
సాక్షి, విజయవాడ: ఇంద్ర కీలాద్రిపై శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. చిన్న జీయర్ స్వామికి దుర్గ గుడి ఈవో సురేష్ బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. చిన్న జీయర్ స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం చిన జీయర్ స్వామి మాట్లాడుతూ, ‘ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలు కష్టాలు పడుతున్నారు. కరోనా నివారణ వ్యాక్సిన్ కోసం భారత్ సహా ప్రపంచ దేశాల్లో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్ లోనూ వ్యాక్సిన్ పై రెండో దశ పరీక్షలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ కోసం చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావాలని అమ్మవారిని ప్రార్థించా. వ్యాక్సిన్ వస్తే ప్రజల్లో వ్యాధినిరోధక శక్తి పెరిగి తిరిగి శక్తిమంతులవుతారు. భారత్ తిరిగి శక్తివంతమైన దేశంగా వెలుగొందాలని కోరుకున్నా. పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమైంది. ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలి’ అని అన్నారు.
చదవండి: శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ
Comments
Please login to add a commentAdd a comment