మోహన్ భాగవత్‌ను ఆశీర్వదిస్తున్న వేదపండితుడు. చిత్రంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: భారత్‌ను ‘విశ్వగురు’గా మార్చే కృషిని ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్‌సంఘ్‌చాలక్ డా.మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. హిందువుల హితమే దేశ హితమని, మిగతా అనవసర కొట్లాటలు, కుమ్ములాటల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. మనకు దేనికీ లోటు లేకపోయినా, మనకంటే తెల్లచర్మం వారికి తామేదో గొప్ప అనే అహంకారం వెల్లడి కావడం అప్పుడప్పుడు చూస్తుంటామన్నారు.
బుధవారం ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ప్రవచన మందిరంలో ప్రసంగిం చారు. ‘వెయ్యేళ్లకు పైగా విదేశీయుల పాÔశవిక అత్యాచారాలు, భరించినా ఆనాడే సమానత్వాన్ని సాధించాం. మన పరంపర నేర్పినదాని ఆధారంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించొచ్చు. భాష, ప్రాంతం తేడాలెన్ని ఉన్నా మనమంతా ఒక్కటే. ఎవరికి వారు తమ మేలు చూసుకుంటూనే ఇతరుల మేలు కూడా చూడాలి.
దీనికి సంబంధించిన ఆచరణను క్రమంగా మొదలుపెట్టాలి’ అని భాగవత్ చెప్పారు. విభిన్నవర్గాల ఆచార్యులు, సంత్ లు కూడా అఖిల భారతస్థాయిలో సమావేశమై సమాజం మేలుకు ఏం చేస్తే బావుంటుందనే దానిపై సమాలోచనలు జరపాలన్నారు. దేశంలో మధ్యభాగంగా ఉన్న భాగ్యనగరంలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సరైన సమయంలో జరిగింద న్నారు. ఇది దేశభాగ్యమని, భాగ్యనగరంపేరు సార్థకమైందన్నారు.
హిందుత్వమే జాతిహితం: శివరాజ్
హిందుత్వమే దేశ హితమని, సనాతనధర్మం, పరంపరతో ముందుకు సాగాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. వివిధ భావాల కలబోత రామానుజాచార్యులు అని అన్నారు. సామాన్యులు, ధనికులు, బీసీలు, ఓబీసీలు, దళి తులు, మహాదళితులు అనే భేదభావాలన్నీ సమా ప్తం కావాలన్నారు. శ్రీరామనగర ప్రాంగణాన్ని దేశ యువత సందర్శించి దేశ భావధారకు అనుగుణంగా వారి ఆలోచనాధోరణి మారితే అంతకంటే అద్భుతం మరొకటి ఉండదన్నారు. యావత్ ప్రపంచానికి సమతా సందేశాన్ని ఇవ్వడానికే శ్రీరామానుజాచార్యుల వెయ్యోజయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలను చేపట్టామని చినజీయర్ స్వామి చెప్పారు.
1927లో బీఆర్ అంబేడ్కర్ తన పత్రిక భారత్‌లో.. వెయ్యేళ్ల క్రితమే సమతను చేసి చూపించిన రామానుజాచార్యుల గురించి రాశారన్నారు. సమస్త మానవాళికి ఐశ్వర్యం సిద్ధించాలనే సంకల్పంతో శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగంలో భాగంగా ఏడోరోజు పూజలు నిర్వహించారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 1,035 యజ్ఞకుండాల్లో ఐదువేల మంది రుత్వికులు çహోమ కార్యక్రమాలు నిర్వహించారు. మహాయాగంలో లక్ష్మీనారాయణ ఇష్టిని నిర్వహించారు. చిన్నారులకు విద్యాభివృద్ధి, పెద్దలకు మానసిక ప్రశాంతత కోసం హయగ్రీవ ఇష్టి నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment