Breadcrumb
Live Updates
సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన
శ్రీలక్ష్మీనారాయణ హోమం పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం జగన్
సమతామూర్తిని దర్శించుకున్న సీఎం వైఎస్ జగన్.. సమతా కేంద్రంలో లేజర్ షో తిలకించారు. 108 దివ్య దేవాలయాలను సీఎం సందర్శించారు. అనంతరం శ్రీలక్ష్మీనారాయణ హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటలపాటు శ్రీరామ నగరంలోనే గడిపారు. శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. తిరిగి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సీఎం జగన్ తాడేపల్లి బయలుదేరారు.
సమతామూర్తిని దర్శించుకున్న సీఎం వైఎస్ జగన్
సమతామూర్తిని సీఎం వైఎస్ జగన్ దర్శించుకున్నారు. 108 దివ్య దేవాలయాలను సీఎం సందర్శించారు. గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చినజీయర్ స్వామికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.
సహస్రాబ్ధి వేడుకల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం
సమతామూర్తి సహస్రాబ్ధి వేడుకల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమతామూర్తి కేంద్రంలోని 108 దివ్య దేశాల్లో 33 ఆలయాలకు ఋత్వికులు ప్రాణ ప్రతిష్ఠాపన చేశారు. యాగశాల నుంచి దివ్య దేశాలకు దేవతామూర్తులతో శోభాయాత్ర నిర్వహించారు. దేవతామూర్తులను దివ్య దేశాల సన్నిధికి 33 మంది ఉపద్రష్టులు తీసుకెళ్లారు. దేవతామూర్తుల శోభాయాత్రను చినజీయర్ స్వామి పర్యవేక్షించారు.
సీఎం జగన్‌ను అభినందించిన చినజీయర్ స్వామి
వైఎస్సార్ తనకు బాగా తెలుసునని.. వైఎస్సార్ ముఖ్యమంత్రి కాకముందు వచ్చి కలిశారని చినజీయర్ స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నానన్నారు. వైఎస్ జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయానన్నారు.
వైఎస్సార్‌ను గుర్తు చేసిన చినజీయర్ స్వామి..
దివంగత మహానేత వైఎస్సార్‌ను చినజీయర్ స్వామి గుర్తు చేశారు. శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.
సమతా స్ఫూర్తిని సమాజానికి అందించాలి: చినజీయర్ స్వామి
దేశంలో సమాజ సేవ.. మంచి జరగాలని చినజీయర్ స్వామి అన్నారు. సమతా స్ఫూర్తిని సమాజానికి అందించాలన్నారు. సమతా విశేషాలు ఇక్కడి నుంచి అందించేందుకు కృషి చేస్తామన్నారు.
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం: సీఎం జగన్
శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం అన్నారు. రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే సమానత్వాన్ని బోధించారన్నారు. రామానుజాచార్యులు భావితరాలకు ప్రేరణగా నిలిచారని సీఎం జగన్ అన్నారు. అసమానతలు రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశారన్నారు. రామానుజ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
చిన జీయర్ స్వామి సమక్షంలో చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానం
సంప్రదాయ దుస్తుల్లో ప్రవచన మండపానికి సీఎం జగన్ వచ్చారు. సీఎం జగన్ జన్మ నక్షత్రానికి సంబంధించిన విష్ణు సహస్ర శ్లోకాలు చిన్నారులు చదివి వినిపించారు. సీఎం జగన్ జన్మ నక్షత్రం స్వయంగా భగవత్ రామానుజల నక్షత్రమని వెల్లడించారు.
సంప్రదాయ దుస్తుల్లో ప్రవచన మండపానికి సీఎం జగన్..
ముచ్చింతల్‌లోని శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులతో సీఎం జగన్.. ప్రవచన మండపానికి వచ్చారు. చినజీయర్ స్వామి సమక్షంలో చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానం నిర్వహించారు. ప్రవాస భారతీయ చిన్నారుల అవధానం సీఎం జగన్ వీక్షించారు.
సమతామూర్తి సహస్రాబ్ధి వేడుకల్లో మరో కీలక ఘట్టం..
ముచ్చింతల్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. నేడు సమతామూర్తి సహస్రాబ్ధి వేడుకల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సమతామూర్తి కేంద్రంలోని 108 దివ్య దేశాల్లో 33 ఆలయాలకు ఋత్వికులు ప్రాణ ప్రతిష్టాపన చేయనున్నారు. యాగశాలలో సంస్కరించిన 33 దేవతామూర్తులతో శోభాయాత్ర నిర్వహించనున్నారు.
కాసేపట్లో సమతామూర్తిని దర్శించుకోనున్న సీఎం జగన్
ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలోని గెస్ట్‌హౌస్‌కు సీఎం జగన్ చేరుకున్నారు. గెస్ట్‌హౌస్ నుంచి రామానుజాచార్యుల సహాస్రాబ్ధి వేడుకల్లో పాల్గొనడానికి సీఎం వెళ్లనున్నారు. ముచ్చింతల్‌లో మూడు గంటల పాటు సీఎం గడపనున్నారు.
ముచ్చింతల్‌లో సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం..
ముచ్చింతల్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జూపల్లి రామేశ్వరరావు స్వాగతం పలికారు. కాసేపట్లో సమతామూర్తిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు.
ముచ్చింతల్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముచ్చింతల్ చేరుకున్నారు. కాసేపట్లో శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. సీఎం వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. కాసేపట్లో సమతామూర్తిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కాసేపట్లో.. ముచ్చింతల్ శ్రీరామ నగరంలో శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు.
హైదరాబాద్‌కు బయలుదేరిన సీఎం జగన్
సీఎం వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామ నగరంలో నిర్వహిస్తున్న శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి వేడుకల ప్రాంతానికి వెళ్తారు. శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. తిరిగి రాత్రి 9.05 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు.
Related News By Category
Related News By Tags
-
Hyd: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి రాజీవ్‌గాంధీ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం( జనవరి 13వ తేదీ) రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసకుంది.గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంత...
-
బ్లాక్ మ్యాజిక్ ముగ్గులు గీస్తున్నారు..!
సంక్రాంతి పండుగ వస్తోందంటే.. బడులు, కాలేజీల్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం సాధారణమే..! సహజంగా అమ్మాయిలు పొంగల్, రథం, సంక్రాంతి గాలిపటాలు, హరిదాసుతో కూడిన రంగోళీలతో అలరించడం తెలిసిందే..! కానీ, ఇటీవలికాల...
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి,గుంటూరు: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల...
-
రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశార...
-
చైనా మాంజా.. సీపీ సజ్జనార్ టీహెచ్‌ఆర్‌సీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: చైనా మాంజాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అడ్వకేట్ రామరావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్క...


