
గోద, రంగనాథుల కల్యాణం కమనీయంగా సాగింది. భక్తులు కనులారా తిలకించి పులకించారు

ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ అద్భుత ఘట్టానికి విజయవాడ మొగల్రాజపురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల ఆవరణ వేదికైంది

విజయకీలాద్రి ఆలయ ప్రధాన అర్చకుడు అనంతాచార్యులు ఆధ్వర్యంలో త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఆగమ శాస్త్ర ప్రకారం గోదారంగనాథుల కల్యాణం జరిగింది










