Millennium
-
మిలీనియం టవర్స్‌పై రామోజీ విలనీయం!
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’కు, దాన్ని నడిపేవాళ్లకు మతిస్థిమితమేమైనా తప్పిందా? ఎక్కడికి పోతున్నారు వీళ్లసలు? ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలంటే ఇదేనా పద్ధతి? ప్రభుత్వ భవనాల్ని ప్రభుత్వం తన అవసరాల కోసం వాడుకుంటే.. దాన్ని ‘సర్కారు వారి కబ్జా’ అని రాయడానికి సిగ్గుండక్కర్లా? అదేమైనా ప్రయివేటు వాళ్ల భవనమా? లేక రామోజీరావు సొంత ఆస్తినా? అయినా బంధువుల భూముల్ని లీజుల పేరిట కబ్జాలు చేసే రామోజీరావుకు ఇలా నీతులు చెబుతూ పత్రిక నడిపే అర్హత ఉందా అసలు? విశాఖలో మిలీనియం టవర్స్‌కు సంబంధించి శుక్రవారం పతాక శీర్షికల్లో ‘ఈనాడు’ వండి వార్చిన కథనంలో వీసమెత్తయినా నిజం ఉందా? ఎందుకింత అక్కసు? ప్రభుత్వాన్ని నడిపేది మీ వాడు కాకపోతే మరీ ఇంతలా దిగజారిపోవాలా? రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ ‘ఈనాడు’ సహా ఎల్లో మీడియా ఆక్రోశానికి హద్దుల్లేకుండా పోతోంది. చంద్రబాబు పాలనతో పోలిస్తే విశాఖపట్నంలో గడిచిన నాలుగున్నరేళ్లుగా ఐటీ రంగం వేగంగా విస్తరించినా... దాన్ని మరుగునపరుస్తూ, యువతలో విషబీజాలు నాటడమే లక్ష్యంగా ‘ఈనాడు’ శుక్రవారం విషం కక్కింది. మిలినియం టవర్స్‌లో ఉన్న ఐటీ కంపెనీ ‘కాండ్యుయెంట్’ అక్కడే కొనసాగుతుండగా.. ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం తన కార్యాలయాల కోసం వాడుకోవాలని సంకల్పించింది. కానీ కాండ్యుయెంట్ను ఖాళీ చేయమని నోటీసులిచ్చారని, అది హైదరాబాద్‌కు వెళ్లిపోతోందని ఎల్లో బ్యాచ్ ఫేక్ ప్రచారానికి దిగింది. దీంతో పాటు హెచ్ఎస్బీసీ వంటి కంపెనీలూ విశాఖ నుంచి వెళ్లిపోయాయని, కొత్తవి ఇంకెక్కడ వస్తాయని ప్రశ్నిస్తూ కథనాన్ని వార్చేసింది. నిజానికి కాండ్యుయెంట్ అక్కడే ఉంది. దానికి నోటీసులివ్వటమనేది పచ్చి అబద్ధం. కేవలం ఎల్లో మీడియా సాగించిన ఫేక్ ప్రచారం. పైపెచ్చు హెచ్ఎస్బీసీ ఇండియాలో తన కార్యకలాపాలకు స్వస్తిచెప్పి 2016లోనే వెళ్లిపోయింది. కాకపోతే వీటన్నిటినీ వైఎస్ జగన్ ప్రభుత్వానికి అంటగడుతూ ఎల్లో మీడియా సాగిస్తున్న విషప్రచారమే... యువతకు అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వ అవసరాలకు కేటాయిస్తే తప్పా? ఐటీ సంస్థల కోసం చంద్రబాబు నాయుడు మిలీనియం టవర్స్ నిరి్మస్తే దాన్ని వేరే అవసరాలకు ముఖ్యమంత్రి జగన్ వాడుకుంటున్నారని.. ఇది ఐటీ అభివృద్ధికి అడ్డంకి అని ‘ఈనాడు’ వాపోయింది. నిజానికి టవర్–ఎ, టవర్–బి పేరిట ఉన్న రెండింటినీ మిలీనియం టవర్స్ పేరుతో పిలుస్తున్నారు. దీన్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.60 కోట్లకుపైగా నిధులు వెచి్చంచి అసంపూర్తిగా ఉన్న టవర్–ఎను పూర్తి చేయటమే కాక, కొత్తగా టవర్–బిని నిరి్మంచింది. టవర్–బి ఈ ఏడాదే పూర్తయింది. ప్రస్తుతం ఖాళీగా ఉంది. మరి దాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా తన అవసరాల కోసం వాడుకుంటే తప్పా? ఇదెక్కడి వాదన? ప్రభుత్వ విభాగానికైనా, ప్రభుత్వ విద్యా సంస్థలకైనా ప్రత్యేక భవనాలు నిరి్మంచే పరిస్థితి లేకుంటే తాత్కాలికంగా అందుబాటులో ఉన్న భవనాలు కేటాయించడం తప్పెలా అవుతుంది? చంద్రబాబు మాదిరి ప్రభుత్వ విభాగాలను సైతం ఫైవ్‌స్టార్ హోటళ్లలో పెట్టి భారీ అద్దెలు చెల్లించాలనా రామోజీ ఉద్దేశం? క్యాండ్యూయెంట్‌కు నోటీసులంటూ పచ్చి అబద్ధాలు.. ‘టవర్–ఏ’లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన ఐటీ సంస్థ కాండ్యుయెంట్‌కు విస్తరణ కోసం అదనపు స్థలం అడిగినా ఇవ్వలేదని, పైపెచ్చు ఖాళీ చేయమంటూ నోటీసులు జారీ చేశారని ఈనాడుతో పాటు సోషల్ మీడియా వేదికగా ఎల్లో బ్యాచ్ విపరీతమైన దు్రష్పచారం చేస్తోంది. నిజానికి ప్రభుత్వం తమకెలాంటి నోటీసులూ ఇవ్వలేదని, హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యే ఆలోచన తమకు లేనే లేదని కాండ్యుయెంట్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసినా... ఈ విషప్రచారానికి మాత్రం తెరపడటం లేదు. నిజానికి ఈ టవర్‌లో కాండ్యుయెంట్ తప్ప వేరే కంపెనీలేవీ కార్యకలాపాలు కొనసాగించడం లేదు. ఐటీ కంపెనీలను ఆకర్షించడం కోసం ప్రభుత్వం ఐటీ ఇన్ఫ్రాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అదానీ గ్రూప్ డేటా సెంటర్‌తో పాటు భారీ ఐటీవర్ను నిర్మిస్తోంది. రహేజా గ్రూపు ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో పాటు ఐటీ టవర్‌ను కడుతోంది. ఏపీఐసీసీ రూ.2,300 కోట్ల వ్యయంతో మధురవాడలో 19 ఎకరాల విస్తీర్ణంలో ‘ఐ స్పేస్’ పేరిట ఐటీ టవర్‌ను నిరి్మస్తోంది. కానీ రామోజీ ఈ నిజాలన్నిటికీ ముసుగేసి అబద్ధాలే ఆలంబనగా చెలరేగిపోయారు. హెచ్ఎస్బీసీ వెళ్లిపోయిందెప్పుడో తెలియదా? ‘ఈనాడు’ ఎంతలా దిగజారిపోయిందో తెలియటానికి ఈ అంశం ఒక్కటీ చాలు. చైనాకు చెందిన హెచ్ఎస్బీసీ తన విధానపరమైన నిర్ణయంలో భాగంగా భారతదేశ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నట్లు 2016లో ప్రకటించింది. అందులో భాగంగా విశాఖ, హైదరాబాద్, ఢిల్లీల్లోని తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడే. దీన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వానికి అంటగట్టి దు్రష్పచారం చేస్తున్నారంటే వీళ్లనేమనుకోవాలి? కొత్త కంపెనీలు కనిపించటం లేదా? కంపెనీలు వెళ్లిపోవటమే గానీ కొత్తవి రావటం లేదంటూ ఆక్రోశించారు రామోజీ. నిజానికి ఐటీకి ఆద్యుడినంటూ డబ్బాకొట్టుకొనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో విశాఖకు చెప్పుకోదగ్గ పేరున్న ఒక్క కంపెనీ కూడా రాలేదు. కానీ ఈ ప్రభుత్వం బీచ్ డెస్టినీ పేరిట ఐటీ కంపెనీలను విశాఖకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ ఇప్పటికే డేటా సెంటర్‌ను ప్రారంభించగా, విప్రో డేటాసెంటర్‌ను ప్రారంభించడానికి వీలుగా విశాఖలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగుల సమాచారాన్ని సేకరిస్తోంది. ఇక అమెజాన్, బీఈఎల్ , రాండ్‌స్టాడ్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. మరికొన్ని సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 24,,350 మంది ఐటీ ఉద్యోగులుండగా ఇపుడా సంఖ్య 53,850 దాటింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్నంతకాలం రామోజీకి ఈ వాస్తవాలు కనిపించనే కనిపించవు. -
అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయండి
శంషాబాద్ రూరల్: మండలంలోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై మంత్రులు టి.హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం చినజీయర్ స్వామితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శ్రీరామనగరంలోని నేత్ర విద్యాలయం సమావేశం మందిరంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఉత్సవాలకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెంది న ప్రముఖులు రానుండటంతో ఆ మేరకు అన్ని సౌకర్యాలు ఏర్పా టు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా వైద్య, వాటర్ గ్రిడ్, ఇంట్రా, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, ఏపీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేతాజీ జయంతి సందర్భంగా ‘ఉద్ఘోష్’ సాక్షి, హైదరాబాద్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జన్ ఉర్జా మంచ్ ఆధ్వర్యంలో ‘ఉద్ఘోష్‘కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆబ్కారీ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు ఉద్ఘోష్ అవార్డులను పంపిణీ చేశారు. -
కర్నూలు మిలీనియం ఉత్సవాల్లో మంగళంపల్లి
కర్నూలు(కల్చరల్): సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కర్నూలులో 1999లో నిర్వహించిన మిలీనియం ఉత్సవాల్లో పాల్గొని తన గాన కచేరితో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుత సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గోపవరం రామచంద్రన్ తన గురువు మహదేవలక్ష్మీ నారాయణరాజు చొరవతో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణను కర్నూలుకు ఆహ్వానించారు. అప్పటి జిల్లా కలెక్టర్ ఉమామల్లేశ్వర్రావు కలెక్టరేట్లో సునయన ఆడిటోరియం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 1999 సంవత్సరంలో డిసెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు మిలీనం ఉత్సవాల పేరుతో కర్నూలులో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాల్గొన్నారు. మిలీనం ఉత్సవాలను పురస్కరించుకుని అప్పటి కలెక్టర్ ఉమామల్లేశ్వరరావు సునయన ఆడిటోరియంను ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవ సభ అనంతరం డాక్టర్ మంగళంపల్లి తన స్వర కచేరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కచేరీలో గోపవరం రామచంద్రన్ ఘటం సహకారాన్ని అందించి ఆయన స్వరానికి తోడుగా నిలిచారు. డాక్టర్ మంగళంపల్లి కచేరీలో కర్నూలుకు చెందిన గోపవరం రామచంద్రన్ రెండుసార్లు సంగీత సహకారం అందించారు. ఢిల్లీలో, చెన్నైలో జరిగిన సంగీత కచేరీలో రామచంద్రన్ డాక్టర్ మంగళంపల్లికి మృదంగ సహకారాన్ని అందించారు. కర్నూలులో 2000 దశకంలో జరిగిన బాలసాయి జన్మదినోత్సవ ఉత్సవాల్లోను మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన గానామృతాన్ని వినిపించి ప్రేక్షకులను, భక్తులను అలరించారు. ఇలా మొత్తంగా బాలమురళీకృష్ణ రెండు పర్యాయాలు కర్నూలు నగరంలో సంగీతాభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మల్లన్న ఆస్థాన విద్వాంసునిగా.. ‘‘శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీశైల మహాలింగ చక్రవర్తికి ఆస్థాన విద్వాంసుడిగా నియామకం కావడం వెయ్యి జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నా..’’ ప్రముఖ సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2003 అక్టోబర్ 20న శ్రీశైల మహాక్షేత్రానికి ఆస్థాన విద్వాంసుడిగా బాధ్యతలను చేపడుతూ అన్న మాటలివి. అప్పటి «ఈఓ ప్రసాదరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర రవాణాశాఖమంత్రి సిద్ధా రాఘవరావు, సమక్షంలో బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ రోజు సాగించిన సంగీత విభావరి భక్తులను అలరించింది. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ స్వామి సన్నిధిలో తన కచేరి సాగుతున్న సమయంలో వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తున్నానని, స్వామిఅమ్మవార్లు కూడా తన గానామృతాన్ని ఆస్వాదించి వరుణుడి రూపంలో ఆశీర్వదించారన్నారు. -
మిలీనియం బ్లాక్ పరిశీలించిన కలెక్టర్
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఈనెల 18న ప్రారంభం కానున్న పొదిల ప్రసాద్ జింఖానా మిలీనియం సూపర్‌స్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్‌ను బుధవారం కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ పరిశీలించారు. గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో వేదిక ఎక్కడ ఏర్పాటుచేయాలి తదితరాలు అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్, ఇతర అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు పూర్తిస్థాయిలో కార్పొరేట్ సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు మిలీనియంబ్లాక్ను నిర్మించినట్లు తెలిపారు. సుమారు ఐదేళ్ళకుపైగా రూ.31 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని, ఇందులో 240 పడకలు అదనంగా వస్తాయని పేర్కొన్నారు. కొందరు ప్రజాసంఘాల నాయకులు కలెక్టర్‌ను కలిసి మిలీనియంబ్లాక్పైజీజీహెచ్ పేరు పెట్టాలని వినతిపత్రం సమర్పించారు. జింఖానా ప్రెసిడెంట్ డాక్టర్ లోకేశ్వరరావు మాట్లాడుతూ గుంటూరు వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థులు 250 మంది మిలీనియంబ్లాక్ నిర్మాణం కోసం రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో జింఖానా ప్రతినిధులు డాక్టర్ త్రిపురనేని రవికుమార్, డాక్టర్ పుసులూరి వెంకటసుబ్బారావు, జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్, అర్బన్‌ఎస్పీ జెట్టి గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు.