బళ్లారి: కర్ణాటకలోని బళ్లారి జిల్లా బండెట్టి గ్రామంలో హెచ్సీఎల్ కాలవలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు ఇద్దరూ అన్నదమ్ములే. మృతి చెందినవారిని అనంతపురం జిల్లా కనేకల్ గ్రామానికి చెందిన కమల్ తేజ(18), రవితేజ(16)గా గుర్తించారు.
ఈ ఇద్దరు సోదరులు సంక్రాంతి సెలవుల్లో భాగంగా బళ్లారిలోని తమ మేనత్త ఇంటికి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకునేందుకు బండెట్టి గ్రామంలోని హెచ్‌ఎల్‌సీ కెనాల్ వద్దకు వెళ్లారు. తొలుత రవితేజ మెట్లపై నుంచి కిందికి దిగుతుండగా కాలు జారి నీటిలో పడిపోయాడు. రక్షించేందుకు సోదరుడు కమల్ ప్రయత్నించాడు. అతడు కూడా కాలు జారి నీటిలో పడిపోవడంతో ఇద్దరూ గల్లంతయ్యారు.
వారి తల్లిదండ్రులు మోషె, సుజాత ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. విడపనకల్లుకు చెందిన వీరు ఉద్యోగరీత్యా కనేకల్‌లో నివసిస్తున్నారు.
కాలవలోపడి ఇద్దరు అన్నదమ్ముల మృతి
Published Wed, Jan 14 2015 5:07 PM | Last Updated on Sat, Aug 25 2018 6:52 PM
Advertisement
Advertisement