన్న సిద్ధేశ్వరస్వామి వినాయకుడు ఆకట్టుకున్నారు. -
పుట్టింటికి తీసుకెళ్తానని చెప్పి.. నరికేశాడు!
కణెకల్ (అనంతపురం) : పండగకు పుట్టింటికి తీసుకెళ్తానని భార్యను బైక్ మీద తీసుకెళ్లిన భర్త.. మధ్యలో బైక్ ఆపి ఆమెను వేట కొడవలితో నరికి చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనంతపురం జిల్లా కణెకల్ మండలం గెనిగెర గ్రామానికి చెందిన శోభ(19)కు బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామానికి చెందిన వడ్డె అనిల్(24)తో ఏడాది కిందట వివాహమైంది. ఈ క్రమంలో దసరా పండగకు పుట్టింటికి వెళ్దామని భార్య చెప్పడంతో ఆమెను తీసుకొని బుధవారం మధ్యాహ్నం బైక్ పై బయలుదేరారు. దగ్గర దారి అని చెప్పి బైక్‌ను కెనాల్ పక్కనుంచి తీసుకెళ్తూ మార్గమధ్యలో వాహనం ఆపి వెంట తెచ్చుకున్న వేట కొడవలితో ఆమెను నరికి చంపేశాడు. అనంతరం కాలువలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి వెళ్లాడు. దీంతో పండగకు ఇంటికి వస్తానన్న కూతురు రాకపోవడంతో శోభ తండ్రి వెంకటేశ్వర్లు బ్రహ్మసముద్రం వెళ్లి ఆరా తీశాడు. అల్లుడు తనకు ఏమీ తెలియదు అనడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో శుక్రవారం అసలు విషయం బయటపడింది. -
రాయదుర్గంలో టీడీపీ నేతల బరితెగింపు
-
కాలవలోపడి ఇద్దరు అన్నదమ్ముల మృతి
బళ్లారి: కర్ణాటకలోని బళ్లారి జిల్లా బండెట్టి గ్రామంలో హెచ్‌సీఎల్ కాలవలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు ఇద్దరూ అన్నదమ్ములే. మృతి చెందినవారిని అనంతపురం జిల్లా కనేకల్ గ్రామానికి చెందిన కమల్ తేజ(18), రవితేజ(16)గా గుర్తించారు. ఈ ఇద్దరు సోదరులు సంక్రాంతి సెలవుల్లో భాగంగా బళ్లారిలోని తమ మేనత్త ఇంటికి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకునేందుకు బండెట్టి గ్రామంలోని హెచ్ఎల్సీ కెనాల్ వద్దకు వెళ్లారు. తొలుత రవితేజ మెట్లపై నుంచి కిందికి దిగుతుండగా కాలు జారి నీటిలో పడిపోయాడు. రక్షించేందుకు సోదరుడు కమల్ ప్రయత్నించాడు. అతడు కూడా కాలు జారి నీటిలో పడిపోవడంతో ఇద్దరూ గల్లంతయ్యారు. వారి తల్లిదండ్రులు మోషె, సుజాత ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. విడపనకల్లుకు చెందిన వీరు ఉద్యోగరీత్యా కనేకల్‌లో నివసిస్తున్నారు. -
కనేకల్ చేరుకున్న విజయమ్మ
-
కల్వర్ట్ను ఢీ కొన్న బైక్: ముగ్గురు యువకులు మృతి
అనంతపురం జిల్లా కణేకల్ సమీపంలో ద్విచక్రవాహనం కల్వర్టును ఢీకొట్టింది. అనంతరం బైక్ కల్వర్ట్‌లో పడిపోయింది. బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఆ ఘటనలో ముగ్గురు యువకులు మరణించారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి వారి సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా ఆ యువకులు అప్పటికే మరణించారు. దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువకులు మృతదేహలను పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పోలీసులకు వెల్లడించారు.