Chinna Jeeyar swamy
-
విజయవాడ : కమనీయంగా గోద, రంగనాథుల కల్యాణం (ఫొటోలు)
-
మా ఆలయాలపై మీ పెత్తనమేంటి?
సాక్షి, అమరావతి: ‘గుళ్లను హిందువులమైన మేమే నిర్మించుకున్నాం.. స్వామీజీల మార్గదర్శకంలో వాటిని హిందువులమే యోగ్యమైన పద్దతిలో నిర్వహించుకుంటాం. రాష్ట్రంలో, దేశమంతటా హిందూ ఆలయాల నిర్వహణలో పెత్తనం చేయడం నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి. ఆయా ప్రభుత్వాల నుంచి విముక్తి కలిగించాలి. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి సాధించే వరకు విశ్రమించేది లేదు. అందరం కలిసి ఐక్యంగా అడుగులు ముందుకు వేద్దాం’ అని వివిధ పీఠాధిపతులు, స్వామీజీలు, వీహెచ్‌పీ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం గన్నవరం విమానాశ్రయానికి సమీపంలోని కేసరపల్లి వద్ద వీహెచ్‌పీ నిర్వహించిన హైందవ శంఖారావం బహిరంగ సభ మధ్యాహ్నం 12.40 గంటలకు మొదలై.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ‘వీహెచ్‌పీ ఆధ్వర్యంలో సాధు సన్యాసులు, నాయవేత్తలు, హిందు ప్రముఖులు కలిసి ఆలయాల స్వయం ప్రతిపత్తికి సంబంధించి రూపొందించిన ముసాయిదా చట్టం ప్రతులను ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి అప్పగించాం. బీజేపీ జాతీయ నాయకత్వానికి కూడా చట్టం ప్రతిని అందించాం. ఆయా ప్రభుత్వాలు, పార్టీలు అత్యంత శీఘ్రంగా ఆ ముసాయిదా చట్టాన్ని పరిశీలించి, నూతన చట్టం రూపొందించడం ద్వారా ఆలయాలను హిందు సమాజానికి అప్పగించే చర్యలు చేపట్టాలి. వెంటనే చట్ట సవరణ చేయాలి. ఆ లోపు, ఆలయ ట్రస్టు బోర్డుల్లో రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి. ఆలయాల్లో, ఆలయాలు నిర్వహించే సంస్థల్లో పని చేసే అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలి. ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడడంతో పాటు అన్యాక్రాంతమైన ఆస్తులను తిరిగి ఆలయాలకు అప్పగించే బాధ్యతను ప్రభుత్వాలు వెంటనే తీసుకోవాలి’ అని హైందవ శంఖారావం డిక్లరేషన్ ప్రకటించారు. గుడి నిధులను హిందు ధార్మిక ప్రచారానికి, హిందు ధర్మ, ధార్మిక సేవలకు మాత్రమే ఉపయోగించాలని, ప్రభుత్వ కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదని శంఖారావం సభ విజ్ఞప్తి చేసింది. త్రిదండి చిన్న జియ్యర్‌స్వామి డిక్లరేషన్ సాధన కోసం సభకు హాజరైన అశేష భక్త జనంతో సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. అయోధ్య తరహాలో అన్ని ఆలయాలుఅయోధ్యలో రామజన్మభూమి ఆలయాన్ని హిందువులే స్వతంత్రంగా నిర్వహించుకుంటున్న తరహాలోనే దేశంలో మిగిలిన అన్ని ఆలయాలు కూడా అదే బాటలో నడిచేలా అడుగులు ముందుకు వేద్దామని ఆయోధ్య రామాలయ తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గిరిగోవింద దేవ్ గిరి స్వామీజీ పిలుపునిచ్చారు. 200 ఏళ్ల క్రితం బ్రిటీష్ ప్రభుత్వం కేవలం హిందు మందిరాలను మాత్రమే తమ చేతుల్లోకి తీసుకుందని.. మసీదులు, గురుద్వారాలు, జైన్ మందిరాల జోలికి వెళ్లలేదని వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు. ఆలయ నిర్వహణను ప్రభుత్వాలు చట్టం చేసి, తమ చేతుల్లోకి తీసుకున్నాయన్నారు. ఈ పని చేయాల్సింది ధర్మాచార్యులు, భక్త సమాజం అని వివరించారు. మొత్తం హిందూ సమాజం కలిసి ఆలయాలను నిర్వహించుకోవాలన్నది వీహెచ్‌పీ అభిమతమని వెల్లడించారు. అందులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉండాలన్నారు. ఈ దిశగా రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నట్టు వీహెచ్‌పీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి మిలింద్ పారండే చెప్పారు. ఈ ఉద్యమానికి హైందవ శంఖారావం పేరిట ఏపీలో నాంది పలికామని వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అన్నారు. రాష్ట్రంలో గుళ్ల పేరిట ఇదివరకు 15 లక్షల ఎకరాల భూములుంటే, ఇప్పుడవి నాలుగున్నర లక్షల ఎకరాలకు కుచించుకుపోయాయని చిన్నజియ్యర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. దేవదాయ శాఖను రద్దు చేయాలన్నదే హైందవ శంఖరావం సభ డిమాండ్ అని కమలానంద స్వామి అన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లు పెట్టాలని, ఆలయాలను హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆలయాలకు ఏ సంబంధం లేని వాళ్లు కౌంటర్లు పెట్టి టికెట్లు అమ్ముకుంటుంటే ఒళ్లు మండుతోందన్నారు. మన ధర్మాన్ని మనం పాలించుకుందామని గణపతిసచ్చిదానందస్వామి అన్నారు. వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్శ, ఉత్తరాంధ్ర వీహెచ్‌పీ కన్వీనర్ తనికెళ్ల సత్యరవికుమార్, వీహెచ్‌పీ భాగ్యనగర్ క్షేత్ర సంఘటనా కార్యదర్శి గుమ్మళ్ల సత్యం, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణం నేపథ్యంలో...
ప్రకృతి, పర్యావరణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘మైరా’. కన్నడంలో గుర్తింపు తెచ్చుకున్న స్మైల్ శ్రీను ఈ తెలుగు చిత్రానికి దర్శకుడు. త్రిదండి దేవనాథ రామానుజ చిన్న జీయర్ స్వామిని కలిసి ‘మైరా’ స్క్రిప్ట్‌కి పూజ చేయించి, ఆశీస్సులు తీసుకున్నారు శ్రీను. త్రిదండి చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ– ‘‘ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రస్తుత సమాజానికి ఉపయోగపడేలా ‘మైరా’ ఉంటుందని అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘మైరా’కు తన ఆశీస్సులు, శిష్యుల సపోర్ట్ ఉంటుందని దేవనాథ రామానుజ జీయర్ స్వామివారు చెప్పడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో తీసి, కన్నడతో పాటు ఇతర భాషల్లో అనువాదం చేస్తాం. ఓ స్టార్ హీరోయిన్ మా సినిమాలో నటిస్తారు’’ అన్నారు స్మైల్ శ్రీను. -
రాముడు ఒక అద్దం లాంటి వారు..చిన్నజీయర్ స్వామి సూపర్ కామెంట్స్
-
యువతకు ఇదే నా సందేశం..!
-
అప్పుడు లాగా ఇప్పుడు చదువులు లేవు : చిన్న జీయర్ స్వామి
-
కులం..మతం..విలువలు..!
-
సీతారాముల కల్యాణానికి భారీగా తరలివచ్చిన భక్తులు
-
రాముని మార్గంలో మనం నడిస్తే
-
కూకట్‌పల్లిలో... దేవాలయం శిఖర ప్రతిష్ట చేసిన చినజీయర్ స్వామి
కూకట్పల్లి: నగరంలోని కూకట్‌పల్లిలో ఉన్న 436 ఏళ్ల నాటి శ్రీ సీతా రామ చంద్రస్వామి దేవాలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమం సోమ వారం త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆలయానికి విచ్చేసిన చినజీయర్ స్వామికి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు, ఆలయ అధికారులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. గర్భగుడిలో యంత్ర ప్రతిష్టాపన తరువాత వెండి ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. యాగశాలలో పూర్ణాహుతి, మూల విరాట్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. -
కన్నబాబుతో స్ట్రెయిట్ టాక్ ప్రోమో
-
చినజీయర్‌ను తప్పించండి: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క–సారలమ్మలను అవమానపరిచిన త్రిదండి చినజీయర్ స్వామిని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుని బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భక్తి విశ్వాసాలపై దాడి చేసిన జీయర్‌స్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
నా కామెంట్లను వక్రీకరిస్తున్నారు: చినజీయర్ స్వామి
సాక్షి, విజయవాడ: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మీద త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో చినజీయర్ స్వామి ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. అవి ఎలా పుట్టుకువచ్చాయో తెలియదు. గ్రామదేవతలను తూలనాడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కానీ, అది వాస్తవం కాదు. పనికట్టుకుని.. వాళ్ల సొంత లాభం కోసమే కొందరు ఇదంతా చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ హడావిడి తగ్గింది కాబట్టే పనికట్టుకుని నా వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చినట్లు ఉన్నారు. ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. అది సబబాకాదా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నాం. సమాజ హితం లేని వాళ్లే ఇలాంటి ప్రచారాలకు పూనుకుంటున్నారు. ఆదివాసీ గ్రామ దేవతలను అవమానపరిచాననడం సరికాదు. మేం ఎలాంటి దురుద్దేశపూర్వక కామెంట్లు చేయలేదు. అవి 20 ఏళ్ల కిందటి కామెంట్లు. విమర్శించేవాళ్లు నా వ్యాఖ్యలపై పూర్వాపరాలు ఒకసారి పరిశీలించాలి. అప్పుడే ఆ వ్యాఖ్యల ఆంతర్యం తెలుస్తుంది. వ్యాఖ్యలపై తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే జాలిపడాల్సి వస్తుంది. పైగా ఆ వ్యాఖ్యలను ఎడిటింగ్ చేసి తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉంది. ప్రపంచంలో అనేక రకాల పద్ధతులు ఉంటాయి. ఎవరి పద్ధతిలో వాళ్లు ఉండాలి. మన పద్ధతిని మనం ఆరాధించుకోవాలి. ఎవరినీ చిన్నచూపు చూడం అనేది ఉండదు. ఒకళ్లని లేదా కొంత మంది దేవతలను చిన్నచూపు చూసే అలవాటు అస్సలు లేదు. అందర్నీ గౌరవించాలన్నదే మా విధానం. అలాగే అన్నీ నేను నమ్మాల్సిన అవసరం లేదు. వివాదంపై వారికే వదిలేస్తున్నా అని వివరణ ఇచ్చుకున్నారు చినజీయర్ స్వామి. కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారు. ఆదివాసీల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి వీలైనంత సేవ చేస్తున్నాం. మాకు కుల, మతం తేడాల్లేవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మతాలకతీతంగా ప్రజలు వస్తుంటారు. కులాన్ని పక్కనపెట్టి.. జ్ఞానసంపదను ఆరాధించాలి. ఇదే రామానుజాచార్యులవారు చెప్పింది. ఆదివాసీలకు ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి వచ్చాం. మహిళలను చిన్నచూపు చూసేవాళ్లను ఎట్టిపరిస్థితుల్లో ప్రొత్సహించం. దీన్ని పెద్ద ఇష్యూ చేస్తూ వివాదం చేయడం సరికాదన్నారు చినజీయర్ స్వామి. -
చినజీయర్ స్వామి క్షమాపణ చెప్పాలి
ఎస్ఎస్ తాడ్వాయి/గుండాల: సమ్మక్క, సారలమ్మ వనదేవతలమీద త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై పూజారులు మండిపడ్డారు. స్వామి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వా యి మండలంలోని మేడారంలో చినజీయర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. అయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్వామి మాటలపై పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మాట్లాడుతూ చినజీయర్ స్వామి ఇంగీత జ్ఞానం లేకుండా సమ్మక్క, సారలమ్మ దేవత కాదని అనడం అవివేకమన్నారు. కోట్లాది మందికి అశీర్వాదాలు అందించే తల్లులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఆదివాసీ ప్రజానీకానికి, వనదేవతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, స్వామి వ్యాఖ్యలను తప్పుబడుతూ భద్రాద్రి కొత్త గూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డలోని పగిడిద్దరాజు గుడివద్ద అరెం వంశీయులు బుధవారం నిరసన తెలిపారు. సమ్మక్క, సారలమ్మ విషయంలో స్వామి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. -
కల్యాణం.. కమనీయం
శంషాబాద్ రూరల్: భక్త జన సందోహం, వేద మంత్రాల మధ్య శ్రీరామనగరం సమతామూర్తి ప్రాంగణంలో ఉన్న 108 దివ్య క్షేత్రాల్లోని పెరుమాళ్లకు శాంతి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులతో 108 పెరుమాళ్ల నామస్మరణం చేయించారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 60 కౌంటర్ల ద్వారా భక్తులకు అక్షింతలు, ప్రసాదా లు పంపిణీ చేశారు. మైహోం గ్రూపు సంస్థల అధినేతలు జూపల్లి రామేశ్వర్రావు, జూపల్లి జగపతిరావు కుటుంబసభ్యులు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీగా సందర్శకులు వారాంతం కావడంతో సమతామూర్తి దర్శనానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. అయితే సాయంత్రం శాంతి కల్యాణోత్సవం ఉండడంతో వారిని లోపలికి అనుమతించలేదు. ఇక స్ఫూర్తి కేంద్రం ప్రధాన ప్రాంగణంలోనికి అతి కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. పశ్చిమ వైపు ఉన్న 9వ నంబరు గేటు నుంచి ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే లోపలికి వదిలారు. కాగా ప్రధాన ప్రాంగణం ఎదురుగా ఉన్న ఆవరణలో సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయడంతో అక్కడ సుమారు పది వేల మంది వరకు కూర్చుని స్క్రీన్లపై కల్యాణోత్సవాన్ని వీక్షించారు. కల్యాణోత్సవానికి సుమారు 15 వేల మంది హాజరైనట్లు అంచనా వేశారు. -
సీఎం కేసీఆర్‌తో ఎలాంటి విభేదాల్లేవు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘సీఎం కేసీఆర్‌తో మాకు ఎలాంటి విభేదాల్లేవు. సహస్రాబ్ది సమారోహంలో నిరంతరాయ విద్యుత్, మంచినీటి సరఫరా, పోలీసు భద్రత, ఇతర ఏర్పాట్లన్నీ ఆయన సహకా రం వల్లే అందాయి. ఆయనతో విభేదాలు అన్న పదమే కరెక్ట్ కాదు’ అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌స్వామి స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల వల్లే ఆయన సమతామూర్తి సందర్శనకు రాలేక పోయారన్నారు. శుక్రవారం ముచ్చింతల్ శ్రీరామ నగరంలో మీడియాతో చినజీయర్ మాట్లాడారు. సమారోహానికి రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు. రాజకీయాల్లో మాత్రమే స్వపక్షం, విపక్షం అనేవి ఉంటాయని, భగవంతుని సన్నిధిలో అలాంటి వాటికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పారు. రామానుజాచార్యుల సహ స్రాబ్ది సమారోహానికి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతోపాటు సాధారణ భక్తులందరినీ ఆహ్వానించామని చెప్పారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ప్రధాని చేతుల మీదుగా చేయిం చాలని 2016లోనే కమిటీ తీర్మానించిందని, ఆ విషయం సీఎం కేసీఆర్ సహా ప్రముఖులందరికీ తెలుసని ఓ ప్రశ్నకు సమా దానంగా చెప్పారు. కేసీఆర్‌తో కానీ, ఇతర నేతలతో కానీ తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కార్య క్రమానికి తొలి వలంటీర్‌గా తానే వ్యవహరిస్తానని స్వయంగా కేసీఆరే చెప్పారని గుర్తు చేశారు. 108 మూర్తులకు ఒకేసారి... 108 దివ్యదేశాల్లోని మూర్తులకు శనివారం శాంతి కల్యాణం నిర్వహించనున్నట్లు చినజీయర్ చెప్పారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. ‘రామానుజా చార్యుల దర్శనానికి వెళ్లే సోపాన మార్గంలో 14 మెట్లపై 108 దివ్యదేశాల్లోని మూర్తు లకు శాంతి కళ్యాణం నిర్వహిస్తాం. ఒక్కో మెట్టుపై 7 నుంచి 9 పెరుమాళ్లకు కల్యాణం జరుపుతాం. ఇప్పటివరకు ఒక్కో ఆలయంలో ఒకరు లేదా ఇద్దరు మూర్తులకు మాత్రమే కల్యాణం నిర్వహించ డం చూశాం. కానీ చరిత్రలోనే తొలిసారిగా ఇక్కడి పెరుమాళ్లందరికీ ఒకే సమయంలో.. ఒకే వేదికపై కల్యాణం నిర్వ హిస్తుండటం చాలా అరుదైన అంశం. ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని స్వయంగా వీక్షించే అవకాశాన్ని ప్రతి ఒక్కరికీ కల్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కరోనా తగ్గింది.. అదే అద్భుతం ‘ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న రెండు రకాల వైరస్లలో ఒకటి కరోనా కాగా, రెండోది అసమాన తలు, విభేదాలు. 12 రోజులపాటు ఐదు వేల మంది రుత్వికులతో యజ్ఞాలు, పూజలు చేయించ డం వల్ల ప్రజలకు మంచే జరిగింది. ప్రస్తుతం కరోనా తగ్గిపోయింది. ఇదంతా యాగ ఫలమే. కార్యక్రమం ప్రారంభానికి ముందు రోజుకు 25 వేల కరోనా కేసులు నమోదైతే.. ఆ తర్వాత రెండో రోజే వాటి సంఖ్య రెండు వేలకు పడిపోయింది. ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయింది. ఇదంతా హోమ పూజా ఫలితమే’ అని చినజీయర్ స్పష్టం చేశారు. సమతావాదం, సామ్యవాదం అనేది పాశ్చాత్యుల నుంచి వచ్చినట్లు అంతా భావిస్తున్నారని, నిజానికి వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు ఈ సమానత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. రేపటి నుంచి సువర్ణమూర్తి దర్శనం ►ఈ నెల 20 నుంచి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రామాను జుల 120 కేజీల సువర్ణమూర్తిని దర్శించు కునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చినజీయర్ తెలిపారు. సమతామూర్తి సంద ర్శనకు వచ్చే భక్తులకు ఆలయ విశిష్టతలను వివరించేందుకు నియర్ ఫ్రీక్వెన్సీ కమ్యూ నికేషన్ (ఎన్ఆర్సీ) వ్యవస్థ ఏర్పాటు చేశా మని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సువర్ణమూర్తి చుట్టూ ఉన్న స్తంభాల ముందు నిలబడి.. వాటిపై ఉన్న ఛాయాచిత్రాల ప్రాముఖ్య తను తెలుసుకోవచ్చన్నారు. డైనమిక్ ఫౌంటెయిన్, ఆగు మెంటెడ్ రియాల్టీ షో, త్రీడీ మ్యాపింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ సేవలన్నీ అందుబాటులోకి వచ్చాక నిర్వహణ భారాన్ని బట్టి, సేవలకు ధరలను నిర్ణయిస్తామన్నారు. -
కేసీఆర్‌తో విభేదాలపై స్పందించిన చినజీయర్ స్వామి
-
ఆయన వస్తారో.. రారో చూడాలి: చిన్న జీయర్ స్వామి
సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్‌లో రేపు (శనివారం) శాంతి కల్యాణం జరగనుందని చినజీయర్ స్వామి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 108 దివ్యదేశాల ఆలయాల్లో మూర్తులకు శాంతి కల్యాణం జరుగుతుందని పేర్కొన్నారు. రేపు( శనివారం) సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శాంతి కల్యాణం జరగనుందని తెలిపారు. శాంతి కల్యాణ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం అందించామని చెప్పారు. అదే విధంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుతో తమకు విభేదాలు ఎందుకు ఉంటాయని.. ఆయన సహకారం ఉన్నందనే కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్.. ‘తాను ప్రథమ సేవకుడినని తెలిపారని చిన్నజీయర్ స్వామి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ రాకపోవడానికి అనారోగ్యం, పని ఒత్తిడి అవ్వొచ్చని అన్నారు. రేపు నిర్వహించే శాంతి కల్యాణానికి కూడా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని తెలిపారు.అయితే ఆయన వస్తారో.. రారో చూడాలని చిన్న జీయర్‌స్వామి పేర్కొన్నారు. ప్రతిపక్షం, స్వపక్షం రాజకీయాల్లోనే ఉంటాయని అన్నారు. అందరూ సమతామూర్తిని దర్శించాలని తెలిపారు. తమకు అందరూ సమానమేనని చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. -
కేసీఆర్, చినజీయర్ దళిత వ్యతిరేకులు
జడ్చర్ల/ నాగర్‌కర్నూల్ రూరల్: సీఎం కేసీఆర్, చినజీయర్‌స్వామి దళిత వ్యతిరేకులని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో చేపట్టిన కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ సాధ్యమైందని ఒకప్పుడు పొగిడిన కేసీఆర్ ఇప్పుడు ఊసరవెల్లిలా రంగులు మార్చి కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొదటి నుంచి అంబేడ్కర్‌పై వివక్ష చూపిస్తూ ఏకంగా రాజ్యాంగాన్నే మార్చాలని కుట్ర చేస్తున్నారన్నారు. రామానుజాచార్యుల విగ్రహం ప్రారంభ కార్యక్రమానికి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కోవింద్‌ను ఆహ్వానించకపోవడం అవమానకరమన్నారు. రామానుజాచార్యుల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చినజీయర్‌స్వామి వ్యవహరిస్తున్నారని, ఆధ్యాత్మికత ముసుగులో ‘రియల్’వ్యాపారవేత్తగా మారారని విమర్శించారు. -
సీఎం జగన్ నిబద్దత చూసి ఆశ్చర్యపోయా
-
సీఎం జగన్‌పై చినజీయర్ స్వామి ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చినజీయర్ స్వామి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నానని చినజీయర్ స్వామి తెలిపారు. చదవండి: అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలి: సీఎం జగన్ ప్రతీ పాలకుడు అందరినీ సమానంగా చూస్తూ వారి అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేయాలన్నారు. విద్య, వయస్సు, ధనం, అధికారం నాలుగు కలిగి ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోరు. కానీ ఇవన్నీ ఉన్న వైఎస్ జగన్‌లో ఎలాంటి గర్వం లేదని చినజీయర్ స్వామి అన్నారు. వైఎస్ జగన్ అందరి సలహాలను స్వీకరిస్తారు.. సలహాలను పాటిస్తారు. వైఎస్ జగన్ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నానని చినజీయర్ స్వామి అన్నారు. వైఎస్సార్‌ను గుర్తు చేసిన చినజీయర్ స్వామి.. దివంగత మహానేత వైఎస్సార్‌ను చినజీయర్ స్వామి గుర్తు చేశారు. శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. -
ముచ్చింతల్‌లో సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం..
-
ఐదోరోజు పరమేష్టి, వైభవేష్టి హోమం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా ఆదివారం ప్రత్యేక హోమాలు, పూజలు చేశారు. ఉదయం అష్టాక్షరీ మంత్ర పఠనంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. తర్వాత లక్ష్మీనారాయణ మహాయాగంలో భాగంగా పరమేష్టి, వైభవేష్టి హోమాన్ని చినజీయర్ స్వామి సారథ్యంలోని రుత్వికులు నిర్వహించారు. మానవుడికి కలిగే కొన్ని రకాల రుగ్మతలకు ఎలాంటి మందులు లేవని.. భగవన్నామ స్మరణ, జపం ద్వారా అలాంటి రుగ్మతలను జయించడమే పరమేష్టి ఉద్దేశమని, పితృదేవతలను సంతృప్తిపరుస్తూ వారి అనుగ్రహాన్ని పొందడమే వైభవేష్టి ఉద్దేశమని రుత్వికులు వెల్లడించారు. 115 యాగశాలల్లోని 1,035 యజ్ఞ కుండాల వద్ద వేదమంత్రోచ్ఛరణల మధ్య ఈ హోమం జరిగింది. తర్వాత మూలమంత్ర హవనం, 108 తర్పనం, 28 పుష్పాంజలి, చివరిగా పూర్ణాహుతి నిర్వహించారు. అదే సమయంలో ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర శతనామావళి, శ్రీరంగనాథ భగవానుడి పూజ జరిగాయి. ప్రవాస విద్యార్థులతో అవధానం అమెరికాలో ప్రజ్ఞ కోర్సు ద్వారా శిక్షణ పొందిన ఎనిమిది మంది ప్రవాస భారతీయ విద్యార్థులతో చినజీయర్ స్వామి చేపట్టిన అవధాన కార్యక్రమం భక్తుల్ని మంత్రముగ్ధులను చేసింది. ప్రవచన మండపంలో జరిగిన ఈ అవధానాన్ని భగవద్గీత శ్లోకాలతో మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరిగా.. ప్రతి శ్లోకం చివరి అక్షరంతో మొదలయ్యే మరో శ్లోకాన్ని అందుకుంటూ, దాని అర్థాన్ని వివరిస్తూ వచ్చారు. కార్యక్రమం అనంతరం ప్రవాస విద్యార్థులు అభిరాం, అముక్త మాల్యద, అనిరుధ్, కోవిద, మహేశ్వరి, మాధవప్రియ, వేద, శ్రీలతలను చినజీయర్ స్వామి ఆశీర్వదించి, సమతామూర్తి ప్రతిమలను బహుకరించారు. కిటకిటలాడిన శ్రీరామనగరం శంషాబాద్: ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి భారీ విగ్రహాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు, సందర్శకులతో ప్రాంగణం కిటకిటలాడింది. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది తరలివచ్చారు. వారిని భద్రవేదికపై ఆశీనులైన ప్రధాన విగ్రహం వరకు క్యూలైన్లో అనుమతించారు. హైకోర్టు న్యాయమూర్తులు పోనగంటి నవీన్‌రావు, జస్టిస్ అభిషేక్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాజస్థాన్ పుష్కార్ జగద్గురు స్వామి రామచంద్రాచార్య మహారాజ్, బిహార్‌లోని గయకు చెందిన జగద్గురు శ్రీస్వామి వెంకటేశ ప్రపంచార్యాజీ మహారాజ్, సిక్కిం ఇక్ఫాయ్ యూనివర్సిటీ వీసీ జగన్నాథన్ పట్నాయక్ తదితరులు కూడా సమతామూర్తిని దర్శించుకున్నారు. మొత్తంగా ఆదివారం ఒక్కరోజే దాదాపు లక్ష మంది వచ్చినట్టు అంచనా వేశారు. నేటి కార్యక్రమాలివీ.. సోమవారం రోజున యాగశాలలో దృష్టి దోష నివారణకు సంబంధించిన వైయ్యూహి కేష్టి యాగాన్ని నిర్వహించనున్నారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి మూలమైన శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ జరుగనుంది. వీటితోపాటు పలువురు ప్రముఖుల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. -
గౌరవ ప్రధాని మోడీని ఉద్దేశించి ప్రసంగించిన చిన్న జీయర్ స్వామి
-
దేశానికే గర్వకారణం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భక్తి ఉద్యమంలో రామానుజాచార్యులు గొప్ప విప్లవం తీసుకొచ్చారని, మానవులంతా సమానమంటూ.. సమానత్వం కోసం వెయ్యేండ్ల క్రితమే ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. భగవంతుని దృష్టిలో మనుషులంతా సమానమేనని చాటిచెప్పిన శ్రీరామానుజాచార్యుల విరాట్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం హైదరాబాద్‌కే కాదు దేశానికే గర్వకారణమని చెప్పారు. చినజీయర్ స్వామి వారి అశేష అనుచరులు, అభిమానులు ఇందుకోసం మహాద్భు త కృషి చేశారని కొనియాడారు. జీయర్ బోధనలకు తెలంగాణ కేంద్రం కావడం గొప్ప విషయమని అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరం వేదికగా ప్రారంభమైన శ్రీరామానుజ సహస్రాబ్ది మహోత్సవాలకు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి హాజరయ్యారు. 5వ తేదీన ఇక్కడికి ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా అక్కడ భద్రత, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సామాజిక సమతను కొనసాగిస్తాం ప్రతిష్టాత్మకమైన ఈ దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక సాంత్వన, మానసిక ప్రశాంతత చేకూరుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం పర్యాటకులకే కాకుండా మానసిక ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ప్రశాంత నిలయంగా మారుతుందని అన్నారు. ఆ మహామూర్తి బోధనలు వెయ్యేళ్ల తర్వాత మళ్లీ ప్రాచుర్యంలోకి రావడం అవి మరో వెయ్యేళ్లపాటు ప్రపంచవ్యాప్తం కానుండటం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. అనతి కాలంలోనే ఈ ప్రాంతం ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విశేష ప్రాచుర్యం పొందు తుందన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను ఏకతాటిపైన నడిపించే సామాజిక సమతను కొనసాగిస్తామని చెప్పారు. చినజీయర్ స్వామి బోధనలను ప్రతి ఒక్కరు అనుసరించాలని సూచించారు. ఈ మహా ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు తమ కుటుంబం తరఫున పండ్లు, ఫలాల ప్రసాదాన్ని అందజేస్తామని తెలిపారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, మనుమడు హిమాన్షు ఉన్నారు. కుటీరానికి ఆహ్వానించి..ఆశీర్వదించి శ్రీరామనగరం సందర్శనకు వచ్చిన సీఎం కేసీఆర్ దంపతులను త్రిదండి చినజీయర్ స్వామి తన కుటీరానికి ఆహ్వానించారు. ఆశీర్వచనాలు అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సక్రమంగా చూసుకుంటోందని తెలిపారు. సమారోహానికి వస్తున్న భక్తులకు స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందుతోందని చెప్పారు. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక, ధార్మిక విషయాల పట్ల ఇష్టాన్ని పెంచుకోవడం మంచి అలవాటని కల్వకుంట్ల హిమాన్షురావును చినజీయర్ స్వామి అభినందించారు. ‘తాత కేసీఆర్ నుంచి ఆధ్యాత్మిక భక్తి ప్రపత్తులను పుణికి పుచ్చుకున్నావు..’ అంటూ ప్రశంసించారు. సీఎం పర్యటనలో ముఖ్యాంశాలివే – సాయంత్రం 4 గంటలకు సీఎం శ్రీరామనగరం చేరుకున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. – భద్రవేదికపై ఆశీనులైన భగవత్‌రామానుజుల వారి విరాట్ సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. చిన జీయర్‌తో కలిసి ప్రదక్షిణలు చేశారు. – అగ్ని ప్రతిష్ట, హోమాలు ప్రారంభమైన నేపథ్యంలో అగ్ని ప్రతిష్ట ప్రారంభ సూచికగా 1,260 కేజీల బరువుతో, నాలుగున్నర అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగంటను మోగించి గంటానాదం చేశారు. – రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించబోయే బంగారు ప్రతిమ ప్రతిష్ట స్థలాన్ని పరిశీలించి, రామానుజ జీవిత చరిత్రను తెలియజేసే పెయింటింగ్స్‌ను తిలకించారు. 108 దివ్య దేశాల సమూహం, వాటి ప్రాముఖ్యతను సీఎంకు చినజీయర్ వివరించారు. – రామానుజుల జీవిత చరిత్రను తెలియజేస్తూ రూపొందించిన లఘుచిత్రాన్ని సీఎం వీక్షించారు. – మైహోం అధినేత జూపూడి రామేశ్వరరావు, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్‌రావు, ఏపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు కూడా సీఎం వెంట ఉన్నారు. -
నారాయణ మంత్రం... శ్రీమన్నారాయణ భజనం
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, రంగారెడ్డి జిల్లా/ శంషాబాద్/ శంషాబాద్ రూరల్: వేదమంత్రోచ్చారణ, శ్రీమన్నారాయణుడి శరణు ఘోషతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ముచ్చింతల్ ప్రాంతం మార్మోగిపోయిది. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల కోసం ముస్తాబైన సమతా స్ఫూర్తి కేంద్రం గురువారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లక్ష్మీనారాయణుడి సుప్రభాత సేవతో గురువారం కార్యక్రమాలు మొదలయ్యాయి. దుష్ట నివారణ కోసం శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్ట సిద్ధికి వాసుదేవేష్టి అష్టోత్తర శతనామ పూజను నిర్వహించారు. ఆరాధన, విష్వక్సేనుడి పూజ, ధ్వజారోహణం కన్నుల పండువగా సాగింది. ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా గరుడ పతాకాన్ని అవిష్కరించారు. గరుడుడి ద్వారా యాగశాలకు సకల దేవతలను ఆహ్వానించారు. ఆ తర్వాత అగ్నిమథన కార్యక్రమంతో లక్ష్మీనారాయణ మహాయాగం ప్రారంభమైంది. సహజ పద్ధతిలో (శమీ దండం, రావి దండం కర్రలతో మథించి) అగ్నిని పుట్టించిన అనంతరం.. ఆ అగ్నిని యాగశాలలకు వితరణ చేసి కుండాలలో నిక్షిప్తం చేసిన రుత్వికులు అత్యంత వైభవంగా యాగాన్ని ప్రారంభించారు. పన్నెండు రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఆచార్య ఆరాధన... సమతాస్ఫూర్తి కేంద్రంలోని ప్రవచన మండపంలో చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో దీప ప్రజ్వలనతో ఆరాధన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దాదాపు 2 వేల మంది భక్తులు క్యూలైన్లలో ఆసీనులయ్యారు. ఆచార్య స్మరణ అనంతరం చిన జీయర్‌స్వామితో పాటు మైహోం సంస్థల అధినేత జె.రామేశ్వరరావు భక్తుల చెంతకు వచ్చి భగవంతుడి ప్రతిమతో కూడిన డాలర్లను పంపిణీ చేశారు. అనంతరం భక్తులు వెంట తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో ఆరాధన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సమయంలో చిన జీయర్ స్వామి భక్తులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ సందర్భంగా పెద్ద జీయర్ స్వామి వారి అష్టోత్తర శతనామావళిని అందరూ పఠించారు. అదే సమయంలో చిన్న జీయర్ స్వామి సన్యాసాశ్రమ స్వీకార విశేషాలను, స్వామివారి ఔన్నత్యాన్ని గురించి మహామహోపాధ్యాయ డాక్టర్ సముద్రాల రంగరామానుజులవారు వివరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ నుంచి విచ్చేసిన శ్రీమాన్ కృష్ణమాచార్యులు పాల్గొన్నారు. అలరించిన కార్యక్రమాలు ఓ వైపు హోమాలు, మరో వైపు కనువిందు చేసే నృత్యాలు, ఇంకోవైపు వినసొంపైన సంప్రదాయ సంగీతం, భక్తి భజనలతో శ్రీరామనగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. యాగశాలలో రుత్వికులు వేద మంత్రోచ్ఛారణ చేస్తుండగా.. ప్రవచన మండపంలో గాయని సురేఖ బృందం సంప్రదాయ సంగీతంతో వినసొంపైన గానాన్ని ఆలపించారు. శ్రీపాద రమాదేవి శిష్య బృందం ‘వాసుదేవాజ్మజ, నారాయణ.. శ్రీమన్నారాయణ’కీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. నవవిధ భక్తి మార్గాల్లో భజన కూడా ఒకటి.. అలాంటి రంగంలో ప్రముఖ కళాకారుడుగా గుర్తింపు పొందిన నర్సింగరావు తన బృందంతో కలిసి ‘హరే కృష్ణ.. హరే కృష్ణ’భజనకీర్తనలు ఆలపించారు. అలివేలు మంగనాథుడు గోవిందా అంటూ ఓ చిన్నారి ఆలపించిన భక్తి గీతం అలరించింది. జిమ్స్ మెడికల్ విద్యార్థులు నాటకాన్ని ప్రదర్శించారు. పావని, మాధవపెద్ది బృందం ప్రదర్శించిన నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది. భక్తుల సుఖసంతోషాలే భగవంతుడి అభిలాష – చినజీయర్ స్వామి ప్రవచనం ప్రతి వ్యక్తి తనకు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే సన్మార్గంలో ప్రయాణించినట్లేనని త్రిదండి చినజీయర్ స్వామి బోధించారు. ఆచార్య ఆరాధన కార్యక్రమంలో భాగంగా పూజలో పాల్గొన్న భక్తులనుద్దేశించి ఆయన ప్రవచనాలు చేశారు. దేవతారాధనపై చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. తాము చేసే తప్పుల నుంచి కాపాడమని కొందరు పూజలు చేస్తారని తెలిపారు. తమపై భగవంతుడు కోపోద్రిక్తుడు కాకుండా ఉండేందుకు పూజలు చేస్తామని కొందరు చెబుతారన్నారు. అయితే స్వచ్ఛమైన ప్రేమకు కేంద్రం భగవంతుడని, భక్తులను సుఖసంతోషాల్లో ఉంచడమే భగవంతుడి అభిలాష అని చినజీయర్ పేర్కొన్నారు. అన్ని మతాల సారం కూడా ఇదేనన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏవిధంగా ఉంటారో భగవంతుడి ప్రేమ కూడా అదే విధంగా ఉంటుందన్నారు. యాగంతో సమస్త మానవాళికి మేలు లక్ష్మీనారాయణుడి యాగశాలను పవిత్ర దేవాలయంగా త్రిదండి చినజీయర్ స్వామి అభివర్ణించారు. మహాయాగం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. యాగశాలకు దేవతలను ఆహ్వానించి పూజలు నిర్వహిస్తుండటంతో ఈ ప్రాంతమంతా ఒక దేవాలయమేనని, ప్రతి ఒక్కరు భగవంతుడి ధ్యానంలో మునిగిపోవాలని సూచించారు. నిష్టతో ఆరాధిస్తే కష్టాలు తొలగిపోతాయన్నారు. ఈ యాగశాలలోని 1,035 కుండాల ద్వారా చేసే యాగంతో వెలువడే పొగ, పరిమళాలతో వాతావరణంలో ఉన్న చెడు అంతరించిపోతుందని, వైరస్ లాంటి కణాలు నశించిపోతాయని చెప్పారు. సమస్త మానవాళికి మేలు జరుగుతుందని అన్నారు. నేటి కార్యక్రమాలు సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో హోమ, పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఐశ్వర్య ప్రాప్తికై శ్రీ లక్ష్మీ నారాయణేష్టి, సత్సంతానానికై వైనతేయేష్టి సహా శ్రీ లక్ష్మీ నారాయణ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనాలు ఉంటాయి. అగ్ని మథనం ఇలా.. లక్ష్మీనారాయణ యాగంలో అగ్నిమథనాన్ని వేదంలో పేర్కొన్నట్లుగా సృష్టించారు. వేదంలో ‘శమీగర్భాదగ్నమ్ మంథతి’అనే వాక్యంలో చెప్పినట్లుగా.. జమ్మిచెట్టు కర్ర (శమీ దండం)పైన రావి కర్రను (రావి దండం) ఉంచి, వేడి రగులుకుని నిప్పు రవ్వ పుట్టే వరకు రాపిడి ప్రక్రియను కొనసాగించారు. సరిగ్గా తొమ్మిది నిమిషాల రాపిడి తర్వాత నిప్పు రవ్వ జ్వలించింది. అలా పుట్టిన నిప్పురవ్వలను పాత్రలోకి తీసుకుని ఆ అగ్నిని యాగశాలలోని అన్ని కుండాలలోకి వితరణ చేశారు. తొలిరోజు పుట్టించిన అగ్నిని యాగం పూర్తయే వరకు ఆరకుండా కొనసాగిస్తారు. -
5న రాష్ట్రానికి ప్రధాని.. పకడ్బందీ భద్రత ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 5న రాష్ట్రంలో పర్యటించనున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలతో పాటు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొననున్నారు. శనివారం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఇక్రిసాట్‌కు చేరుకోనున్న ప్రధాని సంస్థ స్వర్ణోత్సవాలను ప్రారంభించనున్నారు. ఇక్రిసాట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీని ప్రారంభిస్తారు. స్వర్ణోత్సవాలు పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన ఇక్రిశాట్ లోగోతో పాటు స్మారక స్టాంపును సైతం ఆవిష్కరించనున్నారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగనున్న స్వర్ణోత్సవ కార్యక్రమంలో మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి ప్రధాని చేరుకుంటారు. పంచలోహాలతో రూపొందించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామానుజాచార్యుల జీవిత ప్రస్థానం, బోధనలపై 3డీ మ్యాపింగ్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. సమతామూర్తి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాలను సైతం ప్రధాని సందర్శిస్తారు. ఏర్పాట్లు కట్టుదిట్టం ప్రధాని పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై గురువారం ఆయన వివిధ శాఖలతో బీఆర్కేఆర్ భవన్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తును ‘బ్లూ బుక్’ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేదికల వద్ద నిపుణులైన వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అన్నిచోట్లా కోవిడ్–19 ప్రోటోకాల్ పాటించేలా చూడాలన్నారు. వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేపట్టాలని, కోవిడ్–19 స్క్రీనింగ్ బృందాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే రహదారుల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను కార్యక్రమాల నిర్వాహకులతో సమన్వయ పరుచుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంధన, హౌసింగ్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ , జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు. 7 వేల మంది పోలీసులతో బందోబస్తు సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా సుమారు 7 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఇప్పటికే బందోబస్తులో నిమగ్నమయ్యారు. సైబరాబాద్‌లో ఉన్న 4 వేల మంది సిబ్బందితో పాటు ఇతర కమిషనరేట్లు, జిల్లాల పోలీస్ యూనిట్ల నుంచి మరో 3 వేల మందిని విధుల్లో నియమించారు. వీరిలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను ప్రత్యేకంగా భద్రత చర్యల నిమిత్తం నియమించారు. సైబరాబాద్‌లో పనిచేస్తున్న మొత్తం ఐపీఎస్ అధికారులు, డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లను పూర్తి స్థాయిలో రంగంలోకి దింపారు. -
సహస్రాబ్ది సమారోహం.. నమో నారాయణాయ!
రంగారెడ్డి జిల్లా/ శంషాబాద్/ శంషాబాద్ రూరల్: ఐదువేల మంది రుత్వికులు.. ఒకే సమయంలో వేద మంత్రోచ్ఛారణ. మధ్య ... తెలుగు రాష్ట్రాలకు చెందిన 2200 మంది కళాకారుల కళారూపాల ప్రదర్శనలతో ఆ ప్రాంతం పులకించి పోయింది. జై శ్రీమన్నారాయణ.. జైజై శ్రీమన్నారాయణ నామ స్మరణలతో ఆ ప్రాంతం మారుమోగి పోయింది. సమతామూర్తి వేడుకల ప్రాంగణం భక్తులు, కళాకారులతో తొలిరోజు బుధవారం అత్యంత శోభాయమానంగా మారింది. పుట్టమన్ను సేకరణతో.. అంకురార్పణ కార్యక్రమం పుట్టమన్ను సేకరణతో ప్రారంభమైంది. దివ్య సాకేతాలయం సమీపంలో పుట్ట నుంచి రుత్వికులు మట్టిని సేకరించారు. ఉత్సవ మూర్తితో పాటు పుట్టమన్నును భాజా భజంత్రీలతో ప్రధాన యాగశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ మట్టిని అప్పటికే అక్కడ సిద్ధం చేసిన కుండలాల్లో నవ ధాన్యాలతో పాటు సమర్పించారు. ఈ సమయంలోనే రుత్వికుల వేద మంత్రోచ్ఛారణ, భక్తుల నోట నారాయణ జపాలతో ఆ ప్రాంతం భక్తి పారవశ్యం లో మునిగిపోయింది.12 రోజుల పాటు జరగనున్న హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనే రుత్వికులకు రక్షా సూత్రాలు(కంకణాలు), వస్త్రాలు అందజేయగా.. వారు దీక్షకు కంకణబద్ధులయ్యారు. ఆకట్టుకున్న సాంస్కృతిక యాత్ర వివిధ ప్రాంతాల నుంచి రుత్వికులు, భక్తులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు గాను పెద్దసంఖ్యలో కళాకారులు శ్రీరామనగరానికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు కిన్నెర వాయిద్య కళాకారులు కూడా పన్నెండు మెట్ల కిన్నెరలను వాయించడానికి ఇక్కడకి చేరుకున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆరువందల మంది మహిళలు కోలాటం ఆడుతూ తీసుకొచ్చిన బోనాల జాతర అందరినీ ఆకట్టుకుంది. చినజీయర్ స్వామి సైతం ప్రత్యేకంగా బోనాల సందడిని యాగశాల వద్ద వీక్షించారు. చిన్నారి కళాకారుల ప్రత్యేక నృత్యాలు, ఆటపాటలు, సుమారు రెండు వందల మందితో డోలు వాయిద్యాలు, డప్పు దరువులతో పాటు ప్రత్యేక కోలాటాలతో ప్రధాన ఆలయం నుంచి యాగశాల వరకు సాంస్కృతిక యాత్ర చేప ట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడి విశేషాలతో కూడిన చిత్రాల గ్యాలరీని యాగశాల సమీపంలో ఏర్పాటు చేసింది. ఇందులో తిరుమల వెంకటేశ్వరుడికి సంబంధించిన కళాకృతులు, చిత్రాలు కొలువుదీరాయి. దీనికి పక్కనే భక్తులకు వినోదాన్ని పంచే సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేడు అగ్ని మథనం.. ఉత్సవాల రెండోరోజులో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు యాగశాలలో ‘అగ్నిమథనం’తో హోమ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మథనంలో భాగంగా ఐదువేల మంది రుత్వికులతో పాటు యాజమాన్యులు వారికి కేటాయించిన యాగశాలల్లో ఆసీనులు కానున్నారు. సెమీ దండం, రావి దండం కర్రలతో మథించగా వచ్చిన అగ్నిని 144 యాగశాలల్లోని 1,035 కుండాలలో నిక్షిప్తం చేసి హోమాలను ఆరంభిస్తారు. అనంతరం అరణి మథనం, అగ్ని ప్రతిష్ట, సుదర్శనేష్టి, వాసుదేవనేష్టి, పెద్ద జీయర్‌స్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రవచన మండపంలో వేద పండితుల ప్రవచనాలు కొనసాగించనున్నారు. విద్యుత్ అంతరాయంతో... సహస్రాబ్ది సమారోహంలో కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్‌శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక లైన్లనూ ఏర్పాటు చేశారు. అయినా మొదటి రోజు కోతలు తప్పలేదు. మధ్యాహ్నం సుమారు అరగంట పాటు కరెంటు సరఫరా నిలిచిపోవడంతో రుత్వికులు, సేవకులు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఉద్యోగులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇదిలా ఉండగా బుధవారం స్వల్ప అస్వస్థతకు గురైన సేవకులు, రుత్వికులకు ఇక్కడ వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించారు. సహస్రాబ్ది సమారోహంలో నేడు ► ఉదయం 8.30 గంటలకు దుష్ట నివారణ కోసం శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్ట సిద్ధికై వాసుదేవేష్టి, అష్టోత్తర శతనామ పూజ ► 9 గంటలకు యాగశాలలో ‘అగ్నిమథనం’తో హోమ కార్యక్రమం ప్రారంభం ► 12.30 గంటలకు పూర్ణాహుతి ► సాయంత్రం 5గంటలకు సాయంత్రపు హోమం.. 5.30 గంటలకు చినజీయర్ స్వామి థాతి పంచకం సహితంగా శ్రీ విష్ణు సహస్ర నారాయణ పారాయణం ► రాత్రి 9.30 గంటలకు ఇష్టిశాలలో పూర్ణాహుతి ► ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రవచన మండపంలో పెద్ద జీయర్ స్వామి ఆరాధన, చిన జీయర్‌స్వామి, రామచంద్ర జీయర్‌స్వామి ఉపదేశాలు ఉంటాయి. ప్రధాన వేదికపై కర్ణాటక సంగీత కచేరీ, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, భజనలు, పాలపర్తి శ్యామలానంద్ ప్రసాద్, నేపాల్ కృష్ణమాచార్య, అహోబిల జీయర్‌స్వామి ప్రవచనాలు ఉంటాయి. పోస్టల్ కవర్ ఆవిష్కరణ లోకానికి సమతాస్ఫూర్తిని చాటిన శ్రీ భగవద్రామానుజుల వారి చిత్రంతో పోస్టల్ శాఖ రూపొందించిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ పోస్టల్ కవర్, స్టాంపును చినజీయర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తపాలా శాఖ రాష్ట్ర డైరెక్టర్ వి.వి.సత్యనారాయణరెడ్డి, మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. -
Statue Of Equality: రామానుజ సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు
భగవద్రామానుజులవారు భూమిపై అవతరించి ఇప్పటికి వెయ్యేళ్ళు దాటింది. సమాజంలో అసమానతలు తలెత్తి ఎవరికి వారు వేరు వేరంటూ కొందరిని దూరం పెడుతూ... భగవంతుని చేరే మార్గం కొందరి దగ్గరే ఉంచుకుని.. వేరెవరికీ ఇది తెలియ రాదనే కట్టుబాట్లు చాలా కఠినంగా అమలవుతున్న ఆ కాలంలో.. మిగిలినవారంతా భగవంతుని చేరుకోవడానికి నేనొక్కడినీ నరకానికి పోయినా పర్లేదని అప్పటి కట్టుబాట్లను దాటి మానవులందరిని భగవంతుని వద్దకు చేర్చే అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిరంగంగా గోపురమెక్కి అందరికీ చెప్పిన భగవదవతారం శ్రీమద్రామానుజులు. నాటి వారి స్ఫూర్తిని నేటికీ నిలుపుతూ వారు పంచిన సమతను మరోసారి ప్రపంచానికి తెలియజేయాలనీ.. మానవులందరూ వారి బోధనలను తెలుసుకోవాలనీ... ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో నడవాలని.. మరో వెయ్యేళ్ళు రామానుజులవారిని మనమంతా గుర్తుంచుకోవాలని రామానుజ సహస్రాబ్ది సందర్భంగా వెలసినదే సమతా కేంద్రం. ఈ సందర్భంగా హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో రామానుజ సమతా కేంద్రం నిర్మాణ విశేషాలు.. రామానుజులవారి జీవిత విశేషాలు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి ఎన్నో ఏళ్ల కల నేడు నిజమైంది. నేటినుంచి ‘రామానుజ సహస్రాబ్ది సమారోహం’ ప్రారంభం కానుంది. పన్నెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి, దేశప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలైన పాలకవర్గం, మరోవైపు ఆధ్యాత్మిక సంప్రదాయానికి సంబంధించిన అనేకమంది పీఠాధిపతులు.. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. విహంగ వీక్షణ దివ్యవిమానశిఖరాలు.. ఎత్తైన గోపురాలు.. గొప్ప శిల్పకళాశోభితమైన మండపాలు... అనేక ప్రాచీన శిల్పశైలీసంపన్నమైన స్వాగతతోరణాలు.. రామానుజ ఆచార్యాభిషేకం చేసే లీలాజలనీరాజనం (వాటర్ ఫౌంటెన్)... పచ్చటి ఉద్యానవనాలు... సర్వతోభద్ర మండలాకృతిలో రూపొందించిన 108 దివ్యదేశ దేవాలయాలు...ఆచార్య పురుషుని చేరుకునే ఉజ్జీవన సోపానమార్గం... ఆపై భద్రవేదిపై. పద్మాసనంపై ఆసీనులై ప్రసన్న మందస్మిత వదనంతో దర్శనమిచ్చే భగవద్రామానుజులవారి దివ్య విగ్రహం దర్శించినవారి మనస్సు ఆనందంతో ఉప్పొంగక మానదు. ప్రవేశద్వారం ఉన్నతమైన రామానుజులవారి విగ్రహాన్ని దర్శించేందుకు వచ్చిన భక్తులు ముందుగా ప్రవేశద్వారం వద్ద ఉన్న శిల్పకళను చూసి అచ్చెరువొందుతారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రవేశద్వారం నుండి నిష్క్రమణ ద్వారం వరకు ఉన్న శిల్పకళను పరిశీలనగా చూడాలంటే రెండు కళ్లూ సరిపోవు. వాటి విశేషాలను తెలుసుకోవడానికి ఒకరోజు చాలదు. ఇందులో భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవమంతా కొలువుతీరింది. ఒకవైపు ప్రవేశద్వారం.. మరోవైపు నిష్క్రమణద్వారం.. వీటి మధ్యలో ఉన్న అనేక మండపాలు.. స్వాగతతోరణాలు.. మొదలైనవాటి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. విజయనగరనిర్మాణమైన రాతిరథాన్ని గుర్తుకు తెచ్చే రెండు శిలానిర్మిత రథాలను రెండు ఏనుగులు లాగుతున్న దృశ్యం.. వైష్ణవసంప్రదాయంలో భక్తికి ప్రతీకలుగా నిలిచిన గరుడ, హనుమ విగ్రహాలు ఇరువైపులా ఎత్తైన మండపాల్లో కొలువుతీరాయి. హంసద్వారం.. యాళిద్వారం... వాటిపై కాకతీయ స్వాగతతోరణాలను నిర్మించిన తీరు ఈ నేలపై పరిఢవిల్లిన ఒకప్పటి సామ్రాజ్య వైభవాన్ని గుర్తుకు తెస్తుంది. దక్షిణాది, ఉత్తరాది శిల్పౖ శెలులను గుర్తుకు తెచ్చే అనేక విమానశిఖరాలు.. ఆలయగోపురాలు ఇక్కడ కనిపిస్తాయి. ఒక్కసారి ఆమూలాగ్రం ఈ వరుసను పరికిస్తే భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవం కళ్లముందు నిలుస్తుంది. భూమిపై ధర్మానికి ఆపద కలిగినప్పుడు దుష్టశిక్షణ.. శిష్టరక్షణకు చేయడానికి భగవంతుడు అవతరిస్తాడు. రామానుజులవారు తమిళనాడులో శ్రీపెరంబుదూరులో పింగళనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన ఆర్ద్రానక్షత్రంలో రామానుజాచార్యుడు జన్మించాడు. ఆయన తండ్రిపేరు ఆసూరి కేశవ సోమయాజి, తల్లిపేరు కాంతిమతి. సమతామార్గం భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అందరూ మోక్షం పొందడానికి అర్హులే అని చాటి చెప్పిన మహనీయుడు శ్రీమద్రామానుజులు. అందుకే ఆయన దేవుని దరిచేర్చే అష్టాక్షరీమహామంత్రాన్ని అందరికీ వినిపించేలా చెప్పారు. అందరూ సమానమేనని చాటారు. ప్రతి మానవునిలో మాధవుడు కొలువు దీరాడని నిరూపించారు. ఆచార్యుల ఆశయ వారసుడు వైష్ణవ సంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వార్లు ముఖ్యమైనవారుగా పరిగణింపబడుతున్నారు. వీరిలాగే అనేకమంది గురువులు విష్ణుభక్తిని సమాజంలో నెలకొల్పడానికి పాటుపడ్డారు. ఆ కోవలో యామునాచార్యులు ముఖ్యమైన గురుస్థానాన్ని పొందారు. 1042 లో వారు పరమపదించారనే వార్త తెలుసుకొని, వారు వారి జీవితకాలం లో చేయాలనుకుని కలగన్న మూడు కోర్కెలను తీరుస్తానని రామానుజులవారు ప్రతినబూని వాటిని నెరవేర్చారు. యామునాచార్యులవారి వారసత్వాన్ని నిలబెట్టారు. గురువుకే గురువు శ్రీరామానుజాచార్యులవారు పదహారు సంవత్సరాల వరకు శ్రీపెరంబుదూరులోను, ఆ తర్వాత ఎనిమిదేళ్లపాటు తిరుప్పుట్కుళిలోను, పదేళ్లపాటు కంచిలోను వేదాంత విద్యను అధ్యయనం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే అమేయ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. యాదవప్రకాశులనే వేదాంతగురువు పాఠం చెప్తూ విష్ణునేత్రాలను వర్ణిస్తూ వాటికి వింత పోలికలను పోలుస్తూ విచిత్ర ఉపమానాలిస్తున్నప్పుడు రామానుజులవారు అది తప్పని చెబుతూ ‘సూర్యుని రాకతో విచ్చుకున్న తామరల్లా విష్ణునేత్రాలు ఒప్పుతున్నాయి’ అనే శంకరుల భాష్యాన్ని ఉదహరిస్తూ సరైన అర్థాన్ని చెప్పారు. ఇలాంటి సందర్భాలెన్నో. అంతా బ్రహ్మమా? బ్రహ్మమే అంతానా? సర్వం ఖల్విదం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యానికి జగత్తులో ఉన్నదంతా బ్రహ్మపదార్థమే కాని, వేరుకాదు అని అంతవరకూ పండితులు చెప్పిన విశ్లేషణను వ్యతిరేకిస్తూ.. జగత్తులోని అంశలన్నీ భగవంతుని శరీరాలు. అన్నింటిలోనూ భగవంతుని తత్త్వం ప్రకాశిస్తుంటుంది. అంతేకానీ అంశకు, భగవంతునికీ భేదంలేదని చెప్పడం సరికాదన్నారు. బ్రహ్మ అనంతుడంటే సరిపోతుంది కాని, అనంతమే బ్రహ్మ అవుతుందా? అనంతం అంటే అంతం లేనిది అని అర్థం. అంటే అది ఒక గుణాన్ని సూచిస్తుంది కానీ, భగవంతునికి పర్యాయపదం కాదు. సత్య, జ్ఞాన, అనంతాలు భగవంతుని సహజగుణాలు. అటువంటి పరమాత్మని కేవలం సత్యంగాని, జ్ఞానంగాని, అనంతంగాని పరిపూర్ణంగా చిత్రించలేవు కదా! నలుగురి మంచికోసం నరకానికైనా... కాంచీపురంలోనే పెరియనంబి నుండి దివ్యప్రబంధాన్ని, శ్రీశైలపూర్ణుల వద్ద దర్శన రహస్యాలను, వర రంగాచార్యుల నుండి వైష్ణవ దివ్యప్రబంధాలను అధ్యయనం చేశారు. గోష్ఠీపూర్ణులను ఆశ్రయించి వారు పెట్టే పరీక్షలకు తట్టుకుని తిరుమంత్రార్థ రహస్యాన్ని వారివద్దనే గ్రహించారు. ఈ మంత్ర రహస్యాన్ని విన్నవారంతా మోక్షం పొందుతారని గురువులు చెప్పిన ఫలశ్రుతిని గ్రహించారు రామానుజులు. ప్రయాస లేకుండా ప్రజలందరికీ మోక్షం కలిగించాలని ఒకనాడు గుడిగోపురమెక్కి అందరూ వినేలా ఆ మంత్రాన్ని ఉపదేశించారు. అది విన్న గోష్ఠీపూర్ణులవారు. ‘అనర్హులకు ఈ మంత్ర రహస్యాన్ని వివరిస్తే పాపం పొంది నువ్వు నరకానికి పోతావు!’ అని చెప్తే ‘అంతమందికి మేలు జరుగుతున్నప్పుడు నేనొక్కడినే నరకానికి వెళ్లినా పర్వాలేదు’ అని అన్నారు రామానుజులు. వారి గొప్ప మనస్సుకు గోష్ఠీపూర్ణులు ఎంతగానో మెచ్చుకుని. ‘నువ్వు నాకంటే గొప్పవాడివయ్యా!’ అని రామానుజలవారిని గౌరవించారు. రామానుజుల రచనలు – విశిష్ఠ కృతులు రామానుజులవారు శ్రీభాష్యమనే పేరుతో ప్రస్థానత్రయానికి భాష్యం రచించారు. వారు రచించిన శరణాగతి గద్యని ప్రతి నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా మోక్షం లభిస్తుంది. శరణాగతిగద్య, శ్రీరంగగద్య, శ్రీవైకుంఠగద్య అనే మూడింటినీ గద్యత్రయం అంటారు. శ్రీవైష్ణవాలయాలలో పాంచరాత్రాగమోక్తంగా విశిష్ఠసేవలను, కైంకర్యాలను అందించేందుకు, శ్రీవైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ద్రవిడవేదం పట్ల అందరూ గౌరవ, ప్రపత్తులతో మెలిగేటట్లు విశిష్టాద్వైత వ్యాప్తి చేశారు. దేవుడు – జీవుడు రెండుగా లేరు. ఇద్దరూ ఒకటే అంటూ చెప్పేదే అద్వైతం (రెండుగా లేనిది). విశిష్టాద్వైతం అంటే ప్రకృతిని ఉపాయంగా చేసుకొని ఒక్కటిగా ఉండటం. ఈ మార్గాన్ని శ్రీరామానుజాచార్యులవారు బోధించారు. ఎవరైనా శరణాగతిమార్గం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చని, ఆయనతో కలిసి ఒకటి గా ఉండవచ్చని తెలిపారు. అర్చామూర్తిని కొలిచి అర్చామూర్తిగా నిలిచి.. ఎందరో మహాత్ములు తమ చరమాంకంలో భగవంతునిలో లీనమైపోయారు. మరికొందరు సజీవసమాధి పొందారు. ఇంకొందరు దివ్యవిమానంలో ఆకాశమార్గాన దివ్యలోకాలు పొందారు. మరికొందరు దేవతా విగ్రహాలలో లీనమైపోయారు. అయితే తమ జీవితపర్యంతమూ అర్చామూర్తుల అర్చనాది కైంకర్యాలను, ఆలయసేవలను ఏమాత్రం లోటు లేకుండా ఆలయాలలో జీయర్ వ్యవస్థను బలోపేతం చేసి, అర్చామూర్తి ఆరాధనతో అందరూ పరమపదం చేరవచ్చని చాటిన భగవత్ రామానుజులవారు 1137 పింగళ నామ సంవత్సరం మాఘ శుద్ధ దశమినాడు పరమపదించి తన దేహాన్నే విగ్రహంగా మలచుకున్నారు. దానికి సాక్ష్యంగా నేటికీ ఆ విగ్రహం ‘తానాన తిరుమేని’ గా శ్రీరంగంలోని వసంతమంటపంలో దర్శనమిస్తుంది. లీలాజల నీరాజనం (డైనమిక్ ఫౌంటెయిన్) ప్రవేశద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే ఎదురుగా ఒక వాటర్ ఫౌంటెయిన్ కనిపిస్తుంది. ఇది ఒక విశేషమైన నిర్మాణం. దీని చుట్టూ అష్టదళాకృతిలో నీటిని చిమ్ముతూ రెండు వరుసలలో తొట్లు ఉన్నాయి. దానికి మధ్యలో కింద వరుసలో సింహాలు, వాటిపై ఏనుగులు, దానిపై హంసలు ఉంటాయి. వాటిపై అష్టదళపద్మం లోపల రామానుజుల వారి విగ్రహం ఉంటుంది. సింహాలు తామసగుణానికి, ఏనుగులు రాజసగుణానికి, హంసలు సాత్విక గుణానికి ప్రతీకలుగా వాటిపై త్రిగుణాతీతుడైన భగవద్రామానుజులవారు పద్మాలు విచ్చుకుని నిర్ణీత సమయంలో సౌండ్ సిస్టమ్ ద్వారా నీరు పైకెగసి, మధ్యలో చుట్టూ తిరుగుతూ దర్శనం ఇస్తారు. సంప్రదాయ వాద్యాలతో ఏర్పాటు చేసిన ధ్వనితో, నీటి నాట్యంతో జరిగే విన్యాసం చూసిన భక్తులకు దివ్యానుభూతి కలుగుతుంది. ఉజ్జీవన సోపానాలు లీలాజల నీరాజనం దాటి ముందుకు సాగితే భద్రవేదిపై కొలువుతీరిన రామానుజుల దర్శనం చేసుకోవాలని వెళ్లే భక్తులకు ఉజ్జీవనసోపాన మార్గం దర్శనమిస్తుంది. మొత్తం మెట్ల సంఖ్య 108. భగవంతుని దివ్య నామావళి 108ని ప్రతీకగా తీసుకుని ఈ మెట్ల సంఖ్య నిర్ణయించారు. అటూ ఇటూ ఎండవేడిమి, వానతాకిడికి భక్తులు ఇబ్బంది పడకుండా పైన మండపాలు మొత్తం 18 ఉన్నాయి. వీటిని సోపాన మండపాలు అంటారు. భద్రవేది – బంగారు రామానుజులు రామానుజుల విగ్రహం ఉన్న వేదిక ఈ భద్రవేది. ఇది మూడంతస్తుల నిర్మాణం. కింద భాగంలో ప్రవచనమండపం ఉంది. మొదటి అంతస్తులో బంగారు రామానుజులవారు కొలువుతీరే శరణాగత మండపం ఉంది. దీని చుట్టూ స్తంభాలపై 32్ర బహ్మవిద్యల విగ్రహాలున్నాయి. ఈ రామానుజమూర్తి నిర్మాణం కోసం 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. ఈ బంగారు రామానుజుల వారి విగ్రహాన్ని భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈనెల 13న ఆవిష్కరించనున్నారు. దానిపై అంతస్తులో లైబ్రరీ ఏర్పాటు కానుంది. ఈ భద్రవేది పొడవు 54 అడుగులు. చుట్టూ 108 దివ్యదేశాలు భద్రవేది చుట్టూ భారతదేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన 108 దివ్యదేశాలలో 92 క్షేత్రాలను పర్యటించి, ఆ ఆలయాలను పరిశీలించి అదేవిధంగా ఆలయం ఆకృతి, దేవతామూర్తులు ఉండేలా ఈ ఆలయాలను తీర్చిదిద్దారు. భూమిపై ఉన్న ఆలయాలు 106. 107 వది క్షీరసాగరం, 108వది పరమపదం. సర్వతోభద్ర మండలాకృతిలో ఉన్న ఈ ఆలయాల్లో మొదటి ఆలయం శ్రీరంగం కాగా చివరిది పరమపదం. -
108 దివ్య దేశ దివ్యాలయాల ప్రతిష్ఠా మహోత్సవం (ఫోటోలు)
-
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ
శంషాబాద్ రూరల్: డ్రగ్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో పాటు శాంతిభద్రతల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఆదివారం శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో కొత్తగా నిర్మించిన శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌ను శ్రీత్రిదండి చినజీయర్‌స్వామితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ సరఫరా అదుపునకు సీఎం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటుచేసి, డీజీపీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనమన్నారు. పోలీస్ శాఖకు రూ.700 కోట్లు మంజూరుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మరో రెండు నెలల్లో పోలీస్ కమాండింగ్ కంట్రోల్‌ను ప్రారంభిస్తామన్నారు. పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం కోటా కల్పించినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. స్టార్ హోటల్ తరహాలో శంషాబాద్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆధునిక హంగులతో రూ.4.5 కోట్ల వ్యయంతో మైహోం సంస్థ నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ స్టీఫెన్ రవీంద్ర, మైహోం గ్రూపు సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక కేంద్రం కాదు పరివర్తన క్షేత్రం
సాక్షి, హైదరాబాద్: ‘మనుషులు, జంతువులు, పక్షులు, క్రిములు.. చూస్తే అన్నీ వేర్వేరు. కానీ కలిసి సాగితేనే సుఖ జీవనం. మంచి జీవితం కావాలంటే సహజీవనం అవసరం. అదే సమతాభావం.. రామానుజుల తత్వం. కానీ ఇప్పుడు సమాజంలో ఎన్నో వికార పోకడలు. నేనే గొప్ప, నేనే నిలవాలన్న స్వార్థ చింతనలు పెరిగిపోయాయి. ఈ తీరు మారాలి. మన ఇల్లు, ఊరు, సమాజం, దేశం, ప్రపంచం అంతా సంతోషంగా ఉండాలి. అందుకు రామానుజులు చూపిన సమతా మార్గంలో మనం సాగాలి. ఆ దిశగా మేం వేస్తున్న తొలి అడుగు ‘సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం’’.. ఇది త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి చెప్పిన మాట.శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 216 అడుగుల రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్టిస్తూ రూపొందించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం వచ్చే నెల 5న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చినజీయర్ స్వామి ‘సాక్షి’తో మాట్లాడారు. సామాజికంగా సిద్ధాంతాలు ఎన్ని చెప్పినా.. విద్యా విధానం లో విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉంది. విద్యార్థిగా చిన్నప్పుడు పడ్డ బీజాలే వారి భవిష్యత్ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. మనం వాడుకలో నైతికతకు రాముడిని, జీవన విధానానికి భగవద్గీతను మార్గంగా చూపుతాం. కానీ పాఠ్యాంశాల్లోకి వచ్చేసరికి 2,500 ఏళ్లకు ముందు మనకు నాగరికతే లేదని, అప్పుడే శిలాయుగం మొదలైందని అంటున్నాం. ఇలాంటి చదువు చదివినప్పుడు రాముడు, భగవద్గీత, జీవన విధానం, నైతికతలకు ప్రాధాన్యం ఎక్కడుంది? ఈ రెండింటికీ పొంతనేది? దేశీయ సంస్కృతి, సంప్రదాయాలు, మన పూర్వీకుల వైజ్ఞానిక చైతన్యానికి విద్యావిధానంలో చోటు దక్కాలి. ఇప్పటివరకు మన దేశంలో దేవతామూర్తుల భారీ విగ్రహాలున్నాయేగానీ.. ఆది శంకరాచార్యులు, రామానుజులు వంటి గురువుల భారీ మూర్తులు లేవు. ఈ క్రమంలో మహామూర్తిగా శ్రీరామానుజాచార్యుల విగ్రహం రాష్ట్రంలో రూపుదిద్దుకుంది. తాము దీనిని రికార్డు కోసం చేయడం లేదని, దీని వెనుక గొప్ప పరమార్థం దాగి ఉందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వివరించారు. ప్రకృతిలో మనుషులతోపాటు అన్ని జీవులూ సమానమేనన్న రామానుజుల స్ఫూర్తిని అందరం అనుసరించాలని.. ఆ దిశగానే ‘సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం’ను ఏర్పాటు చేస్తున్నామని ‘సాక్షి’కి వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. రామానుజుల ఆలోచనా విధానం 16 శతాబ్దం చివరివరకు కొనసాగింది. ఆంగ్లేయులు వచ్చాక ధ్వంసమైంది. వారు మనుషుల మధ్య అంతరాల మంటలు పెట్టి చలికాచుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఆంగ్లేయుల రీతి కొంత సజీవంగా ఉంది. గణతంత్ర భారతంలో రాజ్యాంగం ప్రసాదించిన సమతాస్ఫూర్తిని ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేకపోతున్నాం. ఎక్కువ మంది రాజకీయ నేతల్లోని నిగూఢమైన స్వార్ధ ప్రవృత్తే దీనికి కారణం. అందుకే.. ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్రం వస్తే.. ఇంకా తెల్లవారలేదు, ఆ చీకట్లు పోలేదు అంటుంటారు. కొత్త విద్యా విధానం రావాలి ఏడెనిమిది శతాబ్ధాలకు పూర్వందాకా అంతరిక్షంలోకి మనిషి వెళ్లనేలేదు. అలాంటిది కొన్ని వేలఏళ్ల కిందటే కచ్చితమైన ఖగోళ రహస్యాలను వరాహమిహిరుడు గ్రంధస్థం చేశారు. ఇలాంటి మన పూర్వీకుల వైజ్ఞానిక అద్భుతాలకు విద్యా విధానంలో చోటుదక్కనప్పుడు.. మన సంప్రదాయ విలువలకు ప్రాధాన్యమే ఉండదు. వైద్యరంగంలో మన పూర్వీకులు అద్భుతాలు చేశారు. కానీ తర్వాతికాలంలో మన సంప్రదాయ వైద్యం, నాటి వైజ్ఞానిక అద్భుతాలను వ్యూహాత్మకంగా అణచివేశారు. ఇప్పటికైనా నాటి వివరాలు, రహస్యాలు, ఆధారాలు అన్నీ మన పాఠాల్లోకి రావాలి. ఇందుకు కొత్త జాతీయ విద్యా విధానం రావాలి. దీనిపై కొంత ప్రయత్నం జరుగుతోంది. ఆజాదీకా అమృతోత్సవాలను ఘనంగా చేసుకోగలుతున్నాం. రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు చేసుకోబోతున్నాం.. ఇవన్నీ కొంత శుభసూచకాలుగా మాకు కనిపిస్తున్నాయి. యువతలో మార్పు రావాలి ఆశిష్టః దృఢిష్టః బలిష్టః యువాస్యాత్ సాధు యువాధ్యాయకః అని వేదం స్పష్టంగా చెప్తోంది. యువత మంచి తిండి తినాలి, తిన్నది హరాయించుకోవాలి, దాన్ని శక్తిగా మార్చుకోవాలి, ఆ శక్తితో సమాజానికి సేవ అందించాలి. లేకపోతే యువత సమాజానికి దండుగగా మారుతుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడదే జరుగుతోంది. యువత రకరకాల వ్యసనాలు, విలాసాలకు లోనవడాన్ని ప్రగతికి చిహ్నంగా భావిస్తోంది. చాలా మంది దారి తప్పి సమాజాన్ని కుంగదీస్తున్నారు. ఇది మారాలి. యువత సమాజానికి ఉపయోగపడే శక్తిగా తయారు కావాలి. కండల లక్ష్యం బలహీనుడిని ఆదుకోవడం, ధన సంపాదన లక్ష్యం ధనహీనుడి ఉద్ధరణ, విద్యాధికుడి లక్ష్యం మార్కులు, ఉద్యోగం కాదు.. విద్యా రహితుడిని విద్యావంతుడిగా మార్చటం.. ఇది రామానుజుల స్పూర్తి. ఇలా ఉన్నప్పుడు సమాజంలో దమము (నియంత్రణ) ఉంటుంది. లేకుంటే తిరగబడి మదము అవుతుంది. మనం సమాజంలో ఓ భాగంగా సమాజ సమగ్ర వికాసానికి ఉపయోగపడాలన్న ఆలోచన అందరిలో ఉండాలనేది రామానుజుల సందేశం. దీన్నే ఆయన వేదాంత పరిభాషలో శరీర శరీరి భావ సంబంధంగా పేర్కొన్నారు. రామానుజుల ఆలోచన సంపత్తిలో ఇదే కీలకం. ఆయన అడుగే ఓ విప్లవం కొందరిపై అంటరానివారిగా ముద్ర వేసి, సమాజానికి దూరంగా పెట్టిన భయంకర పరిస్థితులున్న సమయంలో రామానుజులు ఈనేలపై నడయాడారు. అంటరాని వారిని చేరదీస్తే తల తీసేసే పరిస్థితులను ఎదుర్కొని.. వారిని జనజీవన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పంచ సంస్కారాలు చేశారు. మంత్రదీక్షలు ఇచ్చి, వైష్ణవులుగా మార్చారు.తిరుక్కులతార్గా వారికి గౌరవప్రదమైన కులానికి చెందినవారన్న పేరు పెట్టారు. ఇది గొప్ప సామాజిక మార్పు దిశలో రామానుజులు వేసిన విప్లవాత్మక అడుగు. పండితలోకాన్ని, పాలకులను, ప్రజలను ఒప్పించి ముందుకు సాగిన మహనీయుడు రామానుజులు. ఇప్పుడూ కులాల మధ్య భారీ అగాధం ఉంది. మళ్లీ రామానుజులు రావాల్సిందే.. సర్వప్రాణులూ దైవ స్వరూపమే.. ప్రకృతిలో మనిషే కాదు.. చెట్లు, జంతువులు, సూక్ష్మజీవులు ఎన్నో ఉన్నాయి. అవి లేకుండా మనిషి ఉండలేడు, కానీ మనిషి లేకుండా అవి ఉండగలవు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మనిషి ఇంటికే పరిమితమైతే.. ప్రకృతి పరవశించిన విషయాన్ని కళ్లారా చూశాం. అందుకే మనం పదిలంగా ఉండాలంటే వాటిని కాపాడాల్సిందే. ఇందుకు ప్రత్యేకంగా చేసేదేమీ లేదు. వాటి మానాన వాటిని బతకనీయడమే. అందుకే రామానుజుల అనుసరణ ఏంటంటే.. ‘మాధవ సేవగా సర్వప్రాణి సేవ’. మహనీయుల చరిత్రతో డిజిటల్ లైబ్రరీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో అద్భుతమైన డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నాం. సమతా భావం కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాడిన మహనీయుల చరిత్రను అందులో నిక్షిప్తం చేస్తున్నాం. అబ్రహం లింకన్, మండేలా, మలాలా.. ఇలాంటి 116 మందిని గుర్తించి వారి వివరాలను నిక్షిప్తం చేశాం. రామానుజుల ప్రబోధాలను జనంలోకి తీసుకెళ్లి మార్పునకు అవకాశం కల్పించడం, దేశ పురోగతికి బాటలు వేసేలా చేయాలన్నది నా కల. ఈ కేంద్రంతో కొంత నెరవేరినట్లవుతోంది. దీన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా దారితప్పిన మనిషి పరివర్తనకు బాట వేసే కేంద్రంగా పరిగణించాలి. ఆధునిక పద్ధతిలో యువతకు.. సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సాధారణ గుడిగా, ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించి దర్శనం చేసుకుని వెళ్తే ఉపయోగం ఉండదు. రామానుజుల ఆలోచనలు, సమాజానికి అందించిన సేవలు, మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటో ప్రజలు గ్రహించగలగాలి. ఆ దిశగానే అగుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. రామానుజుల సందేశం వ్యవస్థలోకి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వైష్ణవంలో దివ్య దేశాలుగా పేర్కొనే 108 దేవాలయాల నమూనాలను స్ఫూర్తి కేంద్రంలో నిర్మించాం. వాటిని దేవాలయాలుగా భావించి కాదు, రామానుజులను ప్రభావితం చేసిన ప్రాంతాల నేపథ్యంగా ఏర్పాటు చేశాం. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంగా దీనికి నామకరణం చేశాం. అంతా ప్రకృతి బిడ్డలమన్న భావన రావాలి రోమ్రోమ్మే రామ్ హై అంటాడు భక్తుడు. ఇందుగలడు అందులేడన్న సందేహం లేదంటాడు ప్రహ్లాదుడు. పశుపక్ష్యాదులు, మనిషి అంతా ప్రకృతి సంతానమే. అలాంటప్పుడు ఈ భేదాలు, ఆధిపత్య ధోరణులు ఎందుకు? అందుకే అనేకముల్లో ఒకటిగా ఉండాలని రామానుజులు విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు. కులాలు, వర్గాలు, మతాలు, రంగులు, లింగభేదంతో విడిపోద్దని సూచించారు. దానికి తన అనుభవాన్నీ జోడించారు. ‘పదడుగుల ఎత్తు పునాదితో ఇల్లు కట్టి నన్ను ఆహ్వానించారు. అంతెత్తు పునాది ఎందుకని అడిగాను. పక్కనే ఉన్న నది పొంగి చుట్టూ ఇళ్లు కొట్టుకుపోయినా.. నా ఇల్లు నిలిచి ఉండాలన్న ఉద్దేశంతో ఇలా కట్టానని అతను చెప్పాడు. ఊరంతా కొట్టుకుపోతే ఒక్కడివీ మిగిలి ఏం చేద్దామని? అందరితో కలిసి సాగు, చేతనైతే అందరినీ నిలిపి నువ్వూ నిలువ’ని చెప్పారు. పర సహనం కోల్పోవడం అశాంతికి మూలం ఒకే భాష మాట్లాడేవారు, ఒకే దేవుడిని పూజించేవారు కూడా వైషమ్యాలతో మారణహోమం సృష్టించుకుంటున్నారు. పరసహనం కోల్పోతున్నారు. ఆధిపత్య ధోరణి విశృంఖలమవుతోంది. నేను అగ్రాసనంలో ఉండాలన్న స్వార్ధంతో ఇతరులను అణచివేయటం పరిపాటిగా మారింది. వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య, సమాజాల మధ్య, దేశాల మధ్య ఇదే తీరు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అణ్వాయుధాలు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నకోవిడ్ కూడా ఇదే కోవలో వెలువడ్డ జీవాయుధం. ఇలాంటి ధోరణి మారాలన్నదే వెయ్యేళ్ల కింద రామానుజులు చేసిన ప్రయత్నం. -
ముచ్చింతల్ లో చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్
-
సహస్రాబ్ది మహోత్సవాలకు రండి..
సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి: రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నివాసంలో శనివారం స్వామీజీ.. వైఎస్ జగన్‌ను కలిశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా 1035 కుండ శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ట, కుంభాభిషేకం, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా సీఎం.. స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు. చదవండి: చిన్నారి ప్రాణం నిలిపిన ఆరోగ్యశ్రీ -
ఎవరున్నారో తేల్చాలి..
సాక్షి, అమరావతి: గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. ఇప్పుడే రాష్ట్రంలోని ఆలయాల్లో వరుసగా ఎందుకు ఉపద్రవాలు జరుగుతున్నాయో? వీటి వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చాల్సిన అవసరముందని త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. ఇంటెలిజెన్స్ విభాగం పెద్దలతో కమిటీని నియమించి.. వారికి పూర్తి అధికారాలిచ్చి విచారణ జరిపిస్తే.. బాధ్యులెవరో తప్పకుండా తెలుస్తుందన్నారు. గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రి కొండపై స్వామి మంగళవారం మీడియాతో మాట్లాడారు. వ్యక్తులకు ఉండే ద్వేషాలను ఇలా చూపించడం సరికాదని హితవు పలికారు. ఆలయాలకు రక్షణ కొరవడిందనే విషయం స్పష్టంగా కనబడుతోందన్నారు. ఆలయాలకు సంబంధించి రాష్ట్రంలో 50కి పైగా ఘటనలు జరిగినట్టు తెలుస్తోందన్నారు. 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆలయాలను సందర్శించి స్థానికుల అభిప్రాయాలు తీసుకుంటానన్నారు. అలాగే సాధువులను కలిసి.. వారందరి మార్గదర్శనంతో తదుపరి కార్యక్రమాలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజల్ని ఉద్రేకపర్చొద్దు: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో పెద్ద సంఖ్యలో గుళ్లను కూల్చిన ఘటనలపై మీడియా ప్రశ్నించగా.. ఆ గుడులను మళ్లీ నిర్మిస్తామని చెప్పడంతో తాను జోక్యం చేసుకోలేదన్నారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం కూల్చివేసినప్పుడు కూడా తాను యాత్ర చేస్తానన్నానని.. కానీ అప్పుడు హైకోర్టు జడ్జి ఒకరు పునరాలోచించుకుంటే బాగుంటుందని సూచించడంతో దాన్ని వాయిదా వేసుకున్నట్లు వివరించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను సెన్సేషన్ చేసి ప్రజల్ని ఉద్రేకపరచకూడదన్నారు. మతపరమైన విషయాలతో రాజకీయాలను ముడివేయొద్దని సూచించారు. -
చినజీయర్ స్వామిని కలిసిన మధ్యప్రదేశ్ సీఎం
శంషాబాద్ రూరల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మంగళవారం ముచ్చింతల్‌లోని జీవా ప్రాంగణంలో చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సమేతంగా ఇక్కడకు చేరుకున్న చౌహాన్‌కు అహోబిల జీయర్ స్వామి, ఆశ్రమం సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం దివ్యసాకేతాలయంలో చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో జరిపిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్‌కు చినజీయర్ స్వామి తీర్థ ప్రసాదాలు, మంగళశాసనాలు అందజేశారు. ఆశ్రమం సమీపంలో జరుగుతున్న సమతాస్ఫూర్తి కేంద్రం పనులను జీయర్‌స్వామితో కలసి చౌహాన్ పరిశీలించారు. -
అమ్మవారిని దర్శించుకున్న చినజీయర్ స్వామి
సాక్షి, విజయవాడ: ఇంద్ర కీలాద్రిపై శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. చిన్న జీయర్ స్వామికి దుర్గ గుడి ఈవో సురేష్ బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. చిన్న జీయర్ స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం చిన జీయర్ స్వామి మాట్లాడుతూ, ‘ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలు కష్టాలు పడుతున్నారు. కరోనా నివారణ వ్యాక్సిన్ కోసం భారత్ సహా ప్రపంచ దేశాల్లో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్ లోనూ వ్యాక్సిన్ పై రెండో దశ పరీక్షలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ కోసం చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావాలని అమ్మవారిని ప్రార్థించా. వ్యాక్సిన్ వస్తే ప్రజల్లో వ్యాధినిరోధక శక్తి పెరిగి తిరిగి శక్తిమంతులవుతారు. భారత్ తిరిగి శక్తివంతమైన దేశంగా వెలుగొందాలని కోరుకున్నా. పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమైంది. ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలి’ అని అన్నారు. చదవండి: శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ -
చిన్నజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పరామర్శించారు. సోమవారం రోజున ఆయన శంషాబాద్‌లోని ముచ్చింతల్ శ్రీరాంనగర్‌లోని చిన్న జీయర్‌స్వామి ఆశ్రమానికి వచ్చారు. సీఎం కేసీఆర్ దాదాపు గంటపాటు స్వామి వారితో ఆశ్రమంలో గడిపారు. అనంతరం తిరిగి నగరానికి బయలుదేరారు. కాగా.. గత శుక్రవారం రోజున చిన్న జీయర్‌స్వామి తల్లి అలివేలు మంగతాయారు స్వర్గస్తులు కావడంతో సీఎం కేసీఆర్ ఆశ్రమానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. (చినజీయర్‌స్వామికి మాతృ వియోగం) -
చినజీయర్‌స్వామికి మాతృ వియోగం
సాక్షి, శంషాబాద్: శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) శుక్రవారం రాత్రి 10 గంటలకు నగరంలోని యశోద ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె హృదయ సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. నగరంలోని ఆమె కూతురు వద్ద ఉండగా.. రాత్రి అకస్మాత్తుగా షుగర్ లెవెల్స్ పడిపోయాయి. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. అదే రోజు రాత్రి ఆమె పార్థివదేహాన్ని శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ శివారులో ఉన్న శ్రీరామనగరానికి తీసుకువచ్చారు. శనివారం మధ్యాహ్నం దహన సంస్కారాలు నిర్వహించగా.. చినజీయర్ స్వామి నిప్పంటించారు. మైహోం గ్రూపు సంస్థల అధినేతలు జూపల్లి రామేశ్వర్రావు, జూపల్లి జగపతిరావు, జీవా, జిమ్స్ సిబ్బంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు. శారదా పీఠాధిపతి సంతాపం పెందుర్తి: త్రిదండి చినజీయర్ స్వామి మాతృమూర్తి పరమపదించడంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి విచారం వ్యక్తం చేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
దివ్యసాకేతాలయంలో మధ్యప్రదేశ్ సీఎం పూజలు
శంషాబాద్ రూరల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దంపతులు శుక్రవారం ముచ్చింతల్‌లోని దివ్యసాకేతాలయంలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా సీఎం చౌహాన్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన సంగతి తెలిసిందే. రాత్రి ఇక్కడే బస చేసిన ఆయన శుక్రవారం ఉదయం దివ్యసాకేతాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. 216 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న శ్రీ భగద్రామానుజుల వారి సమతాస్ఫూర్తి కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడి గురుకుల వేద పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆలయంలో వంట పనులు చూసుకునే మనోజీ కూతురు ఆకాంక్ష మిశ్ర పదో తరగతిలో 9.8 జీపీఏ మార్కులు సాధించడంపై సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్రావు దంపతులు పాల్గొన్నారు. -
ఉవ్వెత్తున గోదారి
