శ్రీచినజీయర్‌స్వామి ఆకాంక్ష | Chinna Jeeyar suggests changes to Bhadradri temple master plan | Sakshi
Sakshi News home page

శ్రీచినజీయర్‌స్వామి ఆకాంక్ష

Published Thu, Feb 2 2017 3:15 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

శ్రీచినజీయర్‌స్వామి ఆకాంక్ష - Sakshi

శ్రీచినజీయర్‌స్వామి ఆకాంక్ష

దశదిశలా శ్రీరాముడి వైభవం
సాక్షి, కొత్తగూడెం: శ్రీరాముడి వైభవం దేశం నలుదిక్కులా వ్యాపించేలా భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించడం అభినందనీయమని త్రిదండి చిన జీయర్‌స్వామి అన్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి ఆధ్యాత్మికపరంగా చేపట్టాల్సిన నిర్మాణాలు, తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించడానికి బుధవారం వచ్చిన ఆయన, మంత్రి తుమ్మలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆలయాలకు ఇంతటి మహర్దశ కేసీఆర్‌ హయాంలోనే సాధ్యమైందన్నారు.

యాదాద్రి తరహాలో భద్రాద్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆలయాభివృద్ధికి సూచనలు, సలహాలిస్తామని తెలిపారు.  కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, జాయింట్‌ కలెక్టర్‌ రాంకిషన్, మై హోం అధినేత రామేశ్వరరావు, సీఎం కార్యదర్శి భూపాల్‌రెడ్డి, డీఎస్పీ అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement