మిలీనియం టవర్స్‌పై రామోజీ విలనీయం! | eenadu false story on Visakha Millennium Towers | Sakshi
Sakshi News home page

మిలీనియం టవర్స్‌పై రామోజీ విలనీయం!

Published Sat, Nov 25 2023 4:54 AM | Last Updated on Sat, Nov 25 2023 3:32 PM

eenadu false story on Visakha Millennium Towers - Sakshi

సాక్షి, అమరావతి: ‘ఈనాడు’కు, దాన్ని నడిపేవాళ్లకు మతిస్థిమితమేమైనా తప్పిందా? ఎక్కడికి పోతున్నారు వీళ్లసలు? ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలంటే ఇదేనా పద్ధతి? ప్రభుత్వ భవనాల్ని ప్రభుత్వం తన అవసరాల కోసం వాడుకుంటే.. దాన్ని ‘సర్కారు వారి కబ్జా’ అని రాయడానికి సిగ్గుండక్కర్లా? అదేమైనా ప్రయివేటు వాళ్ల భవనమా? లేక రామోజీరావు సొంత ఆస్తినా? అయినా బంధువుల భూముల్ని లీజుల పేరిట కబ్జాలు చేసే రామోజీరావుకు ఇలా నీతులు చెబుతూ పత్రిక నడిపే అర్హత ఉందా అసలు? విశాఖలో మిలీనియం టవర్స్‌కు సంబంధించి శుక్రవారం పతాక శీర్షికల్లో ‘ఈనాడు’ వండి వార్చిన కథనంలో వీసమెత్తయినా నిజం ఉందా? ఎందుకింత అక్కసు? ప్రభుత్వాన్ని నడిపేది మీ వాడు కాకపోతే మరీ ఇంతలా దిగజారిపోవాలా? 

రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ ‘ఈనాడు’ సహా ఎల్లో మీడియా ఆక్రోశానికి హద్దుల్లేకుండా పోతోంది. చంద్రబాబు పాలనతో పోలిస్తే విశాఖపట్నంలో గడిచిన నాలుగున్నరేళ్లుగా ఐటీ రంగం వేగంగా విస్తరించినా... దాన్ని మరుగునపరుస్తూ, యువతలో విషబీజాలు నాటడమే లక్ష్యంగా ‘ఈనాడు’ శుక్రవారం విషం కక్కింది. మిలినియం టవర్స్‌లో ఉన్న ఐటీ కంపెనీ ‘కాండ్యుయెంట్‌’ అక్కడే కొనసాగుతుండగా.. ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం తన కార్యాలయాల కోసం వాడుకోవాలని సంకల్పించింది. కానీ కాండ్యుయెంట్‌ను ఖాళీ చేయమని నోటీసులిచ్చారని, అది హైదరాబాద్‌కు వెళ్లిపోతోందని ఎల్లో బ్యాచ్‌ ఫేక్‌ ప్రచారానికి దిగింది. దీంతో పాటు హెచ్‌ఎస్‌బీసీ వంటి కంపెనీలూ విశాఖ నుంచి వెళ్లిపోయాయని, కొత్తవి ఇంకెక్కడ వస్తాయని ప్రశ్నిస్తూ కథనాన్ని వార్చేసింది. నిజానికి కాండ్యుయెంట్‌ అక్కడే ఉంది. దానికి నోటీసులివ్వటమనేది పచ్చి అబద్ధం. కేవలం ఎల్లో మీడియా సాగించిన ఫేక్‌ ప్రచారం. పైపెచ్చు హెచ్‌ఎస్‌బీసీ ఇండియాలో తన కార్యకలాపాలకు స్వస్తిచెప్పి 2016లోనే వెళ్లిపోయింది. కాకపోతే వీటన్నిటినీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి అంటగడుతూ ఎల్లో మీడియా సాగిస్తున్న విషప్రచారమే... యువతకు అత్యంత ప్రమాదకరం. 

ప్రభుత్వ అవసరాలకు కేటాయిస్తే తప్పా? 
ఐటీ సంస్థల కోసం చంద్రబాబు నాయుడు మిలీనియం టవర్స్‌ నిరి్మస్తే దాన్ని వేరే అవసరాలకు ముఖ్యమంత్రి జగన్‌ వాడుకుంటున్నారని.. ఇది ఐటీ అభివృద్ధికి అడ్డంకి అని ‘ఈనాడు’ వాపోయింది. నిజానికి టవర్‌–ఎ, టవర్‌–బి పేరిట ఉన్న రెండింటినీ మిలీనియం టవర్స్‌ పేరుతో పిలుస్తున్నారు. దీన్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.60 కోట్లకుపైగా నిధులు వెచి్చంచి అసంపూర్తిగా ఉన్న టవర్‌–ఎను పూర్తి చేయటమే కాక, కొత్తగా టవర్‌–బిని నిరి్మంచింది. టవర్‌–బి ఈ ఏడాదే పూర్తయింది. ప్రస్తుతం ఖాళీగా ఉంది. మరి దాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా తన అవసరాల కోసం వాడుకుంటే తప్పా? ఇదెక్కడి వాదన? ప్రభుత్వ విభాగానికైనా, ప్రభుత్వ విద్యా సంస్థలకైనా ప్రత్యేక భవనాలు నిరి్మంచే పరిస్థితి లేకుంటే తాత్కాలికంగా అందుబాటులో ఉన్న భవనాలు కేటాయించడం తప్పెలా అవుతుంది? చంద్రబాబు మాదిరి ప్రభుత్వ విభాగాలను సైతం ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో పెట్టి భారీ అద్దెలు చెల్లించాలనా రామోజీ ఉద్దేశం? 

క్యాండ్యూయెంట్‌కు నోటీసులంటూ పచ్చి అబద్ధాలు.. 
‘టవర్‌–ఏ’లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన ఐటీ సంస్థ కాండ్యుయెంట్‌కు విస్తరణ కోసం అదనపు స్థలం అడిగినా ఇవ్వలేదని, పైపెచ్చు ఖాళీ చేయమంటూ నోటీసులు జారీ చేశారని ఈనాడుతో పాటు సోషల్‌ మీడియా వేదికగా ఎల్లో బ్యాచ్‌ విపరీతమైన దు్రష్పచారం చేస్తోంది. నిజానికి ప్రభుత్వం తమకెలాంటి నోటీసులూ ఇవ్వలేదని, హైదరాబాద్‌కు షిప్ట్‌ అయ్యే ఆలోచన తమకు లేనే లేదని కాండ్యుయెంట్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసినా... ఈ విషప్రచారానికి మాత్రం తెరపడటం లేదు. నిజానికి ఈ టవర్‌లో కాండ్యుయెంట్‌ తప్ప వేరే కంపెనీలేవీ కార్యకలాపాలు కొనసాగించడం లేదు. ఐటీ కంపెనీలను ఆకర్షించడం కోసం ప్రభుత్వం ఐటీ ఇన్‌ఫ్రాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అదానీ గ్రూప్‌ డేటా సెంటర్‌తో పాటు భారీ ఐటీవర్‌ను నిర్మిస్తోంది. రహేజా గ్రూపు ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణంతో పాటు ఐటీ టవర్‌ను కడుతోంది. ఏపీఐసీసీ రూ.2,300 కోట్ల వ్యయంతో మధురవాడలో 19 ఎకరాల విస్తీర్ణంలో ‘ఐ స్పేస్‌’ పేరిట ఐటీ టవర్‌ను నిరి్మస్తోంది. కానీ రామోజీ ఈ నిజాలన్నిటికీ ముసుగేసి అబద్ధాలే ఆలంబనగా చెలరేగిపోయారు. 

హెచ్‌ఎస్‌బీసీ వెళ్లిపోయిందెప్పుడో తెలియదా? 
‘ఈనాడు’ ఎంతలా దిగజారిపోయిందో తెలియటానికి ఈ అంశం ఒక్కటీ చాలు. చైనాకు చెందిన హెచ్‌ఎస్‌బీసీ తన విధానపరమైన నిర్ణయంలో భాగంగా భారతదేశ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నట్లు 2016లో ప్రకటించింది. అందులో భాగంగా విశాఖ, హైదరాబాద్, ఢిల్లీల్లోని తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడే. దీన్ని కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి అంటగట్టి దు్రష్పచారం చేస్తున్నారంటే వీళ్లనేమనుకోవాలి? 

కొత్త కంపెనీలు కనిపించటం లేదా? 
కంపెనీలు వెళ్లిపోవటమే గానీ కొత్తవి రావటం లేదంటూ ఆక్రోశించారు రామోజీ. నిజానికి ఐటీకి ఆద్యుడినంటూ డబ్బాకొట్టుకొనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో విశాఖకు చెప్పుకోదగ్గ పేరున్న ఒక్క కంపెనీ కూడా రాలేదు. కానీ ఈ ప్రభుత్వం బీచ్‌ డెస్టినీ పేరిట ఐటీ కంపెనీలను విశాఖకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్‌ ఇప్పటికే డేటా సెంటర్‌ను ప్రారంభించగా, విప్రో డేటాసెంటర్‌ను ప్రారంభించడానికి వీలుగా విశాఖలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగుల సమాచారాన్ని సేకరిస్తోంది. ఇక అమెజాన్, బీఈఎల్‌ , రాండ్‌స్టాడ్‌ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. మరికొన్ని సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 24,,350 మంది ఐటీ ఉద్యోగులుండగా ఇపుడా సంఖ్య 53,850 దాటింది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఉన్నంతకాలం రామోజీకి ఈ వాస్తవాలు కనిపించనే కనిపించవు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement