Ramanujacharya
-
ఇల వైకుంఠం శ్రీరంగం
శ్రీరంగనాథుని దేవాలయానికి సంబంధించి మరే దివ్యదేశానికి లేని ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. ఈ దివ్యక్షేత్రం 156 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడ ఉన్నన్ని ్ర΄ాకారాలు, గోపురాలు, మండ΄ాలు, సన్నిధానాలూ మరే దేవాలయంలోనూ లేవు. దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటిగా దీనిని పేర్కొనవచ్చు. శ్రీరంగనాథుని దేవాలయానికి సంబంధించిన చాలా విషయాలు ‘పెరియ’ అనే విశేషణంతో కూడుకుని ఉన్నాయి. ‘పెరియ’ అంటే పెద్ద అని అర్థం. ఉదాహరణకు ఈ దేవాలయాన్ని ‘పెరియకోయిల్’ అని, స్వామివారిని ‘పెరియపిరాట్టి’ అని, శ్రీరంగాన్ని ‘పెరియ అరంగం’ అని, దేవాలయంలో వాయించే మంగళ వాద్యాలను ‘పెరియ మేళమ్’ అని, స్వామివారికి నివేదించే వంటకాలను ‘పెరియ అవసరం’ అని, నివేదనకు తయారు చేసిన పిండి వంటలను ‘పెరియ పణ్యారం’ అనీ వ్యవహరిస్తారు. స్వామివారి వాహనమైన గరుత్మంతుని ‘పెరియ తిరువడి’ అని అంటారు. స్వామివారికి పిల్లనిచ్చిన విష్ణుచిత్తుల వారిని ‘పెరియాళ్వారు’ అన్న పేరుతో పిలుస్తున్నారు. స్వామివారి వాహనమైన గరుత్మంతుని ‘పెరియ తిరువడి’ అని అంటారు. స్వామివారికి పిల్లనిచ్చిన విష్ణుచిత్తుల వారిని ‘పెరియాళ్వారు’ అన్న పేరుతో పిలుస్తున్నారు.ఆళ్వార్లు కీర్తించిన నూట ఎనిమిది దివ్య దేశాలలో శ్రీరంగం ప్రధానమైనది. శ్రీరంగమే భూలోక వైకుంఠమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సర్వేశ్వరుడు స్వయంగా వ్యక్తమైన ఎనిమిది క్షేత్రాలలోప్రధానమైనది శ్రీరంగం. వైష్ణవ పుణ్యక్షేత్రాలుగా వినుతికెక్కిన ‘నాల్గు మండపాల’లో శ్రీరంగం ఒకటి. ఉభయ కావేరుల మధ్య అమరిన సుందర ద్వీపం శ్రీరంగం. కావేరి, కొళ్ళడం అనే రెండు నదులు శ్రీరంగానికి పూలదండలా ఇరువైపులా కొంతదూరం ప్రవహించి తిరిగి ఒకటిగా కలుస్తున్నాయి. తిరుచిరాపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి రైలు, రోడ్డు సదుపాయాలున్నాయి.శ్రీరంగనాథుని దేవాలయం చాలా ప్రాచీనమయింది. ఈనాడు మనం చూసే ఆలయానికి అంకురార్పణ 7వ శతాబ్దంలో జరిగింది. చోళ, పాండ్య, నాయక రాజులు దేవాలయానికి మరమ్మతులు, విస్తరణలు జరిపారు. పదమూడు అంతస్తులు గల ఈ రాజగోపురం 236 అడుగుల ఎత్తులో ఆసియాఖండంలోనే అత్యంత ఎత్తయిన గోపురంగా గుర్తించబడింది. ఈ నూతన రాజగోపురం ఆలయానికి దక్షిణ ద్వారంగా అమరి ఉంది.ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణులలో ప్రధానమైనది చంద్ర పుష్కరిణి. ఆలయప్రాకార ఆవరణలలో నున్న గోపురాలు జీవకళ ఉట్టిపడే శిల్పాలతో ఆలయానికి అలంకారాలై ఉన్నాయి. దేవాలయానికి ఉన్న సప్తప్రాకారాలు సప్తలోకాలకు సంకేతాలుగా ఉన్నాయి. ప్రణవాకార విమానం కింద ఉన్న గర్భాలయంలో శ్రీరంగనాథుడు ఐదు తలలతో పడగెత్తి ఉన్న ఆదిశేషుని పాన్పుపై శయనించి కుడి చేత్తో తన శిరస్సు చూపిస్తూ అన్ని లోకాలకూ తనే నాధుడునని చెప్తున్నట్టున్నారు. ఎడమ చేతితో పాదాలను చూపుతూ శరణన్న వారిని రక్షిస్తానని అభయమిస్తున్నారు. మూలమూర్తికి కొంచెం దిగువున ఉన్న ఒక పీఠంపై ఉత్సవమూర్తి చతుర్భుజుడై ఉన్నారు. వారిని ‘నంబెరుమాళ్ళు’ అని అంటారు.ఉత్సవమూర్తి పై కుడి చేతితో ప్రయోగ చక్రాన్ని ధరించి ఉండగా కింది కుడిహస్తం అభయ ముద్రలో ఉంది. శంఖాన్ని పైఎడమ చేతిలోను, కింది చేతితో గదను ధరించి అందమైన చిరునవ్వు మోముతో శోభాయమానంగా దర్శనమిస్తున్నారు.గర్భాలయానికున్న ప్రదక్షిణ మార్గాన్ని ‘తిరువాణ్ణాళి’ అని, దానికి ముందున్న మంటపాన్ని రంగ మంటపమనీ, గాయత్రీ మంటపమని వ్యవహరిస్తారు. ఈ మంటపంలో నున్న 24 బంగారు స్తంభాలూ, గాయత్రీ మంత్రంలో ఉన్న 24 అక్షరాలకు సంకేతాలని పెద్దలు చె΄్తారు. వీటిని ‘తిరుమణ్ణాత్తూణ్’ అని అంటారు. స్వామివారు ప్రసాదాలు ఆరగించే మంటపానికి చందన మంటపమని పేరు. గర్భాలయానికి బయట ఉన్నప్రాకారంలో ద్వారపాలకులు, యాగశాల, సేన మొదలియార్ల సన్నిధి, పగల్ పత్తు మంటపం, చిలుకల మంటపం, కణ్ణ¯Œ సన్నిధి ఉన్నాయి.మూడవప్రాకారంలో స్వర్ణమయంగా ఉన్న ధ్వజస్తంభం, డోలోత్సవ మంటపం, వైకుంఠ ద్వారం చూడవచ్చును. నాల్గవప్రాకారంలో బ్రహ్మాండమైన గరుడ సన్నిధి ఉంది. 12 అడుగుల ఎత్తులో మూలస్థానానికి దూరంగా స్వామి వారి పిలుపు కోసం వేచి ఉన్నట్లు అయిదు అడుగుల ఎత్తయిన పీఠంపై గరుడాళ్వారు కూర్చుని ఉన్నారు. ఈప్రాకారంలో ఆళ్వార్ల సన్నిధానాలు చాలా ఉన్నాయి. ధన్వంతరికి ప్రత్యేక సన్నిధానం ఉండడం ఇక్కడ ఒక విశేషం. అయిదవప్రాకారంలో ఆండాళ్ళ సన్నిధి, శ్రీరంగనాచ్చియార్ల సన్నిధానం, దానికి ఎదురుగా కంబర్ మండపం, ఉన్నాయి. ఈప్రాకారంలో ముఖ్యమైన కట్టడం వేయికాళ్ళ మండపం.ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం, ఆలయ విమానగోడలపై చిత్రితమై ఉన్న విష్ణుపురాణం, 108 దివ్యదేశాలకు సంబంధించిన దృశ్యాల వివరణ తెలుగు లిపిలో ఉండడం గమనార్హం. ఉగాది మొదలయిన పండుగలను చాంద్రమానం ప్రకారంగా జరుపుకుంటున్నారు.ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత స్వామి వారికి జరిగే సుప్రభాత సేవలో పాల్గొనేవారు తరతరాలుగా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండడం ఒక విశేషం. వీరిని ‘శ్రీపాదం వోర్’ అని అంటారు.శ్రీరంగక్షేత్రంలో సంవత్సరంలో నాలుగు బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. శ్రీరంగంలో నిత్యమూ ఉత్సవ సంరంభమే. ఉత్సవాల సమయంలో శ్రీరంగం అల వైకుంఠపురాన్ని తలపింపజేస్తుంది.శ్రీరంగనాచ్చియార్లకు స్వామివారి ఉత్సవాలైన తర్వాత సంబరాలు జరుపుతారు. భక్తులు స్వామివారి ఉత్సవాల వైభవాన్ని తిలకించి శ్రీరంగేశ పాదార్చనతో పులకించిపోతారు. శ్రీరంగాన్ని ఒక్కసారి దర్శిస్తే 108 దివ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. – స్వాతీభాస్కర్ -
ఘనంగా ప్రారంభమైన ‘సమతా కుంభ్’ బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
ముచ్చింతల్ సమతా మూర్తి: ఫిబ్రవరి 2 నుంచి సమతా కుంభ్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్తో 216 అడుగుల పంచ లోహ రామానుజాచార్యుల విగ్రహంతో సమతామూర్తి(స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, సమతామూర్తి కేంద్రం ఏర్పాటై ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఏడాది కావస్తున్నది. ఈ తరుణంలో చిన్న జీయర్ కీలక ప్రకటన చేశారు. ఇక, సోమవారం చిన్న జీయర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ – 2023 జరుగనుందన్నారు. అదే సమయంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సమతామూర్తి కేంద్రం గత ఏడాది ఫిబ్రవరి 2న ప్రారంభమైంది.. 216 అడుగుల పంచలోహ విగ్రహం అందుబాటులోకి వచ్చిందన్నారు. 108 దివ్య దేశాలు సమతామూర్తి కేంద్రంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను చూశారు. ఈ ఏడాది కూడా అదే క్రమంలో కార్యక్రమం సాగుతుంది. కాకపోతే ఈ ఏడాది 9 కుండాలతో ఉండే యాగశాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించనున్నామని వెల్లడించారు. సమతా కుంభ్ పేరుతో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 11వ తేదీన లక్ష మందితో భగవద్గీత పారాయణం ఉంటుందన్నారు. అలాగే, రామానుజాచార్యులు చాలా మేధావి అంతే కాకుండా మనసు ఉన్న మనస్వి. అన్ని వర్గాల వారిని సమాజంలోకి తెచ్చి ఆలయాల్లో భాగస్వాములను చేశారని అన్నారు. ఈ క్రమంలోనే చిన్న జీయర్‌కు భారత అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ రావడంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో చిన్న జీయర్ మాట్లాడుతూ.. ముందు రోజు నాకు ఫోన్ చేసి.. లిస్టులో మీ పేరు పెడుతున్నామని చెప్పారు. మీకు ఏదైనా అభ్యంతమా? అని అడిగారు. నాకేమీ అభ్యంతరం లేదని నేను వారికి చెప్పాను. పద్మభూషణ్ రావాలని నేను కోరుకోలేదు. అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉంది అని కామెంట్స్ చేశారు. -
సమతామూర్తి సందర్శనకు టికెట్.. పెద్దలకు రూ.150.. పిల్లల టికెట్ ధర ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వహణకు భారీ కసరత్తు జరుగుతోంది. 216 అడుగుల విరాట్ మూర్తి, 120 కిలోల బరువున్న 54 అంగుళాల స్వర్ణమూర్తి, 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఈ క్షేత్ర నిర్వహణకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ క్షేత్రంలో దర్శనానికి రుసుము పెడుతున్నారు. తొలుత పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.200 టికెట్ ధర పెట్టాలని భావించారు. కానీ అది భక్తులకు భారమవుతుందన్న భావనతో దాన్ని రూ.150కి తగ్గించాలని అనుకున్నారు. అది కూడా ఎక్కువ అవుతుందని కొందరు కమిటీ సభ్యులు పేర్కొనటంతో పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75గా ఖరారు చేశారు. మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. రామానుజాచార్యుల స్వర్ణ మూర్తికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహానికి 6 నుంచి 8 అడుగుల దూరం నుంచి బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ ఫ్రేమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేసేవరకు స్వర్ణమూర్తి సందర్శనకు అనుమతించరు. ఈ ప్రాంతంలో సాయుధులైన రక్షణ సిబ్బంది 24 గంటలూ పహారాలో ఉంటారు. ♦ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఈ క్షేత్ర నిర్వహణకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను శరవేగంగా జరుపుతున్నారు. ఈ పనులు పూర్తయ్యేవరకు దర్శనాలను కేవలం సాయంత్రం వేళకే పరిమితం చేయాలని నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఆరున్నర వరకు అనుమతిస్తారు. పనులు పూర్తయ్యాక ఉదయం, సాయంత్రం వేళల్లో అనుమతించనున్నారు. మరో నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల 3డీ లేజర్‌షోను తాత్కాలికంగా ఆపేశారు. ♦ప్రాంగణంలో 250 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఫీడ్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ♦50 ఎకరాల్లో విస్తరించిన ఈ క్షేత్రాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు రెండు షిఫ్టుల్లో 300 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. లోపలకు ఎంతమంది వచ్చారు, బయటకు తిరిగి ఎందరు వెళ్లారన్న వివరాలు తెలిసే ఏర్పాటు చేస్తున్నారు. ఆ రెండు సంఖ్యలు సరిపోలకుంటే లోపలే అనుమానితులు ఉండిపోయారని భావించి క్షుణ్ణంగా తనిఖీ చేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ♦ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు, ఇతర బ్యాగేజీని అనుమతించకూడదని భావిస్తున్నారు. టికెట్ కౌంటర్ పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో సెల్ఫోన్లు, లగేజీ, పాదరక్షలు అప్పగించాలి. ఫుడ్‌కోర్టు దగ్గర నిష్క్రమణ మార్గం ఉంటుంది. ఎంట్రీ వద్ద అప్పగించిన వస్తువులు కన్వేయర్ బెల్టు ద్వారా ఎగ్జిట్ వరకు చేరతాయి. అక్కడ వాటిని తీసుకుని బయటకు రావాల్సి ఉంటుంది. ♦వాహనాలను స్కానర్లతో తనిఖీ చేస్తారు. అనుమానిత వాహనాలను ఆపేందుకు బూమ్ బారియర్స్, బొల్లార్డ్స్ ఉంటాయి. వాటిని ఛేదించుకుని వెళ్లే ప్రయత్నం చేసే వాహనాల టైర్లను చీల్చే టైర్ కిల్లర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ♦ఈ కేంద్రంలో 250 మంది అర్చకులను నియమించనున్నారు. దివ్యదేశాలుగా పేర్కొనే 108 ఆలయాలకు ఇద్దరు చొప్పున, మిగతా ఆలయాల్లో మరికొందరని నియమిస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు. ఇతర అవసరాలకు కలిపి మొత్తం 800 మంది సిబ్బంది ఉంటారని అంచనా. -
ముగిసిన సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు
-
మహాక్రతువు సుసంపన్నం.. శాంతి కల్యాణం వాయిదా
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పన్నెండు రోజుల పాటు ఐదువేల మంది రుత్వికులు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు సోమవారంతో పరిపూర్ణమైంది. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా ప్రవచన మండపంలో రోజూ అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణుసహస్ర పారాయణం నిర్వహించారు. అలాగే, 114 యాగశాలల్లో 1035 హోమకుండలాల్లో రెండు లక్షల కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యితో విష్వక్సేనేష్టి, నారసింహ ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి, వైభవేష్టి, హయగ్రీవ ఇష్టి, వైవాయిహిక ఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతే ఇష్టి యాగ పూజలను నిర్వహించారు. ఉదయం త్రిదండి చినజీయర్ స్వామి యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞ గుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత యాగశాల నుంచి సమతామూర్తి విగ్రహం వరకు పెరుమాళ్ యాత్రను నిర్వహించారు. 120 కేజీల రామానుజాచార్యుల బంగారు ప్రతిమకు చినజీయర్ స్వామి ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రతి యాగశాల నుంచి దేవతామూర్తులను ఆవాహన చేసిన కలశాలను సమంత్రకంగా సమతాక్షేత్ర స్ఫూర్తి కేంద్రానికి తీసుకెళ్లి కుంభప్రోక్షణ చేసి అభిషేకాన్ని నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. సాయంత్రం గ్లైడర్స్ సమతమూర్తి విగ్రహంపై పూలవర్షం కురిపించారు. అనంతరం దేశవిదేశాల నుంచి వచ్చిన రుత్వికులను ఘనంగా సత్కరించారు. ఈ పన్నెండు రోజులు అష్టాక్షరీ మంత్ర పఠనం, చతుర్వేద పారాయణం, ఐదు వేల మంది కళాకారుల ప్రదర్శనలు, మహా పూర్ణాహుతితో ఈ మహాక్రతువు సుసంపన్నమైంది. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం: కిషన్‌రెడ్డి ముచ్చింతల్ భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, హిందూ దర్శన ప్రదేశంగా విలసిల్లుతుందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. శ్రీరామనగరంలో శిలాసంపద అత్యద్భుతంగా ఉందని కొనియాడారు. దేశంలోని ప్రముఖ దివ్యదేశాలను ఒకే చోట దర్శించుకోవడం ఆనందంగా ఉందని, కార్యనిర్వాకుల కృషి, వైదిక ప్రక్రియలు ఈ వేడుకకు వన్నె తెచ్చాయన్నారు. ఈ ఉత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి చివరి వరకు ఎనిమిది లక్షల మందికిపైగా శ్రీరామనగరాన్ని సందర్శించుకున్నట్లు అంచనా. శాంతి కల్యాణం వాయిదా నిజానికి సోమవారం ఉదయం మహా పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారని నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు ముచ్చింతల్ రహదారులు, సమతామూర్తి ప్రాంగణంలో భారీగా కేసీఆర్, కేటీఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు కూడా ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం తర్వాత కూడా సీఎం రాలేదు. సాయంత్రం ఆయా దివ్యదేశాల్లోని మూర్తులకు నిర్వహించే శాంతి కల్యాణంలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. కానీ ఈ వేడుకలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఈ సమయంలో శాంతి కల్యాణం నిర్వహిస్తే.. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన రుత్వికులు, సేవకుల తిరుగు ప్రయాణానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటూ ఈ శాంతి కల్యాణాన్ని 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు చినజీయర్ స్వామి ప్రకటించారు. ఆయా ఆలయాల్లోని 108 విగ్రహ స్వరూపాలకు ఒకే చోట, ఒకే సమయంలో శాంతి కల్యాణం జరిపించడం చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుందని చెప్పారు. -
ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన
-
ఆ స్ఫూర్తిని పంచడమే అసలైన నివాళి
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా/శంషాబాద్: ‘‘సమాజంలో నెలకొన్న వివక్ష, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వెయ్యేళ్ల క్రితమే విప్లవానికి నాంది పలి కిన గొప్ప గురువు రామానుజాచార్యులు. ఆయన స్ఫూర్తిని చాటేందుకు సమతామూర్తి కేంద్రం దోహ దం చేస్తుంది. పెద్ద పెద్ద వాళ్లందరూ ఇక్కడికి రావ డంలో ముఖ్యోద్దే్దశం రామానుజుల స్ఫూర్తిని పొంద డం, పంచడం కోసమే. ఈ స్ఫూర్తిని సమాజానికి చేరువ చేయడమే రామానుజులకు అందించే నిజ మైన నివాళి’’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సందర్శకులను మంత్రముగ్ధుల ను చేస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సమతా మూర్తి ప్రపంచపు 8వ వింత అని కొనియాడారు. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్స వాల్లో ఆయన శనివారం పాల్గొన్నారు. సేవ చేయ డమే అత్యున్నత ఆధ్యాత్మిక కార్యక్రమమని, కుల మతాలకు అతీతంగా మానవత్వమే ప్రధానంగా సేవ చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రస్తుతం కొన్నివర్గాలు రాజకీయ, వ్యక్తిగత ప్రయో జనాల కోసం కుల, వర్గ వైషమ్యాలను ప్రోత్సహి స్తున్న తరుణంలో రామానుజుల బోధనలు మనకు ప్రేరణ కలిగించాల్సి ఉందని.. అందుకు సమతా మూర్తి కేంద్రం దోహదం చేస్తుందని చెప్పారు. తెలుగువారి గొప్పదనాన్ని, తెలుగు భాషా సంస్కృ తులను ముందు తరాలకు తెలియజేసేలా ఏదైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా చినజీయర్ స్వామిని కోరారు. కాగా.. రామానుజు లు ఏది బోధించారో, దాన్ని ఆచరించారని అందుకే గొప్ప గురువు అయ్యారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. శ్రీరామనగరం ఆధ్యాత్మిక కేంద్రం గా, ఒక స్ఫూర్తి కేంద్రంగా, తెలంగాణకు శోభాయ మానంగా నిలబడుతుందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. పరమేష్టి, వైభవేష్టి హోమాలు.. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం 11వ రోజైన శనివారం ఉదయం అష్టాక్షరి మహామంత్ర జపంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తర్వాత ఇష్టిశాలలో పరమేష్టి, వైభవేష్టి హోమాలు నిర్వహించారు. మధ్యాహ్నం ప్రవచన మండపంలో గోపాలోపాయనం కార్యక్రమాన్ని నిర్వహించారు. జీయర్‌స్వామి గురువైన గోపాలాచార్యుల పేరిట ఇచ్చే గోపాలోపాయన పురస్కరాన్ని తమిళనాడుకు చెందిన మాడభూషి వరదరాజన్‌కు అందజేశారు. సమతామూర్తిని దర్శించుకున్న ప్రముఖులు శనివారం ఉదయం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు, శాంతా బయోటెక్ ఎండీ వరప్రసాదరెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్ పాల్గొన్నారు. సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని, భార్య లక్ష్మీప్రణతి కూడా సమతామూర్తి, దివ్యదేశాలను సందర్శించారు. రేపటి నుంచి సువర్ణమూర్తి దర్శనం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం శ్రీరామానుజాచార్యుల సువర్ణ మూర్తిని లోకార్పణ చేయనుండటంతో.. సోమవారం నుంచి భక్తులందరినీ దర్శనానికి అనుమతించనున్నారు. జనసంద్రంగా శ్రీరామనగరం రెండో శనివారం సెలవుదినం, దానికి భీష్మ ఏకాదశి తోడు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీరామనగరానికి పోటెత్తారు. దీనితో ప్రధాన విగ్రహం సహా యాగశాలకు వెళ్లే మార్గాలు కిక్కిరిసి పోయాయి. రాత్రి వరకు కూడా భక్తుల రాక కొనసాగింది. ఒక్కరోజే రెండు లక్షల మంది వరకు వచ్చినట్టు అంచనా వేశారు. ఈ ప్రాంతం పునీతం: చిరంజీవి భీష్మ ఏకాదశి రోజున సమతామూర్తిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సినీ నటుడు చిరంజీవి అన్నారు. శ్రీరామనగరాన్ని వీక్షించాక ఇది ఎంత అద్భుతమో తెలిసిందని, కేవలం ఆరేళ్లలో ఈ దివ్య సంకేతాన్ని నిర్మించడం అమోఘమని కొనియాడారు. చినజీయర్ స్వామి సారథ్యంలో జూపల్లి రామేశ్వరరావు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని చెప్పారు. వెయ్యేళ్ల క్రితం రామానుజులు సర్వమానవ సమానత్వం గురించి ప్రపంచానికి బోధించారని తెలిపారు. సమతామూర్తి దివ్యక్షేత్రం కొన్ని వేల ఏళ్లపాటు వర్ధిల్లుతుందన్నారు. మహారాజులు, చక్రవర్తులే ఇంత పెద్ద ఆలయాలు, విగ్రహాలు నిర్మించగలరని అనుకున్నామని.. సంకల్పం ఉంటే మనమూ సాధ్యం చేయగలమని ఇది నిరూపించిందని చిరంజీవి పేర్కొన్నారు. -
భారత్‌ను విశ్వగురుగా మార్చాలి
సాక్షి, హైదరాబాద్: భారత్‌ను ‘విశ్వగురు’గా మార్చే కృషిని ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్సంఘ్చాలక్ డా.మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. హిందువుల హితమే దేశ హితమని, మిగతా అనవసర కొట్లాటలు, కుమ్ములాటల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. మనకు దేనికీ లోటు లేకపోయినా, మనకంటే తెల్లచర్మం వారికి తామేదో గొప్ప అనే అహంకారం వెల్లడి కావడం అప్పుడప్పుడు చూస్తుంటామన్నారు. బుధవారం ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ప్రవచన మందిరంలో ప్రసంగిం చారు. ‘వెయ్యేళ్లకు పైగా విదేశీయుల పాÔశవిక అత్యాచారాలు, భరించినా ఆనాడే సమానత్వాన్ని సాధించాం. మన పరంపర నేర్పినదాని ఆధారంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించొచ్చు. భాష, ప్రాంతం తేడాలెన్ని ఉన్నా మనమంతా ఒక్కటే. ఎవరికి వారు తమ మేలు చూసుకుంటూనే ఇతరుల మేలు కూడా చూడాలి. దీనికి సంబంధించిన ఆచరణను క్రమంగా మొదలుపెట్టాలి’ అని భాగవత్ చెప్పారు. విభిన్నవర్గాల ఆచార్యులు, సంత్ లు కూడా అఖిల భారతస్థాయిలో సమావేశమై సమాజం మేలుకు ఏం చేస్తే బావుంటుందనే దానిపై సమాలోచనలు జరపాలన్నారు. దేశంలో మధ్యభాగంగా ఉన్న భాగ్యనగరంలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సరైన సమయంలో జరిగింద న్నారు. ఇది దేశభాగ్యమని, భాగ్యనగరంపేరు సార్థకమైందన్నారు. హిందుత్వమే జాతిహితం: శివరాజ్ హిందుత్వమే దేశ హితమని, సనాతనధర్మం, పరంపరతో ముందుకు సాగాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. వివిధ భావాల కలబోత రామానుజాచార్యులు అని అన్నారు. సామాన్యులు, ధనికులు, బీసీలు, ఓబీసీలు, దళి తులు, మహాదళితులు అనే భేదభావాలన్నీ సమా ప్తం కావాలన్నారు. శ్రీరామనగర ప్రాంగణాన్ని దేశ యువత సందర్శించి దేశ భావధారకు అనుగుణంగా వారి ఆలోచనాధోరణి మారితే అంతకంటే అద్భుతం మరొకటి ఉండదన్నారు. యావత్ ప్రపంచానికి సమతా సందేశాన్ని ఇవ్వడానికే శ్రీరామానుజాచార్యుల వెయ్యోజయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలను చేపట్టామని చినజీయర్ స్వామి చెప్పారు. 1927లో బీఆర్ అంబేడ్కర్ తన పత్రిక భారత్‌లో.. వెయ్యేళ్ల క్రితమే సమతను చేసి చూపించిన రామానుజాచార్యుల గురించి రాశారన్నారు. సమస్త మానవాళికి ఐశ్వర్యం సిద్ధించాలనే సంకల్పంతో శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగంలో భాగంగా ఏడోరోజు పూజలు నిర్వహించారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 1,035 యజ్ఞకుండాల్లో ఐదువేల మంది రుత్వికులు çహోమ కార్యక్రమాలు నిర్వహించారు. మహాయాగంలో లక్ష్మీనారాయణ ఇష్టిని నిర్వహించారు. చిన్నారులకు విద్యాభివృద్ధి, పెద్దలకు మానసిక ప్రశాంతత కోసం హయగ్రీవ ఇష్టి నిర్వహించారు. -
సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న అమిత్ షా
► కేంద్ర హోంశాఖ మంత్రి ముచ్చింతల్‌లోని సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మం అన్నింటికీ మూలమని, సమతామూర్తి విగ్రహం ఏకతా సందేశాన్ని అందిస్తోందన్నారు. ► కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. తిరునామం, పంచెకట్టుతో వచ్చిన అమిత్ షా.. ముచ్చింతల్‌లోని దివ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. కేంద్రం విశిష్టతను చినజీయర్ స్వామి హోంమంత్రికి వివరించారు. అనంతరం శ్రీరామానుజుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ► సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత దాదాపు రెండున్నర గంటల పాటు సహస్రాబ్ది వేడుకల్లో అమిత్ షా పాలుపంచుకోనున్నారు. అనంతరం యాగశాలలో జరిగే పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న అమిత్ షాకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ముచ్చింతల్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, బిజేపి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఘన స్వాగతం పలికారు. -
రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం
-
రామానుజ విలువలు ఆదర్శనీయం
సాక్షి, హైదరాబాద్: గొప్ప విలువలతో కూడిన జీవనం సాగించిన రామానుజాచార్యుల విగ్రహాన్ని స్థాపించి, చినజీయర్ స్వామి భావితరాలకు గొప్ప సందేశాన్నిచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. చినజీయర్ నేతృత్వంలో రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆనందంగా ఉందన్నారు. ముచ్చింతల్‌లోని రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆయన సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సమాజంలో మంచి విలువలు నెలకొల్పేందుకు వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు పరితపించారని పేర్కొన్నారు. ఆయనకు తన స్వామి ఉపదేశించిన మంత్రాన్ని అందరికీ తెలియజేస్తే పాపం తగులుతుందని అంతా భావించే రోజుల్లోనే, ఆయన ఆ పాపం తనకు తగిలినా ఫర్వాలేదని గొప్ప మనసుతో సమాజానికి మంచి సందేశాలు ఇచ్చారని కొనియాడారు. ఇలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా రామానుజాచార్యులు విలువల కోసం ఎంత గొప్పగా కట్టుబడి ఉన్నారనేది భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు చినజీయర్ స్వామి కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. సమాజాన్ని మార్చాలన్న గొప్ప సందేశాన్ని ఆయన ఇచ్చారన్నారు. విలువలు మిగిలి ఉన్నాయని చెప్పేందుకు ఇదో మంచి ఉదాహరణ అని జగన్ పేర్కొన్నారు. ముచ్చింతల్ క్షేత్రంలో తీర్థప్రసాదాలను స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇంత మంచి కార్యక్రమానికి చేయూతనిచ్చిన మైహోం అధినేత రామేశ్వరరావును జగన్ అభినందించారు. అమెరికా నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ చక్కగా శ్లోకాలు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. సంప్రదాయ దుస్తుల్లో ప్రవచన మండపానికి వచ్చిన జగన్.. చినజీయర్ సమక్షంలో ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధాన కార్యక్రమాన్ని వీక్షించారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నిగర్వి.. పెద్దల మాటను గౌరవించే వ్యక్తి జగన్
సాక్షి, హైదరాబాద్: ‘విద్య, ధనం, వయసు, అధికారం కలిగి ఉన్న వారు ఇతరుల సలహాలు తీసుకోరు. కానీ జగన్‌కు ఈ నాలుగు ఉన్నప్పటికీ ఎలాంటి గర్వం లేదు. పెద్దల మాటను గౌరవిస్తారు. పెద్దలు ఇచ్చే సూచనలు, సలహాలను స్వీకరిస్తారు.. పాటిస్తారు. జగన్మోహన్రెడ్డి మరింత ఉన్నత స్థానానికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా..’ అని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించేందుకు వచ్చిన ఏపీ సీఎం జగన్‌ను మైహోం ఎండీ రామేశ్వర్రావు జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. యువకుడు జగన్ ధర్మ పరిరక్షణకు, సమాజంలో సమానత కోసం ఏం కావాలో తెలుసుకొని దాని కోసం కృషి చేస్తున్న వ్యక్తి అని అన్నారు. ముచ్చింతల్ క్షేత్రంలో తీర్థప్రసాదాలను స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు తెలుసని, ముఖ్యమంత్రి కాక ముందు ఆయన తనను కలిశారని గుర్తు చేసుకున్నారు. ఏ పాలకుడికైనా ఉండాల్సింది అన్ని వర్గాల ప్రజలను, వారి ప్రయోజనాలను సమానంగా చూడటమేనని.. జగన్, వైఎస్సార్‌ల ఆలోచన ఇదేనని చెప్పారు. ‘వారు అన్ని వర్గాల వారి హక్కులను కాపాడుతూ, వారి సంక్షేమానికి పాటుపడాలని భావించారు. ఏపీలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయా. సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహ సందర్శనకు సమాజంలో అన్ని వర్గాలకు మంచి జరగాలని కోరుకున్న వారిని ఆహ్వానించాం. ముచ్చింతల్ క్షేత్రంలో తీర్థప్రసాదాలను స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమానత్వం పట్ల ఉన్న దృఢ సంకల్పంతో జగన్ రావడం సంతోషకరం’ అని చినజీయర్ చెప్పారు. నెల్సన్ మండేలా నల్ల, తెల్ల జాతీయుల మధ్య సమానత్వం కోసం పాటుపడ్డారని, మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఇదే తరహాలో కృషి చేశారన్నారు. ‘హాల్ ఆఫ్ ఫేమ్’ పేరిట సమానత్వం కోసం ప్రపంచవ్యాప్తంగా పనిచేసిన వారి చిత్రపటాలను ఏర్పాటు చేస్తామని, ఆ హాల్లోకి ప్రవేశించి ఆ చిత్రాలను స్పృశించగానే వారి గురించి హెడ్‌ఫోన్స్ ద్వారా వినే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమానత్వం కోసం కృషి చేసిన 150 మందిని ఇప్పటివరకు గుర్తించామన్నారు. వీరందరి కన్నా ముందు వెయ్యేళ్ల క్రితమే సామాజిక, ఆర్థిక, లింగ వివక్షలపై పోరాడి సమానత్వం కోసం తపించిన మహనీయుడు రామానుజాచార్యుడని చినజీయర్ స్వామి కీర్తించారు. పాలకులు, అధికారులు, మేధావులు, సాధారణ ప్రజల ఆలోచనలు ఒకేవిధంగా ఉండవని, అయితే రామానుజాచార్యులు ఈ నలుగురి ఆలోచనలను ఒకే తోవలోకి తీసుకొచ్చారని కొనియాడారు. చినజీయర్ స్వామికి దండ వేస్తున్న సీఎం జగన్ చెవిరెడ్డి దగ్గరుండి సేవలు చేశారు జగన్ తొలిసారి క్షేత్రానికి వచ్చినా, ఆయన తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా రోజుల నుంచే ముచ్చింతల్‌లో ఏర్పాట్లు చూశారని చినజీయర్ స్వామి చెప్పారు. ఉత్సవాలకు ముందే సంక్రాంతి నుంచి ఏర్పాట్లు చూశారన్నారు. ‘మంచిగా చూడవయ్యా..’ అంటూ పూలు, పండ్ల అలంకరణలన్నీ దగ్గరుండి చేయించారన్నారు. ‘మా బాస్ చెప్పారు... చేస్తున్నాం’ అని చెప్పేవారని, ఆయనను జగన్ ప్రోత్సహించడం ముదావహమని చినజీయర్ అన్నారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, స్వర్ణమ్మల సేవలను చినజీయర్ స్వామి అభినందించారు. వీరందరికి రామేశ్వర్ రావు జ్ఞాపికలను అందజేశారు. సీఎం జగన్‌ను ఆశీర్వదిస్తున్న చినజీయర్ స్వామి (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం జగన్‌కు చిన జీయర్ స్వామి అరుదైన గౌరవం
-
చిన్నారుల శ్లోకాల స్పీడ్‌కు సీఎం జగన్ ఫిదా
-
సీఎం జగన్‌ను అభినందించిన చినజీయర్ స్వామి
-
శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
ఐదోరోజు పరమేష్టి, వైభవేష్టి హోమం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా ఆదివారం ప్రత్యేక హోమాలు, పూజలు చేశారు. ఉదయం అష్టాక్షరీ మంత్ర పఠనంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. తర్వాత లక్ష్మీనారాయణ మహాయాగంలో భాగంగా పరమేష్టి, వైభవేష్టి హోమాన్ని చినజీయర్ స్వామి సారథ్యంలోని రుత్వికులు నిర్వహించారు. మానవుడికి కలిగే కొన్ని రకాల రుగ్మతలకు ఎలాంటి మందులు లేవని.. భగవన్నామ స్మరణ, జపం ద్వారా అలాంటి రుగ్మతలను జయించడమే పరమేష్టి ఉద్దేశమని, పితృదేవతలను సంతృప్తిపరుస్తూ వారి అనుగ్రహాన్ని పొందడమే వైభవేష్టి ఉద్దేశమని రుత్వికులు వెల్లడించారు. 115 యాగశాలల్లోని 1,035 యజ్ఞ కుండాల వద్ద వేదమంత్రోచ్ఛరణల మధ్య ఈ హోమం జరిగింది. తర్వాత మూలమంత్ర హవనం, 108 తర్పనం, 28 పుష్పాంజలి, చివరిగా పూర్ణాహుతి నిర్వహించారు. అదే సమయంలో ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర శతనామావళి, శ్రీరంగనాథ భగవానుడి పూజ జరిగాయి. ప్రవాస విద్యార్థులతో అవధానం అమెరికాలో ప్రజ్ఞ కోర్సు ద్వారా శిక్షణ పొందిన ఎనిమిది మంది ప్రవాస భారతీయ విద్యార్థులతో చినజీయర్ స్వామి చేపట్టిన అవధాన కార్యక్రమం భక్తుల్ని మంత్రముగ్ధులను చేసింది. ప్రవచన మండపంలో జరిగిన ఈ అవధానాన్ని భగవద్గీత శ్లోకాలతో మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరిగా.. ప్రతి శ్లోకం చివరి అక్షరంతో మొదలయ్యే మరో శ్లోకాన్ని అందుకుంటూ, దాని అర్థాన్ని వివరిస్తూ వచ్చారు. కార్యక్రమం అనంతరం ప్రవాస విద్యార్థులు అభిరాం, అముక్త మాల్యద, అనిరుధ్, కోవిద, మహేశ్వరి, మాధవప్రియ, వేద, శ్రీలతలను చినజీయర్ స్వామి ఆశీర్వదించి, సమతామూర్తి ప్రతిమలను బహుకరించారు. కిటకిటలాడిన శ్రీరామనగరం శంషాబాద్: ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి భారీ విగ్రహాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు, సందర్శకులతో ప్రాంగణం కిటకిటలాడింది. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది తరలివచ్చారు. వారిని భద్రవేదికపై ఆశీనులైన ప్రధాన విగ్రహం వరకు క్యూలైన్లో అనుమతించారు. హైకోర్టు న్యాయమూర్తులు పోనగంటి నవీన్‌రావు, జస్టిస్ అభిషేక్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాజస్థాన్ పుష్కార్ జగద్గురు స్వామి రామచంద్రాచార్య మహారాజ్, బిహార్‌లోని గయకు చెందిన జగద్గురు శ్రీస్వామి వెంకటేశ ప్రపంచార్యాజీ మహారాజ్, సిక్కిం ఇక్ఫాయ్ యూనివర్సిటీ వీసీ జగన్నాథన్ పట్నాయక్ తదితరులు కూడా సమతామూర్తిని దర్శించుకున్నారు. మొత్తంగా ఆదివారం ఒక్కరోజే దాదాపు లక్ష మంది వచ్చినట్టు అంచనా వేశారు. నేటి కార్యక్రమాలివీ.. సోమవారం రోజున యాగశాలలో దృష్టి దోష నివారణకు సంబంధించిన వైయ్యూహి కేష్టి యాగాన్ని నిర్వహించనున్నారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి మూలమైన శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ జరుగనుంది. వీటితోపాటు పలువురు ప్రముఖుల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. -
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఏపీ సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం హైదరాబాద్ వెళ్లనున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామ నగరంలో నిర్వహిస్తున్న శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి వేడుకల ప్రాంతానికి వెళ్తారు. శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. తిరిగి రాత్రి 9.05 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు. చదవండి: మీరు లేకపోతే నేను లేనని గుర్తు పెట్టుకోండి: సీఎం వైఎస్ జగన్ -
‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ సమానత్వానికి నిలువెత్తు చిహ్నం: మోదీ
సాక్షి, హైదరాబాద్:‘‘జగద్గురు రామానుజాచార్యుల బోధనలు, ఆయన చాటిన ఆధ్యాత్మిక చైతన్యమే వేల ఏళ్ల బానిసత్వంలోనూ భారతీయులను చైతన్యవంతులుగా నిలిపాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. ప్రస్తుతం స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను, పోరాట యోధులను గుర్తు చేసుకుంటూ 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట జరుపుకొంటున్నామని గుర్తు చేశారు. నాటి స్వాతంత్య్ర పోరాటం అధికారం, హక్కుల కోసమే కాకుండా వేల ఏళ్ల సంస్కృతి పరిరక్షణ కోసం జరిగిందని తెలిపారు. ఆ పోరాటంలో పాటించిన ఆధ్యాత్మిక, మానవీయ విలువలు మనకు రామానుజాచార్యుల వంటి వారి బోధనల నుంచే లభించాయన్నారు. ప్రధాని మోదీ శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న శ్రీరామానుజుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 216 అడుగుల భారీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ వివరాలు ప్రధాని మాటల్లోనే.. ఆయన విలువలు, ఆదర్శాలే మార్గం.. ‘‘రామానుజులు దక్షిణాదిలో జన్మించినా ఆయన బోధనలు అన్నమాచార్యులు, కనకదాసు మొదలుకుని తులసీదాస్, కబీర్దాస్ వంటి సాధు సంతుల ఉపదేశాలు, సందేశాల ద్వారా దేశమంతటా విస్తరించి ఏకత్వాన్ని బోధించాయి. ఆయనను పరమ గురువుగా చిరస్థాయిలో నిలిపాయి. రామానుజులు తన బాగు కంటే జీవకోటి సంక్షేమానికే ఎక్కువ ఆరాటపడ్డారు. ఎంతో శ్రమకోర్చి నేర్చుకున్న గురుమంత్రాన్ని రహస్యంగా ఉంచాలనే గురువు మాటను కాదని.. తాను నరకానికి వెళ్లినాసరే మిగతా వారికి మేలు కలగాలనే ఉద్దేశంతో ఆలయ శిఖరంపైకి ఎక్కి అందరికీ మంత్రాన్ని ఉపదేశించారు. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి మార్గనిర్దేశం కావాలని కోరుకుంటున్నాను. గురువు ద్వారానే మనకు జ్ఞానం లభిస్తుంది. ఇది భారతీయ సాంప్రదాయం. మనం అనుసరిసున్న విలువలు, ఆదర్శాలు యుగయుగాలుగా మానవాళికి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నాయి. ఆ విలువలు, ఆదర్శాలను మనం ఈరోజు రామానుజాచార్యుల విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటున్నాం. రామానుజుల మార్గం రాబోయే సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా ప్రాచీన భారతీయతను కూడా బలోపేతం చేస్తుంది. విశిష్టాద్వైత బోధనతో.. అంబేడ్కర్ వంటివారు రామానుజాచార్యులను ప్రశంసించడంతోపాటు ఆయన బోధనల నుంచి నేర్చుకోవాలని అనేవారు. మన దేశంలో పూర్వకాలం నుంచీ వివిధ వాదాలు, సిద్ధాంతాలను విశ్లేషించి స్వీకరించడమో, తిరస్కరించడమో కాకుండా.. అందులోని మంచిని వివిధ రూపాల్లో ఆచరించే సాంప్రదాయం ఉండేది. అదే రీతిలో రామానుజాచార్యులు కూడా అద్వైత, ద్వైత సిద్ధాంతాలను సమ్మిళితం చేసి విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు. తన బోధనల్లో కర్మ సిద్ధాంతాన్ని ఉత్తమ రీతిలో ప్రస్తావించడంతోపాటు స్వయంగా తన పూర్తి జీవితాన్ని అందుకోసమే సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చర్చిస్తున్న ప్రగతిశీలత, సామాజిక సమస్యల పరిష్కారం వంటి ఎన్నో అంశాలను రామానుజులు తన సంస్కృత, తమిళ గ్రంథాల్లో ఎప్పుడో లేవనెత్తారు. సమానత్వాన్ని బోధిస్తున్న ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’.. ఆదర్శాలు, సత్యం అనే ఆభరణాలు లేని గాంధీని, ఆయన లేని స్వాతంత్య్ర పోరాటాన్ని మనం ఊహించలేం. హైదరాబాద్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఏకత్వాన్ని.. రామానుజాచార్యుల ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ సమానత్వాన్ని బోధిస్తున్నాయి. అధికారం లేదా బలం మీద కాకుండా ఏకత్వం, సమానత్వం, సమాదరణ అనే సూత్రాల మీద మనదేశం ఆధారపడి ఉంది. నేడు ఆవిష్కరించిన రామానుజుల విగ్రహం దేశవాసులకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది. ఈ సమతాస్ఫూర్తితోనే ఎలాంటి అంతరాలు లేకుం డా ప్రతిఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పేదలకు పక్కాఇళ్లతోపాటు, ఉచిత గ్యాస్, రూ.5లక్షల వరకు ఉచిత ఆరోగ్య చికిత్సలు, ఉచిత విద్యుత్ కనెక్షన్లు, జనధన్ ఖాతాలు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాల ద్వారా పేదలు, వెనుకబడిన వర్గాలకు మేలు కలు గుతోంది. ఈ రోజు ఇక్కడ నాకు 108 దివ్యదేశ మందిరాల సందర్శన భాగ్యం లభించింది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. మూఢ విశ్వాసాలను అధిగమిస్తూ.. వెయ్యేళ్ల క్రితం సమాజంలో బలంగా ఉన్న మూఢ, అంధ విశ్వాసాలను అధిగమిస్తూ భారతీయ ఆలోచన ధారను రామానుజాచార్యులు సమాజానికి పరిచయం చేశారు. వెనుకబడిన తరగతులు, దళితుల పట్ల సమాజంలో ఉన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ, వారిని చేరదీసి గౌరవించారు. యాదగిరిపై నారాయణ మందిరం నిర్మించి దళితులకు దర్శనం, పూజలు చేసే అధికారం కల్పించారు. రామానుజాచార్యుల గురువు వేరే జాతి వ్యక్తి అంత్యక్రియలు చేస్తే వచ్చిన విమర్శలపై సమాధానమిస్తూ.. ‘రాముడు జటాయువు అంత్యక్రియలు జరిపినపుడు ఇది ఎలా తప్పు అవుతుంది?’ అని నిలదీశారు. యుగాల నుంచి పరిశీలించి చూస్తే.. చెడు విస్తరించినపుడల్లా మన మధ్య నుంచే మహానుభావులు పుట్టి.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, అనేక కష్టనష్టాలకు ఎదురొడ్డి నిబద్ధతతో పోరాటం చేశారు. సమాజం దానిని అర్థం చేసుకున్నప్పుడు ఆదరణ లభిస్తుంది. రామానుజులు సమాజాన్ని మంచి మార్గంలో నడిపేందుకు.. ఆధ్యాత్మిక, వ్యక్తిగత జీవితాన్ని ఆచరణలో చూపారు. తాను స్నానం చేసి వచ్చే సమయంలో శిష్యుడు ధనుర్దాసు భుజాల మీద చేయివేసి నడవడం ద్వారా అంటరానితనం సరైనది కాదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీది రాజ ధర్మం చినజీయర్ స్వామి నిత్యం ప్రజల శ్రేయస్సును కాంక్షించే శ్రీరామచంద్రుడు వ్రత సంపన్నుడుగా ప్రసిద్ధికెక్కాడని.. ఇప్పుడు దేశప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని మోదీ కూడా వ్రత సంపన్నుడేనని త్రిదండి చినజీయర్ స్వామి కొనియాడారు. మనుషులంతా ఒక్కటేననే స్ఫూర్తిని వెయ్యి సంవత్సరాలకు పూర్వమే రామానుజులు వ్యక్తపరిచారని.. ఆయన స్ఫూర్తిని మోదీ చాటుతున్నారని పేర్కొన్నారు. ‘‘వాల్మీకి రామాయణంలో ప్రజల సుఖసంతోషాల కోసం ప్రభువు చేసే త్యాగాలు, ధైర్య సాహసాలన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో కనిపిస్తున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలు తలెత్తుకునేలా పాలన సాగిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను ముందు వరుసలో నిలిపేలా ఆయన కృషి చేస్తున్నారు. అందుకే నరేంద్ర మోదీకి మాత్రమే ప్రధాని స్థానం సరిపోలుతుంది. ప్రజా సంక్షేమం కోసం ఏయే పనులు చేయాలో మోదీకి తెలుసు. సమయానుకూలంగా వాటిని చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. రాజధర్మాన్ని అత్యంత స్పష్టంగా అమలు చేస్తున్నారు. సబ్‌కాసాత్– సబ్కా వికాస్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు.’’అని చినజీయర్‌స్వామి ప్రశంసించారు. ధర్మపాలన చేసే ప్రభువు నియమనిష్టలతో ఉండాలన్నారు. సమానత్వమే మా సిద్ధాంతం: కిషన్‌రెడ్డి మనుషులంతా సమానమేనని రామానుజులు వెయ్యేళ్ల కింద చాటి చెప్పారని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సమానత్వ సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. కొందరు విచ్ఛిన్నకర కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ మనందరం రామానుజుల స్ఫూర్తితో సమానత్వంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. చినజీయర్ స్వామి ముచ్చింతల్‌లో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఈ సమతా స్ఫూర్తి కేంద్రం అంతర్జాతీయ స్థాయి దివ్యక్షేత్రంగా వెలుగొందుతుందని ఆకాంక్షించారు. మోదీ ప్రభుత్వం కాశీ క్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. గుజరాత్లో సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం, హైదరాబాద్‌లో రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహం ఎంతో ప్రసిద్ధి చెందుతాయని చెప్పారు. దేశం మొత్తానికి 1947లోనే స్వాతంత్య్య్రం లభించినా.. మనకు (హైదరాబాద్ స్టేట్‌కు) ఒక ఏడాది తర్వాత స్వాతంత్య్య్రం లభించిందన్నారు. అది కూడా సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ చొరవతో వచ్చిందని పేర్కొన్నారు. -
రామానుజులు కట్టిన వెయ్యేళ్ల ఆనకట్ట.. మరోసారి తెరపైకి
సాక్షి, హైదరాబాద్: నిరంతరం భగవన్నామ స్మరణలో ఉండే గురువులు.. చుట్టూ ఉన్న ప్రాణికోటి మేలు కోసం ఆలోచించాలన్నదే శ్రీరామానుజుల తత్వం. ఈ తపనతోనే ఆయన దాదాపు వెయ్యేళ్ల కింద ఓ జలాశయ నిర్మాణానికి పూనుకున్నారు. తాను కొంతకాలం నివసించిన ప్రాంతంలో నీటి కరువు లేకుండా చేశారు. అదే కర్ణాటకలోని తొండనూరులో ఉన్న తిరుమల సముద్రం. ఇప్పటికీ వేల ఎకరాలకు నీళ్లిస్తున్న ఈ సరస్సు.. రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రైతుల బాధ చూసి.. అప్పట్లో రామానుజాచార్యులు తమిళనాడులోని శ్రీరంగాన్ని వదిలి కర్ణాటక ప్రాంతానికి వచ్చారు. మేల్కోటికి వెళ్తూ ప్రస్తుత మాండ్యా జిల్లాలోని తొండనూరులో కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలో హొయసల రాజ్యానికి రెండో రాజధానిగా తొండనూరు ఉందని చరిత్ర చెబుతోంది. ఆ రాజ్య ప్రతినిధి తొండనూరు నంబి రామానుజులను స్వాగతించారు. అయితే అక్కడ తరచూ కరువుతో రైతులు ఇబ్బందిపడు తుండటాన్ని చూసిన రామానుజులు.. తానే ఇంజనీరుగా అవతారమెత్తి.. వర్షాధార పెద్ద చెరువుకు చివరలో ఉన్న రెండు గుట్టలను జోడిస్తూ ఆనకట్ట కట్టించారు. దాంతో చిన్న చెరువు.. 2200 ఎకరాల భారీ సరస్సుగా మారింది. దానికి తిరుమల సముద్రంగా పేరుపెట్టారు. దేశంలో ప్రాచీన ఆనకట్ట ఇదేనని చరిత్ర పరిశోధకులు చెప్తున్నారు. వెయ్యేళ్ల కిందటి ఈ జలాశయం ఒక్కసారి కూడా ఎండలేదని స్థానికులు అంటున్నారు. తమ సమస్య తీర్చడంతో స్థానికులు 35 అడుగుల ఎత్తుతో రామానుజాచార్య విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు. సరస్సు నుంచి నీళ్లు ఓ చిన్న జల పాతంలా దిగువకు ప్రవహిస్తాయి. దాన్ని రామానుజ గంగగా పిలుస్తుంటారు. నీటి అడుగున గులకరాళ్లు స్పష్టంగా కనిపించేంత తేటగా నీళ్లుండటంతో.. టిప్పు సుల్తాన్ ఈ సరస్సుకు మోతీ తలాబ్ అని పేరు పెట్టాడు. తర్వాత ఆయనే దాని ఆనకట్టను కొంత ధ్వంసం చేయించారని.. తర్వాత బ్రిటిష్ పాలకులు మరమ్మతు చేయించారని చెబుతారు. జైనం నుంచి వైష్ణవంలోకి.. తొండనూరు ప్రాంతాన్ని పాలిస్తున్న హొయసల రాజు బిత్తి దేవ మొదట్లో జైనమతాన్ని ఆచరించేవారు. ఆయన కుమార్తెకు ఏదో వింత మానసిక సమస్య తలెత్తి, పరిష్కారం దొరక్క మనోవేదనకు గురయ్యారు. చివరకు రామానుజులను ఆశ్రయించటంతో.. రాజు కుమార్తెకు తిరుమల సముద్రంలో స్నానం చేయించి విష్ణు ఆరాధన చేయించారు. కొంతకాలానికి ఆమె సమస్య తగ్గటంతో బిత్తి దేవరాజు రామానుజులను అనుసరిస్తూ వైష్ణవ సంప్రదాయాన్ని స్వీకరించారు. తన పేరును విష్ణువర్ధనుడిగా మార్చుకుని.. ఆ ప్రాంతంలో అద్భుత నిర్మాణ శైలితో నంబి నారాయణ దేవాలయాన్ని నిర్మించారు. రామానుజులు నిర్మించిన పంచ నారాయణ దేవాలయాల్లో ఇదీ ఒకటిగా, పర్యాటక క్షేత్రంగా వెలుగొందుతోంది. -
ఆ విగ్రహం రామానుజ ఆదర్శాలకు ప్రతీక: ప్రధానమంత్రి మంత్రి మోడీ
-
మోడీ ముందే స్పీచ్ అదరగొట్టిన కిషన్ రెడ్డి
-
ఈ మూర్తి.. జగతికి స్ఫూర్తి
సాక్షి, హైదరాబాద్: జగద్గురు రామానుజాచార్యుల బోధనలు, ఆయన చాటిన ఆధ్యాత్మిక చైతన్యమే వేల ఏళ్ల బానిసత్వంలోనూ భారతీయులను చైతన్యవంతులుగా నిలిపాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. నాటి స్వాతంత్య్ర పోరాటం అధికారం, హక్కుల కోసమే కాకుండా వేల ఏళ్ల సంస్కృతి పరిరక్షణ కోసం జరిగిందని తెలిపారు. ఆ పోరాటంలో పాటించిన ఆధ్యాత్మిక, మానవీయ విలువలు మనకు రామానుజాచార్యుల వంటి వారి బోధనల నుంచే లభించాయన్నారు. ప్రధాని మోదీ శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న శ్రీరామానుజుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 216 అడుగుల భారీ రామానుజాచార్యుల విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ వివరాలు ప్రధాని మాటల్లోనే.. ఆయన విలువలు, ఆదర్శాలే మార్గం ‘‘రామానుజులు దక్షిణాదిలో జన్మించినా ఆయన బోధనలు దేశమంతటా విస్తరించి ఏకత్వాన్ని బోధించాయి. ఆయనను పరమ గురువుగా చిరస్థాయిలో నిలిపాయి. రామానుజులు తన బాగుకంటే జీవకోటి సంక్షేమానికే ఎక్కువ ఆరాటపడ్డారు. ఎంతో శ్రమకోర్చి నేర్చుకున్న గురుమంత్రాన్ని రహస్యంగా ఉంచాలనే గురువు మాటను కాదని.. తాను నరకానికి వెళ్లినాసరే మిగతా వారికి మేలు కలగాలనే ఉద్దేశంతో ఆలయ శిఖరంపైకి ఎక్కి అందరికీ మంత్రాన్ని ఉపదేశించారు. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి మార్గనిర్దేశం కావాలని కోరుకుంటున్నాను. మనం అనుసరిసున్న విలువలు, ఆదర్శాలను మనం ఈరోజు రామానుజాచార్యుల విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటున్నాం. రామానుజుల మార్గం రాబోయే సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా ప్రాచీన భారతీయతను కూడా బలోపేతం చేస్తుంది. విశిష్టాద్వైత బోధనతో.. అంబేద్కర్ వంటివారు రామానుజాచార్యులను ప్రశంసించడంతోపాటు ఆయన బోధనల నుంచి నేర్చుకోవాలని అనేవారు. మన దేశంలో పూర్వకాలం నుంచీ వివిధ వాదాలు, సిద్ధాంతాలను విశ్లేషించి స్వీకరించడమో, తిరస్కరించడమో కాకుండా.. అందులోని మంచిని వివిధ రూపాల్లో ఆచరించే సాంప్రదాయం ఉండేది. అదే రీతిలో రామానుజాచార్యులు కూడా అద్వైత, ద్వైత సిద్ధాంతాలను సమ్మిళితం చేసి విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు. తన బోధనల్లో కర్మ సిద్ధాంతాన్ని ఉత్తమ రీతిలో ప్రస్తావించడంతోపాటు స్వయంగా తన పూర్తి జీవితాన్ని అందుకోసమే సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చర్చిస్తున్న ప్రగతిశీలత, సామాజిక సమస్యల పరిష్కారం వంటి ఎన్నో అంశాలను రామానుజులు తన సంస్కృత, తమిళ గ్రంథాల్లో ఎప్పుడో లేవనెత్తారు. మూఢ విశ్వాసాలను అధిగమిస్తూ.. వెయ్యేళ్ల క్రితం సమాజంలో బలంగా ఉన్న మూఢ, అంధ విశ్వాసాలను అధిగమిస్తూ భారతీయ ఆలోచన ధారను రామానుజాచార్యులు సమాజానికి పరిచయం చేశారు. వెనుకబడిన తరగతులు, దళితుల పట్ల సమాజంలో ఉన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ, వారిని చేరదీసి గౌరవించారు. యాదగిరిపై నారాయణ మందిరం నిర్మించి దళితులకు దర్శనం, పూజలు చేసే అధికారం కల్పించారు. తాను స్నానం చేసి వచ్చే సమయంలో శిష్యుడు ధనుర్దాసు భుజాల మీద చేయివేసి నడవడం ద్వారా అంటరానితనం సరైనది కాదని స్పష్టంచేశాడు. చదవండి: ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం సమానత్వాన్ని బోధిస్తున్న ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’.. ఆదర్శాలు, సత్యం అనే ఆభరణాలు లేని గాంధీని, ఆయన లేని స్వాతంత్య్ర పోరాటాన్ని మనం ఊహించలేం. హైదరాబాద్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ఏకత్వాన్ని.. రామానుజాచార్యుల ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ సమానత్వాన్ని బోధిస్తున్నాయి. అధికారం లేదా బలం మీద కాకుండా ఏకత్వం, సమానత్వం, సమాదరణ అనే సూత్రాల మీద మనదేశం ఆధారపడి ఉంది. రామానుజుల విగ్రహం దేశవాసులకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది. ఈ సమతాస్ఫూర్తితోనే ఎలాంటి అంతరాలు లేకుండా ప్రతిఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రయ త్నిస్తోంది. ఈ రోజు ఇక్కడ నాకు 108 దివ్యదేశ మందిరాల సందర్శన భాగ్యం లభించింది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మైహోం అధినేత రామేశ్వర్రావు పాల్గొన్నారు. ప్రధాని మోదీది రాజధర్మం: చినజీయర్ స్వామి నిత్యం ప్రజల శ్రేయస్సును కాంక్షించే శ్రీరామచంద్రుడు వ్రత సంపన్నుడుగా ప్రసిద్ధికెక్కాడని.. ఇప్పుడు దేశప్రజల కోసం అహర్నిశలు కృషిచేస్తున్న ప్రధాని మోదీ కూడా వ్రత సంపన్నుడేనని త్రిదండి చినజీయర్ స్వామి కొనియాడారు. మనుషులంతా ఒక్కటేననే స్ఫూర్తిని వెయ్యి ఏళ్లకు పూర్వమే రామానుజులు వ్యక్తపరిచారని.. ఆయన స్ఫూర్తిని మోదీ చాటుతున్నారని పేర్కొన్నారు. ‘‘వాల్మీకి రామాయణంలో ప్రజల సుఖసంతోషాల కోసం ప్రభువు చేసే త్యాగాలు, ధైర్య సాహసాలన్నీ మోదీలో కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో భారత్‌ను ముందు వరుసలో నిలిపేలా ఆయన కృషిచేస్తున్నారు. అందుకే ఆయనకే ప్రధాని స్థానం సరిపోలుతుంది. సబ్‌కాసాత్– సబ్కా వికాస్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు.’’అని చినజీయర్‌స్వామి ప్రశంసించారు. కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. మనుషులంతా సమానమేనని రామానుజులు వెయ్యేళ్ల కింద చాటి చెప్పారని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సమానత్వ సిద్ధాంతాన్ని అమలుచేస్తోందన్నారు. కొందరు విచ్ఛిన్నకర కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ మనందరం రామానుజుల స్ఫూర్తితో సమానత్వంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. -
5న రాష్ట్రానికి ప్రధాని.. పకడ్బందీ భద్రత ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 5న రాష్ట్రంలో పర్యటించనున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలతో పాటు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొననున్నారు. శనివారం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఇక్రిసాట్‌కు చేరుకోనున్న ప్రధాని సంస్థ స్వర్ణోత్సవాలను ప్రారంభించనున్నారు. ఇక్రిసాట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీని ప్రారంభిస్తారు. స్వర్ణోత్సవాలు పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన ఇక్రిశాట్ లోగోతో పాటు స్మారక స్టాంపును సైతం ఆవిష్కరించనున్నారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగనున్న స్వర్ణోత్సవ కార్యక్రమంలో మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి ప్రధాని చేరుకుంటారు. పంచలోహాలతో రూపొందించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామానుజాచార్యుల జీవిత ప్రస్థానం, బోధనలపై 3డీ మ్యాపింగ్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. సమతామూర్తి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాలను సైతం ప్రధాని సందర్శిస్తారు. ఏర్పాట్లు కట్టుదిట్టం ప్రధాని పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై గురువారం ఆయన వివిధ శాఖలతో బీఆర్కేఆర్ భవన్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తును ‘బ్లూ బుక్’ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేదికల వద్ద నిపుణులైన వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అన్నిచోట్లా కోవిడ్–19 ప్రోటోకాల్ పాటించేలా చూడాలన్నారు. వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేపట్టాలని, కోవిడ్–19 స్క్రీనింగ్ బృందాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే రహదారుల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను కార్యక్రమాల నిర్వాహకులతో సమన్వయ పరుచుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంధన, హౌసింగ్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ , జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు. 7 వేల మంది పోలీసులతో బందోబస్తు సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా సుమారు 7 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఇప్పటికే బందోబస్తులో నిమగ్నమయ్యారు. సైబరాబాద్‌లో ఉన్న 4 వేల మంది సిబ్బందితో పాటు ఇతర కమిషనరేట్లు, జిల్లాల పోలీస్ యూనిట్ల నుంచి మరో 3 వేల మందిని విధుల్లో నియమించారు. వీరిలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను ప్రత్యేకంగా భద్రత చర్యల నిమిత్తం నియమించారు. సైబరాబాద్‌లో పనిచేస్తున్న మొత్తం ఐపీఎస్ అధికారులు, డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లను పూర్తి స్థాయిలో రంగంలోకి దింపారు. -
సర్వమానవ సమానత్వానికే..
సాక్షి, హైదరాబాద్: రామానుజాచార్య సర్వ మానవ సమానత్వం కోసం కృషి చేశారని, జాతి, కుల, మత, లింగ వివక్షలు కూడదని బోధించారని అందుకే దీనిని సమతా పండుగ (ఫెస్టివల్ ఆఫ్ ఈక్వాలిటీ)గా పిలుస్తున్నామని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. విశ్వమంతా ఒకే కుటుంబం అనే భావనను, వసుదైవ కుటుంబం స్ఫూర్తిని అందించేందుకే ఈ పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు. శంషాబాద్‌లోని ముంచింతల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల వెయ్యేళ్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సహస్రాబ్ది సమారోహం సంరంభం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవాలకు చినజీయర్ స్వామి సారథ్యం వహించారు. తాము తలపెట్టిన మహా యజ్ఞం నుంచి వెలువడే పొగ, పరిమళాల వల్ల మానవాళి ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు. ఈ మహా క్రతువులో వేలాది మంది పాల్గొంటుండడం ఆనందంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక పారవశ్యంలో భక్తులు తొలుత రామానుజాచార్యుల శోభాయాత్రను కనుల పండుగగా నిర్వహించారు. సాయంత్రం ప్రపంచంలోనే మున్నెన్నడూ జరగనంత భారీ స్థాయిలో లక్ష్మీనారాయణ మహా యజ్ఞానికి అంకురార్పణ చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో 5 వేల మంది రుత్వికులు, 1,035 హోమ కుండాలు, 144 హోమశాలలు, 2 ఇష్టి శాలలు ఈ మహా క్రతువులో భాగం అయ్యాయి. యాగానికి సిద్ధం చేయడంలో భాగంగా భూమి శుద్ధి చేసి విష్వక్సేనుడి పూజ చేశారు. అలాగే హోమద్రవ్యాల శుద్ధి, వాస్తు శాంతిలో భాగంగా వాస్తు పురుషుడిని ప్రతిష్టించి పూజ నిర్వహించారు. యాగశాలల్లో రుత్వికులు వేద మంత్రోచ్ఛారణ చేస్తూ, మంత్రరాజంగా పేరొందిన అష్టాక్షరి మహా మంత్రాన్ని పఠిస్తూ, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు పారాయణం చేస్తూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులలో ఆధ్యాత్మిక పారవశ్యాన్ని నింపారు. అష్టాక్షరి మహామంత్ర జపం 12 రోజుల పాటు నిర్విరామంగా సాగనుంది. ఉత్సవాలు ముగిసే సమయానికి మొత్తంగా కోటిసార్లు జపించాలనే భారీ లక్ష్యాన్ని చేరుకోనుంది. తరలివచ్చిన స్వాములు, విదేశీ భక్తులు, ప్రముఖులు ఈ సమతా పండుగకు దేశ విదేశాల నుంచి భక్తులు, రుతి్వకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అహోబిల జీయర్‌స్వామి, దేవనాథ జీయర్ స్వామి, రామచంద్ర జీయర్ స్వామి, రంగ రామానుజ జీయర్ స్వామి, అష్టాక్షరి జీయర్ స్వామి, వ్రతధర జీయర్ స్వామి తదితర అతిరథ మహారథులనదగ్గ స్వాములు తరలివచ్చారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వందలాదిగా భక్తులు, 20 మంది రుత్వికులు రావడం విశేషం. యూరప్ నుంచి, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న నగర యువత సైతం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సెలవు పెట్టి మరీ వాలంటీర్లుగా ఇక్కడ సేవలు అందిస్తుండడం విశేషం. -
Statue Of Equality: రామానుజ సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు
భగవద్రామానుజులవారు భూమిపై అవతరించి ఇప్పటికి వెయ్యేళ్ళు దాటింది. సమాజంలో అసమానతలు తలెత్తి ఎవరికి వారు వేరు వేరంటూ కొందరిని దూరం పెడుతూ... భగవంతుని చేరే మార్గం కొందరి దగ్గరే ఉంచుకుని.. వేరెవరికీ ఇది తెలియ రాదనే కట్టుబాట్లు చాలా కఠినంగా అమలవుతున్న ఆ కాలంలో.. మిగిలినవారంతా భగవంతుని చేరుకోవడానికి నేనొక్కడినీ నరకానికి పోయినా పర్లేదని అప్పటి కట్టుబాట్లను దాటి మానవులందరిని భగవంతుని వద్దకు చేర్చే అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిరంగంగా గోపురమెక్కి అందరికీ చెప్పిన భగవదవతారం శ్రీమద్రామానుజులు. నాటి వారి స్ఫూర్తిని నేటికీ నిలుపుతూ వారు పంచిన సమతను మరోసారి ప్రపంచానికి తెలియజేయాలనీ.. మానవులందరూ వారి బోధనలను తెలుసుకోవాలనీ... ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో నడవాలని.. మరో వెయ్యేళ్ళు రామానుజులవారిని మనమంతా గుర్తుంచుకోవాలని రామానుజ సహస్రాబ్ది సందర్భంగా వెలసినదే సమతా కేంద్రం. ఈ సందర్భంగా హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో రామానుజ సమతా కేంద్రం నిర్మాణ విశేషాలు.. రామానుజులవారి జీవిత విశేషాలు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి ఎన్నో ఏళ్ల కల నేడు నిజమైంది. నేటినుంచి ‘రామానుజ సహస్రాబ్ది సమారోహం’ ప్రారంభం కానుంది. పన్నెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి, దేశప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలైన పాలకవర్గం, మరోవైపు ఆధ్యాత్మిక సంప్రదాయానికి సంబంధించిన అనేకమంది పీఠాధిపతులు.. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. విహంగ వీక్షణ దివ్యవిమానశిఖరాలు.. ఎత్తైన గోపురాలు.. గొప్ప శిల్పకళాశోభితమైన మండపాలు... అనేక ప్రాచీన శిల్పశైలీసంపన్నమైన స్వాగతతోరణాలు.. రామానుజ ఆచార్యాభిషేకం చేసే లీలాజలనీరాజనం (వాటర్ ఫౌంటెన్)... పచ్చటి ఉద్యానవనాలు... సర్వతోభద్ర మండలాకృతిలో రూపొందించిన 108 దివ్యదేశ దేవాలయాలు...ఆచార్య పురుషుని చేరుకునే ఉజ్జీవన సోపానమార్గం... ఆపై భద్రవేదిపై. పద్మాసనంపై ఆసీనులై ప్రసన్న మందస్మిత వదనంతో దర్శనమిచ్చే భగవద్రామానుజులవారి దివ్య విగ్రహం దర్శించినవారి మనస్సు ఆనందంతో ఉప్పొంగక మానదు. ప్రవేశద్వారం ఉన్నతమైన రామానుజులవారి విగ్రహాన్ని దర్శించేందుకు వచ్చిన భక్తులు ముందుగా ప్రవేశద్వారం వద్ద ఉన్న శిల్పకళను చూసి అచ్చెరువొందుతారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రవేశద్వారం నుండి నిష్క్రమణ ద్వారం వరకు ఉన్న శిల్పకళను పరిశీలనగా చూడాలంటే రెండు కళ్లూ సరిపోవు. వాటి విశేషాలను తెలుసుకోవడానికి ఒకరోజు చాలదు. ఇందులో భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవమంతా కొలువుతీరింది. ఒకవైపు ప్రవేశద్వారం.. మరోవైపు నిష్క్రమణద్వారం.. వీటి మధ్యలో ఉన్న అనేక మండపాలు.. స్వాగతతోరణాలు.. మొదలైనవాటి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. విజయనగరనిర్మాణమైన రాతిరథాన్ని గుర్తుకు తెచ్చే రెండు శిలానిర్మిత రథాలను రెండు ఏనుగులు లాగుతున్న దృశ్యం.. వైష్ణవసంప్రదాయంలో భక్తికి ప్రతీకలుగా నిలిచిన గరుడ, హనుమ విగ్రహాలు ఇరువైపులా ఎత్తైన మండపాల్లో కొలువుతీరాయి. హంసద్వారం.. యాళిద్వారం... వాటిపై కాకతీయ స్వాగతతోరణాలను నిర్మించిన తీరు ఈ నేలపై పరిఢవిల్లిన ఒకప్పటి సామ్రాజ్య వైభవాన్ని గుర్తుకు తెస్తుంది. దక్షిణాది, ఉత్తరాది శిల్పౖ శెలులను గుర్తుకు తెచ్చే అనేక విమానశిఖరాలు.. ఆలయగోపురాలు ఇక్కడ కనిపిస్తాయి. ఒక్కసారి ఆమూలాగ్రం ఈ వరుసను పరికిస్తే భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవం కళ్లముందు నిలుస్తుంది. భూమిపై ధర్మానికి ఆపద కలిగినప్పుడు దుష్టశిక్షణ.. శిష్టరక్షణకు చేయడానికి భగవంతుడు అవతరిస్తాడు. రామానుజులవారు తమిళనాడులో శ్రీపెరంబుదూరులో పింగళనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన ఆర్ద్రానక్షత్రంలో రామానుజాచార్యుడు జన్మించాడు. ఆయన తండ్రిపేరు ఆసూరి కేశవ సోమయాజి, తల్లిపేరు కాంతిమతి. సమతామార్గం భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అందరూ మోక్షం పొందడానికి అర్హులే అని చాటి చెప్పిన మహనీయుడు శ్రీమద్రామానుజులు. అందుకే ఆయన దేవుని దరిచేర్చే అష్టాక్షరీమహామంత్రాన్ని అందరికీ వినిపించేలా చెప్పారు. అందరూ సమానమేనని చాటారు. ప్రతి మానవునిలో మాధవుడు కొలువు దీరాడని నిరూపించారు. ఆచార్యుల ఆశయ వారసుడు వైష్ణవ సంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వార్లు ముఖ్యమైనవారుగా పరిగణింపబడుతున్నారు. వీరిలాగే అనేకమంది గురువులు విష్ణుభక్తిని సమాజంలో నెలకొల్పడానికి పాటుపడ్డారు. ఆ కోవలో యామునాచార్యులు ముఖ్యమైన గురుస్థానాన్ని పొందారు. 1042 లో వారు పరమపదించారనే వార్త తెలుసుకొని, వారు వారి జీవితకాలం లో చేయాలనుకుని కలగన్న మూడు కోర్కెలను తీరుస్తానని రామానుజులవారు ప్రతినబూని వాటిని నెరవేర్చారు. యామునాచార్యులవారి వారసత్వాన్ని నిలబెట్టారు. గురువుకే గురువు శ్రీరామానుజాచార్యులవారు పదహారు సంవత్సరాల వరకు శ్రీపెరంబుదూరులోను, ఆ తర్వాత ఎనిమిదేళ్లపాటు తిరుప్పుట్కుళిలోను, పదేళ్లపాటు కంచిలోను వేదాంత విద్యను అధ్యయనం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే అమేయ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. యాదవప్రకాశులనే వేదాంతగురువు పాఠం చెప్తూ విష్ణునేత్రాలను వర్ణిస్తూ వాటికి వింత పోలికలను పోలుస్తూ విచిత్ర ఉపమానాలిస్తున్నప్పుడు రామానుజులవారు అది తప్పని చెబుతూ ‘సూర్యుని రాకతో విచ్చుకున్న తామరల్లా విష్ణునేత్రాలు ఒప్పుతున్నాయి’ అనే శంకరుల భాష్యాన్ని ఉదహరిస్తూ సరైన అర్థాన్ని చెప్పారు. ఇలాంటి సందర్భాలెన్నో. అంతా బ్రహ్మమా? బ్రహ్మమే అంతానా? సర్వం ఖల్విదం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యానికి జగత్తులో ఉన్నదంతా బ్రహ్మపదార్థమే కాని, వేరుకాదు అని అంతవరకూ పండితులు చెప్పిన విశ్లేషణను వ్యతిరేకిస్తూ.. జగత్తులోని అంశలన్నీ భగవంతుని శరీరాలు. అన్నింటిలోనూ భగవంతుని తత్త్వం ప్రకాశిస్తుంటుంది. అంతేకానీ అంశకు, భగవంతునికీ భేదంలేదని చెప్పడం సరికాదన్నారు. బ్రహ్మ అనంతుడంటే సరిపోతుంది కాని, అనంతమే బ్రహ్మ అవుతుందా? అనంతం అంటే అంతం లేనిది అని అర్థం. అంటే అది ఒక గుణాన్ని సూచిస్తుంది కానీ, భగవంతునికి పర్యాయపదం కాదు. సత్య, జ్ఞాన, అనంతాలు భగవంతుని సహజగుణాలు. అటువంటి పరమాత్మని కేవలం సత్యంగాని, జ్ఞానంగాని, అనంతంగాని పరిపూర్ణంగా చిత్రించలేవు కదా! నలుగురి మంచికోసం నరకానికైనా... కాంచీపురంలోనే పెరియనంబి నుండి దివ్యప్రబంధాన్ని, శ్రీశైలపూర్ణుల వద్ద దర్శన రహస్యాలను, వర రంగాచార్యుల నుండి వైష్ణవ దివ్యప్రబంధాలను అధ్యయనం చేశారు. గోష్ఠీపూర్ణులను ఆశ్రయించి వారు పెట్టే పరీక్షలకు తట్టుకుని తిరుమంత్రార్థ రహస్యాన్ని వారివద్దనే గ్రహించారు. ఈ మంత్ర రహస్యాన్ని విన్నవారంతా మోక్షం పొందుతారని గురువులు చెప్పిన ఫలశ్రుతిని గ్రహించారు రామానుజులు. ప్రయాస లేకుండా ప్రజలందరికీ మోక్షం కలిగించాలని ఒకనాడు గుడిగోపురమెక్కి అందరూ వినేలా ఆ మంత్రాన్ని ఉపదేశించారు. అది విన్న గోష్ఠీపూర్ణులవారు. ‘అనర్హులకు ఈ మంత్ర రహస్యాన్ని వివరిస్తే పాపం పొంది నువ్వు నరకానికి పోతావు!’ అని చెప్తే ‘అంతమందికి మేలు జరుగుతున్నప్పుడు నేనొక్కడినే నరకానికి వెళ్లినా పర్వాలేదు’ అని అన్నారు రామానుజులు. వారి గొప్ప మనస్సుకు గోష్ఠీపూర్ణులు ఎంతగానో మెచ్చుకుని. ‘నువ్వు నాకంటే గొప్పవాడివయ్యా!’ అని రామానుజలవారిని గౌరవించారు. రామానుజుల రచనలు – విశిష్ఠ కృతులు రామానుజులవారు శ్రీభాష్యమనే పేరుతో ప్రస్థానత్రయానికి భాష్యం రచించారు. వారు రచించిన శరణాగతి గద్యని ప్రతి నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా మోక్షం లభిస్తుంది. శరణాగతిగద్య, శ్రీరంగగద్య, శ్రీవైకుంఠగద్య అనే మూడింటినీ గద్యత్రయం అంటారు. శ్రీవైష్ణవాలయాలలో పాంచరాత్రాగమోక్తంగా విశిష్ఠసేవలను, కైంకర్యాలను అందించేందుకు, శ్రీవైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ద్రవిడవేదం పట్ల అందరూ గౌరవ, ప్రపత్తులతో మెలిగేటట్లు విశిష్టాద్వైత వ్యాప్తి చేశారు. దేవుడు – జీవుడు రెండుగా లేరు. ఇద్దరూ ఒకటే అంటూ చెప్పేదే అద్వైతం (రెండుగా లేనిది). విశిష్టాద్వైతం అంటే ప్రకృతిని ఉపాయంగా చేసుకొని ఒక్కటిగా ఉండటం. ఈ మార్గాన్ని శ్రీరామానుజాచార్యులవారు బోధించారు. ఎవరైనా శరణాగతిమార్గం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చని, ఆయనతో కలిసి ఒకటి గా ఉండవచ్చని తెలిపారు. అర్చామూర్తిని కొలిచి అర్చామూర్తిగా నిలిచి.. ఎందరో మహాత్ములు తమ చరమాంకంలో భగవంతునిలో లీనమైపోయారు. మరికొందరు సజీవసమాధి పొందారు. ఇంకొందరు దివ్యవిమానంలో ఆకాశమార్గాన దివ్యలోకాలు పొందారు. మరికొందరు దేవతా విగ్రహాలలో లీనమైపోయారు. అయితే తమ జీవితపర్యంతమూ అర్చామూర్తుల అర్చనాది కైంకర్యాలను, ఆలయసేవలను ఏమాత్రం లోటు లేకుండా ఆలయాలలో జీయర్ వ్యవస్థను బలోపేతం చేసి, అర్చామూర్తి ఆరాధనతో అందరూ పరమపదం చేరవచ్చని చాటిన భగవత్ రామానుజులవారు 1137 పింగళ నామ సంవత్సరం మాఘ శుద్ధ దశమినాడు పరమపదించి తన దేహాన్నే విగ్రహంగా మలచుకున్నారు. దానికి సాక్ష్యంగా నేటికీ ఆ విగ్రహం ‘తానాన తిరుమేని’ గా శ్రీరంగంలోని వసంతమంటపంలో దర్శనమిస్తుంది. లీలాజల నీరాజనం (డైనమిక్ ఫౌంటెయిన్) ప్రవేశద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే ఎదురుగా ఒక వాటర్ ఫౌంటెయిన్ కనిపిస్తుంది. ఇది ఒక విశేషమైన నిర్మాణం. దీని చుట్టూ అష్టదళాకృతిలో నీటిని చిమ్ముతూ రెండు వరుసలలో తొట్లు ఉన్నాయి. దానికి మధ్యలో కింద వరుసలో సింహాలు, వాటిపై ఏనుగులు, దానిపై హంసలు ఉంటాయి. వాటిపై అష్టదళపద్మం లోపల రామానుజుల వారి విగ్రహం ఉంటుంది. సింహాలు తామసగుణానికి, ఏనుగులు రాజసగుణానికి, హంసలు సాత్విక గుణానికి ప్రతీకలుగా వాటిపై త్రిగుణాతీతుడైన భగవద్రామానుజులవారు పద్మాలు విచ్చుకుని నిర్ణీత సమయంలో సౌండ్ సిస్టమ్ ద్వారా నీరు పైకెగసి, మధ్యలో చుట్టూ తిరుగుతూ దర్శనం ఇస్తారు. సంప్రదాయ వాద్యాలతో ఏర్పాటు చేసిన ధ్వనితో, నీటి నాట్యంతో జరిగే విన్యాసం చూసిన భక్తులకు దివ్యానుభూతి కలుగుతుంది. ఉజ్జీవన సోపానాలు లీలాజల నీరాజనం దాటి ముందుకు సాగితే భద్రవేదిపై కొలువుతీరిన రామానుజుల దర్శనం చేసుకోవాలని వెళ్లే భక్తులకు ఉజ్జీవనసోపాన మార్గం దర్శనమిస్తుంది. మొత్తం మెట్ల సంఖ్య 108. భగవంతుని దివ్య నామావళి 108ని ప్రతీకగా తీసుకుని ఈ మెట్ల సంఖ్య నిర్ణయించారు. అటూ ఇటూ ఎండవేడిమి, వానతాకిడికి భక్తులు ఇబ్బంది పడకుండా పైన మండపాలు మొత్తం 18 ఉన్నాయి. వీటిని సోపాన మండపాలు అంటారు. భద్రవేది – బంగారు రామానుజులు రామానుజుల విగ్రహం ఉన్న వేదిక ఈ భద్రవేది. ఇది మూడంతస్తుల నిర్మాణం. కింద భాగంలో ప్రవచనమండపం ఉంది. మొదటి అంతస్తులో బంగారు రామానుజులవారు కొలువుతీరే శరణాగత మండపం ఉంది. దీని చుట్టూ స్తంభాలపై 32్ర బహ్మవిద్యల విగ్రహాలున్నాయి. ఈ రామానుజమూర్తి నిర్మాణం కోసం 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. ఈ బంగారు రామానుజుల వారి విగ్రహాన్ని భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈనెల 13న ఆవిష్కరించనున్నారు. దానిపై అంతస్తులో లైబ్రరీ ఏర్పాటు కానుంది. ఈ భద్రవేది పొడవు 54 అడుగులు. చుట్టూ 108 దివ్యదేశాలు భద్రవేది చుట్టూ భారతదేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన 108 దివ్యదేశాలలో 92 క్షేత్రాలను పర్యటించి, ఆ ఆలయాలను పరిశీలించి అదేవిధంగా ఆలయం ఆకృతి, దేవతామూర్తులు ఉండేలా ఈ ఆలయాలను తీర్చిదిద్దారు. భూమిపై ఉన్న ఆలయాలు 106. 107 వది క్షీరసాగరం, 108వది పరమపదం. సర్వతోభద్ర మండలాకృతిలో ఉన్న ఈ ఆలయాల్లో మొదటి ఆలయం శ్రీరంగం కాగా చివరిది పరమపదం. -
మూర్తీ’భవించిన రామానుజ స్ఫూర్తి
శంషాబాద్ రూరల్: నేటి సమాజంలో పెరిగిపోతున్న అసమానతలను రూపుమాపడానికి, రామానుజుల స్ఫూర్తిని అందించడానికి సమతామూర్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి చెప్పారు. బుధవారం నుంచి జరుగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాల నేపథ్యంలో శాంతి భద్రతల కోసం వచ్చిన పోలీసులకు ఆయన ప్రవచనం చేశారు. రామానుజుల విశిష్టతను తెలియజేశారు. కూలీలు మొదలుకొని రైతుల, చిరు ఉద్యోగులు ఈ బృహత్తర కార్యక్రమానికి విరాళాలు ఇచ్చారన్నారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం చాలా ఉందన్నారు. సమారోహ ఉత్సవాలకు బుధవారం అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని విభాగాలతో సమన్వయంతో ముందుకు సాగాలని సిబ్బంది, అధికారులకు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఘట్టానికి సుమారు 7 వేల మంది పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో నిమగ్నం కానున్నారు. ప్రధాన యాగశాల ఏర్పాట్లు పూర్తి రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలకు ప్రధాన యాగశాలను సిద్ధం చేశారు. మరోవైపు సినీ చిత్ర కళాకారుడు ఆనంద్‌సాయి ఆధ్వర్యంలో ప్రవచన మండపంలో వేదికను అందంగా ముస్తాబు చేస్తున్నారు. రెండు వేల మంది సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ మండపం నుంచే ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు వారి ప్రసంగాలు, ప్రవచనాలు ఇవ్వనున్నారు. యాగశాల సమీపంలో ప్రభుత్వ వైద్యశాఖతో పాటు యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య సేవల ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఏటీఎం సౌకర్యం కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. -
రామానుజ విగ్రహ కథా ‘చిత్రమ్’
రామానుజాచార్య సమతామూర్తి విగ్రహం చెంత కొలువుదీరేందుకు పెద్ద సంఖ్యలో వర్ణచిత్రాలు సిద్ధమవుతున్నాయి. శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఉన్న ప్రాధాన్యతకు తగ్గట్టుగా వీటిని తీర్చిదిద్దేందుకు పలువురు చిత్రకారులు వర్ణాలద్దుతున్నారు. ఒకేసారి ఇన్ని చిత్రాలు రూపుదిద్దుకోవడం, పెద్ద సంఖ్యలో ఆర్టిస్టులు భాగస్వామ్యం కావడం ఇదే తొలిసారి అని నగర చిత్రకారులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డిజిల్లా: వేల ఏళ్ల క్రితం నాటి రామానుజుల సందేశాన్ని ప్రపంచానికి చాటాలనే సదాశయంతో నెలకొల్పుతున్న సమతామూర్తి కేంద్రంలో వందలాదిగా వర్ణచిత్రాలు కొలువుదీరనున్నాయి. వీటిని కనువిందుగా చిత్రించే పనిలో రోజుకు కనీసం 50 మంది చిత్రకారులు భాగం పంచుకుంటున్నారు. కూకట్‌పల్లిలో ఉన్న జీవా గురుకులంలో దీని కోసం అతిపెద్ద ఆర్ట్ క్యాంప్ ఏర్పాటైంది. నేపథ్యానికి అనుగుణంగా చిత్రాలను గీసేందుకు నగరానికి చెందిన పలువురు చిత్రకారులు, ఆర్ట్ కాలేజీ విద్యార్థులు కూడా హాజరవుతున్నారు. సమాజంలో ఎన్నో రకాల మంచి మార్పులకు, సర్వ ప్రాణి కోటి సమానత్వానికి, ఆధ్యాత్మిక ఆలోచనల వ్యాప్తికి ఎనలేని కృషి చేసి చరిత్రలో నిలిచిపోయిన రామానుజాచార్యులు జీవితంలోని ముఖ్య ఘట్టాలే నేపథ్యంగా ఈ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. సందేశాత్మకంగా సాగే ఆయన జీవితాన్ని కళ్లకు కట్టేలా మొత్తంగా 350 చిత్రాలు ఈ ఆధ్యాత్మిక పరిసరాల్లో కొలువుదీరనున్నాయి. సమతామూర్తి ప్రాంగణంలో ఉన్న 40 స్తంభాలకు నలువైపులా వీటిని అమరుస్తారు. ఈ పెయింటింగ్స్ కొన్ని 3/3, కొన్ని 3/11 సైజులో తయారవుతున్నాయి. సమతామూర్తి విగ్రహం చెంత ఏర్పాటు చేసేందుకు చిత్రకారులు వేస్తున్న చిత్రాలు నెలాఖరు వరకూ క్యాంప్... చిత్రకళా శిబిరం నెలాఖరు వరకూ కొనసాగనుందని ఈ క్యాంప్‌లో పాల్గొంటున్న నగర చిత్రకారుడు మారేడు రాము చెప్పారు. తాను రామానుజాచార్యుల జీవిత ఘట్టం లోని ముఖ్యమైన ఉపదేశాల సన్నివేశాలను రామానుజాచార్యులు రుషులకు బోధిస్తున్న దృశ్యాలను చిత్రించామని తెలిపారు. ఈ తరహా అతిపెద్ద చిత్రకారుల శిబిరం తన జీవితంలో చూడలేదని, దీనిలో తాను సైతం భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇదొక పెద్ద చిత్రకళా పండుగలా ఉందన్నారాయన. గిన్నీస్ రికార్డ్ సాధించదగ్గ భారీ ఆర్ట్ క్యాంప్‌గా దీనిని చెప్పొచ్చునన్నారు. రేపటితో క్యాంప్ పూర్తవుతుందని తెలిపారు. -
ఆధ్యాత్మిక కేంద్రం కాదు పరివర్తన క్షేత్రం
సాక్షి, హైదరాబాద్: ‘మనుషులు, జంతువులు, పక్షులు, క్రిములు.. చూస్తే అన్నీ వేర్వేరు. కానీ కలిసి సాగితేనే సుఖ జీవనం. మంచి జీవితం కావాలంటే సహజీవనం అవసరం. అదే సమతాభావం.. రామానుజుల తత్వం. కానీ ఇప్పుడు సమాజంలో ఎన్నో వికార పోకడలు. నేనే గొప్ప, నేనే నిలవాలన్న స్వార్థ చింతనలు పెరిగిపోయాయి. ఈ తీరు మారాలి. మన ఇల్లు, ఊరు, సమాజం, దేశం, ప్రపంచం అంతా సంతోషంగా ఉండాలి. అందుకు రామానుజులు చూపిన సమతా మార్గంలో మనం సాగాలి. ఆ దిశగా మేం వేస్తున్న తొలి అడుగు ‘సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం’’.. ఇది త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి చెప్పిన మాట.శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 216 అడుగుల రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్టిస్తూ రూపొందించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం వచ్చే నెల 5న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చినజీయర్ స్వామి ‘సాక్షి’తో మాట్లాడారు. సామాజికంగా సిద్ధాంతాలు ఎన్ని చెప్పినా.. విద్యా విధానం లో విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉంది. విద్యార్థిగా చిన్నప్పుడు పడ్డ బీజాలే వారి భవిష్యత్ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. మనం వాడుకలో నైతికతకు రాముడిని, జీవన విధానానికి భగవద్గీతను మార్గంగా చూపుతాం. కానీ పాఠ్యాంశాల్లోకి వచ్చేసరికి 2,500 ఏళ్లకు ముందు మనకు నాగరికతే లేదని, అప్పుడే శిలాయుగం మొదలైందని అంటున్నాం. ఇలాంటి చదువు చదివినప్పుడు రాముడు, భగవద్గీత, జీవన విధానం, నైతికతలకు ప్రాధాన్యం ఎక్కడుంది? ఈ రెండింటికీ పొంతనేది? దేశీయ సంస్కృతి, సంప్రదాయాలు, మన పూర్వీకుల వైజ్ఞానిక చైతన్యానికి విద్యావిధానంలో చోటు దక్కాలి. ఇప్పటివరకు మన దేశంలో దేవతామూర్తుల భారీ విగ్రహాలున్నాయేగానీ.. ఆది శంకరాచార్యులు, రామానుజులు వంటి గురువుల భారీ మూర్తులు లేవు. ఈ క్రమంలో మహామూర్తిగా శ్రీరామానుజాచార్యుల విగ్రహం రాష్ట్రంలో రూపుదిద్దుకుంది. తాము దీనిని రికార్డు కోసం చేయడం లేదని, దీని వెనుక గొప్ప పరమార్థం దాగి ఉందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వివరించారు. ప్రకృతిలో మనుషులతోపాటు అన్ని జీవులూ సమానమేనన్న రామానుజుల స్ఫూర్తిని అందరం అనుసరించాలని.. ఆ దిశగానే ‘సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం’ను ఏర్పాటు చేస్తున్నామని ‘సాక్షి’కి వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. రామానుజుల ఆలోచనా విధానం 16 శతాబ్దం చివరివరకు కొనసాగింది. ఆంగ్లేయులు వచ్చాక ధ్వంసమైంది. వారు మనుషుల మధ్య అంతరాల మంటలు పెట్టి చలికాచుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఆంగ్లేయుల రీతి కొంత సజీవంగా ఉంది. గణతంత్ర భారతంలో రాజ్యాంగం ప్రసాదించిన సమతాస్ఫూర్తిని ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేకపోతున్నాం. ఎక్కువ మంది రాజకీయ నేతల్లోని నిగూఢమైన స్వార్ధ ప్రవృత్తే దీనికి కారణం. అందుకే.. ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్రం వస్తే.. ఇంకా తెల్లవారలేదు, ఆ చీకట్లు పోలేదు అంటుంటారు. కొత్త విద్యా విధానం రావాలి ఏడెనిమిది శతాబ్ధాలకు పూర్వందాకా అంతరిక్షంలోకి మనిషి వెళ్లనేలేదు. అలాంటిది కొన్ని వేలఏళ్ల కిందటే కచ్చితమైన ఖగోళ రహస్యాలను వరాహమిహిరుడు గ్రంధస్థం చేశారు. ఇలాంటి మన పూర్వీకుల వైజ్ఞానిక అద్భుతాలకు విద్యా విధానంలో చోటుదక్కనప్పుడు.. మన సంప్రదాయ విలువలకు ప్రాధాన్యమే ఉండదు. వైద్యరంగంలో మన పూర్వీకులు అద్భుతాలు చేశారు. కానీ తర్వాతికాలంలో మన సంప్రదాయ వైద్యం, నాటి వైజ్ఞానిక అద్భుతాలను వ్యూహాత్మకంగా అణచివేశారు. ఇప్పటికైనా నాటి వివరాలు, రహస్యాలు, ఆధారాలు అన్నీ మన పాఠాల్లోకి రావాలి. ఇందుకు కొత్త జాతీయ విద్యా విధానం రావాలి. దీనిపై కొంత ప్రయత్నం జరుగుతోంది. ఆజాదీకా అమృతోత్సవాలను ఘనంగా చేసుకోగలుతున్నాం. రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు చేసుకోబోతున్నాం.. ఇవన్నీ కొంత శుభసూచకాలుగా మాకు కనిపిస్తున్నాయి. యువతలో మార్పు రావాలి ఆశిష్టః దృఢిష్టః బలిష్టః యువాస్యాత్ సాధు యువాధ్యాయకః అని వేదం స్పష్టంగా చెప్తోంది. యువత మంచి తిండి తినాలి, తిన్నది హరాయించుకోవాలి, దాన్ని శక్తిగా మార్చుకోవాలి, ఆ శక్తితో సమాజానికి సేవ అందించాలి. లేకపోతే యువత సమాజానికి దండుగగా మారుతుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడదే జరుగుతోంది. యువత రకరకాల వ్యసనాలు, విలాసాలకు లోనవడాన్ని ప్రగతికి చిహ్నంగా భావిస్తోంది. చాలా మంది దారి తప్పి సమాజాన్ని కుంగదీస్తున్నారు. ఇది మారాలి. యువత సమాజానికి ఉపయోగపడే శక్తిగా తయారు కావాలి. కండల లక్ష్యం బలహీనుడిని ఆదుకోవడం, ధన సంపాదన లక్ష్యం ధనహీనుడి ఉద్ధరణ, విద్యాధికుడి లక్ష్యం మార్కులు, ఉద్యోగం కాదు.. విద్యా రహితుడిని విద్యావంతుడిగా మార్చటం.. ఇది రామానుజుల స్పూర్తి. ఇలా ఉన్నప్పుడు సమాజంలో దమము (నియంత్రణ) ఉంటుంది. లేకుంటే తిరగబడి మదము అవుతుంది. మనం సమాజంలో ఓ భాగంగా సమాజ సమగ్ర వికాసానికి ఉపయోగపడాలన్న ఆలోచన అందరిలో ఉండాలనేది రామానుజుల సందేశం. దీన్నే ఆయన వేదాంత పరిభాషలో శరీర శరీరి భావ సంబంధంగా పేర్కొన్నారు. రామానుజుల ఆలోచన సంపత్తిలో ఇదే కీలకం. ఆయన అడుగే ఓ విప్లవం కొందరిపై అంటరానివారిగా ముద్ర వేసి, సమాజానికి దూరంగా పెట్టిన భయంకర పరిస్థితులున్న సమయంలో రామానుజులు ఈనేలపై నడయాడారు. అంటరాని వారిని చేరదీస్తే తల తీసేసే పరిస్థితులను ఎదుర్కొని.. వారిని జనజీవన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పంచ సంస్కారాలు చేశారు. మంత్రదీక్షలు ఇచ్చి, వైష్ణవులుగా మార్చారు.తిరుక్కులతార్గా వారికి గౌరవప్రదమైన కులానికి చెందినవారన్న పేరు పెట్టారు. ఇది గొప్ప సామాజిక మార్పు దిశలో రామానుజులు వేసిన విప్లవాత్మక అడుగు. పండితలోకాన్ని, పాలకులను, ప్రజలను ఒప్పించి ముందుకు సాగిన మహనీయుడు రామానుజులు. ఇప్పుడూ కులాల మధ్య భారీ అగాధం ఉంది. మళ్లీ రామానుజులు రావాల్సిందే.. సర్వప్రాణులూ దైవ స్వరూపమే.. ప్రకృతిలో మనిషే కాదు.. చెట్లు, జంతువులు, సూక్ష్మజీవులు ఎన్నో ఉన్నాయి. అవి లేకుండా మనిషి ఉండలేడు, కానీ మనిషి లేకుండా అవి ఉండగలవు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మనిషి ఇంటికే పరిమితమైతే.. ప్రకృతి పరవశించిన విషయాన్ని కళ్లారా చూశాం. అందుకే మనం పదిలంగా ఉండాలంటే వాటిని కాపాడాల్సిందే. ఇందుకు ప్రత్యేకంగా చేసేదేమీ లేదు. వాటి మానాన వాటిని బతకనీయడమే. అందుకే రామానుజుల అనుసరణ ఏంటంటే.. ‘మాధవ సేవగా సర్వప్రాణి సేవ’. మహనీయుల చరిత్రతో డిజిటల్ లైబ్రరీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో అద్భుతమైన డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నాం. సమతా భావం కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాడిన మహనీయుల చరిత్రను అందులో నిక్షిప్తం చేస్తున్నాం. అబ్రహం లింకన్, మండేలా, మలాలా.. ఇలాంటి 116 మందిని గుర్తించి వారి వివరాలను నిక్షిప్తం చేశాం. రామానుజుల ప్రబోధాలను జనంలోకి తీసుకెళ్లి మార్పునకు అవకాశం కల్పించడం, దేశ పురోగతికి బాటలు వేసేలా చేయాలన్నది నా కల. ఈ కేంద్రంతో కొంత నెరవేరినట్లవుతోంది. దీన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా దారితప్పిన మనిషి పరివర్తనకు బాట వేసే కేంద్రంగా పరిగణించాలి. ఆధునిక పద్ధతిలో యువతకు.. సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సాధారణ గుడిగా, ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించి దర్శనం చేసుకుని వెళ్తే ఉపయోగం ఉండదు. రామానుజుల ఆలోచనలు, సమాజానికి అందించిన సేవలు, మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటో ప్రజలు గ్రహించగలగాలి. ఆ దిశగానే అగుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. రామానుజుల సందేశం వ్యవస్థలోకి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వైష్ణవంలో దివ్య దేశాలుగా పేర్కొనే 108 దేవాలయాల నమూనాలను స్ఫూర్తి కేంద్రంలో నిర్మించాం. వాటిని దేవాలయాలుగా భావించి కాదు, రామానుజులను ప్రభావితం చేసిన ప్రాంతాల నేపథ్యంగా ఏర్పాటు చేశాం. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంగా దీనికి నామకరణం చేశాం. అంతా ప్రకృతి బిడ్డలమన్న భావన రావాలి రోమ్రోమ్మే రామ్ హై అంటాడు భక్తుడు. ఇందుగలడు అందులేడన్న సందేహం లేదంటాడు ప్రహ్లాదుడు. పశుపక్ష్యాదులు, మనిషి అంతా ప్రకృతి సంతానమే. అలాంటప్పుడు ఈ భేదాలు, ఆధిపత్య ధోరణులు ఎందుకు? అందుకే అనేకముల్లో ఒకటిగా ఉండాలని రామానుజులు విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు. కులాలు, వర్గాలు, మతాలు, రంగులు, లింగభేదంతో విడిపోద్దని సూచించారు. దానికి తన అనుభవాన్నీ జోడించారు. ‘పదడుగుల ఎత్తు పునాదితో ఇల్లు కట్టి నన్ను ఆహ్వానించారు. అంతెత్తు పునాది ఎందుకని అడిగాను. పక్కనే ఉన్న నది పొంగి చుట్టూ ఇళ్లు కొట్టుకుపోయినా.. నా ఇల్లు నిలిచి ఉండాలన్న ఉద్దేశంతో ఇలా కట్టానని అతను చెప్పాడు. ఊరంతా కొట్టుకుపోతే ఒక్కడివీ మిగిలి ఏం చేద్దామని? అందరితో కలిసి సాగు, చేతనైతే అందరినీ నిలిపి నువ్వూ నిలువ’ని చెప్పారు. పర సహనం కోల్పోవడం అశాంతికి మూలం ఒకే భాష మాట్లాడేవారు, ఒకే దేవుడిని పూజించేవారు కూడా వైషమ్యాలతో మారణహోమం సృష్టించుకుంటున్నారు. పరసహనం కోల్పోతున్నారు. ఆధిపత్య ధోరణి విశృంఖలమవుతోంది. నేను అగ్రాసనంలో ఉండాలన్న స్వార్ధంతో ఇతరులను అణచివేయటం పరిపాటిగా మారింది. వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య, సమాజాల మధ్య, దేశాల మధ్య ఇదే తీరు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అణ్వాయుధాలు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నకోవిడ్ కూడా ఇదే కోవలో వెలువడ్డ జీవాయుధం. ఇలాంటి ధోరణి మారాలన్నదే వెయ్యేళ్ల కింద రామానుజులు చేసిన ప్రయత్నం. -
సమతామూర్తి విగ్రహావిష్కరణకు శ్రీరామనగరం ముస్తాబు
-
శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముస్తాబవుతోన్న శ్రీరామనగరం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ రూరల్: సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముహూర్తం సమీపిస్తోంది. ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం సుందరంగా ముస్తాబవుతోంది. విగ్రహాలకు, ఫౌంటెన్లకు రంగులు అద్ది తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రధాన ఆలయం సహా చుట్టూ ఉన్న ఆలయ గోడలకు, వాటి మెట్లకు, శిలాస్తంభాలకు, ఫ్లోర్స్‌కు అమర్చిన మార్బుల్స్‌ను ముస్తాబు చేస్తున్నారు. ఒకవైపు ఫౌంటెన్ సహా సమతామూర్తి విగ్రహం చుట్టూ మిరిమిట్లుగొలిపేలా లైటింగ్ పనులు చేపడుతున్నారు. మరోవైపు అంతర్గత రోడ్లు, ఫ్లోరింగ్, గార్డెన్లో వివిధ రకాల పూల, ఔషధ మొక్కలు నాటుతున్నారు. ఇంకోవైపు యాగశాలల నిర్మాణాలు, ఇందుకు అవసరమైన పిడకలను తయారు చేస్తున్నారు. నిత్యం 500 మంది కూలీలు నిర్విరామంగా పని చేస్తున్నారు. 2 నుంచి 14 వరకు సహస్రాబ్ది సమారోహం.. ► ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. శ్రీరామనగరంలో ప్రతిష్ఠించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందించిన 54 అంగుళాల రామానుజ నిత్యపూజా మూర్తిని 13న రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ తొలి దర్శనంతో ప్రారంభిస్తారు. చదవండి: యూకేలో ఉద్యోగమంటూ.. మాయ మాటలతో బుట్టలో వేసుకొని ► 216 అడుగుల ఎత్తైన రామానుజల మహా విగ్రహం చుట్టూ 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం కొనసాగుతుంది. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే.. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా మొత్తం 108 ప్రధాన వైష్ణవ గర్భాలయాల ఆకృతిలో ఆలయాలు, దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఆయా విగ్రహమూర్తులకు రంగులద్ది తుది మెరుగులు దిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు. చదవండి: Warangal: ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగీలో పొగలు శరవేగంగా రహదారుల విస్తరణ ► ఇటు బెంగళూరు జాతీయ రహదారి నుంచి శ్రీరామనగరం మీదుగా అటు పెద్ద గోల్కొండ సమీపంలోని సంగీగూడ చౌరస్తా వరకు 9 కిలోమీటర్ల మేర 13 మీటర్ల పాటు రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ► ఎన్‌హెచ్ 44 నుంచి పెద్దషాపూర్ తండా చౌరస్తా– గొల్లూరు– అమీర్‌పేట్ మీదుగా రూ.17.50 కోట్లతో 8 కి.మీ మేర తొమ్మిది మీటర్ల చొప్పున రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ► ఎన్ 44 మదనపల్లి క్రాస్ రోడ్డు నుంచి ముచ్చింతల్ మీదుగా చిన్న తూప్రాన్ వరకు రూ.15.50 కోట్లతో 5 కి.మీ మేర సీసీ రోడ్డును 10 మీటర్లకు విస్తరించారు. ఇవి కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. అతిథులకు ఆహ్వానం పలుకుతూ రోడ్డు మధ్యలోనే కాకుండా ఇరు వైపులా వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా.. తాగునీరు ► రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ట్రాన్స్‌కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏర్పాట్లు చేస్తున్నా యి. ఇప్పటికే ముచ్చింతల్ సమీపంలో 33/11కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.30 లక్షల అంచనా వ్యయంతో ముచ్చింతల్ ఆవరణలో తాత్కాలిక విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. ► రోజుకు సగటున 15 లక్షల తాగునీరు అందించేలా ముచ్చింతల్ ప్రధాన లైన్ నుంచి సమతామూర్తి కేంద్రంలో ఉన్న సంపులకు మిషన్ భగీరథ అధికారులు కనెక్షన్లు ఇచ్చారు. ఆవుపేడతో పిడకలు సిద్ధం ► హోమకుండలాల్లో వినియోగించేందుకు ఆవు పేడతో ప్రత్యేకంగా తయారు చేసిన పిడకలు వాడనున్నారు. ఇప్పటికే ఇదే ప్రాంగణంలో ప్రత్యేక యంత్రం సహాయంతో వీటిని తయారు చేసి ఎండకు ఆరబెట్టారు. ఎండిన పిడకలను ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచి, హోమకుండలాల వద్దకు చేర్చే పనిలో నిమగ్నయయ్యారు. ► పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి హోమకుండలంలో రోజుకు నాలుగు కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించనున్నారు. ఇలా ఒక్కో యాగశాలలోని తొమ్మిది హోమ కుండలాల్లో రోజుకు 72 కేజీల చొప్పున మొత్తం రెండు లక్షల కేజీల ఆవు నెయ్యిని రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని స్వచ్ఛమైన దేశీయ ఆవు పాల నుంచి సేకరించి తీసుకొచ్చారు. పద్మపత్రాలు విచ్చుకునేలా ఫౌంటెన్.. ► సందర్శకులను ఆకర్షించే విధంగా ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించగానే సమతామూర్తికి ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్ ఫౌంటెన్ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతితో ఉండే ఈ ఫౌంటెన్‌లో పద్మ పత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా విన్పిస్తుంటాయి. ప్రధాన ఫౌంటెన్ సహా ప్రధాన ఆలయం చుట్టు లేజర్‌షో, అత్యాధునిక లైటింగ్, సౌండ్ సిస్టం పనులు సైతం తుది దశకు చేరుకున్నాయి. వెదురు బొంగులు.. తాటి కమ్మలతో.. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. వీటిని పూర్తిగా తాటి కమ్మలు, వెదురు బొంగులతో ఏర్పాటు చేశారు. యాగశాల నిర్మాణం పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఈ క్రతువుకు దేశం నలుమూలల నుంచి 5 వేల మంది రుత్వికులు, వేద పండితులు పాల్గొననున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు కొనసాగుతాయి. ► నాలుగు దిక్కుల్లో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం 144 చోట్ల యాగాలు జరుగుతుంటాయి. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టశాలలు ఉన్నాయి. వీటిలో 1035 హోమ కుండాలు నిర్మించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని విన్పిస్తుంటారు. -
ఆ సిద్ధాంతాల అవసరం ఇప్పుడే ఎక్కువ!
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరగబోవడం... రాష్ట్ర, దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది. ప్రపంచ మేధావులను, ఆధ్యాత్మికవేత్తలను, పండితులను ఆలోచింపచేస్తుంది. పరంపరాగతమైన భారతీయ తాత్విక చింతన గురించి మరొకసారి విశ్లేషణలు వెల్లివిరుస్తాయి. ఈ మధ్యన జీయర్‌స్వామి రాష్ట్రపతి, ప్రధానమంత్రులను కలసి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. రామానుజాచార్యుల బోధనల అవసరం వేయి సంవత్సరాల క్రితం సమాజానికి ఎంత ఉండిందో... ఈ కాలానికి అంతకన్నా ఎక్కువ అవసరమైన పరిస్థితి ఏర్పడ్డది. వారు సశాస్త్రీయంగా బోధించిన సామాజిక సమరసా సిద్ధాంతం అన్ని వర్గాల, మతాలకు చెందిన వారికి శిరోధార్యం. ఆనాడు వారు తీసుకున్న భక్తి గమనము, ఎంతోమంది సాధు సంతులను, ప్రజలను, ముఖ్యంగా రామానంద ద్వారా కబీర్ దాస్‌లాంటి వాళ్లను ప్రభావితం చేసి దేశ సమగ్రతకు, సమైక్యతకు తోడ్పడ్డాయి. ఈ సంప్రదాయానికే చిన జీయర్‌స్వామి కొంత సుగం ధాన్ని, మరికొంత సువర్ణాన్ని పూసి సరళమైన భాషలో, స్పష్టమైన భావాలతో చేసిన ప్రసంగాలతో లక్షలమందిని ఆకర్షించారు. ‘‘నీ తల్లిని ప్రేమించు, ఇతరుల తల్లులను గౌరవించు’’ అన్న చిన్న పదాలు– వర్గాలను, కులాలను, మతాలను కలిపి స్వామీజీ ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు బాట వేసి వేలమందికి విద్య, ఉపాధి పొందే అవకాశాలను కల్పిస్తున్నాయి. మరొకవైపు స్వామి భక్తి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ, సాంస్కృతిక జీవనంలో ఒక కొత్త దనాన్ని తెచ్చాయి. ఈ మధ్యన నిర్వహించిన ఒక సర్వేలో 27 శాతం భారతీయులు – హిందువులలో అత్యధి కంగా 30 శాతం, సిక్కులలో 23 శాతం, ముస్లింలలో 18 శాతం మంది అంటరానితనాన్ని పాటిస్తున్నారని ఎన్సీఏఈఆర్ నివేదికలో చెప్పారు. వివిధ నివేదికలను పూర్తిగా లెక్కలోకి తీసుకోలేకున్నా... అంటరానితనం ఇంకా ఉన్నదనేది నిర్వివాదం. ఆది శంకరుడు, రామానుజుడు, బసవేశ్వరుడు, వివేకా నందుడు, నారాయణగురు, బ్రహ్మనాయుడు లాంటి వారెం దరో మన మనస్సులలో సుప్రతిష్ఠితులు. వీరందరూ కులాల, మతాల వివక్షలను నిర్ద్వంద్వంగా ఖండించారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని ఒకవైపు రాజ్యాంగం నిర్దేశించినా... పరువు హత్యలు సమాజానికి సవాలుగా మారాయి. ఈ మధ్యన సుప్రీం కోర్టు ఈ కులరక్కసిని అంతమొందించటానికి ఆదేశాలు జారీ చేసి, వాటి అమలుకు కార్యాచరణను రూపొందించింది. రాజస్థాన్ ప్రభుత్వమైతే మరణ శిక్షను విధిస్తూ చట్టం చేసింది. కానీ కొందరు మతాంతర వివాహమే మరణ శాసనమని భావిస్తూ బ్రతుకుతున్నారు, మరికొందరు మరణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ‘హిందూ’ అన్నపదం, ఇటు రాజకీయాలలో, చట్టసభలల్లో, సమాజంలో కేంద్ర బిందువుగా మారుతున్నది. హిందూ అన్న పదం సాంస్కృ తిక భావన అని దాదాపు అన్ని వర్గాలు ఆలోచించే శుభ పరిణామాన్ని చూస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్, సాంస్కృతిక జాతీయవాదానికి అనుగుణంగానే 1956లో పెద్ద సంఖ్యలో అనుచరులతో కలసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. హిందూ సమాజంలో అమానవీయంగా విలయతాండవం చేసిన అస్పృశ్యత వంటి రుగ్మత లకు నిరసనగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇతర మతాలకు మారవలసిందిగా ఎందరో ఆయనను ప్రలోభ పెట్టారు. అయితే ఈ మతాలకు మారడం అంటే భారతదేశ సంస్కృతి నుండి దూరం కావడమే అనే అద్భుత ప్రకటన చేశారు. దీనికి యావత్ భారతదేశం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాల్సిందే. వివేకానందుడు 1898 జూన్ 10 నాడు తన మిత్రుడు మహమ్మద్ సర్ఫరాజ్ హుసేన్‌కు రాసిన లేఖను డిస్కవరీ ఆఫ్ ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ ఉటంకించారు. ఎంతో విశ్లేషణాత్మకమైన ఉత్తరంలో మన మాతృభూమికి హిందూ, ముస్లిం అనే రెండు గొప్ప మతాల కూడలిలో... వేదాంతం బుద్ధి అయితే, ఇస్లాం శరీరం అని రాశారు. దీన్ని అర్థం చేసుకొని హిందువులు, ముస్లిములు ఐక్యంగా ఉండి మళ్ళీ ఈ దేశ ఉజ్జ్వల భవిష్యత్తును రాబోయే తరాలకు అందించాలని కోరారు. 1995 డిసెంబర్ 11న సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పులో హిందూ అన్న పదానికి సంబంధించిన అయోమయాన్ని తొలగించి స్పష్టమైన తీర్పునిచ్చింది. హిందూ, హిందుత్వ, హిందూయిజం అన్న పదాలకు నిర్దిష్టమయిన అర్థాన్ని చెప్పలేమని, అయితే ఆ పదం నుంచి భారతీయ సంస్కృతీ పరంపరను, వారసత్వ సంపదను వేరుచేసి సంకుచిత మతానికి పరిమితం చేయలేమని, అది ప్రజల జీవన విధానమని స్పష్టం చేసింది. హైదరాబాదులో ఒక సమావేశంలో సాంస్కృతిక జీవన విధానాన్ని సమర్థిస్తూ ఆర్చ్ బిషప్ ఎస్. అరుళప్ప ‘జన్మతః నేను భారతీయుడిని. సంస్కృతిపరంగా నేను హిందువును. విశ్వాసం రీత్యా క్రైస్తవుడిని’ అని హర్షధ్వానాల మధ్యన ప్రకటించారు. స్వామి వివేకానందునికి ఇష్టమైన సూక్తి – ‘‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’’. యువత వేగవంతంగా ముందుకు తీసుకుపోవలసిన స్పూర్తిని రామానుజాచార్యుల వారి విగ్రహావిష్కరణ ఇస్తుందని ఆశిద్దాం. - సీహెచ్ విద్యాసాగర రావు మహారాష్ట్ర మాజీ గవర్నర్ -
పర్యాటక ప్రాంతంగా ‘రామానుజుల విగ్రహం’
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో ముచ్చింతల్‌లోని త్రిదండి చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణం లో ఆవిష్కరించనున్న రామానుజుల విగ్రహం రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఆదివారం సంక్రాంతి సందర్భంగా ట్రస్ట్ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రులు.. రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రత్యేకంగా వేస్తున్న రోడ్ల పనులను పరిశీలించారు. ప్రాంగణంలోని దేవాలయాన్ని, రామానుజుల భారీ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక హబ్‌గా మారిన రాష్ట్రానికి రామానుజుల విగ్రహం మకుటాయమానం కానుందని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రులతో పాటు చినజీయర్ స్వామి, మై హోమ్స్ అధినేత రామేశ్వర్ రావు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరో యాదాద్రిగా జోగుళాంబ ఆలంపురం జోగుళాంబ పుణ్య క్షేత్రాన్ని మరో యాదాద్రిగా తీర్చిదిద్దుతామని టూరిజం, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆలయ ఈవో పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ క్షేత్రంలో పర్యాటకుల సౌకర్యాల కోసం మొదటి విడతగా రూ.36 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. -
మళ్లీ ‘భువికి’ రామానుజులు!
సాక్షి, హైదరాబాద్: జాతులు.. వర్గాలు.. ఆడ.. మగ.. మనిషి.. జంతువు.. అంతా సమానమే.. పరమాత్మ దృష్టి అన్నీ ఒకటే అంటూ సమానత్వాన్ని చాటిన సమతా మూర్తి శ్రీరామానుజాచార్యులు మరోసారి మనముందు వెలుస్తున్నారు. ఓవైపు భారీ రామానుజుడి విగ్రహం.. మరోవైపు ఆధ్యాత్మిక పరిమళాలు, సంభ్రమాశ్చర్యాలను కలిగించే సాంకేతిక విన్యాసాలు.. అబ్బురపరిచే రాతి శిల్పాలతో శ్రీరామానుజ సహస్రాబ్ధి ప్రాంగణం సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ శ్రీరామనగరంలో నిర్మించిన ఈ మహా ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలా 2 నుంచి 14 వరకు ‘శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం’పేరిట ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్ద సంఖ్యలో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, పలు రంగాల ప్రముఖులు అందులో పాల్గొననున్నారు. 216 అడుగుల ఎత్తయిన రామానుజుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని ప్రారంభించనుండగా.. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందిన 54 అంగుళాల రామానుజుల నిత్యపూజామూర్తిని 13న రాష్ట్రప్రతి తొలి దర్శనంతో ప్రారంభిస్తారు. సీఎం కె.చంద్రశేఖరరావు ఈ వేడుకలను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో.. ♦ రామానుజుల ప్రాంగణం ఎన్నో ప్రత్యేకతలకు నెలవుగా నిలుస్తోంది. చినజీయర్ స్వామి చిరకాల వాంఛను నిజం చేస్తూ 2016లో దాదాపు రూ.వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి 2,700 శిల్పులు ఈ రాతి కట్టడాన్ని సిద్ధం చేశారు. ♦ ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న అతి ఎత్తయిన లోహ విగ్రహంగా శ్రీరామానుజుల విగ్రహం నిలవనుంది. ఇందులో పద్మాసనంలో ఉన్న రామానుజుల విగ్రహం 108 అడుగులుండగా.. దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మపీఠం 27 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. స్వామివారి పాదుకలతో ఉండే శఠారి 18 అడుగులు ఉంది. ఈ లోహ విగ్రహం బరువు 1,800 టన్నులు. దీన్ని చైనాకు చెందిన ఏరోసన్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో.. చినజీయర్ స్వామి సూచనల ప్రకారం రూపొందించారు. 200 మం ది చైనా నిపుణులు 9 నెలల పాటు శ్రమించి.. 1,600 భాగాలుగా విగ్రహాన్ని తయారు (క్యాస్టింగ్)‡ చేశారు. వాటిని ఇండియాకు తీసుకొచ్చాక 60మంది చైనా నిపుణులు కలిపి తుదిరూపు ఇచ్చారు. వాతావరణంలో ఏర్పడే మార్పులు, పరిణామాలను తట్టుకుని వెయ్యేళ్లు నిలిచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 108 పుణ్యక్షేత్రాల దర్శన అనుభూతితో.. ♦ ఈ క్షేత్రంలో రామానుజుల మహా విగ్రహం చుట్టూ.. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాల గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా ప్రధాన వైష్ణవాలయాలు ఇందులో ఉన్నాయి. వీటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. ♦ ఈ క్షేత్రంలో ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించగానే ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్ ఫౌంటెయిన్ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతిలో ఉండే ఈ ఫౌంటెయిన్‌లో పద్మపత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఎనిమిది రకాల జీవరాశులు నీటిని విరజిమ్ముతుండగా.. పద్మపత్రాల మధ్య నుంచి రామానుజుల ఆకృతిపైకి వచ్చి అభిషేకం జరుగుతున్న భావన కలుగుతుంది. అదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా వినిపిస్తుంటాయి. ♦ రామానుజుల సమతామూర్తి, పక్కనే ఉన్న ఫౌంటెయిన్, ఇతర భవనాలపైన కనువిందు చేసేలా.. ప్రత్యేక కాంతిపుంజాల విన్యాసాలతో జరిగే ఏఆర్ (అగుమెంటెడ్ రియాలిటీ) షో మంత్రముగ్ధులను చేస్తుంది. రోజూ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 18 నిమిషాల పాటు ఈ 3డీ షో నిర్వహిస్తారు. ఇందులో రామానుజులు ప్రబోధించిన సమానత్వాన్ని చాటే ఘట్టాలు కనివిందు చేస్తాయి. ఏకకాలంలో 3,600 మంది తిలకించొచ్చు. ఇక రెండు లక్షల మొక్కలతో ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. -
ప్రధాని మోదీకి చినజీయర్ స్వామి ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా.. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని ప్రధాని మోదీని త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. శనివారం ఆయనతోపాటు మైహోం గ్రూపు చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నామని, అందులో పాల్గొని 216 అడుగుల భగవద్ రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరారు. భేటీ అనంతరం వివరాలతో ప్రకటన విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న రామానుజుల మహావిగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారని అందులో తెలిపారు. ‘‘శ్రీరామానుజుల దివ్యత్వం ప్రధానికి తెలుసు. ఆయన 70వ స్వాతంత్య్ర వేడుకల్లో ఎర్రకోట బురుజు నుంచి రామానుజుల వైభవాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సంరంభానికి రావాలని, 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని చినజీయర్ స్వామి ఆహ్వానించగా.. ప్రధాని మోదీ అంగీకరించారు. ప్రపంచానికి సమతా సందేశాన్ని అందించే లక్ష్యంతో రామానుజుల మహా విగ్రహాన్ని రూపొందించడం అభినందనీయమంటూ..చినజీయర్ స్వామి సంకల్పాన్ని కొనియాడారు’’ అని వెల్లడించారు. పెద్దలందరికీ ఆహ్వానం ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, కిషన్‌రెడ్డి, నితిన్ గడ్కరీ ఇతర కేంద్రమంత్రులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లను చినజీయర్ స్వామి స్వయంగా కలిసి మహోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. 1,035 హోమగుండాలతో ప్రత్యేక యాగం ముచ్చింతల్‌లోని దివ్య సాకేతంలో 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగబోయే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1,035 హోమగుండాలతో ఈ యాగం చేస్తారు. 2 లక్షల కిలోల ఆవునెయ్యితోపాటు ఇతర హోమ ద్రవ్యాలను వినియోగించనున్నారు. చదవండి: 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు చూసి -
మూర్తీభవించిన మానవతా వాది భగవద్రామానుజులు
సమాజంలో అశాంతి, అల్లకల్లోల భావాలు ప్రజ్వరిల్లుతున్నవేళ ధర్మపథాన్ని చూపేందుకు, జాతి యావత్తునూ ఏకతాటిపై తెచ్చేందుకు ఓ వెలుగు రేఖ ఉద్భవించింది. అష్టాక్షరీ మంత్రాన్ని గాలి గోపురమెత్తి చాటింది. అజ్ఞాన తిమిరాన్ని సంహరించి జ్ఞానమార్గాన్ని చూపింది. ఆ కాంతి కిరణమే ‘భగవద్రామానుజాచార్యులు’. నేటియుగంలో చెప్పుకుంటున్న సహజీవన, సమభావన, సమతావాదాలను ఆనాడే ప్రతిపాదించారు. మూర్తీభవించిన సమతా, మానవతావాదిగా కీర్తిగాంచారు. తరతరాలకి ఆదర్శం... విశిష్టాద్వైత సిద్ధాంత నిరూపణతోపాటు సర్వమానవాళిని చైతన్యపరిచేందుకు సహజ– సమభావాలతో ధార్మిక బోధనలు చేస్తూ ఆదర్శమూర్తిగా నిలిచారు. జ్ఞానమార్గంతోపాటు భక్తిమార్గంపై విస్తృత ప్రచారం చేశారు. ధర్మానుష్ఠానంతో జ్ఞానం, సామాజిక న్యాయదృష్టితో చేసే కర్మద్వారా జీవితం సార్థకమవుతుందని ఉద్బోధించారు. వీరి తరువాత దేశంలో బయలు దేరిన అనేక ఉద్యమాలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రామానుజులవారి ప్రభావం ఉండటం వీరి భావోన్నతికి తార్కాణంగా నిలుస్తోంది. సిసలైన శ్రీ భాష్యకారుడు... వేదాంతంలో ఎంతో క్లిష్టమైనటువంటి బ్రహ్మసూత్రాలకు రామానుజులు రాసిన శ్రీభాష్యం అత్యంత ప్రసిద్ధిపొందింది. అలాగే వేదాంతసారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలు రచించి విశిష్టాద్వైతాన్ని, వేదాంత సాహిత్యాన్ని దేశమంతటా ప్రచారం చేయడానికి పూనుకున్నారు. సాఫల్యం సాధించారు. ఏడుకొండలవాడి పాద సేవ... జ్ఞానం, కర్మ అనే రెండు మార్గాలను తనలోఇమడ్చుకునిసాగే భక్తిమార్గాన్నిఎంచుకున్నారు రామానుజులు. ఇది తదనంతరకాలంలో గొప్ప చారిత్రక పరిణామాలకు కారణమైంది. కేవలం పాండిత్యం, జ్ఞానం ఉన్నవారికే దైవం సాక్షాత్కరిస్తుందనే భావనను తొలగించేందుకు అడుగులు వేశారు రామానుజులు. అవశ్యం... ఆచరణీయం అణుమాత్రమైనా మినహాయింపు లేకుండా త్రికరణ శుద్ధిగా తనను తాను భగవంతునికి అర్పించుకోవాలి. అటువంటి వారికి భగవంతుడు ప్రసన్నుడై సాయుజ్యాన్ని ప్రసాదిస్తాడన్న రామానుజులు వారి మాటలు అవశ్యం ఆచరణీయం. ఆ మహానుభావుడు జన్మించి 1002 సంవత్సరాలు గడిచినా ఆయన ఏర్పాటు చేసిన రహదారిపై ధర్మరథం ఈనాటికీ పరుగులు పెడుతూనే ఉంది. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని,వేదపండితులు -
నాన్నగారు తీయలేని సినిమా నేను తీస్తా!
తాడేపల్లి : సినీరంగంలో తన తండ్రి ఎన్టీ రామారావు తీరని కోరిక అయిన రామానుజాచార్య చరిత్రను తాను సినిమాగా చిత్రీకరిస్తానని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో ఆయన గురువారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాల మధ్య ఆయనకు పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ‘రామానుజాచార్య చరిత్రను నాన్నగారు సినిమాగా తీయాలనుకున్నాయి. అయితే అది కార్యారూపం దాల్చలేదు. ఆయన తీరని కోరినను నేను తీరుస్తా. ప్రపంచంలోని అతి గొప్ప వ్యక్తి అయిన రామానుజాచార్యుల చరిత్రను సినిమాగా రూపొందించి ప్రజలకు ఆయన గొప్పతనాన్ని తెలియచేస్తా’ అని అన్నారు. -
ఆ సినిమా నేను చేస్తా: బాలయ్య
సాక్షి, అమరావతి: తన తండ్రి ఎన్టీ రామారావు తీయలేకపోయిన సినిమాలను తాను పూర్తి చేస్తానని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. గురువారం ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరం విజయకీలాద్రిపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... రామానుజచార్య సినిమా త్వరలో తాను చేస్తానని ప్రకటించారు. రామానుజచార్యులు.. ఆధ్యాత్మిక గురువే కాక గొప్ప సంఘసంస్కర్త అని, వేల సంవత్సరాల క్రితమే దళితులకు సమాజంలో సరైన గౌరవం కల్పించిన వ్యక్తి అని ప్రశంసించారు. రామానుజచార్యులపై పోస్టల్ స్టాంప్ విడుదల చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. విజయకీలాద్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆయనను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. -
రామానుజాచార్య తపాలాబిళ్ల ఆవిష్కరణ
న్యూఢిల్లీ : రామానుజాచార్య సహస్రాబ్ది సందర్భంగా ఆయన జ్ఞాపకార్థకం రూపొందించిన తపాలాబిళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సోమవారం ఇక్కడి ప్రధాని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్, అనంత్‌కుమార్, త్రిదండి చినజీయర్ స్వామి తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానుజాచార్య తొలి తపాలాబిళ్లను ప్రధాని మోదీ చేతులమీదుగా గవర్నర్ నరసింహన్ అందుకున్నారు. ప్రధాని మాట్లాడుతూ.. మోక్షానికి సంబంధించిన గురుమంత్రాన్ని అప్పట్లో రహస్యంగా ఉంచితే.. సర్వజనుల హితం కోసం రామానుజాచార్యులు దానిని బహిర్గతం చేశారన్నారు. ప్రజలను కలిపేందుకు విశిష్టాద్వైతం ద్వారా ఆయన ఎంతో కృషి చేశారని, విభిన్న జాతుల వారిని ఆలయాల్లో సభ్యులుగా చేర్చిన మహనీయుడు రామానుజాచార్యులని మోదీ కొనియాడారు. -
జగత్ గురువులు... జగతికి వెలుగులు
జగత్తులో అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలున్నాయి. ఇందులో ఏది ఎవరికి తగినదనే దాన్ని సాధకుని యోగ్యత, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించి, అది వారికి ఉపదేశించేది గురువే. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసేవాడని అర్థం. ‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే ప్రకాశం. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగుతో ప్రకాశింపచేసేవాడు అని అర్థం. జ్ఞాన మార్గ దర్శకుడైన గురువు స్థానం పరమ పవిత్రమైనది. జ్ఞానాన్ని ఆర్జించడం కన్నా సద్గురువు చరణారవిందాలను సేవించడం, అనుగ్రహాన్ని పొందడం ఉత్తమమైనది. దేవుడు ఉన్నాడని నమ్మేవారు ఆస్తికులు, లేడని చెప్పేవారు నాస్తికులు అయితే జగత్తు, దేవుడు, జీవుడు అనే పరంపర నుంచి మూడు వాదాలు ఉద్భవించాయి. అవే మూడు ప్రధాన మతసిద్ధాంతాలుగా ఆవిర్భవించి, విస్తృతంగా వ్యాప్తిచెందాయి. ఆ సిద్ధాంతాలే అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అయితే... హైందవ ధర్మానికి మూలస్తంభాలుగా పేర్కొనదగ్గ ముగ్గురు ఆచార్యులు ఈ మూడు మత పరంపరలకు ఆద్యులు. వారే జగద్గురు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు లేదా మధ్వాచార్యులు. ఈ మూడు మతాలు మతత్రయంగా, ఈ ముగ్గురూ ఆచార్యత్రయంగా ప్రసిద్ధి. అద్వైతమతం... ఆదిశంకరాచార్యులు: అద్వైతం అంటే రెండు కానిది. అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పే మతమన్నమాట. ఈ సిద్ధాంతానికి రూపకర్త జగద్గురు శ్రీ ఆదిశంకరులు. కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించిన ఆదిశంకరులు ప్రపంచమంతా జగద్గురువుగా గౌరవించే అత్యున్నతమైన ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, మహాపండితులు. సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి, ప్రస్థాన త్రయభాష్యంతోబాటు ఈనాడు మనం స్తుతించుకునే అనేక స్తోత్రగంథాలు, ప్రకరణ గ్రంథాలు, కనకధారాస్తోత్రం, భజగోవింద శ్లోకాలు ఆయన రచించినవే. రవాణా సదుపాయాలు లేని రోజుల్లోనే ప్రపంచమంతా కాలినడకన పర్యటించి అన్ని మతాలను, విశ్వాసాలను ఒక తాటిపైకి తెచ్చిన ఈ జగద్గురువు భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపించారు. బదరీనాథ్, పూరి, శృంగేరి, ద్వారకలలో వీరు స్థాపించిన ఈ పీఠాలకు బాధ్యతలు చేపట్టిన వారు కూడా వీరి నామంతోనే జగద్గురువులుగా ప్రఖ్యాతి చెందుతుండటం విశేషం. వీరి లెక్క ప్రకారం దేహమే దేవాలయం. దేహంలో ఉండే జీవుడే దేవుడు. భౌతికమైన దేహం నశించినా, ఆ దేహంలో ఉండే జీవుడు మాత్రం స్థిరంగా ఉంటాడని అద్వైతుల నమ్మకం. నిశ్చలమైన బుద్ధితో ‘అహం బ్రహ్మాస్మి’ అంటే నే నే బ్రహ్మను అని తెలుసుకునేవాడు జీవన్ముక్తుడు అవుతాడని అద్వైతులంటారు. విశిష్టాద్వైతం... రామానుజాచార్యులు: బ్రహ్మానికి, ప్రకృతికి భేదం లేదని బోధించే విశిష్టాద్వైత మత స్థాపకులు రామానుజాచార్యులు. ఈ మతాన్ని అనుసరించేవారు విశిష్టాద్వైతులుగా ప్రసిద్ధి. జగత్తు సత్యం, జీవుడు సత్యం, దేవుడు సత్యం అన్నది వీరి విశ్వాసం. దేహంలోని భాగాల వలె జీవుడు కూడా దేవునితో చేరి ఉంటారని, దేహం నశించిన తరువాత జీవుడు మరో దేహంలో ప్రవేశిస్తాడు లేదా ప్రకృతిలో లీనమైపోతారని వీరి నమ్మకం. విశిష్టాద్వైతమతాచార్యులైన భగవద్రామానుజులు నేటి చెన్నైకు చేరువలోని శ్రీపెరంబుదూరులో జన్మించారు. కాంచీపురం లోని తిరుక్కచినంబికి శిష్యులైన రామానుజులు శ్రీరంగంలో గొప్ప పండితుడు, వైష్ణవ మత ప్రవక్త అయిన యామునాచార్యులవారి వారసుడిగా నిలిచారు. బ్రహ్మసూత్రభాష్యానికి విశిష్టాద్వైత దృష్టితో శ్రీ భాష్యం వ్యాఖ్యను రచించారు. మొట్టమొదటి మత సంస్కర్తగా నిలిచిన రామానుజులవారు వేదాంత సంగ్రహం, గద్యత్రయం వంటి విశిష్టమైన గ్రంథాలను రచించారు. ఉత్తరభారతమంతా విస్తృతంగా పర్యటించిన ఆయన దేశం నలుమూలలా నాలుగు శ్రీైవైష్ణవ మఠాలను నెలకొల్పారు. జాతి, మత భేదాలను పాటించకుండా భక్తి భావంతో భగవంతుని సందర్శించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆలయ ప్రవేశం కల్పించేలా చేశారు. తిరుమలతో సహా అనేక దేవాలయాలలో నిర్దిష్టమైన పూజావిధానాలను, సంప్రదాయాలను ఏర్పరిచారు. ద్వైతమతం... మధ్వాచార్యులు: జీవుడు, దేవుడు వేర్వేరు. జీవాత్మ, పరమాత్మ రెండుగా ఉంటాయని చెప్పే ద్వైతమతాన్ని మధ్వాచార్యులు నెలకొల్పారు. వీరికే వల్లభాచార్యులని పేరు. ఈయన జన్మనామం వాసుదేవులు. ఈయనను వాయుదేవుడి అంశగా భావిస్తారు. జీవాత్మ, పరమాత్మలకు భేదం ఉందని ద్వైతమతవాదులు విశ్వసిస్తారు. వీరికి కూడా వేదాలే ప్రమాణాలు అయినప్పటికీ, అన్నింటిలోకి భాగవత గ్రంథాన్ని అత్యంత ప్రామాణికంగా భావిస్తారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉడిపి సమీపంలోని కంచనపూర్ అనే గ్రామంలో జన్మించిన మధ్వాచార్యులవారు రామానుజాచార్యులవారు ప్రచారం చేసిన శ్రీవైష్ణవానికి బదులు సద్వైష్ణవం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మహాభారతంపై తమదైన వ్యాఖ్యానం, శ్రీకృష్ణస్తుతి, ద్వాదశా స్తోత్రం, నఖస్తుతి, యమకభారతం, కృష్ణామృత మహార్ణవం, తంత్రసార, ఉపాధి ఖండన మొదలైన గ్రంథాలను అందించారు. జీవులందరూ విష్ణువు అధీనంలో ఉంటారని, ఆయన అనుగ్రహం పొందగలిగినవారికి ముక్తి లభిస్తుందని బోధించే మధ్వాచార్యులు ఉడిపిలో శ్రీకృష్ణుని దేవాలయాన్ని నిర్మించారు. శ్రీవైష్ణవులకు శ్రీరంగంలోని రంగనాథ దేవాలయం ఎంత పవిత్రమైనదో, ద్వైతులకు ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయం అంతటి పవిత్రమైనది. వీరి సిద్ధాంతాలలోని సరళత్వం సామాన్యప్రజలను అనేకమందిని ఆకట్టుకుని, వీరి మతంవైపు మొగ్గుచూపేలా చేసింది. - డి.వి.ఆర్.