శ్రీరంగనాథుని దేవాలయానికి సంబంధించి మరే దివ్యదేశానికి లేని ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. ఈ దివ్యక్షేత్రం 156 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడ ఉన్నన్ని ్ర΄ాకారాలు, గోపురాలు, మండ΄ాలు, సన్నిధానాలూ మరే దేవాలయంలోనూ లేవు. దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటిగా దీనిని పేర్కొనవచ్చు. శ్రీరంగనాథుని దేవాలయానికి సంబంధించిన చాలా విషయాలు ‘పెరియ’ అనే విశేషణంతో కూడుకుని ఉన్నాయి. ‘పెరియ’ అంటే పెద్ద అని అర్థం. ఉదాహరణకు ఈ దేవాలయాన్ని ‘పెరియకోయిల్’ అని, స్వామివారిని ‘పెరియపిరాట్టి’ అని, శ్రీరంగాన్ని ‘పెరియ అరంగం’ అని, దేవాలయంలో వాయించే మంగళ వాద్యాలను ‘పెరియ మేళమ్’ అని, స్వామివారికి నివేదించే వంటకాలను ‘పెరియ అవసరం’ అని, నివేదనకు తయారు చేసిన పిండి వంటలను ‘పెరియ పణ్యారం’ అనీ వ్యవహరిస్తారు. స్వామివారి వాహనమైన గరుత్మంతుని ‘పెరియ తిరువడి’ అని అంటారు. స్వామివారికి పిల్లనిచ్చిన విష్ణుచిత్తుల వారిని ‘పెరియాళ్వారు’ అన్న పేరుతో పిలుస్తున్నారు.
స్వామివారి వాహనమైన గరుత్మంతుని ‘పెరియ తిరువడి’ అని అంటారు. స్వామివారికి పిల్లనిచ్చిన విష్ణుచిత్తుల వారిని ‘పెరియాళ్వారు’ అన్న పేరుతో పిలుస్తున్నారు.ఆళ్వార్లు కీర్తించిన నూట ఎనిమిది దివ్య దేశాలలో శ్రీరంగం ప్రధానమైనది. శ్రీరంగమే భూలోక వైకుంఠమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సర్వేశ్వరుడు స్వయంగా వ్యక్తమైన ఎనిమిది క్షేత్రాలలోప్రధానమైనది శ్రీరంగం. వైష్ణవ పుణ్యక్షేత్రాలుగా వినుతికెక్కిన ‘నాల్గు మండపాల’లో శ్రీరంగం ఒకటి.
ఉభయ కావేరుల మధ్య అమరిన సుందర ద్వీపం శ్రీరంగం. కావేరి, కొళ్ళడం అనే రెండు నదులు శ్రీరంగానికి పూలదండలా ఇరువైపులా కొంతదూరం ప్రవహించి తిరిగి ఒకటిగా కలుస్తున్నాయి. తిరుచిరాపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి రైలు, రోడ్డు సదుపాయాలున్నాయి.శ్రీరంగనాథుని దేవాలయం చాలా ప్రాచీనమయింది. ఈనాడు మనం చూసే ఆలయానికి అంకురార్పణ 7వ శతాబ్దంలో జరిగింది. చోళ, పాండ్య, నాయక రాజులు దేవాలయానికి మరమ్మతులు, విస్తరణలు జరిపారు. పదమూడు అంతస్తులు గల ఈ రాజగోపురం 236 అడుగుల ఎత్తులో ఆసియాఖండంలోనే అత్యంత ఎత్తయిన గోపురంగా గుర్తించబడింది. ఈ నూతన రాజగోపురం ఆలయానికి దక్షిణ ద్వారంగా అమరి ఉంది.
ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణులలో ప్రధానమైనది చంద్ర పుష్కరిణి. ఆలయప్రాకార ఆవరణలలో నున్న గోపురాలు జీవకళ ఉట్టిపడే శిల్పాలతో ఆలయానికి అలంకారాలై ఉన్నాయి. దేవాలయానికి ఉన్న సప్తప్రాకారాలు సప్తలోకాలకు సంకేతాలుగా ఉన్నాయి.
ప్రణవాకార విమానం కింద ఉన్న గర్భాలయంలో శ్రీరంగనాథుడు ఐదు తలలతో పడగెత్తి ఉన్న ఆదిశేషుని పాన్పుపై శయనించి కుడి చేత్తో తన శిరస్సు చూపిస్తూ అన్ని లోకాలకూ తనే నాధుడునని చెప్తున్నట్టున్నారు. ఎడమ చేతితో పాదాలను చూపుతూ శరణన్న వారిని రక్షిస్తానని అభయమిస్తున్నారు. మూలమూర్తికి కొంచెం దిగువున ఉన్న ఒక పీఠంపై ఉత్సవమూర్తి చతుర్భుజుడై ఉన్నారు. వారిని ‘నంబెరుమాళ్ళు’ అని అంటారు.
ఉత్సవమూర్తి పై కుడి చేతితో ప్రయోగ చక్రాన్ని ధరించి ఉండగా కింది కుడిహస్తం అభయ ముద్రలో ఉంది. శంఖాన్ని పైఎడమ చేతిలోను, కింది చేతితో గదను ధరించి అందమైన చిరునవ్వు మోముతో శోభాయమానంగా దర్శనమిస్తున్నారు.గర్భాలయానికున్న ప్రదక్షిణ మార్గాన్ని ‘తిరువాణ్ణాళి’ అని, దానికి ముందున్న మంటపాన్ని రంగ మంటపమనీ, గాయత్రీ మంటపమని వ్యవహరిస్తారు. ఈ మంటపంలో నున్న 24 బంగారు స్తంభాలూ, గాయత్రీ మంత్రంలో ఉన్న 24 అక్షరాలకు సంకేతాలని పెద్దలు చె΄్తారు. వీటిని ‘తిరుమణ్ణాత్తూణ్’ అని అంటారు. స్వామివారు ప్రసాదాలు ఆరగించే మంటపానికి చందన మంటపమని పేరు. గర్భాలయానికి బయట ఉన్నప్రాకారంలో ద్వారపాలకులు, యాగశాల, సేన మొదలియార్ల సన్నిధి, పగల్ పత్తు మంటపం, చిలుకల మంటపం, కణ్ణ¯Œ సన్నిధి ఉన్నాయి.
మూడవప్రాకారంలో స్వర్ణమయంగా ఉన్న ధ్వజస్తంభం, డోలోత్సవ మంటపం, వైకుంఠ ద్వారం చూడవచ్చును. నాల్గవప్రాకారంలో బ్రహ్మాండమైన గరుడ సన్నిధి ఉంది. 12 అడుగుల ఎత్తులో మూలస్థానానికి దూరంగా స్వామి వారి పిలుపు కోసం వేచి ఉన్నట్లు అయిదు అడుగుల ఎత్తయిన పీఠంపై గరుడాళ్వారు కూర్చుని ఉన్నారు. ఈప్రాకారంలో ఆళ్వార్ల సన్నిధానాలు చాలా ఉన్నాయి. ధన్వంతరికి ప్రత్యేక సన్నిధానం ఉండడం ఇక్కడ ఒక విశేషం. అయిదవప్రాకారంలో ఆండాళ్ళ సన్నిధి, శ్రీరంగనాచ్చియార్ల సన్నిధానం, దానికి ఎదురుగా కంబర్ మండపం, ఉన్నాయి. ఈప్రాకారంలో ముఖ్యమైన కట్టడం వేయికాళ్ళ మండపం.
ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం, ఆలయ విమానగోడలపై చిత్రితమై ఉన్న విష్ణుపురాణం, 108 దివ్యదేశాలకు సంబంధించిన దృశ్యాల వివరణ తెలుగు లిపిలో ఉండడం గమనార్హం. ఉగాది మొదలయిన పండుగలను చాంద్రమానం ప్రకారంగా జరుపుకుంటున్నారు.ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత స్వామి వారికి జరిగే సుప్రభాత సేవలో పాల్గొనేవారు తరతరాలుగా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండడం ఒక విశేషం. వీరిని ‘శ్రీపాదం వోర్’ అని అంటారు.
శ్రీరంగక్షేత్రంలో సంవత్సరంలో నాలుగు బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. శ్రీరంగంలో నిత్యమూ ఉత్సవ సంరంభమే. ఉత్సవాల సమయంలో శ్రీరంగం అల వైకుంఠపురాన్ని తలపింపజేస్తుంది.శ్రీరంగనాచ్చియార్లకు స్వామివారి ఉత్సవాలైన తర్వాత సంబరాలు జరుపుతారు. భక్తులు స్వామివారి ఉత్సవాల వైభవాన్ని తిలకించి శ్రీరంగేశ పాదార్చనతో పులకించిపోతారు. శ్రీరంగాన్ని ఒక్కసారి దర్శిస్తే 108 దివ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం.
– స్వాతీభాస్కర్
Comments
Please login to add a commentAdd a comment