సాక్షి, సిద్దిపేట : కరువు నేలను గోదారమ్మ ముద్దాడింది. సముద్రమట్టానికి 88 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద ప్రవహించే గోదావరి 618 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి ఎగిరి దుంకింది. మేడిగడ్డ నుంచి పది లిప్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. త్రిదండి చినజీయర్ స్వామితో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మర్కూక్ పంప్‌హౌస్ వద్ద రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. మోటార్లను ఆన్ చేసిన 10 నిమిషాల్లోనే గోదావరి ఉత్తుంగ జలవాహినిలా కొండపోచమ్మ రిజ ర్వాయర్‌లోకి ప్రవహించింది. పంప్‌హౌస్ నుంచి రిజర్వాయర్ వద్దకు వచ్చిన సీఎం దంపతులు, చినజీయర్ స్వామి, మంత్రులు, ఇరిగేషన్ అధికారులు గోదావరి నీటికి స్వాగతం పలికారు. కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమలు, నవధాన్యాలు, పూలు, పండ్లను నీటి ప్రవాహంలో వేసి గోదారమ్మకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మం త్రులు తన్నీరు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, ఫారూక్ హుస్సేన్, బి. వెంకటేశ్వర్లు, శేరి శుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సొలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, సతీష్‌కుమార్, మదన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. కొండపోచమ్మ ఆలయంలో తీర్థం స్వీకరిస్తున్న సీఎం కేసీఆర్ దంపతులు పూజలతో కార్యక్రమానికి శ్రీకారం... కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ దంపతులు ముందుగా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ మండలంలోని కొండపొచమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ప్రాంగణంలో శుక్రవారం వేకువజామున 4 గంటలకు చండీయాగం చేపట్టగా కేసీఆర్ దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు మర్కూక్, ఎర్రవెల్లి గ్రామాల్లోని రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వరదరాజుపూర్లోని వరదరాజుల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీయాగంలో పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు చినజీయర్ స్వామితో కలిసి.. ఏ కార్యక్రమం చేపట్టినా యజ్ఞ, యాగాలు నిర్వహించే ఆనవాయితీ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి ముందు కూడా మర్కూక్ పంప్‌హౌస్ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న సీఎం దంపతులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చినజీయర్‌కు స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య సుదర్శన యాగం నిర్వహించారు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన వారందరికీ చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు అందజేశారు. అక్కడి నుంచి నేరుగా పంప్‌హౌస్ వద్దకు చినజీయర్ స్వామితో కలసి సీఎం కేసీఆర్ వెళ్లి పంప్‌హౌస్‌లోని రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి కొండపొచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జాలలను వదిలారు. శుక్రవారం కొండపోచమ్మ ఆలయం వద్ద నిర్వహించిన చండీయాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు సతాయించిన రెండో మోటార్ మర్కూక్, జగదేవ్‌పూర్ (గజ్వేల్): కొండపోచమ్మసాగర్ పంప్‌హౌస్ ప్రారంభంలో రెండో మోటార్ కొంతసేపు సతాయించింది. పంప్‌హౌస్‌లోని రెండు మోటార్లను ప్రారంభించేందుకు మర్కూక్ కట్టపైకి సీఎం కేసీఆర్ చేరుకొని మోటార్లను స్విచ్ ఆన్ చేయగా మొదటి మోటార్ వెంటనే ప్రారంభమైంది. కానీ సాంకేతిక కారణాలతో రెండో మోటార్ ఆన్ కాలేదు. దాన్ని రిపేర్ చేసేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో కేసీఆర్, మంత్రులు అక్కడి నుంచి వరదరాజుపూర్లోని వరదరాజస్వామి దేవాలయానికి వెళ్లారు. అరగంట తర్వాత మోటార్‌ను బాగు చేశాక సీఎం కేసీఆర్ తిరిగి పంప్‌హౌస్ వద్దకు చేరుకొని రెండో మోటార్‌ను ప్రారంభించారు. మర్కూక్ పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన సుదర్శన యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు, చినజీయర్‌స్వామి తదితరులు సుదర్శనయాగంలో నవ దంపతులు మర్కూక్ (గజ్వేల్): కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు మర్కూక్ పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన సుదర్శనయాగంలో పాల్గొనే అదృష్టం మర్కూక్ మండల ఎంపీపీ తాండ పాండుగౌడ్ నూత న దంపతులకు లభించింది. పాండుగౌడ్‌కు ఈ నెల 27న మెదక్ జిల్లా మనోహరాబాద్‌కు చెందిన మేఘనతో వివా హం జరగ్గా పెళ్ల యిన రెండో రో జే అంటే శుక్రవా రం సీఎం కేసీఆర్ సూచనల మేరకు సుదర్శనయాగంలో నూ తన దంపతులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతో కలసి ఈ అరుదైన ఘట్టంలో పాలుపంచుకున్నారు. అలాగే త్రి దండి చినజీయర్‌స్వామి నుంచి ఆశీర్వాదాలు తీసుకు న్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా పాండు గౌడ్ దంపతులను మా ఎంపీపీ దంపతులు అంటూ పరిచయం చేయడంతో వారు ఉప్పొంగిపోయారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో తమకు అవకాశం దక్కడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. -
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం
సాక్షి, సిద్ధిపేట : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలమైన దశకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. కొండపోచమ్మ సాగర్ పంపుహౌస్‌ను(మర్కూక్) సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. చినజీయర్ స్వామితో కలిసి ఆయన మోటార్ ఆన్ చేశారు. దీంతో కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం కొత్త చరిత్రని లిఖించినట్టయింది. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. (చదవండి : కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు) అంతకుముందు శుక్రవారం తెల్లవారుజాము నుంచే కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం, మర్కూక్ వద్ద సుదర్శన యాగం ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగంలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న కేసీఆర్ ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మర్కూక్ వద్ద నిర్వహించిన సుదర్శన యాగం పుర్ణాహుతిలో కేసీఆర్, చినజీయర్ స్వామి పాల్గొన్నారు. -
చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్
-
‘పసుపుకొమ్ములు కట్టుకోవాలి’ వార్త నిజం కాదు
సాక్షి, శంషాబాద్ రూరల్: పసుపు కొమ్ములు ధరించాలని చినజీయర్ స్వామి చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం అవాస్తవమని శ్రీఅహోబిల జీయర్ స్వామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి నివారణకు ముత్తైదువులు అమావాస్యలోపు ఏడు దారాలతో పుసుపుకొమ్ములు ధరించి, అమావాస్య తర్వాత తీసివేయాలని చినజీయర్ స్వామి చెప్పినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, వీటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. కరోనా వైరస్ కట్టడి కావాలంటే ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, భగవంతుడిని ధ్యానిస్తే మనకు మానసిక బలం చేకూరుతుందని వివరించారు. మానసిక ఒత్తిడి తగ్గడానికి భగవంతుని నామ స్మరణ చేయాలని, రోగ నివారణ కోసం వైద్య చికిత్స అవసరమని పేర్కొన్నారు. ‘ఆమె’ అష్టా చమ్మా ఎంత పని చేసిందంటే.. -
గోకవరంలో పర్యటించిన చిన్న జీయర్ స్వామిజీ
-
త్రిదండి చినజీయర్ స్వామి తిరునక్షత్రోత్సవ వేడుకలు
-
చినజీయర్ ఆశీస్సులు తీసుకున్న యెడియూరప్ప
-
ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలకు ప్రాణాలు తీసుకోవద్దు
ఆమనగల్లు : ఇంటర్ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు అమాయకులైన పిల్లలు ప్రాణాలు కోల్పోయారని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఎవరో చేసిన తప్పుకు పిల్లలు బలికావద్దని ఆ తప్పులపై పోరాడి విజయం సాధించాలన్నారు. విద్యార్థులు మనోబలం, ఆత్మ విశ్వాసం పెంచుకోవాలని ఆయన సూచించారు. కడ్తాల మండలం బాలాజీనగర్ తాండా సమీపంలోని ధనరాశి పర్వతంపై వెలసిన శ్రీరాధాకృష్ణ దేవాలయ బ్రహ్మోత్సవాలలో సోమవారం చినజీయర్‌స్వామి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన రాధాకృష్ణ కళ్యాణోత్సవంలో వారు పాల్గొన్నారు. అనంతరం చిన్న జీయర్‌స్వామి మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాలలో జరిగిన తప్పు ఎవరిదో తెలియదు కానీ, అమాయకులైన 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మానవ తప్పిదాలు సహజమని, ఎవరివల్లనో జరిగిన తప్పిదాలకు తొందరపడి పిల్లలు ప్రాణాలు తీసుకోవడం సరికాదని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదని, పోరాడితేనే తెలంగాణ వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి ఎదురొడ్డి పోరాడి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పిల్లలలో మనోబలం, ఆత్మవిశ్వాసం పెరగాలని, అందుకోసం పిల్లలలో దేవునిమీద భక్తి విశ్వాసం పెంపొందించేలా తల్లిదండ్రులు చూడాలన్నారు. జీవితంలో జయాపజయాలు, వ్యాపారంలో లాభ నష్టాలు సహజమని, మన కృషి, శ్రమను బట్టి ఫలితాలు ఉంటాయని ఆయన వివరించారు. దైవ నామ స్మరణ మనసుకు బలాన్ని ఇస్తుందన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, అలాగే ఆలయాలకు సంబందించిన భూములను ఆలయాలకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దైవ సంకల్పబలంతో ఆలయాలు నిర్మిస్తున్నారని ప్రశంసించారు. మనందరిదీ భగవత్ కుటుంబం ప్రతి మినిషి తనలో ఉన్న చెడును, ద్వేషాన్ని విడనాడాలని, ప్రేమను, మంచిని పెంచుకుని ఒకే కుటుంబంలా ముందుకు సాగాలని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. మనందరిదీ ఒకటే కుటుంబమని అది భగవత్ కుటుంబమని ఆయన అన్నారు. సమాజంలో ప్రతీది దైవ కల్పితమని, దైవానుగ్రహం లేనిదే ఏది సాధ్యంకాదని ఆయన చెప్పారు. యజ్ఞయాగాలు, భగవన్నామస్మరణ లోకశాంతికి ఉపకరిస్తాయని ఆయన వివరించారు. దైవానుగ్రహంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వాలు మేఘమథనం ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించడానికి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారని, అయితే భగవంతుని అనుగ్రహం లేక ఫలితాన్ని ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. యజ్ఞాలు, యాగాలు, భగవన్నామస్మరణ వర్షాలు కురవడానికి దోహదపడతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్త రామావత్ బిచ్చానాయక్, ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్ దశరథ్‌నాయక్, సర్పంచ్‌లు గూడురి లక్ష్మీ నర్సింహారెడ్డి, కమ్లి, కృష్ణయ్య, లయన్స్‌క్లబ్ మాజి గవర్నర్ చెన్నకిషన్‌రెడ్డి, నాయకులు గంప వెంకటేశ్, సుదర్శన్‌రెడ్డి, రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, రాంచందర్‌నాయక్, లచ్చిరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘చినజీయర్‌స్వామిపై రాజద్రోహం కేసు పెట్టాలి’
సాక్షి, హైదరాబాద్: దేశంలో కులాలు, అంతరాలు ఉండాలని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పిన ఆంధ్ర పీఠాధిపతి చినజీయర్ స్వామిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో టీపీఎస్కే, కేవీపీఎస్ ఆధ్వర్యంలో చినజీయర్ స్వామి వ్యాఖ్యలకు నిరసనగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టే ముందు సాష్టాంగ నమస్కారం చేయడం విచారకరమని ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. కులాలు ఉండాలి, వర్ణ వ్యవస్థ ఉండాలని చెప్పిన చినజీయర్ స్వామిపై చర్యలు తీసుకోకుంటే ఆయన ఆక్రమించుకున్న 500 ఎకరాల ఆశ్రమం వద్ద నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. మోదుగుపూల ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన చినజీయర్ స్వామిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబాబు, ప్రముఖ కవి కాలువ మల్లయ్య, జేవీవీ జాతీయ నాయకులు టి.రమేశ్, పీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మనం దుర్యోధనుడికంటే దారుణంగా బతికితే ఎలా?
సింహాచలం: దేవుడి భూముల్లో ఒక్క అంగుళం కూడా ముట్టుకునే హక్కు ముఖ్యమంత్రికి కూడా లేదని పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితులు త్రిదండి చిన జీయర్‌స్వామి అన్నారు. సింహాచలం దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురం గోశాలలో ఈ నెల 11 నుంచి జరుగుతున్న సుదర్శన నారసింహ మహాయజ్ఞంలో మంగళవారం పాల్గొన్న ఆయన వేదికపై అనుగ్రహ భాషణం చేశారు. దేవుడి భూముల్లో ఒక్క అంగుళం కూడా ముట్టుకునే హక్కు దేవాలయాల ఈవోలకే కాదు.. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కూడా లేదని స్పష్టం చేశారు. బ్రాహ్మణులకు, దేవుడికి ఇచ్చిన భూములు తప్ప మిగతా వాటిని మనం ఎలాగైనా శాసించవచ్చని మహాభారతంలో చెడ్డవాడిగా చెప్పుకునే దుర్యోధనుడే చెప్పాడని తెలిపారు. దుర్యోధనుడికంటే దారుణంగా మనం బతికితే ఎలాగని ప్రశ్నించారు. దీన్నిబట్టి చూస్తే ఆ కాలంలో దుర్యోధనుడే చాలా గొప్పవాడన్నారు. దేవుడి ఆస్తితో ఆటలొద్దు దేవుడి ఆస్తితో, భూములతో ఆటలాడుకోవడం మంచిపద్ధతి కాదన్నారు. దేవస్థానాన్ని, దేవాలయాన్ని అప్పగించారని ధర్మకర్తలు, ఈవోలు స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని వాడుకోకూడదన్నారు. అలాగే దేవాలయాల్లో స్వామికి భక్తులు ఇచ్చే ఆభరణాలు వైదికులకు ఇస్తే వాటిని వారు వాడుకోకూడదన్నారు. అలా జరిగితే పాలకుల అసమర్థత అవుతుందన్నారు. సింహాచలం దేవస్థానం భూసమస్య పరిష్కారం అంటూ ఇటీవల ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ విషయాన్ని విన్నానన్నారు. దేవస్థానానికి పూర్వీకులు ఇచ్చిన ఆస్థిని కాపాడాలన్నారు. దేవుడి కోసం మనం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. దేవుడి ద్వారా సమాజం బాగుపడుతుందని, సామాజిక వ్యక్తుల్లో నైతిక బలం పెరుగుతుందనే ఉద్దేశంతో ఆరోజు వేలాది ఎకరాలు మన పూర్వీకులు దేవుడికి ఇచ్చారని తెలిపారు. నిజంగా జనాలపై ప్రేమ పొంగిపొర్లుతుంటే దేవుడి భూమి ఒక్క ఇంచు కూడా ముట్టుకో కుండా ప్రభుత్వ భూమి అంతా దానం చేయాలని సూచించారు. ఆలయ వ్యవస్థలను, భూము లను కాపాడాల్సిన భాధ్యత ధర్మకర్తలు, ఈవోలపై ఉంటుంద న్నారు. కార్యక్రమంలో పాల్గొన్న దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతి రాజు, ఈవో కె.రామచంద్ర మోహన్‌లను చూపిస్తూ ఆవిధంగా చేయాలని సూచించారు. ఆలయ వ్యవస్థని కాపాడుకోవాలి ఆలయ వ్యవస్థని జాగ్రత్తగా పెట్టుకుంటే సమాజంలో ఉన్న ప్రతీ వ్యక్తికి శ్రేయస్సు కలుగుతుందన్నారు. భగవంతుడు మేఘం వంటివాడని, మేఘానికి పక్షపాతం ఉండదన్నారు. సింహాచలం దేవస్థానం ప్రస్తుత కాలంలో చాలా గొప్ప ఆలయమన్నారు. ప్రతీ ఆలయంలో ఒక నిత్యాగ్నిహోత్రం ఉండేదని, ఆలయం ప్రారంభం నుంచి అగ్నిహోత్రం సాగుతుంటుందన్నారు. ఇప్పుడు చాలాచోట్ల ఆ వ్యవస్థ లేదని నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఒక్క సింహాచలం దేవస్థానంలో ఆ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగడం ఎంతో గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అహోబిల రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ దేవస్థానంలో సుదర్శన నారసింహ మహా యజ్ఞం నిర్వహణ చాలా గొప్ప కార్యక్రమమని తెలిపారు. -
వైఎస్ జగన్‌కు చినజీయర్ ఆశీస్సులు
శంషాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలోని జీవా కేంద్రంలో చినజీయర్ స్వామిని ఆయన కలిశారు. ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్.. అక్కడి నుంచి నేరుగా ముచ్చింతల్ వచ్చారు. అరగంటకు పైగా అక్కడ గడిపారు. విద్యా ప్రమాణాల పెంపు, విలువల ఆధారిత బోధనకు జీవా తీసుకుంటున్న చర్యలను స్వామీజీ జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా జగన్ పాదయాత్రపై కాసేపు చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ అధినేత వెంట ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి, నార్నే శ్రీనివాస్‌రావు ఉన్నారు. వీరందరికీ చినజీయర్‌స్వామి మంగళశాసనాలు అందజేశారు. -
దైవంపై నమ్మకముంటే గౌరవించాలి : చిన్న జీయర్ స్వామి
సాక్షి, హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పులు శాస్త్రాలకు విరుద్దంగా ఉండటం సరైనది కాదని చిన్న జీయర్ స్వామి అన్నారు. శబరిమల ఆలయంపై జరుగుతున్న రాద్దాంతంపై ఆదివారం ఆయన స్పందించారు. ప్రతీ ఆలయానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని ఉల్లంఘించడం మంచిది కాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగం పరిధిలోనే వ్యవహరించాలని, రాజ్యాంగం శాస్త్రాలకు కల్పించిన హక్కులపై ఇతరులు కల్పించుకోవడం సరికాదన్నారు. కేవలం అయ్యప్ప ఆలయంపైనే ఎందుకు ఇంత చర్చ చేస్తున్నారని, మసీదుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. నిజంగా దైవంపై నమ్మకం ఉంటే వాటిని గౌరవించాలని.. లేకపోతే వాటికి దూరంగా వదిలేయాలని హితవు పలికారు. కొంతమంది రాజకీయ జోక్యం చేసుకుని కేవలం ఆలయాల మీదనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. సమాజానికి ప్రమాదం లేకుండా ఎవరి స్వేచ్చను వారు పొందే హక్కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. -
చినజీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్..!
-
ఆనవాయితీ: చినజీయర్ ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్
-
ఆనవాయితీ: చినజీయర్ ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిని కలిశారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ సమీపంలో ఉన్న చినజీవయర్ స్వామి ఆశ్రమంలో జరిగిన హోమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హోమం అనంతరం చినజీయర్ స్వామి ఆశీస్సులను తీసుకున్నారు. కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఉన్నారు. ఎన్నికలకు ముందు చినజీయర్ స్వామి ఆశీస్సులు కేసీఆర్ తీసుకోవడం ఆనవాయితీ. తాజాగా ముందస్తు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసీఆర్ చినజీయర్ ఆశ్రమాన్ని సందర్శించి.. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. -
రామయ్యకు పట్టాభిషేకం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం కనుల పండువగా జరిగింది. రామాలయం సమీపంలోని మిథిలా స్టేడియంలో గల శిల్ప కళాశోభితమైన కల్యాణ మండపంలో మంగళవారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ఈ వేడుక చూసిన భక్తులు పులకించిపోయారు. రామాలయ ప్రాంగణంలోని యాగశాలలో ఉదయం చుతాస్థానార్చన హోమం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారిని సుందరంగా అలంకరించిన పల్లకీలో ఆలయం నుంచి గిరి ప్రదక్షిణగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. స్వామి, అమ్మవార్లను కల్యాణ మండపంపై వేంచేయింపజేసి, ముందుగా విష్వక్సేన పూజ చేశారు. అనంతరం శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో పట్టాభిషేక మహోత్సవ క్రతువును నిర్వహించారు. వేడుకలో వినియోగించే ద్రవ్యాలకు దేవస్థానం అర్చకులు పుణ్యాహవచనం గావించారు. ఆ తర్వాత కలశాలలో పోసిన చతుస్సముద్రాలు, పంచ నదుల తీర్థ జలాలకు ప్రోక్షణ చేసి భక్తులతో పాటు ప్రాంగణంలోని నలు దిక్కులా చల్లారు. అభిషేకానికి వీలుగా కలశ స్థాపన చేశారు. రామదాసు కాలం నాటి ఆభరణాలైన బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, క్షత్రం సమర్పించి, కిరీట ధారణ చేశారు. తర్వాత ప్రధాన కలశంతో ప్రోక్షణ చేసి రామయ్యను పట్టాభిషిక్తుడిని చేశారు. భద్రాచలంలో జరిగే ఈ వేడుక విశిష్టతను వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు భక్తులకు వివరించారు. రాముడన్నా.. నారాయణుడన్నా ఒక్కరే పూజల వివాదంపై చినజీయర్ స్వామి శ్రీరాముడి పాలనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు భద్రాచలంలో నిర్వహించే పూజలపై కొంతమంది వివాదం చేయటం తగదని చినజీయర్ స్వామి అన్నారు. మంగళవారం భద్రాచలంలో శ్రీసీతారాముల వారికి నిర్వహించిన పట్టాభిషేక వేడుకలో పాల్గొన్న ఆయన.. భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. శ్రీరాముడు లోకకల్యాణం కోసం చేసిన త్యాగం గురించి వర్ణించారు. రాముడన్నా.. నారాయణుడన్నా ఒక్కరేనని, అనాదిగా వస్తున్న నియమాలను అనుసరించటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. భద్రాచలంలో కొంతమంది ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేయటం తగదన్నారు. ఏ నియమాన్ని ఏర్పరుచుకున్నామో, దాన్నే అనుసరించాలని, ఈ విషయంలో గందరగోళం సృష్టించవద్దని సూచించారు. ఇలాంటి నియమాల ప్రకారమే భద్రాచలంలో పూజలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. నియమాల పరిరక్షణకు భక్తరామదాసు వారసులమై స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. ఇదే విషయాన్ని భక్తులందరితోనూ చెప్పించారు. ఆలయ వ్యవస్థకు మూలమైన రామానుజుల వారు కూడా ఇదే చెప్పారని జీయర్ గుర్తు చేశారు. శ్రీరాముడి పాలన నేటి తరాలకు ఆదర్శం కావాలని ఆయన చెప్పారు. రాముడు అవతరించిన విళంబి నామ సంవత్సరంలో ఈ ఏడాది పట్టాభిషేకం నిర్వహించడం ఎంతో విశేషమన్నారు. -
సహస్ర కాంతుల దీపం
ధర్మం నాలుగు పాదాల మీద నడవాలి. పాదాల మీద కంటే ముందు.. మనసులో నడవాలి. మాటలో నడవాలి. చూపులో నడవాలి. చర్యలో నడవాలి. మానవ జీవన సూత్రం.. సమతాధర్మం. ఆ సమతకు దారి దీపమే చినజీయర్ స్వామీజీ. దీపం సహస్ర కాంతులను విరజిమ్ముతుంది. సహస్ర కాంతులతో వెలుగుతున్న పరంపర దీపం.. స్వామీజీ. దీపావళి నాడే ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన సంభాషణం. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి తేదీకి భారతీయ సంప్రదాయంలో సమానమైంది నక్షత్రం. ప్రతినెలలో రెండు పక్షాలు ఉంటాయి. తిథి రెండుసార్లు వస్తుంది. కాని నక్షత్రం నెలలో ఒక్కరోజే ఉంటుంది. ప్రతినెలా 27 నక్షత్రాలు తేదీలతో సమానం. పుట్టినతేదీ ఆంగ్ల సంప్రదాయం అయితే పుట్టిన స్వాతి నక్షత్రం ఉన్న రోజున జన్మదినోత్సవం చేసుకుంటారు. పెద్దల పుట్టినరోజును తిరునక్షత్రం అంటారు. అక్టోబర్ 19, 2017న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి 61వ తిరునక్షత్రం. ఈ స్వాతిముత్యం దీపావళినాడు మెరిసింది. శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించడం వల్ల ఆతని నరకబాధలనుంచి విముక్తమైన లోకులు దీపాలు వెలిగించి పండుగ చేసుకోవడమే దీపావళి. మరో అంతరార్థం ఉందని జీయర్ స్వామి వివరించారు. నర–క అంటే నరులలో హీన లక్షణం. దానికి ప్రతీక చీకటి. ఆత్మకు, జ్ఞానానికి దీపమే ప్రతీక. మనలోని హీనలక్షణాల చీకట్లను ఆత్మజ్ఞాన దీపావళుల వెలుగులతో అంతరింపజేయడమే నిజమైన నరకాంతక దీపావళి. ఆచరించి చెప్పేవాడు, చెప్పిందే ఆచరించే వాడే ఆచార్యుడు కనుక ఆచార్యనామాన్ని సార్థకం చేస్తున్న రామానుజాభి మతాచార్యుడు, మొదటి రామానుజ జీయర్ స్వామిని పెద్ద జీయర్ అంటూ శాశ్వతంగా చిన్న జీయర్ నామాన్ని ధరించిన నిరాడంబరుడు శ్రీమన్నారాయణ రామానుజాచార్యుడు. టీవీ మాధ్యమాలకు భక్తి ఠీవిని నిలిపిన తొలితరం టీవీ ప్రవచనకర్త, పరిచయం అవసరం లేని ప్రవక్త. భవబంధాలనుంచి ముక్తి కల్పించేది భక్తి అన్న రామానుజ సిద్ధాంతాన్ని మనసా వచసా కర్మణా పాటిస్తున్న బుద్ధి, త్రికరణశుద్ధి ఆయనది. 61 సంవత్సరాల జీవితం అంతా ఇదే జీయర్ జీవనం. దేశదేశాలలో దివ్యోపదేశాలు చేస్తూ ప్రపంచానికి ‘ఈదేశం సందేశం’ అని చెప్పుకోతగ్గ భారతీయుడు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలుగా సాకారమైన ఆయన ఆలోచనలివిగో... Equityఅంటే సమత, న్యాయమైన సమానత అని అర్థం. దాన్ని సాధించడానికి మీ ప్రాజెక్టు ఉపయోగపడుతుందా? స్వామి: ఉపయోగపడాలనే ఉద్దేశ్యం. సమానత అంటే సరిపోదు, న్యాయమైన సమానత కదా కావలసింది. ఆర్థిక న్యాయం లేని సమానత లేదు. సామాజిక న్యాయం కూడా లేదు. ఆర్థికంగా సమానత రావాలంటే అవకాశాలు సమానంగా చేతికి అందాలి. కొందరు తక్కువ కష్టంతో ఎక్కువ సుఖపడే పద్ధతులు, మరికొందరు ఎంత కష్టపడ్డా కొంతైనా సుఖం దొరకని పరిస్థితులు తప్పు. ఇదే అసమానత అంటే. ఎంత కష్టపడితే అంత సుఖపడే అవకాశం ఉండాలి. కష్టపడదలచుకున్న వారికి పనిచేసే అవకాశం రావాలి. అప్పుడే ఆర్థిక న్యాయం వస్తుంది. ప్రపంచంలో సమాన హక్కులకోసం పోరాడిన వారు ఎందరో ఉన్నారు. వారందరి జీవిత చిత్రాలను సేకరించి సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఒక హాల్ లో ఏర్పాటు చేస్తున్నాం. నెల్సన్ మండేలా, అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్ వంటి అనేక మంది హక్కుల పోరాట వీరులు దేశదేశాల వారు మొత్తం 160 మంది విగ్రహాలు ఈ హాల్లో కొలువు దీరుతాయి. వారు ఏం చేశారో వారి వల్ల సమాజానికి ఏ మేలు జరిగిందో సంక్షిప్తంగా తెలియజేస్తాం. ఎవ్వరి జీవితమైనా రాబోయే తరాలకు స్ఫూర్తి కలిగిస్తే లక్ష్యం వైపు అడుగులు పడినట్టే. ప్రతి వ్యక్తిలో అంతర్గతమైన శక్తి ఉంటుంది. అయితే, దాన్ని వెలికితీసే అవకాశాలే అందరికీ దొరకవు. భగవంతుడి సృష్టిలో అందరికీ సమానంగా బతికే అధికారం ఉంది. శక్తికి జ్ఞానానికి ఆసక్తికి తగినట్టు బతికే సామర్థ్యం మనిషికి ఉంది. ఆ శక్తిని, జ్ఞానాన్ని సంపాదించే అవకాశాలు కూడా సమానంగా ఉండాలి. ప్రతివ్యక్తి బుద్ధిని వికసింపచేసే అవకాశాలలో అధికారాలలో కొరత ఉండకూడదు. మన సంవిధానం ఆర్టికల్స్ 14, 15, 16 లో ప్రభుత్వ, బహిరంగ సహజ వనరులు, ఉద్యోగ విద్యావకాశాలు అందుకునే అవకాశాలు అందరికీ ఉండాలని నిర్దేశిస్తున్నాయి. అవి ప్రాథమిక హక్కులు కదా..? అవును. చదువుకోగలిగితే ఎవరైనా శాస్త్రజ్ఞులు కావచ్చు, అందరూ చదువుకోవచ్చుననే వీలుండే వ్యవస్థ ఉండాలి. నోబుల్ బహుమతి పొందగలిగే సత్తా అందరికీ ఉన్నా అవకాశా లున్న వారికే బహుమతి వస్తుంది. నోబుల్ రానివాడు అనర్హుడు అని కాదు. అవకాశాలు రాక పైకి రాలేకపోయిన వారెందరో ఉంటారు. వనరులు, సంపదలు చేరువలో ఉంటే, చేయగలిగిన వాడు, చేతనైన వాడు, చేవ ఉన్నవాడు అందుకుంటాడు.దానికి ఉదాహరణ. ఆదిలాబాద్‌లో బెల్లంపల్లి గ్రామంలో ఆదిమజాతుల కోసం మేం ఏర్పాటు చేసిన ఒక పాఠశాల. ఆదిమజాతి విద్యార్థి ఇక్కడ వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుని 97 శాతం మార్కులు సంపాదించి బాగు పడుతున్నాడు. సునామీలు, భూకంపాలు మనం పుడమితల్లికి చేస్తున్న తీవ్రగాయాలని మీరు ఒక చోట పేర్కొన్నారు..? అవును. అక్షరాలా అవి తీవ్రగాయాలే. ప్రాణికోటి హద్దు మీరి నీటిని వాడుకోవడం వల్ల ఈ ప్రమాదాలు వస్తాయి. సముద్రాలను కూడా కలవరపెట్టి కలుషితం చేసి ఇటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం. మన వ్యవసాయం పూర్తిగా పర్యావరణ ధ్వంసకరంగా మారింది. భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా మీరు తలపెట్టిన బృహత్ కార్యక్రమం ఎప్పటికి ఒకరూపు దిద్దుకుంటుంది? ఈ మహత్కార్యం రెండు దశలలో సాగుతుంది. మొదటి దశ ఏప్రిల్ 2018లో రామానుజ విగ్రహావిష్కరణ తో పూర్తవుతుంది. కూర్చున్న భంగిమలో ప్రపంచంలోకెల్లా ఎత్తయిన లోహ రామానుజ విగ్రహ ప్రారంభంతోపాటు ఆ యతిరాజ జీవిత చరిత్రను వివరించే అంశాలను కూడా ప్రదర్శన రూపంలో ఆవిష్కరించబోతున్నాం. రెండో దశ మరింత ముఖ్యమైంది. రామానుజుని సమతా సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఆ దశలో ప్రయత్నాలు జరుగుతాయి. 108 శ్రీమన్నారాయణ దివ్యదేశాలకు ప్రతీకల నిర్మాణాన్ని చేపడతాం. ఇది మూడు సంవత్సరాల కాలంలో పూర్తవుతుందని అంచనా. అందుకు ఆయన రచనలను ప్రజానీకానికి అందుబాటులోకి తేవలసి ఉంది. గ్రంథాల రచన, సేకరణ, పుస్తక ప్రచురణ, అనువాద రచనల ప్రచురణ ఆ తరువాత డిజిటల్ గ్రం«థాలయాలను అంతర్జాలంలో అందించడం కూడా ముఖ్యంగా భావిస్తున్నాం. ఇదంతా రెండోదశలో ఉన్న ముఖ్యమైన భాగాలే. రామానుజుని జీవనగా«థ గురించి తమిళంలో వివరమైన ప్రచురణలు కొన్ని ఉన్నాయి. గురుపరంపర ప్రభావం పేరుతో ఒక తమిళ గ్రంథంలో రామానుజ జీవనం విస్తారంగా రచించారు. ఈ గ్రంథాన్ని తెలుగులో తీసుకురావడం అవసరం. అదేవిధంగా నవల రూపంలో రామానుజుని కథా సంఘటనలను కవిరత్న గుదిమెళ్ల హృదయ రంజకంగా రచించారు. అయితే, అవి అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని అదే ధోరణిలో పరిష్కరించే ప్రయత్నాలు అవసరమే. భక్తినివేదన ధారావాహికలో రామానుజ జీవనగాథ చాలావరకు వస్తుంది. ఇంకా శేషభాగం గురించి అవకాశాలు పరిశీలించాలి. ప్రపన్నామృతం పేరుతో మరొక గ్రంథం ఉంది. దానిని తెలుగులోని అనువదించాల్సి ఉంది. టీకే చూడామణి భగవద్రామానుజ చరిత్ర పేరుతో రచించిన తెలుగు పుస్తకాన్ని జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రచురించింది. విద్యాకార్యక్రమాల విస్తరణలో మీరు గురుకులం పేర కొన్ని సంస్థలు ప్రారంభించారు కదా, వాటిని వ్యవస్థీకరించి విస్తరించే ప్రణాళికలేమయినా ఉన్నాయా? పిల్లలే మన భవిష్యత్తు. వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం మనతరం బాధ్యత. కనుక ఉన్న వసతులతో ఆదర్శప్రాయంగా ఉన్నత ప్రమాణాలతో మూడు గురుకుల విద్యాలయాలను ప్రారంభించాం. అల్పాదాయ వర్గాల పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తున్నాం. వారు అక్కడే నివసిస్తారు. ఉచితంగా నివాసం, భోజనం, విద్యాబోధన, పుస్తకాలు, ఇతర సామగ్రి ఇస్తున్నాం. కాని ప్రతి గ్రామంలో ఆ విధంగా ఒక్కొక్క గురుకులం నెలకొల్పాలంటే పెద్ద ఎత్తున ఆర్థిక అండదండలు అవసర మవుతాయి. నిరంతరం చేయాలంటే దానికి భారీ ఎత్తున వనరులను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఒక్క సంస్థకు అన్ని వనరులు ఉండడం కష్టం కదా. అలాగే వైద్యరంగంలో కూడా సేవలు అవసరం. చికిత్సా కేంద్రాలు, హాస్పిటల్స్ నిర్మించడం కూడా భారీ వనరులుంటేనే సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఒక పెద్ద హాస్పిటల్‌ను, వైద్యకళాశాలను నిర్వహిస్తు న్నాం. ఇతర ప్రైవేట్ హాస్పిటళ్ల ఫీజులు, ఖర్చులతో పోలిస్తే 20 శాతానికే నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాం. చాలా గ్రామాల్లో పాఠశాల, హాస్పిటల్ లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలకు విద్య, వైద్యం అందడం లేదు. టిటిడి వంటి సంస్థలు ఈ సేవలు అందించడం మంచి పనులే కదా? ఎందుకు చేయరు? నిజమే. టిటిడిగానీ బాగా ఆదాయం ఉన్న ఇతర దేవాలయ సంస్థలు గానీ ఆ డబ్బును గ్రామాల్లో విద్య, వైద్య రంగాలకు వెచ్చించడానికి వారి నియమ నిబంధనలు, చట్టాలు, విధానాలు అంగీకరించాలి కదా. ప్రజలకు ఇవి అవసరం అని వారు భావించాలి. ప్రజల నుంచి అందుకు డిమాండ్ రావాలి. ఆ డిమాండ్ ను వారు అంగీకరించి సేవలు అందించడానికి పాలసీ రూపొందించిన తరువాత ఆ నిర్ణయం తీసుకుంటే పాలకులు, పాలకమండళ్లు కూడా జనామోదమైన విధానంగా భావించి అమలు చేసే వీలుంటుంది. భక్తి మార్గమైనా, సంస్కృతి రక్షణైనా జ్ఞానమార్గం ద్వారానే సాధ్యమంటారు కదా... అవును, జ్ఞానమే ప్రగతికి మార్గం. జ్ఞానం లేక మరేదీ సాధ్యం కాదు. మీరు పర్యావరణ పరిరక్షణ పట్ల కూడా దృష్టి పెట్టినట్టుంది కదా.. ఆ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, సూచ్యప్రాయంగా ఒకటి రెండు చోట్ల చేయడం కన్న వాటిని వ్యవస్థీకరించి విస్తరించడం అవసరం కదా. మానవసేవే మాధవ సేవ అనే నినాదం మనందరికీ తెలుసు. ఈ నినాదాన్ని కొంత సంస్కరించి కొత్త రూపు ఇచ్చాం. ‘మాధవసేవగా సర్వ ప్రాణి సేవ’ "Serve All Beings as Service to God' అనేదే ఆ కొత్త నినాదం. మనిషి ప్రకృతిమీద ఆధారపడి బతుకుతూనే ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. పర్యావరణంలో ఈ ప్రకృతిలో ప్రతిదీ ఇతర ప్రాణికోటికి సాయపడుతూనే ఉంటుంది. ఉపకారం చేస్తూనే ఉంటుంది. ఈ భూమిమీద నీటిని, చెట్లను, ఇతర జంతుజాలాన్ని పరిరక్షించుకోకుండా ప్రకృతి రక్షణ ఏముంటుంది? జీవా ఆశ్రమంలో ఇటీవల మూడు వేలమంది రైతులకు సహజసేద్యంలో శిక్షణ ఇచ్చాం. 9 రోజులపాటు జరిగిన శిక్షణ సమావేశంలో సుభాష్ పాలేకర్ వంటి సామాజిక సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. వారు తమ ప్రసంగాలతో శిక్షణార్థులకు స్ఫూర్తి నిచ్చారు. ఈ విధంగా నేర్చుకున్న వారంతా ఈ విద్యను వ్యాపింపచేస్తారు. ఇటువంటి మోడల్ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది. రాబోయే కాలంలో ఇంకా విశేష కార్యక్రమాలను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయా? (నవ్వుతూ) ప్రభుత్వాలకు పంచవర్ష ప్రణాళికలు... ఆ తరువాత ప్రణాళికలు ఉంటాయి. మాకు ఎందుకు చెప్పండి? ముఖ్యంగా మాముందు ఇప్పుడున్న రామానుజ కార్యక్రమమే మాకు అన్నింటికన్నా బృహత్తరమైంది. శ్రీధర్: మీరు రామానుజుడిని సమతా సిద్ధాంత కర్త అన్నారు. రామానుజ సహస్రాబ్ది సందర్భంగా ఆ యతిరాజు విగ్రహాన్ని స్థాపిస్తూ ్ట్చ్టu్ఛ ౌజ ఉ్ఞu్చ జ్టీy (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) అన్నారు. ఎందుకని ? స్వామి: వేయేళ్ల కిందటే అందరూ సమానమని రామానుజుడు సందేశాన్నిచ్చారు. గోపురం ఎక్కి తిరుమంత్రార్థాన్ని అందరికీ అడగకుండానే ప్రసాదించిన ఆచార్యుడు రామానుజుడు. ఆయన ఆదర్శమూర్తిత్వం నుంచి ఒక స్ఫురణ పొందేందుకే ఆయన 216 అడుగుల లోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నాం. ఆయన జీవిత సంఘటనలు ప్రేరణ కలిగించేవి. ఆయన ఆదర్శాలు అనుకరించి సమాజానికి మంచి చేయడానికి ఉపయోగపడేవి. వారి సందేశాన్ని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేయడం మా లక్ష్యం. ఆ యుగంలో ఆనాటి అలవాట్ల మధ్య, సంప్రదాయాల మధ్య అందరికీ జ్ఞానం సమానంగా అందాలన్నారు. విద్యార్జన, విజ్ఞానార్జన అవకాశాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని అందరూ బాగుపడతారా లేదా అనేది తదుపరి అంశం. అందుబాటులోకి తేవడం మన పని. అందుకున్నవాడు బాగుపడతాడు. అవకాశాలే కల్పించకపోవడం అన్యాయం. అదే రామానుజుని సమత. సమానత. అందుకే రామానుజ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ అని అందుకే అన్నాం. సమానత రామానుజుని ధ్యేయం, మన సంవిధానపు సమానతే రామానుజుని సమత. కాని బ్రిటిష్ పాలన, ఇతరుల పాలనల ప్రభావం వల్ల ఆ సమానతా భావాలు మరుగున పడ్డాయి. మళ్లీ ఆ భావాలను జాగృతం చేయడం, ఇప్పటి తరాలకు ఆనాటి ఆయన సమతావాదాన్ని గుర్తుచేయడం, రాబోయే తరాలకు సమసమాజాన్ని రూపకల్పన చేసే అవకాశం అందించాలన్న సమతా మూర్తి స్ఫూర్తికేంద్రం అనే పేరును కూడా అందుకే ఖాయం చేసాం. జీయర్ గురుకులాలు, జీయర్ గురుకుల పాఠశాలలు కటారివారిపాలెం, అల్లంపల్లి, బీర్సాయిపేటలలో ఉన్నాయి. హింసామార్గంలోకి వెళ్లిపోయే అవకాశం ఉన్న పిల్లలను చదువు వైపు మళ్లించే బడులు ఇవి. మరుగుదొడ్లు అంటే ఏమిటో తెలియని పిల్లలు... ఇప్పుడు బడిలో పిల్లలు మరుగుదొడ్లను వాడుతున్నారు. శాశ్వతమైన కట్టడాలలో నివసిస్తున్నారు. ఆ పిల్లలకు సమగ్ర స్థాయి పోషకాహారం అందుతోంది. మంచి ఆలోచనలు అలవాట్లు నేర్చుకుంటున్నారు. సమాజం నుంచి తీసుకోవడమేనా. తిరిగి ఇవ్వడం కూడా ముఖ్యమే అని తెలుసుకుంటున్నారు. ఈ విద్యాకేంద్రాల్లోని శాస్త్ర ప్రయోగ శాలలు, కంప్యూటర్ లాబొరేటరీలు పిల్లలను రేపటి డిజిటల్ ప్రపంచానికి సంసిద్ధం చేస్తున్నాయి. వారు అక్కడ టీవీల్లో డిస్కవరీ, జియోగ్రాఫిక్ చానెల్స్ చూస్తారు. ఆటపాటల సంస్కృతి నేర్చుకుంటున్నారు. నాగరిక భాషల్లో మాట్లాడుకుంటున్నారు. మంచి హాస్టళ్లు, పరిశుద్ధమైన తాగునీరు ఇవన్నీ గిరిజన బాలబాలికలకు అందుబాటులో ఉన్నాయి. ఈ పిల్లలకు 2016 కరాటే పోటీల్లో మొదటి, రెండో బహుమతులు రావడం విశేషం. హైదరాబాద్‌లోని నేత్ర విద్యాలయ కాంపస్‌లో ఆర్థికంగా వెనుకబడి నేత్రపరంగా దివ్యాంగులైన వారికి ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ విద్యాబోధన కళాశాలను నిర్వహిస్తున్నారు. వారు బిఎ, బికాం చదువుకోవచ్చు. ఇంటర్వ్యూ: ఆచార్య మాడభూషి శ్రీధర్ -
చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు పొందిన వైఎస్ జగన్
-
చిన్నజీయర్ ఆశీస్సులు పొందిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామిని కలిశారు. ఏపీలో పాదయాత్ర చేపట్టబోతున్న నేపథ్యంలో స్వామి ఆశీస్సులను ఆయన తీసుకున్నారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్ స్వయంగా ట్వీటర్లో ట్వీట్ చేశారు. చిన జీయర్‌స్వామిని ఇవాళ (మంగళవారం) కలిశానని, ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ముందుగా ఆయన ఆశీస్సులు తీసుకున్నానని జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చిన జీయర్ స్వామితో సమావేశమైన ఫొటోలను ట్వీటర్లో పొందుపరిచారు. -
సమసమాజమే రామానుజుల లక్ష్యం
- అందుకోసం వెయ్యేళ్ల క్రితమే జీవితాంతం కృషి - కొనియాడిన త్రిదండి చినజీయర్ స్వామి సాక్షి, న్యూఢిల్లీ: అసమానతల్లేని సమాజమే లక్ష్యంగా వెయ్యేళ్ల క్రితమే శ్రీ రామానుజా చార్యులు జీవితాంతం కృషి చేశారని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి కొనియాడారు. రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని తన ఆశ్రమమైన ‘జీవ’లో ప్రతిష్టించనున్న 216 అడుగుల రామానుజుల పంచలోహ విగ్రహ (సమతా విగ్రహం) ఏర్పాట్ల వివరా లను చినజీయర్‌స్వామి శనివారం ఢిల్లీలో విలే కరులకు వెల్లడించారు. సుమారు రూ. 1,000 కోట్ల వ్యయంతో వంద ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టించనున్న రామానుజుల విగ్రహ ఏర్పా ట్లు నవంబర్ నాటికి పూర్తవుతాయన్నారు. సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా వచ్చే ఏడాది మార్చి 25 నుంచి ఏప్రిల్ 21 వరకు 27 రోజుల పాటు ఆశ్రమంలో వివిధ కార్యక్రమాలు నిర్వ హిస్తున్నామన్నారు. ఈ సందర్భంగానే రామా నుజుల విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్లను మూడు దశల్లో చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరు కానున్నట్టు చెప్పారు. రామానుజాచార్యుల జీవితాన్ని వివరిస్తూ మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆడిటోరియం నిర్మిస్తున్నట్లు తెలిపారు. సమసమాజ స్థాపన తోపాటు సమస్త మానవాళికి వేదాల అవస రాన్ని చాటేందుకు రామానుజులు జీవితాం తం పాటుపడిన విధానాన్ని వర్చువల్ చిత్రాల ద్వారా నేటి తరానికి తెలియజేస్తామన్నారు. రామానుజుల జీవిత విశేషాలపై షార్ట్ ఫిలిం ఫెస్టివల్... రామానుజుల జీవిత ఇతివృత్తం, ఆయన అనుసరించిన ఆదర్శాల వల్ల సమాజంలో చోటుచేసుకున్న పరిణామాలను వివరించేలా అంతర్జాతీయ లఘు చిత్ర ఉత్సవాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు హైదరా బాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించనున్నట్లు చినజీయర్‌స్వామి తెలిపారు. ఇందులో ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి మొదటి బహు మతికి రూ. 10 లక్షలు, రెండో బహుమతికి రూ. 8 లక్షలు, మూడో బహుమతికి రూ. 6 లక్షలు ఇస్తామన్నారు. బహుమతుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 4న తమ ఆశ్రమంలో జరుగు తుందన్నారు. లఘు చిత్రాల చిత్రీకరణలో వైష్ణవ తెంకలి సంప్రదాయాన్ని పాటించాలని కోరారు. లఘు చిత్రాలను ఏ భాషలో అయినా చిత్రీకరించవచ్చని, అయితే అందులో ఆంగ్లం లో సబ్ టైటిల్స్ ఉండేలా చూడాలని, చిత్రం నిడివి 8 నిమిషాలకు మించకుండా ఉండాల న్నారు. సంబంధిత వివరాలు సేవ్‌టెంపుల్. ఓఆర్జీలో ఉంటాయన్నారు. సమావేశంలో మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, గజల్ శ్రీనివాస్, జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ బీవీఎన్ రావు పాల్గొన్నారు. ప్రధాని గుర్తించడం అభినందనీయం.. సమానత్వం కోసం రామాను జులు చేసిన కృషిని ప్రధాని మోదీ గుర్తించి ఆచరించడం అభినందనీ యమని చిన్నజీయర్‌స్వామి పేర్కొన్నా రు. మోక్షానికి సంబంధించిన గురు మంత్రాన్ని సర్వజనుల హితం కోసం రామానుజులు బహిర్గతం చేశారని మే 1న రామానుజుల తపాలాబిళ్ల ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని పేర్కొనడం సంతోషకరమన్నారు. దేశ స్వాతంత్య్రం అనంతరం రామానుజుల కృషిని గుర్తించిన ఏకైక ప్రధాని మోదీయేనన్నారు. -
14 ఏళ్ల తర్వాత శ్రీవారి దర్శనం
-
శ్రీచినజీయర్‌స్వామి ఆకాంక్ష
దశదిశలా శ్రీరాముడి వైభవం సాక్షి, కొత్తగూడెం: శ్రీరాముడి వైభవం దేశం నలుదిక్కులా వ్యాపించేలా భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించడం అభినందనీయమని త్రిదండి చిన జీయర్‌స్వామి అన్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి ఆధ్యాత్మికపరంగా చేపట్టాల్సిన నిర్మాణాలు, తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించడానికి బుధవారం వచ్చిన ఆయన, మంత్రి తుమ్మలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆలయాలకు ఇంతటి మహర్దశ కేసీఆర్ హయాంలోనే సాధ్యమైందన్నారు. యాదాద్రి తరహాలో భద్రాద్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆలయాభివృద్ధికి సూచనలు, సలహాలిస్తామని తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, జాయింట్ కలెక్టర్ రాంకిషన్, మై హోం అధినేత రామేశ్వరరావు, సీఎం కార్యదర్శి భూపాల్‌రెడ్డి, డీఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
కొత్త అధికార నివాసంలోకి సీఎం
సంప్రదాయబద్ధంగా గృహప్రవేశం దగ్గరుండి పర్యవేక్షించిన చినజీయర్ స్వామి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కొత్త అధికార నివాస గృహ ప్రవేశం గురువారం సంప్రదాయబద్ధంగా జరిగింది. తెల్లవారు జామున 5.22 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు బేగంపేటలోని నూతన గృహంలోకి ప్రవేశించారు. చినజీయర్ స్వామి సమక్షంలో శృంగేరీ వేద పండితుల మంత్రోఛ్చారణ మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కార్తీక మాసంలో గృహప్రవేశం చేస్తే మంచిదనే ఉద్దేశంతో కేసీఆర్ రోడ్లు భవనాల శాఖ అధికారులకు టార్గెట్ పెట్టి మరీ నిర్ణీత సమయంలో క్యాంపు కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. దీంతో గురువారం అనుకున్న ముహూర్తానికి గృహప్రవేశం జరిగింది. సంప్రదాయబద్ధంగా... శృంగేరీ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చినజీయర్ స్వామి కేసీఆర్ దంపతు లతో గృహప్రవేశాన్ని శాస్త్రోక్తంగా నిర్వ హించారు. దైవ ప్రవేశం, యతి ప్రవేశం, గో ప్రవేశం, నివసించే వారి ప్రవేశం తదితర ఘట్టాలన్నింటినీ జరిపించారు. అనంతరం వాస్తు హోమం, సుదర్శన హోమం నిర్వహించారు. ముఖ్యమైన కార్య క్రమాలకు దైవ బలం తోడుండాలని భా వించే కేసీఆర్... అన్ని ప్రధాన కార్యక్ర మాల వేళ హోమాలు నిర్వహించడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం సుదర్శన హోమం నిర్వహించారు. ఇక తాను విధులు నిర్వ హించేందుకు ఉపయోగించే ఆసనంలో ముందుగా చినజీయర్ స్వామిని కూర్చో బెట్టి.. ఆ తర్వాతే కేసీఆర్ కూర్చుని, పని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన గవర్నర్ దంపతులకు కేసీఆర్ దంపతులు ప్రధాన ద్వారం వద్ద నుంచే సాదరంగా స్వాగతం పలికారు. చివరగా సర్వమత ప్రార్థనలు కూడా నిర్వహించారు. ముఖ్య మంత్రి, గవర్నర్లను ఆయా మతపెద్దలు ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రు లు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ కవిత దంపతులు, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
షష్టి స్ఫూర్తి
త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ (చిన్న జీయర్ స్వామీజీ)తో ‘సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ భగవద్ రామానుజస్వామి... వారిది మిలీనియమ్ మార్చ్! దళితులను గుడిలోకి తీసుకువెళ్ళారు! అతి శక్తిమంతమైన ‘నారాయణ మంత్రం’ దాచుకోకుండా పంచిపెట్టారు! పెద్ద జీయర్‌స్వామి... వీరిది ఫ్రీడమ్ మార్చ్! తన భూమినంతా దానం చేసి, స్వరాజ్యం కోసం పోరాడారు... నిరతాగ్నిహోత్రంతో... దేశమంతటా... 108 ‘శ్రీరామక్రతువు’లు చేశారు. భక్తులతో ‘రామ’కోటి రాయించి, సమతా ‘స్తూపాల’ను ప్రతిష్ఠించారు. మహానుభావులు... ‘ధర్మం’ కోసం కృషి చేశారు. చిన్న జీయర్ స్వామి... వీరిది ప్రోగ్రెసివ్ మార్చ్! వేదానికి అధ్యయన జ్యోతి... అంధులకు అక్షర కాంతి... గిరిజనులకు విద్యాక్రాంతి. భగవద్ రామానుజ, పెద్ద జీయర్ స్వాముల పరంపరకు ‘జెండాపై కపిరాజు’. మనకు తెలిసిన స్వామి... మనలో ఒకడైన స్వామి... కళ్ళతో పలకరిస్తారు... చిరునవ్వుతో సాంత్వన కలిగిస్తారు. ఊరి పెరటిలో... తులసి మొక్క... సమాజంలోని సర్వరోగాలకూ నివారిణి! వీరికి 60 ఏళ్ళు... వీరి పరంపరకు వెయ్యేళ్ళు... వీరి స్ఫూర్తి... పదికాలాలు విరాజిల్లు!! - రామ్, ఎడిటర్, ఫీచర్స్ నమస్కారం స్వామీజీ! మీకు 60 వత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా తిరునక్షత్ర మహోత్సవం చేస్తామని భక్తులు ప్రతిపాదన తెచ్చినప్పుడు ఏమనిపించింది? (సాలోచనగా ఆగి... దేహం వంక చూపిస్తూ) 60 ఏళ్ళనేది ఈ శరీరానికి గడిచాయని అంటున్నారు. నిజానికి, సన్న్యాసికి శారీరకమైన జన్మ, వయస్సు ఉండవు. సన్న్యాసం స్వీకరించినప్పటి నుంచి మరుజన్మ కిందే లెక్క. అయితే, భక్తులు ప్రేమగా చేసుకుంటామని అన్నప్పుడు కాదనడానికి మనమెవరం! అయితే ఏదైనా ఘనకార్యం సాధిస్తే, అప్పుడు ఆ ఘనకార్యానికి ఉత్సవం చేసుకోవచ్చు. అలాంటివి ఏం చేశామని! గడచిన 36 ఏళ్ళ పైచిలుకు సన్న్యాసాశ్రమ ప్రస్థానంలో అంధులకు విద్యాలయాలు, వేద పాఠశాలలు, ఆసుపత్రులు, గిరిజన విద్యాలయాల లాంటివెన్నో ఏర్పాటు చేశారు కదా! (చిరు దరహాసంతో...) అవును. కానీ, సమాజానికి చేయాల్సినది ఇంకా ఎంతో ఉంది! విదేశాలకు వెళ్ళి, వేదధర్మాన్ని ప్రచారం చేసిన తొలి జీయర్ కూడా మీరే! విదేశాలకు వెళ్ళడమే తప్పు అనుకొనే సంప్రదాయంలో అంతటి సాహసం ఎలా చేశారు? విదేశాల్లో భారతీయ ధర్మ ప్రచారానికి వెళ్ళడం వెనుక ఒక దైవికమైన ఘటన ఉంది. 1992లో, 1993లో కూడా ధర్మప్రచారానికి నన్ను విదేశాలకు రమ్మని అడిగారు. కానీ, మేము రామని చెప్పాము. 1993లో ఒక సన్నివేశం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఏడాది దీపావళి వేడుక తరువాత అర్ధరాత్రి విజయవాడ దగ్గర సీతానగరంలోని మా ఆశ్రమం నుంచి మేము ఆరాధించే కోదండ రామస్వామి విగ్రహాలు చోరీ అయ్యాయి. మూడు రోజుల పాటు ఆశ్రమంలో నిద్రాహారాలు లేవు. ఆ రాత్రి అక్కడ బీట్‌లో ఉన్న కోటేశ్వరరావు అనే ఎస్.ఐ. ఇదంతా చూసి, ‘దేవుడి విగ్రహాలు దొరికే వరకు కట్టుకున్న దుస్తులు కూడా మార్చను’ అని దీక్ష పట్టారు. నాలుగో రోజున దొంగల్ని పట్టుకున్నారు. విగ్రహాలు సాధించారు. మాకు ఆ సమాచారమిచ్చారు. అయిదో రోజున విగ్రహాలు రావడంతో, వెయ్యి కలశాలతో మా స్వామికి అభిషేకం చేసి, ఆరాధించాం. అప్పటి నుంచి ప్రతి ఏటా దానికి గుర్తుగా మా ఆరాధ్యదైవమైన కోదండరామ స్వామికి ‘సహస్ర కలశాభిషేకం’ చేస్తున్నాం. ఇవాళ్టికీ కోటేశ్వరరావు గారు ఎక్కడున్నా, ఆ రోజున ఆ కార్యక్రమానికి వస్తారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నతాధికారి. ఆయన వచ్చాక, ఆయన చేతులకు తాకించి కానీ, ఆ అభిషేక కార్యక్రమం మొదలుపెట్టం. ఈ విగ్రహాల చోరీ వ్యవహారం జరిగాక, సాక్షాత్తూ స్వామే ఎలాగూ బయటకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు, మనమే స్వయంగా తీసుకొని ఎందుకు వెళ్ళకూడదని అనిపించింది. అది స్వామి ఆదేశంగా భావించి, అప్పటి నుంచి ధర్మప్రచారం కోసం విదేశాలకు వెళ్ళి వస్తున్నాం. సంపన్న అమెరికా నుంచి, వర్ధమాన భారతం దాకా ప్రపంచమంతా తిరిగారు కదా! అన్నిచోట్లా సమస్యలే! అన్నిచోట్లా అశాంతే! కారణం ఏమిటంటారు? ఇవాళ శాంతి లేకపోవడానికి ప్రధాన కారణాలు... ఒకటి- ఉగ్రవాదం, రెండు - ఆర్థిక అసమానతలు. రెండూ అశాంతికి దారి తీస్తున్నాయి. ఆర్థిక అసమానతలు తొలగించాలంటే, వ్యక్తుల్లో విద్యను పెంచాలి. దిగువ వర్గాల వారు కూడా ఉన్నత వర్గాల వారితో పోటీపడేలా, వారిలో నైపుణ్యం పెంచాలి. అవకాశాలు కల్పించాలి. ఇక, ఉగ్రవాదాన్ని తగ్గించడానికి శాసనాలు, ప్రేమతత్త్వం రెండే మార్గాలు. చాలాదేశాల్లో కఠిన శాసనాలున్నాయి. కానీ, మన దేశంలో ఉన్న శాసనాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని సరిదిద్దాలి. మరోపక్క వ్యక్తిలో తోటివారి పట్ల ప్రేమను పెంచాలి. మనమంతా సహోదరులమనే భావన కలిగించాలి. అలాంటి భావన ఇవ్వగలిగింది మన వైదిక వాఙ్మయం. ఇతర మతాల్లో, వారి గ్రంథాల్లో కూడా ఆ భావన ఉంది. కానీ వాటిని బోధించడంలో, ఆచరించడంలో వస్తున్న తప్పులు, తేడాల వల్ల కొన్నిసార్లు ఉపద్రవం సంభవిస్తోంది. కానీ, హిందూ ధర్మంలోనూ రకరకాల శాఖలు, రూపాలు ఉన్నాయిగా!? మన ‘భగవద్గీత’ మొదలైన గ్రంథాలేవీ, ‘దైవాన్ని ఇలానే నమ్మాలి, ఇలానే పూజించాలి’ అని కట్టడి చేయడం లేదు. పరస్పర విద్వేషం చెప్పడం లేదు. భగవద్గీతలోనే పరమాత్మ ‘యాన్తి దేవవ్రతో దేవాన్...’ అని చెప్పాడు. ‘నన్ను ఏ రూపంలో ఆరాధిస్తే, ఆ రూపంలో కనిపిస్తాను’ అన్నాడు. కాబట్టి ఎన్ని రూపాలు, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నా దేవుడు ఒక్కడే! ఎవడు ఏ విధానంలో ఆరాధన చేసినా, ఫలితం పొంది తీరతాడు. మతమార్పిడి తప్పు. అందుకే, మేము ‘స్వీయ ఆరాధన... సర్వ ఆదరణ’ అని మేము చెబుతాం. వివరంగా చెప్పాలంటే, ‘నీ మతాన్ని నువ్వు ఆరాధించు. నీది కానిదేదో దాన్ని గౌరవించు, ఆదరించు!’ మన భారతదేశానికి ఇదే జీవనాడి. మన రాజ్యాంగం కూడా మత స్వేచ్ఛనిచ్చింది కదా! మతస్వేచ్ఛ నిచ్చింది. పరస్పరం గౌరవాదరాలతో బతకాలనే చెప్పింది. కానీ, అమలుపరచడం దగ్గరకొచ్చే సరికే సమస్యలు. కొన్ని వేల ఏళ్ళుగా మన పక్కనే ఏ ఆలయం ఉన్నా, మసీదు ఉన్నా, చర్చి ఉన్నా, గౌరవించి, ఆదరించిన సంస్కృతి మనది. కానీ, ఇప్పుడు కొందరు తమ మతగ్రంథాల సారాన్ని తప్పుగా బోధించడం వల్ల ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. ఈ దేశపు రాజ్యాంగాన్ని గౌరవించం కానీ, ఈ పౌరసత్వం, ఇక్కడి హక్కులు అన్నీ కావాలంటే ఎలా? మనం ముందు భారతీయులం... ఆ తరువాతే ఏమైనా! ప్రపంచంలోని ఈ సమకాలీన విషయాలు మీకెలా తెలుస్తుంటాయి? ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది. అవి చూసే భక్తులున్నారు. చెబుతుంటారు. మీరు కూడా టెక్నాలజీనీ, ల్యాప్‌టాప్ లాంటివి బాగా వాడతారట? (నవ్వుతూ... తల పంకించారు...) సైన్సు, మతం పరస్పర భిన్నమైనవనే వాదన గురించి ఏమంటారు? నిరూపణ జరిగిన సిద్ధాంతాలన్నీ సైన్స్ అయితే, నిరూపణ కానివి ఫిలాసఫీ అని అని కదా ప్రసిద్ధి (నవ్వులు...). అయితే, సైన్స్‌కు అందని నిజాలు చాలానే ఉన్నాయి. సైన్స్‌లో డార్విన్ పరిణామ సిద్ధాంతం లాంటివి మీరు ఒప్పుకోరని విన్నాం! పరిణామం అనేది అనివార్యం. కానీ, (నవ్వుతూ...) వాళ్ళు చెప్పే పద్ధతిలో పరిణామ సిద్ధాంతాన్ని మేము అంగీకరించం. చూడండి. మనం గింజ వేస్తే దాని నుంచి ఆకులు, కొమ్మలు, పువ్వులు, పండ్లతో చెట్టు వస్తోంది. అది పరిణామం. కానీ, ఆ గింజలో లేని ఆకు, వేరు, పువ్వు, పండు రావడం లేదు కదా! ఆ గింజలోనే అవన్నీ సూక్ష్మరూపంలో ఉన్నాయి. పరిణామంలో అవి పైకి కనిపించాయి. అంతే! సూక్ష్మరూపంలో లేనిది స్థూలరూపంలోకి రాదు. మీరు ఒకప్పుడు దైవాన్ని కూడా ఒప్పుకొనేవారు కాదట! మరి, అటు నుంచి ఇటు వైపు ప్రయాణం... (నవ్వేస్తూ...) చిన్నప్పుడు అవకాశమున్న పుస్తకమల్లా చదివేవాళ్ళం. ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రపత్రిక’ లాంటి వాటిల్లో వచ్చే సీరియల్స్ కాగితాలు చించి, కుట్టుకొని, బైండ్ చేయించుకొని సేకరించిపెట్టేవాళ్ళం. అలా చాలా కథలు చదివాం. ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ లాంటి అనువాద సాహిత్యం చాలా చదివాం. అలా చదివిన సాహిత్యంతో లోలోపల అనేక ప్రశ్నలు వస్తుండేవి. వాటికి సమాధానాల కోసం అన్వేషిస్తుండేవాళ్ళం. అవన్నీ మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు వచ్చాక, తీరాయి. తెనాలి దగ్గర నడిగడ్డపాలెంలో గురువులు గోపాలాచార్యుల వద్ద మాకు వేదాంత గ్రంథాల బోధన జరిగింది. గోపాలాచార్యులు, మా పెద్ద స్వామి వారు సహాధ్యాయులు. కలసి వేదాంత ప్రచారం చేశారు. స్వామి వారు ఊరూరా తిరుగుతూ క్రతువులు చేస్తుంటే, గోపాలాచార్యుల వారు నడిగడ్డపాలెంలోని ఆశ్రమంలో ఉంటూ, అందరికీ వేదాంత శిక్షణనిచ్చేవారు. మేమూ అక్కడ కొన్నాళ్ళు ఉండి, అవి అధ్యయనం చేశాం. అలా పూర్తిగా ఇటువైపు వచ్చాం. స్వామీజీ! ఒకప్పుడు మీలో మార్క్సిస్టు భావాలుండేవనీ, ఆ పుస్తకాలు చదివేవారనీ... (మళ్ళీ నవ్వేస్తూ...) అవన్నీ ఒకప్పటి సంగతులు. ఇప్పటికీ సమాజసేవ, దిగువ వర్గాల అభ్యున్నతి లాంటి విషయాల్లో మీది వామపక్ష భావజాలమేనేమో... (నవ్వులు...) సమాజం మన శరీరం లాంటిది. ఇందులో ఏ అంగం ఎక్కువ, ఏది తక్కువ అంటే ఏం చెబుతాం! సమాజంలో అన్ని వర్గాలూ ఒకదానికొకటి సహకరించుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఒకరు, మరొకరిని అణచివేస్తానంటే ఎలా? అదే సమయంలో అందరూ పనిచేయాలి. చేసేవాడు చేస్తూ ఉంటే, తిని కూర్చొనేవాడు కూర్చుంటానంటే కుదరదు. పనిచేయడానికి బద్ధకించేవాణ్ణి పనిచేసేవాడిగా మార్చాలి. అందుకని ప్రతి ఒక్కరిలో నైపుణ్యం పెంపొందింపజేయాలి. ఉన్నత వర్గాలతో పోటీ పడేలా దిగువ వర్గాలకీ అవకాశం కల్పించాలి. వారిని తీర్చిదిద్దాలి. దీన్ని కేవలం వామపక్షం, వామభావజాలం అంటే ఎలా? నిజానికి, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కర్తవ్యం అంటాను. అయితే, అదే సమయంలో - నైపుణ్యం లేకపోయినా 20 మార్కులతో పాస్ అయిన వ్యక్తిని విమానానికి పైలట్‌గానో, అల్లోపతి డాక్టర్‌గానో పెడితే... వాట్ హ్యాపెన్స్ టు ది క్వాలిటీ ఆఫ్ దిస్ కంట్రీ? మొత్తం సమాజమే నష్టపోతుంది. అసమర్థుడైన వ్యక్తిని ఆపరేషన్‌కి డాక్టర్‌గా పంపిస్తే ఏమవుతుందో ఊహించుకోండి! అన్నట్లు... మీరు కూడా మంచి వైద్యులట! మంచి మందులిస్తారట! (నవ్వేస్తూ...) హోమియో వైద్యం నేర్చుకుంటున్నా. మందులు ఇస్తుంటా. మీ తాత గారు, తండ్రి గారిలా వైద్యవిద్య వంశపారంపర్యంగా వచ్చినట్లుందే! పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు. ఇక మాకు జన్మనిచ్చిన తండ్రి గారు ఆ రోజుల్లోనే చెన్నైలో చదువుకొన్న ఎల్.ఐ.ఎం (లెసైన్స్డ్ ఇండియన్ మెడిసిన్) డాక్టర్. ఇద్దరూ వైద్యంలో దిట్టలే! కానీ, ఇవాళ మనం డాలర్ల జబ్బును రూపాయలిచ్చి కొనుక్కుంటున్నాం. ప్రతిదీ ఖరీదై, అల్లోపతి వైద్యం సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో అది మాత్రమే పద్ధతి కాదు, ఇంకో పద్ధతి ఉందంటూ వచ్చిన హోమియోపతి మంచి ప్రత్యామ్నాయం. సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశ పరిస్థితికి శ్రమ, ఖర్చు తక్కువైన ఈ వైద్యవిధానం బాగా సరిపోతుంది. రోగి లక్షణాలు సరిగ్గా తెలుసుకొని ఔషధమిచ్చే మంచి వైద్యుడుంటే మందు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, దీన్ని కూడా వ్యాపారంగా మారుస్తున్నవారు లేకపోలేదు. అందుకనే, అందరికీ ఈ వైద్యం అందుబాటులోకి రావాలని ‘ఇంటిగ్రేటివ్ సిస్టమ్’లో మా శంషాబాద్ ఆశ్రమంలో ‘జిమ్స్’ హోమియో కాలేజ్, ఆసుపత్రి నడుపుతున్నాం. అంటే, ఇటు ప్రజల శారీరక ఆరోగ్యం, అటు ఆధ్యాత్మికతతో మానసిక ఆరోగ్యం రెండూ మీరు చూస్తున్నారన్న మాట! (నవ్వుతూ...) అంతే అనుకోవచ్చు! కానీ, సన్న్యాసంలో ఉంటూ సామాజిక సంస్కరణ, సముద్ధరణ చేయడమెలా వచ్చింది? వెయ్యేళ్ళ క్రితం రామానుజాచార్యులూ ఇదే చేశారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక నాయకులే కాదు. ఆ రోజుల్లోనే అందరి మోక్షం కోసం గోపురమెక్కి, ‘తిరుమంత్రం’ ఎలుగెత్తి చాటిన సామాజిక సంస్కర్త. ఆయన స్ఫూర్తితో వచ్చిన మా పెద్ద స్వామి వారైతే స్వాతంత్య్ర సమరయోధులు. దేశం కోసం పోరాడారు. ఆ రోజుల్లోనే ప్రజల బాగు కోసం గ్రామాలు పట్టుకు తిరిగారు. సొంత భూములు హరిజనులకిచ్చి, వారి ఉద్ధరణకు కృషి చేశారు. స్త్రీలు ఘోషాలో ఉండే ఆ రోజుల్లోనే భార్యకు రాట్నం మీద నూలు వడకడం నేర్పించి, ఆ నూలు దుస్తులు భుజాన వేసుకొని, ఊరూరా పంపిణీ చేసేవారు. దుర్భిక్ష సమయంలో పొలాల్లో తిరిగి, ఎకరానికి ఒక కట్ట చొప్పున గ్రాసం తీసుకొని, పశువులకు మేత పెట్టేవారు. సన్న్యాసాశ్రమం స్వీకరించాక కూడా ఆయన సామాజిక ఉద్ధరణ మార్గంలోనే వెళ్ళారు. మాది కూడా ఆ బాటే! ఇన్నేళ్ళ ఈ బాటలో... ఈ షష్ట్యబ్ది పూర్తివేళ మీరు స్మరించుకోవాల్సిన వ్యక్తులంటే..? (ఆసనంలో ఒక్కసారి వెనక్కి వాలి... దీర్ఘంగా శ్వాస విడుస్తూ...) చాలామంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లితండ్రులు, గురువులు, మా పెద్ద స్వామి వారు, మేము ఈ స్థితికి చేరడానికి కారణమైన వ్యక్తులు, ఈ ప్రయాణంలో పరిచయమైన వ్యక్తులు, తీర్చిదిద్దిన వ్యక్తులు, కలసి ప్రయాణించిన, ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. రాజమహేంద్రిలో స్కూలులో చదువుకుంటున్నప్పుడు ‘నారాయణా! నువ్వు తెలివిగలవాడివి. నీకు పాతికకి పాతిక మార్కులు వేస్తే, కొమ్ములొస్తాయిరా’ అంటూ, అంతా సరిగ్గా రాసినా లెక్కల్లో కూడా ఇరవై అయిదుకి ఇరవై నాలుగున్నర మార్కులే వేసిన మా మాస్టారిని స్మరించుకోవాలి. ‘ప్రపంచం గురించి చెప్పి, ఇలా ఉండాలి సుమా’ అని చెప్పిన మార్క్సిస్టు మిత్రులున్నారు. చిన్నప్పటి నుంచి మాలో ఒక క్రమశిక్షణ నేర్పిన రామచంద్ర అనే ఆర్.ఎస్.ఎస్. కుర్రాడు ఉన్నాడు. పొట్టకూటి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు జీవితమంటే ఎలా ఉంటుందో నాకు నేర్పిన అనుభవాలున్నాయి. ఇలా ఎందరో, ఎన్నెన్నో! ఆ పూర్వాశ్రమ జీవితంలో ఎదురైన అనుభవాల వివరాలు ఏమైనా...! అప్పట్లో మేము సికింద్రాబాద్‌లో క్యారవాన్ దగ్గర ఉండేవాళ్ళం. కోఠీ వైపు వెళ్ళాలి. పురానాపూల్, అఫ్జల్‌గంజ్, ఘోషామహల్ పక్క నుంచి వెళుతుండేవాళ్ళం. పైసా.. పైసాకి కష్టపడుతూ, కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళిన రోజులు గుర్తే! ఒకసారి కష్టపడి ఒక సైకిల్ కొనుక్కున్నాం. కానీ, కొన్న మూడో రోజునే దాన్ని ఎవరో పట్టుకుపోయారు. అదంతా జీవితంలో ఒక దశ. సామాన్య ప్రజల కష్టాలన్నీ స్వయంగా చూశాం, అనుభవించాం. మరి, ఆధ్యాత్మిక విద్యకు ముందు అప్పట్లో మీరు చదివిన లౌకికమైన చదువులు... ఆ రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ చదివాం. ఆ తర్వాత పై చదువుల కోసం ప్రయత్నించినా, ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వచ్చేది. పరీక్షలకు హాజరు కాలేకపోయాం. టైప్, షార్ట్‌హ్యాండ్‌ల్లో హయ్యర్ పాసయ్యాం. మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు చేరినప్పుడు ‘ఆలయాల జీర్ణోద్ధరణ కమిటీ’ తరఫున మేము అన్ని రకాల క్లరికల్ జాబ్స్ చేసేవాళ్ళం. లెక్కలు, స్టేట్మెంట్స్ తయారుచేసేవాళ్ళం. స్వామి వారి దగ్గరకు వచ్చాక అంతకు ముందు మాకున్న అనేక సందేహాలు తీరాయి. మళ్ళీ మా మనసు మారకుండా ఉండడం కోసం మా సర్టిఫికెట్లన్నీ మేమే చింపేశాం. మీరు అమెరికన్ యాసలో మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. రష్యన్ కూడా నేర్చుకున్నారట! (నవ్వుతూ...) పూర్వాశ్రమంలో హైదరాబాద్‌లోనే ‘సీఫెల్’ (ఇప్పటి ‘ఇఫ్లూ’)లో సరదా కోసం చదివాం. కానీ, ఆశ్రమజీవితంలోకి వచ్చినప్పుడు ఆ కఠోర దీక్ష, క్లిష్టమైన వేదాంత విద్య ఎలా అలవడ్డాయి? ఒక రకంగా నన్ను మా పెద్ద స్వామి వారి పాదాల దగ్గరకు చేర్చింది మా తల్లి గారే! ‘నీకు ఏది మంచిదో వారు నిర్ణయిస్తారు’ అన్న ఆమె మాట! భగవత్ కృప వల్ల చిన్నప్పటి నుంచి అనుకున్నది ఎలాగైనా పూర్తి చెయ్యాలనే మనస్తత్త్వం, పట్టుదల అలవడ్డాయి. అప్పట్లో ఒకసారి పెద్ద స్వామి వారి క్రతువు కోసం కొన్ని మూర్తులు అవసరమయ్యాయి. కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళి, అందించి వచ్చే పని నాకు అప్పగించారు. తీరా నేను బయల్దేరితే రైలు మిస్సయింది. బస్సు మిస్సయింది. కానీ, ఆయనకు అవి ఇచ్చే రావాలి తప్ప, ఇంటికి వెనక్కి రాకూడదనే పట్టుదల నాది. అప్పటికి ఈ తరం పిల్లల్లాంటి లోకజ్ఞానం కూడా లేని పల్లెటూరి బైతులం మేము. అయినా సరే, సామర్లకోట దాకా బండిలో, తరువాత మరో వాహనంలో, ఆ పైన నడక... ఇలా ఎట్టకేలకు తెల్లవారు జామున పెద్ద స్వామి వద్దకు చేరాం. అనుకున్న ముహూర్తానికి అన్నీ సక్రమంగా అందించగలిగాం. ఆ తరువాత ఈ ఆశ్రమజీవితంలోకి వస్తున్నప్పుడు కూడా వేద, వేదాంత విద్యల అధ్యయనంలోనూ అదే పట్టుదల. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో చుండూరు ఘటన, తిరుమలలో వెయ్యికాళ్ళ మండపం లాంటి కొన్ని సందర్భాల్లో మీ వ్యాఖ్యలపై వివాదాలు, విమర్శలు వచ్చినప్పుడు ఏమనిపించేది? అప్పట్లో చుండూరు ఘటనలో వాస్తవాన్ని వెలికితీసి చెప్పడానికే మాట్లాడాను. ఇతరులు చాలామంది, చివరకు మీడియా కూడా వెనుకంజ వేస్తుంటే, చుండూరులో జరిగింది కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణ కాదు... అది మతసంబంధమైన ఘర్షణ కూడా అని వాస్తవం చెప్పాం. అప్పట్లో ఒక ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ విలేఖరి వచ్చి, నాతో అన్నీ మాట్లాడారు. కానీ, పత్రికలో మాత్రం వాస్తవాన్ని కాస్తంత దాచిపెడుతూనే రాశారు. మీడియా కూడా ఉన్నది ఉన్నట్లు రాయడానికి ధైర్యం చేయలేదు. కానీ, మేము మాత్రం సత్యమే చెప్పాను. చివరకు తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపం విషయంలో కూడా! మేము ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. క్రమాన్నీ, ధర్మాన్నీ తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, మనం మాట్లాడకపోతే తప్పు అవుతుంది. మిగతావాళ్ళకు సాహసం లేదు. మేము విమర్శల్ని పట్టించుకోకుండా, వాస్తవం మాట్లాడాల్సిన కర్తవ్యం నిర్వర్తించాం. అంతే! సమాజోద్ధరణ ధ్యేయమైన మీ లాంటి కొందరిని మినహాయిస్తే, ఇవాళ అసలు ‘గాడ్’ కన్నా‘గాడ్మన్’ల హవా ఎక్కువైందని ఒక విమర్శ! నిజమే. దానికి కారణం - దైవాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా, ఒక శాస్త్రీయమైన అధ్యయన ప్రక్రియ లేకుండా కొందరు ఒక స్థానంలో కూర్చోవడమే! అధ్యయనం లేకుండానే ఒక పీఠంపై కూర్చొన్నప్పుడు, వేలమంది వచ్చి మొక్కుతూ ఉంటే, తెలియని ఉద్ధతి, గర్వం వస్తాయి. మనకు తెలియకుండానే రెండు, నాలుగు, ఎనిమిది, పదహారు - ఇలా కొమ్ములు మొలుస్తాయి. అందుకే, ఎప్పుడూ అవి లేకుండా, రాకుండా అధ్యయనం చేస్తూనే ఉండాలి. అది మా పెద్ద స్వామి వారు చెప్పిన మాట! ఒకసారి ఆ గర్వం వస్తే అందరూ మన మాటే వినాలనుకుంటాం. కాదని ఎవరైనా అంటే, వారి మీద కసి, కోపం పెరుగుతాయి. దాంతో, ఏదో అంటాం. ఇవన్నీ అధ్యయనం, వినయం లేకపోవడం వల్ల వచ్చే పర్యవసానాలు. రోజూ తెల్లవారు జాము నుంచి రాత్రి దాకా మానవ సేవ, మాధవ సేవ, భక్తజనం మధ్య ఉండడంతో, మాకైనా అధ్యయనానికి తీరిక దొరకదు. కానీ, అధ్యయనం చేయాలి. మానకూడదు. వేదకాలం నుంచి ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ ఇవాళ్టి పరిస్థితి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? స్త్రీలను గౌరవించడం మనందరి విధి. వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే సమాజానికి క్షేమం. అందుకే, ‘ఉమెన్స్ హెల్త్ కేర్’ అనే ప్రాజెక్ట్ పెట్టాం. ఇవాళ స్త్రీలలో ఎక్కువ మందిని బాధిస్తున్నవి - సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. వీటి పట్ల స్త్రీ మూర్తుల్లో చైతన్యం కలిగిస్తూ, వాళ్ళకు ఉచితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తున్నాం. ఇప్పటి దాకా తెలుగు నేలపై 5 లక్షల 25 వేల మందికి ఉచితంగా ఈ స్క్రీనింగ్ చేశాం. ఇక, స్త్రీల ప్రవర్తన విషయానికి వస్తే ఆధునిక తరంలో ధర్మం పట్ల లక్ష్యం తక్కువవుతోంది. తమిళనాడు, ఉత్తరాది లాంటి చోట్ల స్త్రీలలో ధర్మం పట్ల జాగృతి కాస్త ఉన్నా, మన తెలుగు నేలపై ధర్మం పట్ల సుముఖత తగ్గుతున్నట్లుంది. వేదాలు, ఆగమాలు చదివిన పురోహితుల్ని పెళ్ళి చేసుకోవడానికి పిల్లలు, పిల్లనిచ్చేవారు సిద్ధంగా లేరంటే ఏమనాలి? అందరూ సాఫ్ట్వేర్ వరుల వెంటపడుతున్నారు. నిజానికి, స్త్రీలు ఇవాళ విద్యలో, సహనంలో, కృషిలో చాలా ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి, ఇక వారిలో మనది ఈ జాతి, మనది ఈ ధర్మం, మనది ఈ సంప్రదాయం అనే భావన కలిగించాల్సి ఉంది. అందు కోసం కృషి చేస్తున్నాం. మరోపక్క, స్త్రీని కేవలం ఒక భోగవస్తువుగా చూసే పురుషులూ ఇవాళ ఎక్కువయ్యారేమో? నిజమే. అది కూడా మన విద్యావిధానంలోని లోపమే. వ్యక్తిని వ్యక్తిగా చూడాల్సిన విజ్ఞత నేర్పాల్సింది విద్యే కదా! కానీ, పిల్లలకు మంచి చెడు చెప్పే తీరిక, మన సంస్కృతి, సంప్రదాయం నేర్పే ఓపిక తల్లితండ్రులకు లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయే సరికి, పిల్లలకు అవన్నీ నేర్పే తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు ఇంట్లో లేరు. ఎంతసేపూ చదువులు, మార్కుల మీదే శ్రద్ధ. విద్య సంస్కారాన్ని కలిగించాల్సింది పోయి, సంస్కారాన్ని తొలగిస్తోంది! ఇప్పటికే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఒక తరం నష్టపోయింది. దాని ప్రభావమే స్త్రీల పట్ల చులకన భావం. అందుకే, ఇప్పటికైనా మనం మేల్కోవాలి. పిల్లల్లో మన ధర్మం మీద శ్రద్ధ, రుచి కలిగించాలి. వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. మరి, అందుకు ఏం చేయాలంటారు? పెద్దలకూ, పిల్లలకూ మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియాలి. మన దేశ ఘనచరిత్రకు ప్రతిరూపాలైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలెన్నో ఉన్నాయి. కానీ, జీర్ణోద్ధరణ అనో, సుందరీకరణ అనో పేరు పెట్టి, వాటి రూపాన్ని మార్చకూడదు. శంకరాచార్యులు, రామానుజాచార్యుల కాలం నాటి నిర్మాణాలున్నాయి. వేదవ్యాసుడు తిరుగాడిన బదరికాశ్రమం లాంటివి ఉన్నాయి. ఆ ఆశ్రమ ప్రాంతానికి వెళితే, కొన్ని వేల ఏళ్ళ నాటి మన జాతి చరిత్ర తెలిసి, మనకు పెద్ద అండ వచ్చినట్లవుతుంది. మన దేశాన్నీ, శ్రీలంకనూ కలుపుతూ సముద్రంలో శ్రీరామచంద్రుడు నిర్మించిన ‘నల సేతు’ ఇప్పటికీ ఉందని ‘నాసా’ వారి ఉపగ్రహ ఫోటోలు చూపిస్తున్నాయి. ఇవాళ్టికీ దర్భశయనం దగ్గరకు వెళితే 6 అడుగుల లోపల నీటిలో ఆ సేతువు రూపం కనిపిస్తుంది. మేము చూశాం. రామాయణ కాలం నాటి ఆ వారధిని కాపాడుకొంటే, మనం అక్కడకు వెళ్ళినప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి మానసికంగా వెళతాం. మనలో హనుమంతుడి అంత శక్తి వస్తుంది. ఇంత చరిత్ర, వారసత్వం ప్రపంచంలో మన భారత జాతికి తప్ప మరొకరికి లేదు. జనంలో ఈ చైతన్యం తేవాలి. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేళ మీరు చేపట్టిన ‘సమతామూర్తి స్ఫూర్తికేంద్రం’ అలాంటిదేనా? అవును. విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసిన భగవద్ రామానుజాచార్యులు 1017లో జన్మించి, 120 ఏళ్ళు కృషి చేశారు. ఆయన కేవలం మతాచార్యులే కాదు, దిగువ వర్గాల సముద్ధరణకు కృషి చేసిన సాంఘిక సంస్కర్త. ఆయన సహస్రాబ్ది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. ‘జీయర్ ఇన్టిగ్రేటెడ్ వేదిక్ అకాడెమీ’ (జీవా)కు అనుబంధంగా 45 ఎకరాల్లో 216 అడుగుల ఎత్తై రామానుజాచార్యుల వారి పంచలోహ మూర్తి నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే 2017లో ఈ పాటి కల్లా దాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం. ఇంకా, 108 దివ్యదేశాలు, వైదిక ధర్మ ప్రదర్శనశాలల నిర్మాణం కూడా చేస్తాం. విజయవాడ, సీతానగరం దగ్గర కొండ మీద 108 అడుగుల మరో భారీ విగ్రహం పెట్టాలని కూడా యోచన. అంతా భగవత్ సంకల్పం! ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో మీకు తృప్తినిచ్చిన విషయం? ఇవాళ్టికీ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళకు ఏదైనా చెబితే చక్కగా వింటారు. అర్థం చేసుకుంటారు. ఆచరిస్తారు. అలా గ్రామ గ్రామానికీ వెళ్ళి, మన ధర్మాన్ని ప్రచారం చేస్తూ, సమాజ ఉద్ధరణకు పాల్పడడం బాగుంటుంది. మరి, మీరింకా చేయాలని అనుకుంటున్నవి? మనం చేయగలిగినవి, చేయాల్సినవి, జరగాల్సినవి (చేతులు చాచి చూపిస్తూ...) బోలెడన్ని ఉన్నాయి! ఇప్పటి దాకా చేసింది కేవలం సముద్రంలో నీటిబొట్టే! చివరిగా, ఈ దీపావళి పండుగ వేళ ప్రజలకు మీరిచ్చే సందేశం? ఇవాళ చుట్టుపక్కల నుంచి దేశానికి అభద్రత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో దేశ భద్రతకు సరైన చర్యలు చేపట్టే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఆ రకంగా ప్రజలకు అదృష్టకాలం వచ్చింది. ప్రజలంతా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క రూపాయి మన సైనిక సంక్షేమ నిధికి ఇచ్చినా, అది కొన్ని వందల కోట్ల నిధిగా మారి, దేశ భద్రతకు పనికొస్తుంది. దేశానికి నిప్పు పెట్టే స్థితి కొంతైనా అడ్డుకుంటాం. ఈ ఉద్యమంలో కుల, మత, జాతి విచక్షణ లేకుండా భారతీయులందరూ పాల్గొనాలి. ఒక భారతీయ హిందువుగా, ఒక భారతీయ ముసల్మానుగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరం మన భారతదేశ భద్రతకు తోడ్పడాలి. వ్యక్తిగత విశ్వాసాలు ఎవరివి ఏమైనా, భారతదేశమనే ఈ గృహరక్షణ మనందరి ప్రథమ కర్తవ్యం కావాలి. దానికోసం సమాయత్తం కావాల్సిన సమయం ఇదే. అది చేయడమే నిజంగా మనకు దీపావళి. - డాక్టర్ రెంటాల జయదేవ -
సైనికులకు అండగా నిలుద్దాం
• ప్రజలకు చినజీయర్ స్వామి పిలుపు శంషాబాద్ రూరల్: దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో సైనికులకు అండగా నిలుద్దామని శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో పండగల సందర్భంగా సరదాల కోసం డబ్బును ఇష్టానుసారంగా ఖర్చు పెట్టవద్దని సూచించారు. ప్రధాని మోదీ సూచన మేరకు సైనిక సంక్షేమ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశం ఉదారమైనదని, ఎవరు వచ్చి చేయి చాచినా.. ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటుందన్నారు. ఈ స్వభావాన్ని కొన్ని దేశాలు మన బలహీనతగా భావిస్తే పొరపాటని అన్నారు. మోదీ నేతృత్వంలో దేశంలో ఉత్తమ పాలన కొనసాగుతోందన్నారు. వాజ్‌పేయి హయాంలో పాకిస్తాన్ లో బస్సుయాత్ర చేపడితే.. అందుకు ప్రతిఫలంగా కార్గిల్ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మోదీ ప్రభుత్వం ఇరుగు, పొరుగుతో సఖ్యతగా ఉండేందుకు పాక్‌లో పర్యటిస్తే.. 9 మంది జవాన్ల ప్రాణాలు బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
'ప్రభుత్వ ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయి'
గుంటూరు : నదిని కాలుష్యం చేయకుండా స్నానాలు చేయాలని భక్తులకు చిన్నజియర్ స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లి సమీపంలోని కృష్ణానదిలో ఆయన పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం చిన్నజియర్‌స్వామి మాట్లాడుతూ... ఇప్పటికే మన చర్యల వల్ల నదికీ తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు. పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయని చిన్నజియర్ స్వామి తెలిపారు. తాడేపల్లిలోని ఘాట్‌లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పుణ్యస్నానం ఆచరించారు. -
ముహూర్తం మంచిదేనా?
సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పుష్కర స్నానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర స్నాన ముహూర్తంపై చినజీయర్ స్వామిని అడిగితెలుసుకున్నట్లు సమాచారం. తాడేపల్లిలోని చినజీయర్ ఆశ్రమాన్ని గురువారం సీఎం సందర్శించారు. దుర్గాఘాట్‌లో ఉదయం 5.45గంటలకు బాబు పుష్కర స్నానం చేయనున్నారు. ఆ సమయం మంచిదా? కాదా? అని చినజీయర్‌ను అడిగినట్లు తెలిసింది. ఆశ్రమంలో చినజీయర్‌తో పది నిమిషాలు ఏకాంతంగా చర్చించినట్లు సమాచారం. అనంతరం తాడేపల్లిలోని ఆశ్రమాన్ని, వేదవిశ్వవిద్యాలయాన్ని సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి సీఎంను సత్కరించి ఆశీర్వదించి మంగళశాసనాలు అందించారు. 19న లక్షల మందితో సమతాస్నానం.. ఈ నెల 19న చిన జీయర్‌స్వామి లక్ష మంది తో సమతాస్నానం నిర్వహించనున్నారు. దీనికి సీఎం ను ఆహ్వానించినట్లు తెలిసింది. కాగా కృష్ణా జిల్లాలోని అన్ని ఘాట్ల సమాచారం ‘కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్’కు అందుతుందని, అక్కడి నుంచే పుష్కరాలను సమీక్షిస్తామని సీఎం వెల్లడించారు. దుర్గాఘాట్‌లోని మోడల్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. -
వేములవాడ చేరుకున్న చిన్నజీయర్‌స్వామి
వేములవాడ అర్బన్: చిన్నజీయర్ స్వామి ఆదివారం కరీంనగర్ జిల్లా వేములవాడకు చేరుకున్నారు. రాజరాజేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకుడు అది శ్రీనివాస్ ఇంట్లో జరగనున్న ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటారు. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వేములవాడలో శోభాయాత్ర జరగనుంది. సోమవారం ఉదయం గుడిచెరువుకట్ట వద్ద శ్రీరామ పాదుకా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. -
సన్యాసులను రాజకీయంలోకి లాగొద్దు
బాన్సువాడ: సన్యాసులను రాజకీయాల్లోకి లాగొద్దని త్రిదండి మహోబలి రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆదివారం నిర్వహించిన వేంకటేశ్వర ఆలయ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. త్రిదండి చిన్నజీయర్ స్వామిపై కొందరు రాజకీయ నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నజీయర్ స్వామిని తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టకు వెళ్లడాన్ని కొందరూ రాజకీయ నాయకులు వేరేలా ఆలోచిస్తున్నారని, సన్యాసులకు అందరూ సమానమేనని అన్నారు. నాయకులు నోటిని దుర్వినియోగం చేసుకోవద్దని, అసూయ, ద్వేషాలు మంచివి కావని సూచించారు. అంతకు ముందు ఆలయంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక పూజలు జరిపారు. -
చినజీయర్ సూచనలతో మాస్టర్‌ప్లాన్
భువనగిరి/యాదగిరికొండ: యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం త్రిదండి చినజీయర్ స్వామి సలహాలు, సూచనలతో మాస్టర్‌ప్లాన్ రూపొం దించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇందుకోసం వారం రోజుల్లో ఆయనతో కలిసి పుణ్యక్షేత్రానికి మళ్లీ రానున్నట్లు చెప్పారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన యాదగిరీశుడి కల్యాణోత్సవం సందర్భంగా ఆయన శుక్రవారం సతీసమేతంగా వచ్చి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు సమర్పించారు. రాత్రి కల్యాణం ఉండగా కేసీఆర్ దంపతులు ఉదయం 11:25 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, విప్ గొంగిడి సునీత, పలువురు ఎమ్మెల్యేలు వారి వెంట వచ్చారు. ఆలయ ముఖద్వారం వద్ద అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో అర్చకులు, వేద పండితులు వేదమంత్రాలతో సీఎం దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు స్వామివారి హనుమంత వాహనసేవలోని స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను వారు దర్శించుకున్నారు. అక్కడే స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి పువ్వులు, పసుపుకుంకుమ, గాజులను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులతో కలిసి సీఎం కేసీఆర్ మరోమారు ఆలయ ప్రాంగణంలో కలియదిరిగారు. కొండపైనుంచి యాదగిరిగుట్ట గ్రామంతోపాటు, పరిసర కొండలను పరిశీలించారు. వాటికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్‌ను కేసీఆర్ ఆదేశించారు. వారంలోగా జీయర్‌స్వామితో కలిసి వచ్చి మాస్టర్‌ప్లాన్ కోసం సలహాలు, సూచనలు తీసుకుంటానని అర్చకులతో చెప్పారు. అనంతరం ఆండాళ్ నిలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. 25న కూడా గుట్టకు వచ్చిన సీఎం అన్ని ప్రాంతాలను పరిశీలించి పలు పనులకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే అన్ని పనులు చేపట్టాలని సూచించారు. కొండపై చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన తాజాగా మళ్లీ సమీక్ష జరిపారు. కాగా, సీఎం రాకతో గుట్టపై భక్తులు, మీడియా ప్రతినిధులు, పూజారులు, దేవస్థానం ఉద్యోగులు మరోసారి పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. కేసీఆర్ వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పార్టీ విప్ గొంగిడి సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, వేముల వీరేశం, దేవస్థానం ఈవో గీతారెడ్డి తదితరులు ఉన్నారు.