సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్‌లో రేపు (శనివారం) శాంతి కల్యాణం జరగనుందని చినజీయర్ స్వామి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 108 దివ్యదేశాల ఆలయాల్లో మూర్తులకు శాంతి కల్యాణం జరుగుతుందని పేర్కొన్నారు. రేపు( శనివారం) సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శాంతి కల్యాణం జరగనుందని తెలిపారు.
శాంతి కల్యాణ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం అందించామని చెప్పారు. అదే విధంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుతో తమకు విభేదాలు ఎందుకు ఉంటాయని.. ఆయన సహకారం ఉన్నందనే కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్.. ‘తాను ప్రథమ సేవకుడినని తెలిపారని చిన్నజీయర్ స్వామి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ రాకపోవడానికి అనారోగ్యం, పని ఒత్తిడి అవ్వొచ్చని అన్నారు. రేపు నిర్వహించే శాంతి కల్యాణానికి కూడా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని తెలిపారు.అయితే ఆయన వస్తారో.. రారో చూడాలని చిన్న జీయర్‌స్వామి పేర్కొన్నారు. ప్రతిపక్షం, స్వపక్షం రాజకీయాల్లోనే ఉంటాయని అన్నారు. అందరూ సమతామూర్తిని దర్శించాలని తెలిపారు. తమకు అందరూ సమానమేనని చినజీయర్ స్వామి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment