towers
-
దూసుకెళ్తున్న బీఎస్ఎన్ఎల్.. ‘4జీ’లో మరో మైలురాయి
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 4జీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ తాజాగా మరింత ప్రగతి సాధించింది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అందించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.దేశవ్యాప్తంగా 4జీ సర్వీస్‌ను విస్తరిస్తున్న బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీలకు పోటీగా 5జీ టెక్నాలజీని పరీక్షించడం ప్రారంభించింది. ఈ క్రమంలో వినియోగదారులకు 5జీ సిమ్ కార్డ్‌లను కూడా అందిస్తోంది. తాజగా 4జీ సర్వీస్‌లో మరింత పురోగతి సాధించింది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లు 15 వేల మైలురాయికి చేరుకున్నాయి.ఈ టవర్లను 'ఆత్మనిర్భర్ భారత్' పథకం కింద నిర్మించామని, దేశవ్యాప్తంగా అంతరాయం లేని ఇంటర్నెట్ను అందిస్తామని కంపెనీ తెలిపింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే బీఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ పూర్తిగా భారతీయ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ మొబైల్ టవర్లలో అమర్చిన పరికరాలన్నీ భారత్‌లోనే తయారయ్యాయి.అక్టోబరు చివరి నాటికి 80,000 టవర్లను ఏర్పాటు చేస్తామని, మిగిలిన 21,000 టవర్లను వచ్చే ఏడాది మార్చి నాటికి ఏర్పాటు చేస్తామని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అంటే 2025 మార్చి నాటికి మొత్తం లక్ష టవర్లు 4జీ నెట్‌వర్క్‌కు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల డౌన్లోడ్ స్పీడ్ పెరుగుతుందని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
అంబానీ ఇంటిని తలదన్నే ఇల్లు!! బెంగళూరులో..
దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏది అంటే టక్కున ముఖేష్ అంబానీది అనే చెప్పేస్తారు. ముంబైలో ఉన్న ఈ విలాసవంతమైన నివాసం పేరు ‘యాంటిలియా’. అయితే దీనిని తలదన్నే మ్యాన్షన్ బెంగళూరులో ఉంది. అది ఎవరిది.. దాని విలువ ఎంత.. ఇతర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం..400 అడుగుల ఎత్తు.. 33 అంతస్తుల లగ్జరీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్.. దానిపైన మ్యాన్షన్. రెండు అంతస్తుల్లో ఉన్న ఈ స్కై మ్యాన్షన్‌లో ఉన్న విలాసవంతమైన సదుపాయాల గురించి తెలిస్తే నోరెల్లబెడతారు. హెలిప్యాడ్, లష్ గార్డెన్స్, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, 360 డిగ్రీ వ్యూయింగ్ డెక్‌తో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.ప్రస్తుతం విదేశాలకు పరారైన, లిక్కర్ కింగ్‌గా పేరొందిన విజయ్ మాల్యాకు చెందిందే ఈ విలాసవంతమైన భవనం. కింగ్‌ఫిషర్ టవర్స్‌గా పిలిచే ఈ అపార్ట్మెంట్ బ్లాక్‌ను మాల్యా పూర్వీకుల ఇల్లు ఉండే 4.5 ఎకరాల స్థలంలో నిర్మించారు. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ దీన్ని నిర్మించింది. ఈ ఇంటి విలువ 20 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.ఒక్క రోజు కూడా ఉండలేదుఇక అంబానీ కుటుంబానికి చెందిన ముంబై టవర్, యాంటిలియా దేశంలోని అత్యంత సంపన్నుల యాజమాన్యంలో ఉన్న మరో అద్భుతమైన ఇల్లు . దీని నిర్మాణానికి 2 బిలియన్ ఖర్చయినట్లు అంచనా. విలువపరంగా చూస్తే కింగ్‌ఫిషర్ టవర్స్ విలువ తక్కువే అయినా అంబానీ నివాసం 27 అంతస్తులు ఉంటే.. మాల్యా మ్యాన్షన్ ఉండే టవర్స్ 33 అంతస్తుల్లో ఉంది. అయితే ముచ్చట పడి కట్టించుకున్న ఈ మ్యాన్షన్‌లో విజయ్ మాల్యా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఇది ఇంకా నిర్మాణంలో ఉండగానే బ్యాంకులకు రుణాల ఎగవేత వ్యవహారంలో ఆయన దేశం వదిలి పారిపోయారు. -
మిలీనియం టవర్స్‌పై రామోజీ విలనీయం!
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’కు, దాన్ని నడిపేవాళ్లకు మతిస్థిమితమేమైనా తప్పిందా? ఎక్కడికి పోతున్నారు వీళ్లసలు? ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలంటే ఇదేనా పద్ధతి? ప్రభుత్వ భవనాల్ని ప్రభుత్వం తన అవసరాల కోసం వాడుకుంటే.. దాన్ని ‘సర్కారు వారి కబ్జా’ అని రాయడానికి సిగ్గుండక్కర్లా? అదేమైనా ప్రయివేటు వాళ్ల భవనమా? లేక రామోజీరావు సొంత ఆస్తినా? అయినా బంధువుల భూముల్ని లీజుల పేరిట కబ్జాలు చేసే రామోజీరావుకు ఇలా నీతులు చెబుతూ పత్రిక నడిపే అర్హత ఉందా అసలు? విశాఖలో మిలీనియం టవర్స్‌కు సంబంధించి శుక్రవారం పతాక శీర్షికల్లో ‘ఈనాడు’ వండి వార్చిన కథనంలో వీసమెత్తయినా నిజం ఉందా? ఎందుకింత అక్కసు? ప్రభుత్వాన్ని నడిపేది మీ వాడు కాకపోతే మరీ ఇంతలా దిగజారిపోవాలా? రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ ‘ఈనాడు’ సహా ఎల్లో మీడియా ఆక్రోశానికి హద్దుల్లేకుండా పోతోంది. చంద్రబాబు పాలనతో పోలిస్తే విశాఖపట్నంలో గడిచిన నాలుగున్నరేళ్లుగా ఐటీ రంగం వేగంగా విస్తరించినా... దాన్ని మరుగునపరుస్తూ, యువతలో విషబీజాలు నాటడమే లక్ష్యంగా ‘ఈనాడు’ శుక్రవారం విషం కక్కింది. మిలినియం టవర్స్‌లో ఉన్న ఐటీ కంపెనీ ‘కాండ్యుయెంట్’ అక్కడే కొనసాగుతుండగా.. ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం తన కార్యాలయాల కోసం వాడుకోవాలని సంకల్పించింది. కానీ కాండ్యుయెంట్ను ఖాళీ చేయమని నోటీసులిచ్చారని, అది హైదరాబాద్‌కు వెళ్లిపోతోందని ఎల్లో బ్యాచ్ ఫేక్ ప్రచారానికి దిగింది. దీంతో పాటు హెచ్ఎస్బీసీ వంటి కంపెనీలూ విశాఖ నుంచి వెళ్లిపోయాయని, కొత్తవి ఇంకెక్కడ వస్తాయని ప్రశ్నిస్తూ కథనాన్ని వార్చేసింది. నిజానికి కాండ్యుయెంట్ అక్కడే ఉంది. దానికి నోటీసులివ్వటమనేది పచ్చి అబద్ధం. కేవలం ఎల్లో మీడియా సాగించిన ఫేక్ ప్రచారం. పైపెచ్చు హెచ్ఎస్బీసీ ఇండియాలో తన కార్యకలాపాలకు స్వస్తిచెప్పి 2016లోనే వెళ్లిపోయింది. కాకపోతే వీటన్నిటినీ వైఎస్ జగన్ ప్రభుత్వానికి అంటగడుతూ ఎల్లో మీడియా సాగిస్తున్న విషప్రచారమే... యువతకు అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వ అవసరాలకు కేటాయిస్తే తప్పా? ఐటీ సంస్థల కోసం చంద్రబాబు నాయుడు మిలీనియం టవర్స్ నిరి్మస్తే దాన్ని వేరే అవసరాలకు ముఖ్యమంత్రి జగన్ వాడుకుంటున్నారని.. ఇది ఐటీ అభివృద్ధికి అడ్డంకి అని ‘ఈనాడు’ వాపోయింది. నిజానికి టవర్–ఎ, టవర్–బి పేరిట ఉన్న రెండింటినీ మిలీనియం టవర్స్ పేరుతో పిలుస్తున్నారు. దీన్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.60 కోట్లకుపైగా నిధులు వెచి్చంచి అసంపూర్తిగా ఉన్న టవర్–ఎను పూర్తి చేయటమే కాక, కొత్తగా టవర్–బిని నిరి్మంచింది. టవర్–బి ఈ ఏడాదే పూర్తయింది. ప్రస్తుతం ఖాళీగా ఉంది. మరి దాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా తన అవసరాల కోసం వాడుకుంటే తప్పా? ఇదెక్కడి వాదన? ప్రభుత్వ విభాగానికైనా, ప్రభుత్వ విద్యా సంస్థలకైనా ప్రత్యేక భవనాలు నిరి్మంచే పరిస్థితి లేకుంటే తాత్కాలికంగా అందుబాటులో ఉన్న భవనాలు కేటాయించడం తప్పెలా అవుతుంది? చంద్రబాబు మాదిరి ప్రభుత్వ విభాగాలను సైతం ఫైవ్‌స్టార్ హోటళ్లలో పెట్టి భారీ అద్దెలు చెల్లించాలనా రామోజీ ఉద్దేశం? క్యాండ్యూయెంట్‌కు నోటీసులంటూ పచ్చి అబద్ధాలు.. ‘టవర్–ఏ’లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన ఐటీ సంస్థ కాండ్యుయెంట్‌కు విస్తరణ కోసం అదనపు స్థలం అడిగినా ఇవ్వలేదని, పైపెచ్చు ఖాళీ చేయమంటూ నోటీసులు జారీ చేశారని ఈనాడుతో పాటు సోషల్ మీడియా వేదికగా ఎల్లో బ్యాచ్ విపరీతమైన దు్రష్పచారం చేస్తోంది. నిజానికి ప్రభుత్వం తమకెలాంటి నోటీసులూ ఇవ్వలేదని, హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యే ఆలోచన తమకు లేనే లేదని కాండ్యుయెంట్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసినా... ఈ విషప్రచారానికి మాత్రం తెరపడటం లేదు. నిజానికి ఈ టవర్‌లో కాండ్యుయెంట్ తప్ప వేరే కంపెనీలేవీ కార్యకలాపాలు కొనసాగించడం లేదు. ఐటీ కంపెనీలను ఆకర్షించడం కోసం ప్రభుత్వం ఐటీ ఇన్ఫ్రాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అదానీ గ్రూప్ డేటా సెంటర్‌తో పాటు భారీ ఐటీవర్ను నిర్మిస్తోంది. రహేజా గ్రూపు ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో పాటు ఐటీ టవర్‌ను కడుతోంది. ఏపీఐసీసీ రూ.2,300 కోట్ల వ్యయంతో మధురవాడలో 19 ఎకరాల విస్తీర్ణంలో ‘ఐ స్పేస్’ పేరిట ఐటీ టవర్‌ను నిరి్మస్తోంది. కానీ రామోజీ ఈ నిజాలన్నిటికీ ముసుగేసి అబద్ధాలే ఆలంబనగా చెలరేగిపోయారు. హెచ్ఎస్బీసీ వెళ్లిపోయిందెప్పుడో తెలియదా? ‘ఈనాడు’ ఎంతలా దిగజారిపోయిందో తెలియటానికి ఈ అంశం ఒక్కటీ చాలు. చైనాకు చెందిన హెచ్ఎస్బీసీ తన విధానపరమైన నిర్ణయంలో భాగంగా భారతదేశ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నట్లు 2016లో ప్రకటించింది. అందులో భాగంగా విశాఖ, హైదరాబాద్, ఢిల్లీల్లోని తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడే. దీన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వానికి అంటగట్టి దు్రష్పచారం చేస్తున్నారంటే వీళ్లనేమనుకోవాలి? కొత్త కంపెనీలు కనిపించటం లేదా? కంపెనీలు వెళ్లిపోవటమే గానీ కొత్తవి రావటం లేదంటూ ఆక్రోశించారు రామోజీ. నిజానికి ఐటీకి ఆద్యుడినంటూ డబ్బాకొట్టుకొనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో విశాఖకు చెప్పుకోదగ్గ పేరున్న ఒక్క కంపెనీ కూడా రాలేదు. కానీ ఈ ప్రభుత్వం బీచ్ డెస్టినీ పేరిట ఐటీ కంపెనీలను విశాఖకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ ఇప్పటికే డేటా సెంటర్‌ను ప్రారంభించగా, విప్రో డేటాసెంటర్‌ను ప్రారంభించడానికి వీలుగా విశాఖలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగుల సమాచారాన్ని సేకరిస్తోంది. ఇక అమెజాన్, బీఈఎల్ , రాండ్‌స్టాడ్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. మరికొన్ని సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 24,,350 మంది ఐటీ ఉద్యోగులుండగా ఇపుడా సంఖ్య 53,850 దాటింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్నంతకాలం రామోజీకి ఈ వాస్తవాలు కనిపించనే కనిపించవు. -
ఇన్‌కమ్‌ట్యాక్స్ టవర్స్‌ను పేల్చుతానంటూ బెదిరించిన వ్యక్తి అరెస్టు
హైదరాబాద్: డయల్–100కు ఫోన్ చేసి ఈ నెల 12న నగరంలోని మూడు ప్రధాన ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాలను ఏకకాలంలో బాంబులతో పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి గుంటూరుకు చెందిన జైని రాధాకృష్ణ (43)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సోమవారం మధ్య మండలం డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్ డీసీపీ ఎ.రమణారెడ్డిలు ఒక సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేశారు. జైని రాధాకృష్ణ వ్యాపారంలో నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడని, వాటినుంచి బయటపడేందుకు ఇలా తప్పుడు మార్గం ఎంచుకున్నాడని వారు పేర్కొన్నారు. పథకం ప్రకారం జూన్ 11న రాత్రి గుంటూరు నుండి సికింద్రాబాద్‌కు చేరుకున్న రాధాకృష్ణ..అక్కడి నుంచి నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకుని అక్కడ బాంబు బూచికి పథకాన్ని రచించాడు. అనుకున్నట్టుగా ఈ నెల 12న మూడు రహస్య ప్రదేశాల్లో బాంబును అమర్చినట్లు డయల్–100కు ఫోన్ చేశాడు. పోలీసులు దాన్ని ఫేక్‌గా తేల్చి..అదే రోజు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కోసం గాలించినా సరైన ఆధారాలు లేక అతడు చిక్కలేదు. దీంతో నిందితుడిపై నాంపల్లి పోలీసు స్టేషన్‌తో పాటుగా గాంధీనగర్, సైఫాబాదు పోలీసు స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చే శారు. ఈ నెల 18న హయత్‌నగర్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద పట్టుకుని అరెస్టు చేసినట్లు ఎం.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
మారుమూలకూ.. డిజిటల్ విప్లవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగేళ్లుగా గిరిజన సంక్షేమాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేని విధంగా విశేషంగా కృషి చేస్తోంది. గిరిజనుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేకంగా దృష్టి సారించింది. కనీస మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, రహదారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వీటన్నింటికీ తోడు మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను అందుబాటులోకి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. తద్వారా ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను లబ్ధిదారుల ముంగిటకు మరింత త్వరితగతిన తీసుకెళ్లడానికి నాంది పలికింది. సమగ్ర గిరిజనాభివృద్ధే లక్ష్యంగా నాలుగేళ్లుగా చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆయా ప్రాంతాల్లో డిజిటల్ సేవలు విస్తరింప చేయాలన్న తాపత్రయంతో ప్రత్యేకంగా దృష్టి సారించారు. సెల్ ఫోన్ సేవలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్‌లో మెరుగైన, నాణ్యతతో కూడిన సేవలు అందుతాయని భావించారు. ప్రధానంగా పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని విశ్వసించారు. ఇందులో భాగంగా మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటుకు ముమ్మరంగా కసరత్తు చేశారు. ఇందుకు గిరిజన, అటవీ ప్రాంతాల్లో ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో స్వయంగా మాట్లాడారు. మార్గదర్శకాలను సులభతరం చేసుకుని.. సెల్టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని రాష్ట్రంలో వేగవంతం చేశారు. అవరసమైన మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయించారు. మొత్తంగా రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) ద్వారా సెల్ టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మొత్తం ప్రాజెక్టు కింద కొత్తగా 2,849 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు గాను ఇప్పటికే 2,463 చోట్ల స్థలాలు అప్పగించింది. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించింది. ఆవాసాలన్నింటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలందించేందుకు ఒకేసారి 100 జియో టవర్స్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ నాటికి రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని ఆవాసాలన్నింటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ రానుందని తెలిపారు. తద్వారా ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ మరింతగా కనెక్టివిటీ లభించడంతో పాటు మెరుగైన, నాణ్యతతో కూడిన సేవలు అందుతాయన్నారు. సెల్ టవర్స్ ఏర్పాటు ద్వారా రేషన్ పంపిణీ, ఇ–క్రాప్ బుకింగ్ సులభమవుతుందని.. ఆయా ప్రాంతాలకు ఆర్థికంగా కూడా మరింత లబ్ధి కలగనుందని చెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలను అత్యంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మలకు మరింత సమర్థవంతంగా అందించగలుగుతామన్నారు. ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సెల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగానికి, జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్కు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ప్రారంభమైన సెల్ టవర్ల ద్వారా 209 గ్రామాలకు 4జీ సేవలు అందనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైఎస్సార్ జిల్లాలో 2 టవర్లను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో వీటిని 5జీ సేవలుగా అప్‌గ్రేడ్ చేయనుంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సెల్ టవర్ల పరిధిలో 150 ఎంబీపీఎస్ డౌన్లోడ్, 50 ఎంబీపీఎస్ అప్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. గిరిజన సంక్షేమాభివృద్ధికి పెద్దపీట ► గిరిజనుల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం 2022 డిసెంబర్ నాటికి రూ.17,651 కోట్లు ఖర్చు చేసింది. గిరిజనులు ధైర్యంగా పంటలు పండించుకునేందుకు వీలుగా చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా 4.88 లక్షల ఎకరాలకు 2.49 లక్షల అటవీ హక్కు పత్రాలు, డికేటీ పట్టాలు అర్హులైన గిరిజనులకు పంపిణీ చేశారు. ► నాడు–నేడులో భాగంగా గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల రూపురేఖలు మార్చింది. గిరిజనుల కోసం ప్రత్యేకించి పాడేరు, పార్వతీపురంలో మెడికల్ కళాశాలలు, కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల, సీతంపేట, పార్వతిపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు.. విజయనగరం వద్ద గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా విద్యకు కేటాయించిన బడ్జెట్లో గిరిజనుల విద్య కోసం 37.66 శాతం కేటాయిస్తూ వస్తోంది. ► ఈ ఒక్క ఏడాదే రూ.4,123.39 కోట్ల బడ్జెట్ కేటాయించింది. గిరిజన ఉప ప్రణాళిక కోసం రూ.6,929.09 కోట్లు కేటాయించింది. విశాఖ జిల్లా చింతపల్లి మండలం రాజంగిలో రూ.35 కోట్లతో గిరిజన స్వాతంత్య్ర సమర యోధుల మ్యూజియం నిర్మిస్తోంది. మారుమూల గ్రామాలకు వందల కిలోమీటర్ల మేర రహదారి సౌకర్యం కల్పించింది. గిరిజనులతో ముచ్చటించిన సీఎం అల్లూరి సీతారామరాజు జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సికలబాయి, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కుంటంబడేవలస గ్రామాల్లో టవర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయా గ్రామాల్లో వచ్చిన సెల్ టవర్ నెట్వర్క్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎంపీ గొడ్డేటి మాధవి, అరుకు, పాడేరు, కురుపాం ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, కొట్టుగుళ్లు భాగ్యలక్ష్మి, పుష్ప శ్రీవాణి, కలెక్టర్లు సుమిత్ కుమార్, నిషాంత్ కుమార్, పాడేరు ఐటీడీఏ పీఓ వి.అభిషేక్, ప్రజలు.. సీఎంతో మాట్లాడారు. వారందరినీ సీఎం ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఐటీ సెక్రటరీ కోన శశిధర్, రిలయెన్స్ జియో ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ రోజు పెద్ద పండుగ మీ (సీఎం) చొరవ వల్ల గిరిజన ప్రాంతాలు సైతం అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వంద సెల్ టవర్లు ప్రారంభించడం మా మారుమూల ప్రాంతాల్లో పెద్ద పండుగగా భావిస్తున్నాం. ఈ టవర్ల వల్ల మాకు వేగవంతమైన సేవలు అందుతాయి. 104, 108, ఆర్బీకే వ్యవస్థల సేవలను చక్కగా వినియోగించుకోవడానికి దోహద పడుతుంది. గత టీడీపీ ప్రభుత్వం మా గిరిజన ప్రాంతాలను అంధకారంలోకి నెట్టివేసింది. ఇప్పుడు మీ వల్ల మా గిరిజనులు అభివృద్ధికి నోచుకుంటున్నారు. అందరికీ ఆధార్ కార్డులు కూడా ఇస్తుండడంతో ప్రభుత్వ సేవలు ప్రతి గడపకూ చేరుతున్నాయి. – చెట్టి ఫాల్గున, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, అరకు మీ వల్లే గిరిజనుల్లో వెలుగు ఎక్కడో మారుమూల ఒడిశాకు అతి సమీపంలో ఉన్న గ్రామాలకు సైతం ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందడం చాలా సంతోషకరం. మా ఐటీడీఏ డివిజన్‌లోనే 86 టవర్లు ప్రారంభించడం ఒక చరిత్ర. మా ప్రాంత ప్రజలందరి తరఫునా మీకు పాదాభివందనం. గతంలో సిగ్నల్స్ లేక ఆఫ్‌లైన్‌లో పని చేయలేక.. ఆన్లైన్ ఉన్నచోట డేటా డౌన్లోడ్ చేయాల్సి వచ్చేది. గ్రామస్తుల సమస్యలు ఎవరికైనా అత్యవసరంగా చెప్పాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ సమస్య తప్పింది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధితో పాటు రోడ్లు.. సెల్ కనెక్టివిటీ కల్పించడం శుభ పరిణామం. గత పాలకులు మా ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తే.. మీరు (సీఎం) పారదర్శకంగా చక్కటి పాలన అందిస్తున్నారు. గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపిన మీ మేలు ఎవరూ మరచిపోరు. – కె.భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పాడేరు గిరిజనుల పక్షపాత సీఎం అన్నా.. మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రతి ఆలోచనా, ప్రతి పథకం మా గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి దోహదపడ్డాయి. మీరు గిరిజన పక్షపాత ముఖ్యమంత్రి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మా గిరిజన ప్రాంతాల స్కూల్స్, ఆస్పత్రుల రూపురేఖలు మార్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మాకు అందించారు. నా కుటుంబ సభ్యులంటూ మమ్మల్ని అభివర్ణించిన నాయకుడు మీరే. మీరు మా గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. – పాముల పుష్ప శ్రీవాణి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, కురుపాం కష్టాలు తప్పించారు సెల్ టవర్ అందుబాటులోకి రావడం వల్ల భీమవరం సచివాలయ పరిధిలో 16 గ్రామాలకు నెట్వర్క్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వలంటీర్లు సకాలంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు అవకాశం ఏర్పడింది. సెల్ నెట్వర్క్ లేకపోవడం వల్ల గతంలో వలంటీర్లు సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని హుకుంపేట వెళ్లి డేటా ఎంట్రీ చేసేవారు. ఆ తర్వాతే పింఛన్లు పంపిణీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు భీమవరం, అండిభ పంచాయతీల పరిధిలో నాలుగు టవర్లు నిర్మించడం ద్వారా ఆ ఇక్కట్లు తప్పాయి. తద్వారా పింఛను, వైఎస్సార్ బీమా, ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ, మ్యుటేషన్ల ప్రక్రియ వేగవంతం అవుతుంది. – శాంతికుమారి, హార్టికల్చర్ అసిస్టెంట్, భీమవరం, హుకుంపేట్ మండలం, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఇప్పుడు ఫోన్ చేస్తే 108 వస్తుంది అన్నా.. మేం నేరుగా మీతో మాట్లాడుతున్నామంటే సెల్ టవరే కారణ. మాకు గతంలో రోడ్లు, కరెంట్, సెల్ టవర్ సౌకర్యాలు లేవు. అవన్నీ మీరు ఇచ్చారు. చాలా సంతోషం. గతంలో గర్భవతులను ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే డోలీలే దిక్కు. కానీ ఇప్పుడు మేము 108కు ఫోన్ చేస్తే మా ప్రాంతానికీ వెంటనే వస్తుంది. మాకు వైద్యం అందుతుంది. మేం మీకు రుణపడి ఉంటాం. – పాలక సంధ్య, పెదఖర్జ, గుమ్మలక్ష్మీపురం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా -
పెద్ద ఎత్తున మార్పులు రాబోతున్నాయ్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. దీని ద్వారా 209 మారుమూల గ్రామాలకు సేవలు అందనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్ జిల్లాలో 2 టవర్లను సీఎం ప్రారంభించారు. టవర్లను ఏర్పాటు చేసిన రిలయన్స్ జియో సంస్థ.. భవిష్యత్తులో 5జీ సేవలను అప్‌గ్రేడ్ చేయనుంది. కొత్తగా ప్రారంభించిన సెల్టవర్ల వల్ల మారుమూల ప్రాంతాలనుంచి ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో సీఎం జగన్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ప్రాజెక్టు కింద కొత్తగా 2,704 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే 2,363 చోట్ల స్థలాలు ప్రభుత్వం అప్పగించింది. టవర్లతో మరింత మెరుగ్గా సేవలు టవర్ల ఏర్పాటు కారణంగా ఏపీలో మారుమూల ప్రాంతాల్లో మరింతగా మెరుగుపడనున్నాయి ప్రభుత్వ సేవలు. ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ మరింత కనెక్టివిటీ, మెరుగైన నాణ్యతతో సేవలు అందుతాయి. అలాగే విద్యార్థులకు ఇ– లెర్నింగ్ అందనుంది. మరింత మెరుగ్గా అందనున్నాయి ఆరోగ్య సేవలు. ఆర్థికంగానూ ఆయా ప్రాంతాలకు మరింత లబ్ధి చేకూరనుంది. మారుమూల ప్రాంతాలకు.. రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకూ వారి ముంగిటకే సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యూనివర్సిల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) ద్వారా సెల్టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సెల్ టవర్ల పరిధిలో 150 ఎంబీపీఎస్ డౌన్లోడ్, 50 ఎంబీపీఎస్ అప్లోడ్ చేసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలతో మాట్లాడుకుని.. మార్గదర్శకాలను సులభతరం చేసుకుని.. సెల్టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. ► ఇక అవరసమైన మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసింది ప్రభుత్వం. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటునకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పెద్ద ఎత్తున మార్పులు రాబోతున్నాయ్: సీఎం జగన్ టవర్లను ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ అభినందనలు. కేంద్ర ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి, జియోకు, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ అందిరికీ ధన్యవాదాలు. డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయి. దీంతో అన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, స్కూళ్లకూ ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుంది. రేషన్ పంపిణీ, ఇ–క్రాప్ బుకింగ్ కూడా సులభమవుతుంది. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును అత్యంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మలకు అందించగలుగుతాం. అదే విధంగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ప్రజాప్రతినిధులకు, అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ టవర్స్ ఏర్పాటు వల్ల మీ అందరికీ ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నా అని తెలిపారు సీఎం జగన్. చదవండి: పోలవరం అడవిలో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లి -
బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..!
జీవితాన్ని సౌకర్యవంతంగా గడపడానికి ఉద్యోగం తప్పనిసరి. ఏ ఉద్యోగం చేసినా పదో పాతికో సంపాదించగలం. బాగా శ్రమిస్తే కొందరైతే లక్షల వరకు చేరుకోగలరు. కానీ కేవలం బల్బులను మార్చుతూ కోట్లు సంపాదించగలరా? ఏ సంస్థ అయినా లైట్లు మార్చితే కోట్ల రూపాయల జీతం ఇస్తుందా? అవును ఇస్తుంది. కేవలం టవర్‌కు ఉండే లైట్లను మార్చితే కోట్ల రూపాయల జీతం సంపాదించవచ్చు. కాకపోతే.. ఆ టవర్ల ఎత్తు మామూలుగా ఉండదు మరి..! మామూలు టవర్లు కావు.. వందల మీటర్లు ఉండే ఎత్తైన సిగ్నల్ టవర్లపై పని చేయాలి. పైకి వెళ్లగానే కళ్లు తిరుగకుండా, ధైర్యంగా సన్నని కడ్డీలపై తిరుగాల్సి ఉంటుంది. బయట కనిపించే టవర్ల లాంటివి కావు ఇవి. ఎత్తుకు పోయేకొలది సన్నగా ఉంటాయి. చివరకు కేవలం సన్నని కడ్డీ మాత్రమే ఉంటుంది. ఈ టవర్లపై ఎక్కి లైట్లను మార్చాలి అంటే..భయంతో కూడిన పని. కేవలం ఒక తాడు మాత్రమే రక్షణగా ఉంటుంది. ఇలాంటి పనులు అందరూ చేయలేరు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి టవర్లపై పనిచేయగలిగే వారికి చాలా డిమాండ్ అంటుందట. కోట్లలో జీతాలు.. టవర్ ఎత్తు, అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగికి జీతం ఉంటుందట. కొందరికి గంటల చొప్పున ఉంటుంది. ఎంత తక్కువలో అయినా ఒక టవర్ ఎక్కి దిగడానికి కనీసం ఆరుగంటలైన పడుతుంది. 1500 మీటర్ల టవర్‌ను ఎక్కగలిగేవారికి దాదాపు 1 కోటి రూపాయలపైనే ఉంటుంది. ఉద్యోగంలో కొత్తగా చేరినవారికే గంటకు సరాసరిగా 17డాలర్ల వరకు ఇస్తారు. అయితే.. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఈ లైట్లను మారుస్తారట. అమెరికాలోని డకోటా నగరానికి చెందిన ఓ ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. Every six months this man in South Dakota climbs this communication tower to change the light bulb. He is paid $20,000 per climb. pic.twitter.com/z9xmGqyUDd — Historic Vids (@historyinmemes) December 2, 2022 ఇదీ చదవండి:యూఎస్‌కి 17 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన గణిత మేధావి మృతి -
TS Transco: పొలాల్లో జబర్దస్తీ.. పరిహారం నాస్తి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టవర్లు, లైన్ల ఏర్పాటుతో రాష్ట్రంలో భూములు నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం అందని ద్రాక్షగా మారింది. జిల్లా కలెక్టర్లు పరిహారం చెల్లింపు ఊసే ఎత్తడం లేదు. కలెక్టర్ల నిర్లక్ష్యం, ట్రాన్స్‌కో నిర్లిప్తతతో.. పరిహారం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది రైతులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఈ మేరకు బాధిత రైతు ఒకరు చేసిన ఫిర్యాదును విచారించిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ).. పరిహారం ఇప్పించే అధికారం తమకు లేదని పేర్కొంది. జిల్లా కలెక్టర్లు మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అప్పట్లో స్పష్టం చేసింది. అయితే తాజాగా అదే కేసులో చిత్రమైన ఆదేశాలు జారీ చేయడంతో బాధిత రైతులను పట్టించుకునేవారే లేకుండా పోయారు. పరిహారం కోసం జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లండి.. రైతు పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్ 2017 ఆగస్టు 7న ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 67(4)లోని నిబంధనల మేరకే కమిషన్ పాత్ర పరిమితమని, పరిహారం ఇప్పించలేమని స్పష్టం చేసింది. విద్యుత్ లైన్ల ఏర్పాటుతో భూములు నష్టపోతున్న రైతులు, ఇతర భూ యజమానులకు పరిహారం చెల్లింపునకు మార్గదర్శకాల రూపకల్పన కోసం అత్యవసరంగా జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని ట్రాన్స్‌కోను ఆదేశించింది. ‘నిర్ణయాలన్నింటినీ జిల్లా కలెక్టర్ ముందు ఉంచి తగిన పరిహారం కోరే హక్కు పిటిషనర్‌కు ఉంది..’ అని స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 67(4)లోని నిబంధనల మేరకే కమిషన్ పాత్ర పరిమితమని, పరిహారం ఇప్పించలేమని స్పష్టం చేసింది. విద్యుత్ లైన్ల ఏర్పాటుతో భూములు నష్టపోతున్న రైతులు, ఇతర భూ యజమానులకు పరిహారం చెల్లింపునకు మార్గదర్శకాల రూపకల్పన కోసం అత్యవసరంగా జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని ట్రాన్స్‌కోను ఆదేశించింది. ‘నిర్ణయాలన్నింటినీ జిల్లా కలెక్టర్ ముందు ఉంచి తగిన పరిహారం కోరే హక్కు పిటిషనర్‌కు ఉంది..’అని స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం 2003 కింద పరిహారాన్ని ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్లు సహజ న్యాయ సూత్రాలు, భూసేకరణ చట్టాలను అనుసరించాలి. కేంద్రం జారీ చేసిన ‘రైట్ ఆఫ్ వే’నిబంధనలను దృష్టిలో పెట్టుకుని పరిహారం నిర్ణయించాలి. పిటిషనర్ ఈ అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సరైన పరిహారం కోరవచ్చు. ’అని కమిషన్ ఆదేశించింది. రైతులకు పరిహారం అందకపోవడం పట్ల ఈ ఉత్తర్వుల్లో కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కలెక్టర్లు జారీ చేసిన పరిహారం ఉత్తర్వులను సమీక్షించించే అధికారం కమిషన్‌కు ఉందని కూడా స్పష్టం చేసింది. కలెక్టర్లదే అధికారం: కేంద్ర విద్యుత్ నిబంధనలు–2006 ప్రకారం టవర్ల నిర్మాణానికి తప్పనిసరిగా రైతులు/భూయజమానుల సమ్మతి తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. కాగా టవర్ల ఏర్పాటుతో భూములు నష్టపోయిన వారికి పరిహారాన్ని నిర్ణయించి ఇప్పించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కట్టబెడుతూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2007 ఫిబ్రవరి 27న ‘వర్క్స్ ఆఫ్ లైసెన్స్ రూల్స్’పేరుతో జీవో ఎంఎస్ నం.24 జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం కూడా పరిహారం ఇప్పించే బాధ్యత కలెక్టర్లదే. ఈఆర్సీ ఆదేశాలు బేఖాతరు: ఈఆర్సీ 2017లో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆ తర్వా త వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు వెంకట్‌రెడ్డి మూడుసార్లు అర్జీ పెట్టుకున్నారు. కానీ కలెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఆయన 2020లో మళ్లీ ఈఆర్సీని ఆశ్రయించారు. విద్యుత్ చట్టంలోని నిబంధనలు ఉటంకిస్తూ.. ఈఆర్సీ ఉత్తర్వులు అమలు చేయని కలెక్టర్లు, ట్రాన్స్కోపై చర్యలు తీసుకోవాలని, జరిమానా విధించాలని కోరారు. తాజాగా ఈఆర్సీ విచిత్ర ఆదేశాలు భూ సేకరణకు మార్గదర్శకాలు రూపకల్పన చేయా లని జిల్లా కలెక్టర్‌ను గత ఉత్తర్వుల్లో ఆదేశించినప్పటికీ, అందులో పిటిషన్‌దారుడైన బాధిత రైతు కేసు ను నిర్దిష్టంగా ప్రస్తావించలేదని ఈఆర్సీ తన తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్‌ను సంప్ర దించడానికి రైతుకు కమిషన్ స్వేచ్ఛ ఇవ్వలేదని పేర్కొంది. జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలని ట్రాన్స్ కోను కూడా ఆదేశించలేదని పేర్కొంది. కాబ ట్టి ఈఆర్సీ ఆదేశాలను జిల్లా కలెక్టర్, ట్రాన్స్‌కో అధికారులు బేఖాతరు చేశారన్న అంశం ఉత్పన్నం కాదని, వీరిపై చర్యలు తీసుకోలేమంటూ స్పష్టం చేసింది. కొత్త లైన్లకు సైతం లభించని పరిహారం నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సరఫరా చేయడానికి దామరచర్ల–డిండి, దామరచర్ల–చౌటుప్పల్ వరకు 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో వందల మంది రైతుల పొలాల్లో టవర్లు వేసినప్పటికీ పరిహారం చెల్లించలేదు. కల్లెపల్లికి చెందిన మాతృ నాయక్‌కు ఎకరంన్నర పొలం ఉండగా, పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి 4 నెలల కిందట టవర్ వేశారు. కానీ ఇంకా ఇవ్వలేదు. ఇదే గ్రామానికి చెందిన మరో రైతు ఠాగూర్‌కు 3 ఎకరాల పొలం ఉండగా 4 నెలల కిందట టవర్ వేశారు. పరిహారం ఇవ్వలేదని, అధికారులను అడిగితే రేపు, మాపు అంటూ సమాధానం చెబుతున్నారని ఆయన వాపోతున్నారు. -
4 భారీ టవర్లు... 10 సెకన్లలోనే నేలమట్టం!
ఇంగ్లండ్: స్టాఫోర్డ్‌షైర్‌లోని రుగేలీ పవర్ స్టేషన్లో 117 మీటర్ల పొడవైన నాలుగు భారీ శీతలీకరణ టవర్లు 10 సెకన్ల కాలంలో నేలమట్టమయ్యాయి. ఇంగ్లండ్‌లో ఈ టవర్లు దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా తమ సేవలను అందించాయి. అయితే బొగ్గుతో నడిచే ఈ విద్యుత్ ప్లాంట్‌ను 2016లో మూసివేశారు. కాగా ప్రస్తుతం అక్కడ గృహ, వ్యాపార స్థలాలకు ఏర్పాటు చేయడానికి వీటిని పడగొట్టినట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా ఈ స్థలం వద్దకు రావద్దని స్థానిక ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వందలాది మంది సమీపంలోని ఓ కొండపైకి చేరుకుని టవర్ల కూల్చివేతను వీక్షించారు. టవర్లను కూల్చివేస్తున్నపుడు పొగ, ధూళి చుట్టూ కమ్ముకుంది. ఇక వివిధ కోణాల నుంచి చిత్రీకరించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇంగ్లాండ్‌లోని కూల్చివేత కాంట్రాక్టర్ బ్రౌన్, మాసన్ గ్రూప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. 81 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఇక అక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమిని చదును చేయడానికి కార్మికులు శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ పని సంవత్సరం చివరినాటికి ముగిసే అవకాశం ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. (చదవండి: యూఎన్ చీఫ్‌గా మళ్లీ ఆంటోనియా గుటెరస్) -
బలమైన గాలి వీచినా ఇక చెక్కుచెదరవ్!
సాక్షి, అమరావతి: విద్యుత్ లైన్లను మరింత బలోపేతం చేయాలని ఏపీ ట్రాన్స్‌కో నిర్ణయించింది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తట్టుకునేలా నూతన డిజైన్‌ను తీసుకురాబోతోంది. దీని కోసం కొన్ని నెలలుగా దేశ, విదేశీ సాంకేతికతను అధ్యయనం చేసింది. తుపానుల నేపథ్యంలో తరచూ టవర్లు కూలుతుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంటకు 300 కిలోమీటర్ల గాలి వీచినా తట్టుకునేలా టవర్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్తగా వేసే లైన్లలో ముందుగా దీన్ని పాటించనుంది. ప్రస్తుతం ఉన్న లైన్లను క్రమంగా ఈ స్థాయికి తీసుకువచ్చే వీలుందని గ్రిడ్ అధికారులు వెల్లడించారు. ఎంతకైనా తట్టుకునేలా... ► ఏపీ ట్రాన్స్‌కోకు రాష్ట్రవ్యాప్తంగా 400 కేవీ, 220, 132 కేవీల లైన్లు, సబ్స్టేషన్లు, లైన్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త లైన్లు వేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని లైన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ► ప్రస్తుతం ట్రాన్స్‌కో టవర్స్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా తట్టుకుంటాయి. భూమి తీరును బట్టి వీటి నిర్మాణం చేపడతారు. నేల మెత్తగా ఉంటే మరింత లోతుగా, ఎక్కువ ఇనుము వాడి పునాది గట్టిగా వేస్తారు. ► హుద్‌హుద్ తుపాను సమయంలో బలమైన ట్రాన్స్‌కో టవర్లకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. తుపాను తాకిడికి దాదాపు 62 విద్యుత్ టవర్లు నేలకూలాయి. కల్పక–ఖమ్మం లైన్లో 400 కిలోవాట్ల సామర్థ్యం గత 14 టవర్స్ పడిపోయాయి. ► సాధారణంగా గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని మించి గాలి వీచిన దాఖలాలు అప్పటి వరకూ లేవు. హుద్‌హుద్ అనుభవాన్ని పరిశీలించిన తర్వాత గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే టవర్స్ నిర్మాణం అవసరమని ట్రాన్స్‌కో భావిస్తోంది. ► తుపాను ప్రభావిత ప్రాంతాలపైనే ముందుగా అధికారులు దృష్టి పెట్టారు. అక్కడి పరిస్థితులను బట్టి డిజైన్‌కు రూపకల్పన చేశామని ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడున్న దానికన్నా టవర్ ఎత్తు పెంచడం, మరింత బలమైన మెటీరియల్ ఉపయోగించేలా డిజైన్‌లో మార్పు తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ► కొత్త డిజైన్‌ను అందుబాటులోకి తెస్తే టవర్ నిర్మాణ వ్యయం స్వల్పంగా పెరిగే వీలుందని, అయితే, ఎలాంటి తుపానులొచ్చినా కూలిపోయే వీల్లేదని చెప్పారు. ఆ సమయంలో జరిగే నష్టంతో పోల్చుకుంటే ఇప్పుడే కొంత ఎక్కువ వెచ్చించడం భారం కాదన్నారు. -
ఆ వ్యాపారంలో లేం: రిలయన్స్
సాక్షి, న్యూఢిల్లీ: కార్పొరేట్ లేదా కాంట్రాక్ట్ వ్యవసాయ వ్యాపారంలో తాము లేమని రిలయన్స్ సంస్థ స్పష్టం చేసింది. పంజాబ్‌లో తమ జియో సంస్థ టెలికం టవర్ల ధ్వంసం వెనుక స్వార్థ ప్రయోజనాలను ఆశిస్తున్న శక్తులున్నాయని ఆరోపించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు తమ టవర్లను ధ్వంసం చేయకుండా అడ్డుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ పంజాబ్, హరియాణా హైకోర్టులో రిలయన్స్ పిటిషన్ దాఖలు చేసింది. ‘మా గ్రూప్ సంస్థలు ఒప్పంద వ్యవసాయ రంగంలో లేవు. భవిష్యత్తులో ప్రవేశించాలన్న ఆలోచనా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడా మేం వ్యవసాయ భూమిని కొనలేదు’ అని పిటిషన్లో రిలయన్స్ పేర్కొంది. సంస్థకు చెందిన రిటెయిల్ యూనిట్లు ఆహార ధాన్యాలు సహా నిత్యావసరాలను అమ్ముతాయన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా రిలయన్స్ స్పష్టత ఇచ్చింది. తాము రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయమని వివరించింది. పంజాబ్‌లో ఉన్న 9 వేల జియో టవర్లలో దాదాపు 1,800 టవర్లు ధ్వంసమయ్యాయి. రైతుల పంటలకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించాలన్న డిమాండ్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రిలయన్స్ పేర్కొంది. ఆ అఫిడవిట్లో అన్నీ అబద్ధాలే హైకోర్టులో రిలయన్స్ సమర్పించిన అఫిడవిట్లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకే ఆ సంస్థ ఈ పిటిషన్ వేసిందని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) విమర్శించింది. మహారాష్ట్రలో, దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ భూములను కొనుగోలు చేసిందని పేర్కొంది. భూములను రైతులకు వెనక్కు ఇచ్చాక కోర్టును ఆశ్రయించాలని రిలయన్స్‌కు సూచించింది. -
తొలి దశలో రెండువేల 5జీ టవర్ల నిర్మాణం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో 5జీ టవర్లను నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ టవర్స్ లిమిటెడ్ (ఏపీటీఎల్) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోవిడ్–19 దెబ్బతో 5జీ సేవలు అందుబాటులోకి రావడానికి ఆలస్యం కానుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తొలి దశలో కనీసం 2,000 టవర్లను ఏదైనా ఒక భాగస్వామ్య సంస్థతో నిర్మించి వాటిని టెలికాం ఆపరేటర్లకు లీజుకు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఏపీటీఎల్ ఎండీ ఆర్. పవనమూర్తి తెలిపారు. భూమి లీజుదారులు, టెలికాం ఆపరేటర్ల మధ్య ఏపీటీఎల్ ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తుందన్నారు. దీనివల్ల ఒకే టవర్‌ను అనేక ఆపరేటర్లు వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. కాగా, ఈ సంవత్సరాంతానికి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రావాల్సి ఉండగా..ప్రధాని మోదీ ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా చైనా పరికరాలు కాకుండా దేశీయ పరికరాలే వాడాలని పేర్కొనడంతో ఆలస్యమవుతోంది. ఇప్పటికే సీడాట్, టెక్ మహీంద్రా వంటి దేశీయ సంస్థలు సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. (తిరుపతి శిల్పారామానికి రూ.10 కోట్లు) -
హోర్డింగ్ డేంజర్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని టవర్లు, హోర్డింగ్‌లతో ప్రమాదం పొంచి ఉంది. తక్కువ వేగంతో వీస్తున్న గాలులకే ఇవి కుప్పకూలిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వీటి నిర్మాణ నాణ్యత, మన్నిక పరిశీలనలో జీహెచ్ఎంసీ విఫలమవుతోంది. ఫలితంగా ప్రజా భద్రత గాలిలోదీపమవుతోంది. తాజాగా సోమవారం కురిసిన గాలివానకు ఎల్బీ స్టేడియంలోని ఫ్లడ్‌లైట్ల టవర్ కూలి ఓ వ్యక్తి మరణించడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలో దాదాపు 2,600 హోర్డింగ్‌లు ఉండగా... వీటిలో కొన్ని దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసినవి కావడంతో అవి ఎప్పుడు కూలుతాయోన ని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. 2016లో జూబ్లీహిల్స్‌లో ఓ భారీ హోర్డింగ్ యూనిపోల్ కుప్పకూలడం తో నగరంలో నూతన హోర్డింగ్‌లకు అనుమతులు నిషేధించారు. అయితే వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆందోళనలు చేయడంతో షరతులతో కూడిన అనుమతులు మంజూ రు చేయాలని నిర్ణయించారు. ఈ నిబంధ నల ప్రకారమే 2017 నుంచి హోర్డింగ్‌లకు అనుమతులు ఇస్తున్నారు. అయితే కొన్ని నిబంధనలు కాగితాలకే పరిమితమవడం గమనార్హం. మరోవైపు హోర్డింగ్‌లకు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు గాలులు వీచినప్పుడు ఎగిరిపడి మెట్రోరైలు మార్గంలోని ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై పడుతుండడంతో రైళ్ల రాకపోకలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల బాలానగర్‌లో, అంతకుముందు తార్నాక, మెట్టుగూడ, బేగంపేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. పాలసీపై నిర్లక్ష్యం... గ్రేటర్లో హోర్డింగ్‌లతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ‘హోర్డింగ్ ఫ్రీ సిటీ’గా మారుస్తామని గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన సమయంలో కేటీఆర్ ప్రకటించారు. అయితే ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నగరంలో ప్రస్తుతమున్న 2,600 హోర్డింగ్‌ల నాణ్యత, మన్నిక ఎలా ఉందనే అంశంపై జేఎన్టీయూ, ఐఐటీ నిపుణులతో పరీక్షించే విషయంలో బల్దియా యంత్రాంగం విఫలమైంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బెంగళూర్ తరహాలో ‘ప్రమాద రహిత హోర్డింగ్’ పాలసీ విధివిధానాలు రూపొందించడంలోనూ మున్సిపల్, బల్దియా యంత్రాంగాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. జీహెచ్ఎంసీ నోటీసులు... ఎల్బీ స్టేడియంలో ఉన్న ఫ్లడ్‌లైట్ టవర్ల స్ట్రక్చరల్ స్టెబిలిటీపై తక్షణం నివేదిక సమర్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. సోమవారం రాత్రి కురిసిన గాలివానకు స్టేడియంలోని ఫ్లడ్‌లైట్ టవర్ కూలి ఒకరు మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మిగిలిన మూడు టవర్ల స్టెబిలిటీపై జేఎన్టీయూ, ఉస్మానియాకు చెందిన ఇంజినీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించి, తక్షణం నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఆదేశించారు. మిగిలిన మూడింటిలో ఏదైనా టవర్ బలహీనంగా ఉన్నట్లు నివేదికలో తేలితే వెంటనే తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నగరంలో హోర్డింగ్‌లు, యూనిపోల్స్ స్ట్రక్చరల్ స్టెబిలిటీపై గతేడాది పరీక్షలు నిర్వహించామన్నారు. ప్రధాన మార్గాల్లోని హోర్డింగ్‌లపై ఫ్లెక్సీలను తొలగించాలని ఆయా ఏజెన్సీలకు కమిషనర్ స్పష్టం చేశారు. అదే విధంగా గ్రేటర్‌లోని అన్ని సెల్టవర్ల మన్నిక సామర్థ్యం (స్ట్రక్చరల్ స్టెబిలిటీ)పై తక్షణం నివేదిక ఇవ్వాలని ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈదురు గాలులకు హోర్డింగ్‌లు, టవర్లు కూలుతున్న నేపథ్యంలో ఈ నోటీసులిచ్చింది. నగరంలోని అన్ని సెల్టవర్ల స్ట్రక్చరల్ స్టెబిలిటీపై నిపుణులైన ఇంజినీర్లు లేదా ఉస్మానియా, జేఎన్టీయూ ఇంజినీరింగ్ విభాగాలతో పరీక్షించి నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చింది. కాగితాల్లోనే నిబంధనలు... ♦ గోడలకు, భూమి మీద ఏర్పాటు చేసే హోర్డింగ్‌ల సైజు 40 గీ25 ఫీట్లు మాత్రమే ఉండాలి. ♦ రూఫ్‌టాప్ మీద పెట్టేవి రెండంతస్తుల ఎత్తు మించరాదు. వీటి పరిమాణం కూడా 30 గీ25 మాత్రమే ఉండాలి. ♦ తాము ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లతో ఎలాంటి ప్రమాదాలు జరగబోవని సదరు ఏజెన్సీ అండర్‌టేకింగ్ ఇవ్వాలి. ♦ హోర్డింగ్ ఏర్పాటు సమయంలో, ఆ తర్వాత జేఎన్టీయూ, ఐఐటీ నిపుణులతో నిర్మాణ నాణ్యతను పరీక్షించాలి. ♦ గ్రేటర్లో అనధికారికంగా 330 భారీ హోర్డింగ్‌లు ఉన్నట్లు 2016లో గుర్తించారు. వీటిలో 300 వరకు 2018లో తొలగించారు. అయితే ఆ తర్వాత ఎక్కడ? ఎన్ని? అనధికారిక హోర్డింగ్‌లు వెలిశాయనేది బల్దియా యంత్రాంగం గుర్తించకపోవడం గమనార్హం. -
ముంబైలోని క్రిస్టల్ టవర్‌లో అగ్ని ప్రమాదం
-
జియో టవరంటూ టోకరా!
సాక్షి, సిటీబ్యూరో: జియో ఫోన్లకు సంబంధించిన టవర్ ఏర్పాటుకు అనుమతి ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. కిషన్‌బాగ్‌కు చెందిన వ్యాపారి అబ్దుల్ సయ్యద్‌కు గత నెల 27న అజయ్ షా అనే వ్యక్తి ఫోన్ వచ్చింది. మీ ఇంటి ఆవరణలో జియో టవర్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇప్పిస్తామని నెలనెలా భారీ మొత్తం అద్దె వస్తుందని చెప్పాడు. ఇందుకు అబ్దుల్ అంగీకరించడంతో సైబర్ నేరగాళ్లు రిలయన్స్ సంస్థ పేరుతో కొటేషన్ పంపారు. ఇది నిజమని నమ్మిన బాధితుడితో రిజిస్ట్రేషన్ ఫీజు పేరు చెప్పి రూ. 14,500 తమ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. ఆపై ఒప్పందం ఖరారంటూ మరికొన్ని పత్రాలను ఈ–మెయిల్ చేసి అగ్రిమెంట్ ఛార్జీల పేరు చెప్పి మరో రూ.52,500 కాజేశారు. ఇంకోసారి డిక్లరేషన్ ఫామ్ పేరు చెప్పి ఇంకో రూ.35,200 వసూలు చేశారు. మొత్తం రూ. 1,02,200 కోల్పోయిన బాధితుడిని నేరగాళ్లు మరో రూ.55,500 డిపాజిట్ చేయమన్నారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
కాల్ డ్రాప్ కష్టాలు...
సాక్షి, అమరావతి : విజయవాడలో ఉంటున్న నరేంద్రకు ఆఫీసు నుంచి ముఖ్యమైన ఫోన్ వచ్చింది. ఇంట్లో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే అవతలి వైపు వారికి తన మాట వినిపించడం లేదు. ఫోన్ కట్ చేసి బయటకు వచ్చి తిరిగి కాల్ చేస్తే కలవటం లేదు. దాదాపు ప్రతి సెల్‌ఫోన్ వినియోగదారుడు ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటున్న అనుభవం ఇది. కొందరైతే సిగ్నల్స్ అందక బయటకు లేదా ఇంటిపైకి పరిగెత్తాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఖాతాదారులను పెంచుకోవడంపై చూపుతున్న శ్రద్ధను టవర్ల సంఖ్యపై కూడా చూపాలని డిమాండ్ చేస్తున్నారు. టవర్లు తగినన్ని లేకనే.. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న మొబైల్ వాడకందారులకు అనుగుణంగా మౌలిక వసతులను పెంచడంలో సెల్‌ఫోన్ ఆపరేటర్లు విఫలమవుతున్నారు. ఖాతాదారుల సంఖ్యకు తగినట్టుగా టవర్లు, సామర్థ్యం పెంచకపోవడంతో కాల్డ్రాప్స్ ఎక్కువవుతున్నాయి. కాల్‌డ్రాప్స్‌ను అరికట్టేందుకు ‘ట్రాయ్’ ఎన్ని పెనాల్టీలు విధిస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావట్లేదు. సబ్స్క్రైబర్స్ అధికంగా ఉన్న సెల్యూలర్ సంస్థల్లో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. వారం క్రితం నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఖాతాదారులు ఇబ్బంది ఎదుర్కొన్న మాట వాస్తవమేనని, దీన్ని వెంటనే సరిదిద్దినట్లు ఐడియా ఏపీ సర్కిల్ హెడ్ బి.రామకృష్ణ తెలిపారు. వొడాఫోన్‌ను టేకోవర్ చేయడం వల్ల ఆ ఖాతాదారులు ఐడియాలోకి మారటంతో కూడా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. పోటాపోటీగా ఆఫర్లు సెల్‌ఫోన్ కంపెనీల మధ్య పోటీ పెరిగి ఆఫర్లు ప్రకటిస్తుండటంతో ప్రతి నెలా సబ్స్క్రైబర్స్ భారీగా పెరుగుతున్నారు. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించిన ఓ కంపెనీ ధాటిని తట్టుకుని ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు ఇతర ఆపరేటర్లు పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దీనివల్ల ఖాతాదారుల సంఖ్య పెరుగుతున్నా ఆదాయం తగ్గిపోతోందని కంపెనీలు చెబుతున్నాయి. హైస్పీడ్ లేదు... 2జీనే సెల్‌ఫోన్ కంపెనీలు చెబుతున్న హైస్పీడ్ డేటా కేవలం ప్రచారానికే పరిమితమవుతోందని, పలు సందర్భాల్లో 2 జీ స్పీడు కూడా ఉండటం లేదని ఖాతాదారులు వాపోతున్నారు. అన్లిమిటెడ్ డేటా ప్యాక్‌లు ప్రకటిస్తుండటంతో వినియోగం భారీగా పెరిగి పీక్ సమయాల్లో వేగం తగ్గిపోతోంది. 4 జీ టవర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కానీ డేటా స్పీడ్ పెరిగే అవకాశం లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఐడియా సెల్యూలర్‌కు 11,000కి పైగా 2జీ టవర్లు ఉంటే 3జీ టవర్లు సుమారు 9,000 ఉన్నాయి. ఐడియా 4 జీ టవర్లు కేవలం 8,000 మాత్రమే ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్కు 4జీ అనుమతి లేనందున ఇతర సంస్థల స్పీడ్‌తో పోల్చి చూడకూడదని ఓ ఉన్నతాధికారి చెప్పారు. 8 కోట్లుదాటిన వాడకం దారులు ప్రస్తుతం ఏపీ సర్కిల్లో (ఏపీ, తెలంగాణ) ప్రైవేట్ సెల్‌ఫోన్ కంపెనీల ఖాతాదారుల సంఖ్య 7.02 కోట్లకు చేరింది. దీనికి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులను కూడా కలిపితే 8 కోట్లు దాటుతోంది. కంపెనీల మధ్య పోటీ పెరిగి ఆఫర్లు ప్రకటిస్తుండటంతో లాభాలు తగ్గి సామర్థ్యం పెంచుకోలేకపోతున్నాయి. దీనికి తోడు కొత్త టవర్ల ఏర్పాటుకు అనుమతులు రాక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆపరేటర్లు చెబుతున్నారు. కాలనీల మధ్యలో వెలుస్తున్న ఎత్తైన అపార్ట్మెంట్ల వల్ల కూడా సిగ్నల్స్‌కు అంతరాయం కలుగుతోందని, ఇలాంటి సందర్భాల్లో ఫిర్యాదు అందగానే టవర్ల ఫ్రీక్వెన్సీని మారుస్తున్నట్లు టెలికాం అధికారులు పేర్కొంటున్నారు. 7.02కోట్లు ప్రైవేట్ సెల్‌ఫోన్ కంపెనీల ఖాతా దారుల సంఖ్య -
ఖాజాలో రామకృష్ణ టెక్నో టవర్జ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిర్మాణ సంస్థ రామకృష్ణ హౌజింగ్ మంగళగిరిలోని ఖాజా గ్రామంలో రామకృష్ణ టెక్నో టవర్జ్ పేరిట అధునాతన వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తోంది. 11 లక్షల చ.అ.ల్లో 25 అంతస్తుల్లోని ఈ భవన సముదాయంలో 500 చ.అ. నుంచి 20 వేల చ.అ. స్థలాన్ని కొనుగోలు చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 5 లెవల్స్ పార్కింగ్, 18 ఎలివేటర్స్, ఫిట్నెస్, లైఫ్ స్టయిల్ సెంటర్స్, ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్లు, షాపింగ్ కేంద్రాలతో పాటూ ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక ఫర్నీచర్, లైటింగ్, ఔట్‌డోర్ వ్యూ, హై స్పీడ్ ఇంటర్నెట్ వంటి అన్ని రకాల వసతులను కల్పిస్తున్నామని పేర్కొంది. -
సూర్యభగవానుని సౌధం
ఇది ఇన్వెక్టస్ టవర్. ఇన్వెక్టస్ అంటే లాటిన్లో ‘అన్ కాంకరబుల్’ అని, ‘అన్ డిఫీటబుల్’ అని కూడా. అంటే ఎవరూ జయించలేనిది, ఎవరూ ఓడించలేనిది అని అర్థం. బహుశా భవిష్యత్తులో ఎదురవబోయే విద్యుత్ కొరత ఈ టవర్‌లో ఉండే (ఉండబోయే) నివాస గృహాలపై ఏ విధంగానూ ప్రభావం చూపలేదనే అర్థంలో ఇలా ‘ఇన్వెక్టస్ టవర్’ అని పేరు పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే.. కరెంట్ లేకపోయినా, ఈ టవర్ తన సొంత కరెంటును తయారుచేసుకుంటుంది! హౌ? ఎలా? చదవండి. వంద అంతస్తుల భవనాన్ని చూశాం... అంతకంటే పెద్దదైన బుర్జ్ ఖలీఫానూ చూశాం. వాటితో పోలిస్తే ఫొటోలో కనిపిస్తున్న సోల్ ఇన్వెక్టస్ టవర్ పెద్దదేమీ కాదు. అరవై అంతస్తులు మాత్రమే ఉంటుంది ఇది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో దీన్ని నిర్మించనున్నారు. మరి ఏమిటి దీని ప్రత్యేకత అంటున్నారా? చాలా వరకూ ఆకాశహర్మ్యాల మాదిరిగానే దీంట్లోనూ చుట్టూ అద్దాలు కనిపిస్తున్నాయా? నిజానికి అవి అద్దాలు కానేకాదు. సోలార్ ప్యానెల్స్! ఇంకోలా చెప్పాలంటే ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ప్రతి ఇంటిలో ఒక గోడకు బదులు సోలార్ ప్యానెల్స్ ఉంటాయన్నమాట. సాధారణంగా మనం సూర్యుడి వేడి తగలకుండా కర్టెన్స్ వాడతాం. కానీ సోలార్ ఇన్వెక్టస్ టవర్‌ను వీలైనంత ఎక్కువ సూర్యరశ్మి తగిలేలా కోడిగుడ్డు ఆకారంలో డిజైన్ చేశారు. భవనం చుట్టూ ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ సూర్యుడి వేడి నుంచి రక్షణ కల్పిస్తూనే అదనంగా విద్యుత్తునూ ఉత్పత్తి చేస్తాయి. భవనం విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుంటే దీనిపై దాదాపు 400 చదరపు మీటర్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే అవకాశముండేది. అయితే అన్నివైపులా ఉన్న ఫసాడ్ (బయటికి కనిపించే అద్దాల గోడ) కూ వీటిని వాడటం వల్ల ఈ విస్తీర్ణం 3500 చదరపు మీటర్లకు పెరిగింది. ఫలితంగా భవన విద్యుత్తు అవసరాల్లో సగానికిపైగా సూర్యుడే అందిస్తున్నట్లు అయింది. పెడెల్ థార్ప్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ డిజైన్ చేసిన సోల్ ఇన్వెక్టస్ టవర్ మరో మూడు నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకోనుంది. మరింత సమర్థమైన బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఇంకా ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసి వాడుకోవచ్చునని సంస్థ ప్రతినిధి బ్రూక్ అంటున్నారు. -
ఇంద్రకీలాద్రిపై టవర్ల ఏర్పాటు
సీతానగరం (తాడేపల్లి రూరల్) : రానున్న పుష్కరాలను దష్టిలో ఉంచుకుని వివిధ శాఖలకు చెందిన సిగ్నల్స్‌ను త్వరిత గతిన అందేందుకు సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై టవర్లు ఏర్పాటు చేశారు. ఈ టవర్ల వల్ల పోలీసు శాఖకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. పుష్కరనగర్లలో, పోలీసు స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్స్‌కు సిగ్నల్స్ అందడంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉంటుందని కమ్యూనికేషన్ అధికారులు తెలిపారు. -
ఎయిర్ టెల్ ఉద్యోగి మాయం
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం వేముల సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. వేంపల్లె, రాయచోటి, కడప ప్రాంతాల్లో ఎయిర్ టెల్ టవర్స్ మేనేజర్‌గా పనిచేసే శివభాస్కర్‌రెడ్డి (35) శనివారం కడపలో స్నేహితుల వద్ద నుంచి బైక్ తీసుకుని వేముల కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల వద్ద పని ఉందని చెప్పి బయల్దేరాడు. సాయంత్రమైనా శివభాస్కర్‌రెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆరా తీశారు. స్నేహితులు ఇచ్చిన సమాచారంతో కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం వెతకగా, ఓ గుంటలో బైక్‌ను కనిపించింది. శివభాస్కర్‌రెడ్డి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో పోలీసులు జాగిలాన్ని రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ట్రూత్’ చెబుతున్నది ఇదే..
నిజనిర్ధారణ సమాచారం కలచివేసే విధంగా ఉండడం వల్ల ప్రధాన మీడియా, పార్లమెంట్ చాలావరకు మౌనముద్ర దాల్చాయని కూడా ‘ట్రూత్’ పేర్కొన్నది. తన నివేదిక ముగింపులో ఇంకా ఇలా చెప్పింది: ‘ఉత్తర దక్షిణ టవర్లు, 47 అంతస్తులు ఉన్న 7వ టవరు జెట్ విమానాల తాకిడి వల్ల, వాటితో వ్యాపించిన మంటలతో గానీ ధ్వంసం కాలేదు. పేలుడు పదార్థాలతో, నియంత్రిత విధ్వంసంతో టవర్స్ నాశనమైనాయి.’ ‘చరిత్రపుటలకు ఎక్కకుండా వాస్తవాలను పూర్తిగా తొలగించివేశారు.’ - నోమ్ చామ్స్కీ (అమెరికా ట్విన్ టవర్స్ మీద దాడికి స్పందనగా రాసిన గ్రంథం ‘9/11, 2002’ నుంచి) ‘మానవులలో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. తమకు అనుకూలంగా లేకుంటే చాలు, ఎంతటి సత్యాన్నైనా పొక్కకుండా కప్పెడతారు.’ -హాన్స్ కోనింగ్ (కొలంబస్ గ్రంథకర్త. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సేనలతో పోరాడి, తరువాత అమెరికాలో స్థిరపడిన హాలెండ్ జాతీయుడు) సెప్టెంబర్ 11... పదమూడేళ్ల క్రితం (2001) సరిగ్గా ఇదే రోజున చరిత్ర మరువలేని దుర్ఘటన జరిగింది. మరో మూడురోజులలో దీనిని ప్రపంచం మరోసారి గుర్తు చేసుకోబోతున్నది. పాలకులూ, పాలనా వ్యవస్థలూ ప్రపం చంలో ఖండఖండాలలో వారి ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా ఉగ్రవాదం తలెత్తడానికి ఎలా దోహదపడుతూ ఉంటారో, ఉగ్రవాద చర్యలకు ఎలా ఊతం ఇస్తుంటారో ఆలస్యంగా బయటపడుతున్న నిజాలు వెల్లడిస్తూనే ఉన్నాయి. ట్విన్ టవర్స్ దుశ్చర్యకు సంబంధించి రెండు పరస్పర విరుద్ధ నివేదికలు వెలువడ్డాయి. అమెరికా పాలకులు (జార్జిబుష్ జూనియర్) అధికారికంగా విడుదల చేసిన కమిషన్ విచారణ నివేదిక. పదిహేను వందల మంది సుప్రసిద్ధ అమెరికన్ భవన నిర్మాణ నిపు ణులు (ఆర్కిటెక్ట్స్), ఇంజనీర్లు విడుదల చేసిన విశిష్ట నివేదిక. అదే ‘ఇన్వెస్టిగేటర్ న్యూస్’. వీరు ‘నిజ నిర్ధారణ ఉద్యమం’ పేరుతో 2010 ప్రాంతంలో ఈ నివేదికను వెలువరించారు. అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చెందిన ట్విన్ టవర్స్ భవన సముదాయం మీద, అక్కడి ఫ్లారిడా కేంద్రంగా ఏకకాలంలో బయలుదేరిన నాలుగు పౌర విమానాలు దాడి చేశాయి. 110 అంతస్తుల ఆ భవన సముదాయం కుప్పకూలింది. ఆ టవర్స్‌లో నిత్యం పని చేసే 50,000 మంది ఉద్యోగులలో అధికారిక లెక్కల ప్రకారం 3,000 మంది చనిపోయారు. ఇక అమెరికా యుద్ధ తంత్ర కేంద్ర కార్యాలయం పెంటగాన్ మీద జరిగిన విమానదాడిలో 125 మంది చనిపోయారు. వీరితో పాటు మొత్తం ఆ నాలుగు విమానాలలోను ప్రయాణిస్తున్న 256 మంది కూడా చనిపోయారని కూడా ప్రకటించారు. ఈ మృతుల సంఖ్య పెరల్ హార్బర్ మీద జపాన్ చేసిన దాడి (డిసెంబర్ 1941) కారణంగా మరణించినవారి సంఖ్య కంటే ఎక్కువేనని అధికారిక కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. కొని తెచ్చుకున్న కొరివి ఈ విషయంతో పాటే, ‘2001, సెప్టెంబర్ 11తో అమెరికా ఇక మారిపోయిన దేశం’గా అవతరించవలసి వచ్చిందని ప్రకటించింది. ఇంకా, ‘ఇస్లామిస్ట్ ఉగ్రవాదుల బెడద 1990 వరకు లేద’నీ, ఆ తరువాతే ప్రారంభమై, పదేళ్ల వ్యవధిలోనే ఉగ్రవాదం నుంచి ప్రమాదం తీవ్రమైందని కూడా బుష్ ప్రభుత్వ విచారణ కమిషన్ ప్రకటించింది. అంటే, 1990 దాకా లేని ఉగ్రవాద బెడద, తరువాత తలెత్తడానికి ఉన్న పూర్వరంగం అంతా అరబ్ ప్రపంచానికి సంబంధించినదేనని అమెరికా భాష్యం. అక్కడ అప్పటికి ఏకైక సెక్యులర్ శక్తిగా ఉన్న పాలకుడు సద్దాం హుస్సేన్. ప్రజలను మూకుమ్మడిగా హత మార్చే విషపూరిత అణ్వాయుధాలను సద్దాం ప్రభుత్వం రూపొందిస్తున్నదన్న ఆరోపణతోనే ఇరాక్ మీద దాడులకు అమెరికా పథకం రచించింది. ఈ ఆరో పణలను ఐక్యరాజ్య సమితి మొదట ఆమోదించలేదు. కానీ అమెరికా ఒత్తిడి తోనే విచారణ కోసం ‘బ్రిక్స్ కమిషన్’ను నియమించింది. ఇరాక్‌లో తనిఖీలు జరిపిన ఈ కమిషన్ అక్కడ మారణాస్త్రాలను తయారు చేస్తున్నారని చెప్ప డానికి అవసరమైన ఆధారాలు లేవని తేల్చింది. ఇరాక్ పెట్రోలియం వనరులే లక్ష్యంగా ఉన్న అమెరికా బ్రిక్స్ కమిషన్ తీర్పును ఖాతరు చేయకుండా ఆ దేశం మీద దాడులకు దిగింది. అమెరికా సహా బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మ నీలు కలసిన దుష్టకూటమి జరిపిన దాడి కారణంగా ఇరాక్ సర్వనాశనమైంది. 15 లక్షల మంది హతమయ్యారు. ఇందులో బాలల సంఖ్య 4-5 లక్షలని అంచనా. చివరికి రుజువులు లేని ఆరోపణలతో సద్దాంనూ ఉరితీసింది. వీటన్నిటి ఫలితంగానే ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగింది. ఈ పరిణామమే అరబ్ ప్రపంచంలోని పెక్కు ప్రభుత్వాలు, వ్యవస్థలు (నిరంకుశ, ప్రజాతంత్ర పాలకులన్న తేడా లేకుండా) కూలిపోవడానికి దోహదపడింది. తిరుగు బాట్లకు కూడా ప్రోత్సాహమిచ్చింది. పరస్పర విరుద్ధ నివేదికలు ఇంతకీ సొంత గూటిని కూల్చుకునే పాలకులు చరిత్రలో ఉంటారా అని ప్రశ్నించుకుంటే, ఇందుకు కొన్ని ఉదాహరణలు మాత్రం లేకపోలేదు. ముస్సో లినీ, హిట్లర్ ఏం చేశారు? రాజకీయ ప్రాపకం కోసం జర్మనీ పార్లమెంటు రీచ్‌స్టాగ్ భవంతికి నాజీ మూకల చేత నిప్పు పెట్టించి, ఆ పాపాన్ని హిట్లర్ కమ్యూనిస్టులపైకి నెట్టాడు. అసలు టవర్స్ మీద దాడికి ముందుగానే బుష్ (జూ) మారుమూల ప్రాంతంలో ఎందుకు తలదాచుకోవడానికి వెళ్లినట్టు? సోవియెట్‌ను బూచిగా చూపి అఫ్ఘానిస్తాన్‌లో తొలి ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని కూల్చడానికీ, మధ్యాసియా సోషలిస్ట్ రిపబ్లిక్లోకి చొరబడడానికి ఆ చిన్న దేశాన్ని ముఖద్వారంగా మార్చడానికీ తాలిబాన్లను సాకి ఆయుధాలు ఇచ్చింది అమెరికాయే. తాలిబాన్ల నుంచి పుట్టిందే అల్‌కాయిదా ఉగ్రవాదం. అమెరికా అండతోనే ఉన్మాదశక్తులుగా ఎదిగినవాళ్లే ఇస్లామిక్ ఉగ్రవాదులు. వీరిపై బిన్‌లాడెన్ ముద్రవేస్తే గానీ రాజ్య విస్తరణ, సైనిక పారిశ్రామిక విస్త రణ అనే జమిలి పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించుకోవడం అమెరికాకు సాధ్యంకాదు. తన ఉనికి కోసం మెజారిటీ ఉగ్రవాదానికీ, మైనారిటీ ఉగ్రవా దానికీ మధ్య వ్యత్యాసాన్ని చెరిపివేసేదే పెట్టుబడిదారీ వ్యవస్థ అని విస్మరిం చరాదు. బహు శా ఈ పరిణామక్రమాన్ని శ్రద్ధగా అవగాహన చేసుకోవడం వల్లనే, శాస్త్ర సాంకే తిక రంగాలతో దానిని సంధానించబట్టే 9/11 ఘటనకు దారితీసిన కారణాల మీద నిజనిర్ధారణ విచారణ ఉద్యమం (ట్రూత్ మూవ్ మెంట్) అధ్యయనం చేసింది. వాస్తవాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. మరో కోణంతో జరిగిన ఈ డాక్యుమెంట్ రచనకు, నిజ నిర్ధారణ ఉద్య మానికి రథసారథి రిచర్డ్ గేజ్. భవన నిర్మాణ, వాస్తు నిపుణుడైన గేజ్ 1,500 మంది నిపుణులతో ట్రూత్ ఉద్యమాన్ని ఆరంభించారు. ఈ విశిష్ట సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 14,000 శాఖలు ఉన్నాయి. ‘మేము దాడి కుట్రకు సంబం ధించిన సిద్ధాంతాల జోలికి పోదలుచుకోలేద’ని కూడా ఆ సంస్థ స్పష్టంగా చెప్పింది. 9/11 ఘటన మీద వచ్చిన అధికారిక నివేదికల గురించి కొన్ని సమాధానాలు కావాలని వారు కోరుతున్నారు. కానీ గత దశాబ్దంగా అమెరికా పాలకులు ఆ ఊసే ఎత్తడం లేదు. ‘ట్రూత్’ను గమనించాలి ‘ఈ దుర్ఘటనలో పలువురు ప్రత్యక్ష సాక్షుల నుంచీ, ముఖ్యుల నుంచీ నేరుగా సాక్ష్యాలు సేకరించాం. ఫొటోలు, వీడియో ఫోరెన్సిక్, శాస్త్రవేత్తల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నాం. కీలకమైన ఈ అంశాలను అధికార నివేదిక విస్మ రించింది. వ్యక్తుల, ఏజెన్సీల సాక్ష్యాలను వక్రీకరించడం లేదా ధ్వంసం చేయ డం జరిగింది’ అని అనధికార నిజనిర్ధారణ సంస్థ చెబుతోంది. ట్రూత్ సంస్థ వెబ్సైట్లో ఈ డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. ప్రజలను మరింత చైతన్యవంతం చేసేందుకు ఇందుకు సంబంధించిన సమాచారంతో డీవీడీలు, పత్రాలు, బ్రోచర్లను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. 2006 మార్చిలో ఈ సంస్థ (ఏఈ 9 11 ట్రూత్) ఆవిర్భవించింది. ఈ సంస్థ విచారణలో కొన్ని వాస్తవాలు వెలుగుచూసిన మాట నిజం. అవి: *స్వయం చోదిత క్షిపణుల మాదిరిగా పౌర విమానాలు దాడి చేయ డంతోనే ఆ టవర్స్ కూలలేదనీ, రిమోట్ కంట్రోల్ లాగా నియంత్రిత విధ్వంస కాండ (కంట్రోల్డ్ డిమోలిషన్)తోనే కూలాయి. *బోయింగ్ 717 వంటి భారీ విమానం డీకొట్టినా తట్టుకు నిలబడగల సామర్థ్యంతో 1-2 టవర్లను పకడ్బందీగా నిర్మించారని భారీ నిర్మాణాల నిపుణులు, వాస్తు శాస్త్ర నిపుణులు స్పష్టం చేశారు. కానీ అసలు ఫోరెన్సిక్ నిపుణుల సాక్ష్యాలే అధికారిక నివేదికలో లేవు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. *ఇంతటి భారీ స్థాయిలో మానవ ప్రేరితంగా జరిగిన దుర్ఘటన మీద నిష్పాక్షికంగా, సమగ్రంగా విచారణ జరిపించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిజాయితీపరులైన న్యాయశాస్త్ర నిపుణులతో, న్యాయమూర్తులతో, ఇంజనీర్లతో, సామాజిక కార్యకర్తలతో ఆ విచారణ జరిపించాలి. ఈ విధ్వంసం వెనుక ఉన్న వాస్తవాలను వివరిస్తూ ట్రూత్ సంస్థ అమె రికాలోని 30 నగరాలకు చెందిన, 23 దేశాలకు చెందిన దాదాపు ఏడేసి వందల మందికి 200 చిత్రాలను ప్రదర్శించింది. వీటితో 85 శాతం వీక్షకులు ఆమోదించారు. తన ఫిర్యాదును ప్రతి పార్లమెంట్ సభ్యునికీ కూడా ‘ట్రూత్’ అందించింది. నిజనిర్ధారణ సమాచారం కలచివేసే విధంగా ఉండడం వల్ల ప్రధాన మీడియా, పార్లమెంట్ చాలావరకు మౌనముద్ర దాల్చాయని కూడా ట్రూత్ పేర్కొన్నది. తన నివేదిక ముగింపులో ఇంకా ఇలా చెప్పింది: ‘ఉత్తర దక్షిణ టవర్లు, 47 అంతస్తులు ఉన్న 7వ టవరు జెట్ విమానాల తాకిడి వల్ల, వాటితో వ్యాపించిన మంటలతో గానీ ధ్వంసం కాలేదు. పేలుడు పదా ర్థాలతో, నియంత్రిత విధ్వంసంతోనే టవర్స్ నాశనమైనాయి.’ కాబట్టి ఈ విధ్వంసానికి సవాలక్ష కారణాలు వెతకాలి. ట్రూత్ నివేదిక చెబుతున్నది ఇదే. మళ్లీ అధికారంలోకి రావడం కోసం మూడు లక్షల నల్లవాళ్ల ఓట్లను మాయం చేసిన వాడికి అమెరికా నుంచి ఉగ్రవాదాన్ని సృష్టించడం కష్టమా? (వ్యాసకర్త మొబైల్: 9848318414) - ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
టవర్లు తొలగించేలా ఉద్యమాలొస్తాయి
* టెలికం సర్వీస్ ప్రొవైడర్లను బెదిరించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు * ‘ఓటుకు కోట్లు’లో తమకు అనుకూల అంశాలు బహిర్గతం చేయాలని ఒత్తిడి * విజయవాడలో ముగిసిన ప్రొవైడర్ల విచారణ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసుకు కౌంటర్‌గా నమోదైన కేసుల దర్యాప్తులో టెలికం సర్వీసు ప్రొవైడర్లను ఏపీ ప్రభుత్వం బెదిరిస్తోంది. సెల్ టవర్లు తొలగించేలా ప్రాంతాల వారీగా ఉద్యమాలు వస్తాయని, ఆ తరువాత మీరే నష్టపోవాల్సి వస్తుందని టెలికం సంస్థలను హెచ్చరిస్తోంది. విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్లో రెండో రోజైన మంగళవారం విచారణ కొనసాగించిన సిట్ బృందం.. సర్వీసు ప్రొవైడర్లను భయభ్రాంతులకు గురయ్యేలా బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. సిట్ శనివారం ఇచ్చిన నోటీసుల మేరకు టెలికం సర్వీసు ప్రొవైడర్లు సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరయ్యారు. నోటీసుల్లో అడిగిన ‘ట్యాపింగ్’ సంబంధిత వివరాలను నేరుగా ఇవ్వడం సాధ్యం కాదంటూ ప్రొవైడర్లు తేల్చిచెప్పడంతో.. కొందరు ‘ప్రభుత్వ పెద్దలు’ రంగంలోకి దిగి ప్రొవైడర్లను బెదిరించే ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది. ‘అనుకూల’ వివరాలివ్వండి.. సిట్ బృందం అడిగిన వివరాలతో పాటు తమకు అనుకూలంగా మారే అంశాలు ఉంటే వాటినీ బయటపెట్టాలని ప్రొవైడర్లపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. తాము చేసిన హెచ్చరికలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని, ఒక వేళ వస్తే సర్వీస్ ప్రొవైడర్లే స్వయంగా వాటిని ఖండించాలని చెప్పినట్లు సమాచారం. మరోపక్క సిట్ అధికారులు విజయవాడలో చేపట్టిన విచారణ మంగళవారంతో ముగిసింది. దాదాపు 15 మంది అధికారులతో కూడిన బృందం ఒక్కో సర్వీసు ప్రొవైడర్‌ను నాలుగు నుంచి ఐదు గంటల పాటు విచారించింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి తెలంగాణ పోలీసులు రాసిన లేఖలు తమ వద్ద ఉన్నాయని, గడిచిన కొన్ని నెలలుగా తెలంగాణ అధికారులు చేపట్టిన ట్యాపింగ్స్ వివరాలు అందించాలని వారిపై సిట్ ఒత్తిడి తెచ్చిందని తెలుస్తోంది. వివరాలివ్వడం నిబంధనలకు విరుద్ధమే కాకుండా ఆ చర్య అధికారిక రహస్యాల చట్టం (ఓఎస్ యాక్ట్) ఉల్లంఘన కిందకి వస్తుందని టెలికం కంపెనీల ప్రతినిధులు చెప్పినా సిట్ పెడచెవిన పెడుతోంది. ఈ తతంగాన్ని వీడియో రికార్డు చేస్తూ, ఇక్కడే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామంటూ పరుష పదజాలం వాడి సర్వీస్ ప్రొవైడర్ ప్రతినిధుల్ని బెదిరించినట్లు తెలిసింది. ఇలావుండగా, టెలికం సర్వీసు ప్రొవైడర్ల విచారణ అంకం ముగియడంతో దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను సిట్ చీఫ్ డీఐజీ ఇక్బాల్‌కు అందించడానికి ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఇక్బాల్‌తో పాటు డీజీపీ రాముడికీ ఈ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు మత్తయ్య కేసులో 20 రోజుల కాల్ డేటా ఇవ్వాలని కోరుతూ సీఐడీ పోలీసులు విజయవాడలోని మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. -
ఆకాశం అంచులు చూద్దాం
హుస్సేన్‌సాగర్ చుట్టూ రానున్న టవర్లు సింగపూర్, దుబాయ్, షాంఘై నిర్మాణాల పరిశీలన కసరత్తు ప్రారంభించిన జీహెచ్ఎంసీ ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్‌కు చోటు! పట్టుదలతో ఉన్న రాష్ట్ర సర్కార్ ఈ భవంతిని చూశారా... ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవనంగా గుర్తింపు పొందిన బుర్జ్ ఖలీఫా. దుబాయ్(యూఏఈ) లో ఉంది. దీని ఎత్తు భూమట్టం నుంచి 828 మీటర్లు (2,717అడుగులు). దీనిలో 163 అంతస్తులున్నాయి. ఎక్కడో దుబాయ్‌లో ఉన్న భవనం ప్రస్తావన ఇప్పుడెందుకూ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఆకాశాన్ని తాకేలా కనిపించే ఇలాంటి సుందర భవనాలు మన గ్రేటర్ నగరంలో త్వరలో కనువిందు చేయనున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరంలో వీటి నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తథాగతుని సాక్షిగా... విద్యుల్లతల మధ్య ఠీవీగా దర్శనమిచ్చే ఇలాంటి భవంతులను చూసిన వారు ఆనందాశ్చర్యాలకు గురయ్యేలా నిర్మించాలనేది ప్రభుత్వ యోచన. దీనికి అవసరమైన కార్యాచరణ రూపొందించే పనిలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలతో పాటు మన దేశం...మన నగరంలో ఉన్న బహుళ అంతస్తులభవంతుల విశిష్టతలు తెలుసుకుందాం. ఆకాశహర్మ్యాలకు అనువైన ప్రదేశాలను జీహెచ్ఎంసీ గుర్తించింది. వీటి నిర్మాణాలకు గాను నిబంధనలు, ప్రతిబంధకాలు, అనుమతులపై దృష్టి సారించింది. సుప్రీంకోర్టు అనుమతి పొందాల్సి ఉండడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. సాగర్‌కు సమీపంలో 18 మీటర్ల కన్నా ఎత్తయిన భవంతులు నిర్మించాలంటే ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తప్పనిసరి. నిర్మాణ సమయంలో సెట్బ్యాక్లు, రహదారి వెడల్పు తదితర నిబంధనలు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం ఒకింత ఊరట. ఆకాశహర్మ్యాలు ఇక్కడే... టవర్ల నిర్మాణానికి లోయర్ ట్యాంక్‌బండ్, బీఆర్కే భవన్, పాటిగడ్డ తదితర ప్రాంతాలు అనువుగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. అవసరమైతే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం స్థానే బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ భవనాలకు డిజైన్, డ్రాయింగ్, ఆర్కిటెక్చర్ రూపొందించేందుకు జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోనున్నారు. విశ్వనగరం బాటలో... షాంఘై, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ తదితర దేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా సాగర అందాలు వీక్షించేలా అధునాతన టవర్స్ నిర్మించాలన్న సర్కార్ ఆలోచన బాగానే ఉన్నా... వాటి నిర్మాణానికి అయ్యే వ్యయం వేల కోట్లపైమాటే. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన బుర్జ్ ఖలీఫా వంటి భవంతిని మన నగరంలో నిర్మించాలంటే సుమారు రూ.10 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చిస్తుందా? లేక పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో వీటి నిర్మాణాన్ని చేపడుతుందా? అన్నది తేలాల్సి ఉంది. షాంఘై టవర్స్.. చైనాలోని షాంఘై నగరంలో ఉందీ టవర్. దీని ఎత్తు 632 మీటర్లు (2,073 అడుగులు). ప్రపంచంలో రెండో ఎత్తయిన భవంతిగా పేరొందింది. నిర్మాణ వ్యయం 4.2 బిలియన్ అమెరికా డాలర్లు. ఈ భవంతిలో 121 అంతస్తులున్నాయి. హైదరాబాద్ నగరంలో.. లోధాబెలీజా1: దక్షిణ భారత దేశంలో ఎత్తయిన కట్టడంగా పేరొందిన లోథాబెలీజా టవర్స్ మన నగరంలోనే ఉంది. కేపీహెచ్‌బీ మలేషియా టౌన్‌షిప్‌కు వెనకవైపున ఉన్న ఈ భవంతి ఎత్తు 140 మీటర్లు(459 అడుగులు). ఇందులో 42 అంతస్తులున్నాయి. కాగా గ్రేటర్ నగరంలో 20 అంతస్తులు ఆపైబడిన భవంతులు సుమారు 50 వరకు ఉన్నాయి. మరో వంద వరకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉండడం విశేషం. బుర్జ్ ఖలీఫా ప్రపంచంలో అత్యంత ఎత్తయిన కట్టడంగా ప్రసిద్ధి చెందిన బుర్జ్ ఖలీఫా టవర్ దుబాయ్ (యూఏఇ)లో ఉంది. దీని ఎత్తు భూమట్టం నుంచి 828 మీటర్లు (2,717 అడుగులు). ఈ భవంతిలో 163 అంతస్తులుండడం విశేషం. దీని నిర్మాణాన్ని ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ 2010లో పూర్తి చేసింది. నిర్మాణానికి 150 కోట్ల అమెరికా డాలర్లు (రూ.9వేల కోట్లు) ఖర్చు చేశారు. 900 నివాసాలు, 37 కార్యాలయ అంతస్తులు, 160 అతిథి గదులున్న ఆర్మనీ హోటల్, 144 ప్రైవేటు నివాసాలు, క్లబ్‌లు, రూఫ్‌గార్డెన్‌లు, ఫిట్నెస్ క్లబ్‌లు ఈ భవంతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మన దేశంలో.. మన దేశంలోనే ఎత్తయిన భవంతిగా పేరొందిన ఇంపీరియల్ టవర్-1 ముంబై దక్షిణ ప్రాంతంలో ఉంది. 120 అంతస్తుల భవంతి. ఫ్లోర్ ఏరియా 1.30 లక్షల చదరపు అడుగులు.ఎత్తు 254 మీటర్లు(833 అడుగులు). -
‘ట్రాన్స్మిషన్’ మాయ!
యాచారం: విద్యుత్ ట్రాన్స్మిషన్ అధికారుల మాయతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. రైతుల అంగీకారం లేకుండానే పచ్చటి వ్యవసాయ భూముల్లో అధికారులు టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. తమ భూముల్లో టవర్లు ఏర్పాటు చేయొద్దని అన్నదాతలు ప్రశ్నిస్తే.. ప్రభుత్వమే వేయిస్తోంది.. అడ్డుకుంటే కేసుల పాలవుతారని వారు భయపెడుతున్నారు. దీంతో ఆందోళనకు గురైన రైతులు ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. విశాఖపట్నం నుంచి నల్గొండ జిల్లా సూర్యాపేట మీదుగా జిల్లాలోని శంకర్పల్లి వరకు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు చెందిన ఓ వ్యాపార సంస్థ 400 కేవీ విద్యుత్ తీగల టవర్లను ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని మంచాల మండలం నుంచి శంకర్పల్లి వరకు 124 కిలోమీటర్ల పరిధిలో 386 విద్యుత్ టవర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా మండలంలోని మొండిగౌరెల్లి, యాచారం, నందివనపర్తి, మల్కీజ్‌గూడ, కుర్మిద్ద తదితర గ్రామాల నుంచి భారీ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామ పరిధిలో పది నుంచి 15 వరకూ టవర్లను ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇలా వందలాది గ్రామాల మీదుగా టవర్లు ఏర్పాటుకు నిర్ణయించారు. ఒక టవర్ ఏర్పాటుకు పది గుంటల భూమి అవసరముంటుంది. రైతుల అంగీకారం లేకుండానే... టవర్లను ఏర్పాటు చేసే ట్రాన్స్మిషన్ సంస్థ ముందుగా గ్రామ సభలు ఏర్పాటు చేసి విషయాన్ని రైతులకు తెలియజేయాలి. చట్టంలోని నింబంధనల ప్రకారం.. రైతులు ఒప్పుకుంటేనే టవర్ల ఏర్పాటుకు కదలాలి. కానీ ఈ నిబంధనలేవీ పట్టించుకోకుండానే విద్యుత్ ట్రాన్స్మిషన్ అధికారులు అత్యవసర సేవలంటూ... అడ్డుకుంటే కేసుల పాలవుతారని రైతులను భయపెడుతున్నారు. దీంతో రైతులు ఆందోళనచెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం మండలంలోని పలు గ్రామాల రైతులు తమ భూముల్లో విద్యుత్ టవర్ల ఏర్పాటు విషయమై మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధితాధికారులతో మాట్లాడారు. టవర్లు ఏర్పాటు చేసే సంస్థ ప్రైవేట్ కార్పొరేషన్ అని తెలిసింది. నిబంధనల ప్రకారం రైతుల అంగీకారం ఉంటేనే టవర్లు ఏర్పాటు చేయాలి. న్యాయబద్ధంగా పరిహారం అందజేసి ఆ తర్వాతే టవర్ల ఏర్పాటుకు పూనుకోవాలి. టవర్ల ఏర్పాటు ప్రారంభంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. భూములు కోల్పోయే రైతులతో ట్రాన్స్మిషన్ అధికారులు అంగీకార పత్రం రాయించుకున్నారు. రూ. 15 వేల నుంచి రూ. లక్ష వరకూ పరిహారం అందజేస్తామని ఒప్పందం కుదుర్చుకొన్నారు. కానీ రైతులు చెప్పులరిగేలా తిరిగాక రూ. 15 వేలు అందజేసి చేతులు దులుపుకొన్నారు. కేవలం ఒకరిద్దరి రైతులకు మాత్రమే నగదు అందజేసి మిగతా వారిని భయపెట్టే పనిలో ఉన్నారు. భూములు కోల్పోవడానికి ససేమిరా.. నిబంధనల ప్రకారం ట్రాన్స్మిషన్ అధికారులు వ్యవహరించడం లేదని తెలుసుకున్న ఆయా గ్రామాల రైతులు రెండు, మూడు రోజులుగా యాచారం, మల్కీజ్‌గూడ తదితర గ్రామాల్లో టవర్ల పనులు జరగ్గాకుండా అడ్డుకుంటున్నారు. కేసులైనా నమోదు చేయండి కానీ తమ భూముల్లో టవర్లను మాత్రం బిగించనీయమని ఆందోళనకు దిగుతున్నారు. టవర్లు పచ్చటి వ్యవసాయ భూముల్లో నుంచి పోతున్నాయి. నిబంధనల ప్రకారం అధికారులు వ్యవసాయానికి పనికిరాని భూముల్లోంచి టవర్లను ఏర్పాటు చేయాలి. అది కూడా రైతుల అంగీకారం మేరకే జరగాలి. టవర్ల ఏర్పాటుతో పది గుంటల భూమి నిరుపయోగంగా మారే అవకాశం ఉంది. జిల్లా పరిధిలోని పలు మండలాలు నగరానికి సమీపంలో ఉండడంతో భూములకు మంచి డిమాండ్ ఉంది.టవర్లు శాశ్వతంగా ఉండే ప్రమాదం ఉండడంతో సదరు భూములకు అమాంతం డిమాండ్ తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమకు అండగా నిలిచి టవర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వారు కోరుతున్నారు. తమకు న్యాయం జరిగేలా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. -
భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలి ఆరుగురు మృతి
-
భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలి ఆరుగురు మృతి
కడప: నిన్న రాత్రి ఎడితెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని మైలవరం మండలం నవాబుపేటలో విషాదం అలుముకుంది. సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో మట్టి మిద్దె కూలి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా భారీ పంట నష్టం కూడా వాటిల్లింది. మూడు రోజులుగా పెనుగాలులు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గాలి బీభత్సానికి చాలాచోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. ఉద్యాన పంటలు నేలమట్టం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు, టవర్లు నేల కొరిగాయి. దీంతో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఉద్యాన పంటలకు సంబంధించి తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి అన్నదాతపై కక్ష కట్టడంతో రైతన్నలు విలవిల్లాడుతున్నారు. సుడిగాలుల నేపథ్యంలో విద్యుత్‌స్తంభాలు విరిగిపడుతుండటంతో రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. -
పెనుగాలుల ధాటికి అతలాకుతలం..
పెనుగాలుల ధాటికి జిల్లా వణికిపోతోంది. పచ్చని చెట్లు నిలువునా నేల కూలుతున్నాయి. చేతికందాల్సిన కాయలు నేలపాలవుతున్నాయి. ఆరుగాలం కష్టించి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన అరటి, మామిడి, బొప్పాయి తోటలు కళ్లముందే వాలిపోతుంటే రైతన్నకు కన్నీరు మిగులుతోంది. సోమవారం సాయంత్రం ప్రకృతి సృష్టించిన బీభత్సం జన జీవితాలను అతలాకుతలం చేసింది. పంటలు నష్టపోయిన రైతులు ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నారు. సాక్షి, కడప: మూడు రోజులుగా పెనుగాలులు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గాలి బీభత్సానికి చాలాచోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. ఉద్యాన పంటలు నేలమట్టం అవుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, టవర్లు నేల కొరుగుతున్నాయి. దీంతో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఉద్యాన పంటలకు సంబంధించి తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి అన్నదాతపై కక్ష కట్టడంతో రైతన్నలు విలవిల్లాడుతున్నారు. సుడిగాలుల నేపథ్యంలో విద్యుత్‌స్తంభాలు విరిగిపడుతుండటంతో రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. దీంతో అక్కడ ప్రజలు తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొర ఉన్న చేతి బోర్ల వద్దనే జనాలు బారులు తీరుతున్నారు. ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనూహ్యంగా గాలులు వీస్తుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతూనే ఉంది. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడుతుండటంతో రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతోంది. పంట నష్టం జరిగిన ప్రాంతాలివే! ముఖ్యంగా అరటి, బొప్పాయిపంటలకు సంబంధించి మైదుకూరు మండలంలోని భూమాయపల్లె, కేశిలింగాయపల్లె, విశ్వనాథపురం, బండివారిపల్లె, పోచిరెడ్డిపల్లె, వనిపెంట, ఆదిరెడ్డిపల్లె, కాశినాయన మండలం బసనపల్లె, గొంటువారిపల్లె, ఆకుల నారాయణపల్లెతోపాటు తొండూరు, వేంపల్లె, ముద్దనూరు, వేముల, వీరపునాయునిపల్లె, కమలాపురం మండలాల్లోని పలు గ్రామాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైల్వేకోడూరు, రాయచోటి ప్రాంతాల్లో మామిడి రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం రైల్వేకోడూరుతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెనుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. -
సంచార్ నిగమ్...సేవలు సగమ్..
అరకులోయ,న్యూస్‌లైన్: పర్యాటక కేం ద్రమైన అరకులోయలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సేవలు మెరుగుపడకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరికి ఫోన్ చేిసినా నెట్ వర్క్ ఎర్రర్ అని వస్తుండడంతో విసిగిపోతున్నారు. పది రోజుల కాలం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో అత్యవసర ప రిస్థితుల్లో సైతం సమాచారం చేరవేసేం దుకు అవకాశం లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులే ఎక్కువ మం ది ఉన్నాసేవలు అంతంతా మాత్రంగా ఉండడం, సంబంధిత అధికారులు ప ట్టించుకోకపోవడం గమనార్హం. దాదా పు అరగంట ప్రయత్నించినా ఒక్క ఫోన్ కాల్ కూడా వెళ్ళని పరిస్థితి ఉందని వాపోతున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా ప్రైవేటు సంస్థ అయిన ఎయిర్టెల్ వైపు మళ్లుతున్నారు. మన్యంలో సెల్ ఫోన్ సేవలు విసృ్తతం చేసేందుకు గత ఏడాది నుంచి ఈ ప్రాంతంలో విసృ్తతంగా టవర్లు ఏర్పాటు చేశారు.దీంతో పాటు 3జీ సేవలు కూడా అందుబాటులోని తెచ్చారు. అయినా ఇక్కడ నెట్వర్క్ బాగోలేక పోవడంతో ఎన్ని టవర్లు వేసినా ప్రయోజనం లేకపోతోంది. అరకులోయలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పూర్తి స్థాయి జూనియర్ టెలికాం ఆఫీసర్‌ను నియమించకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదన్న అభిప్రాయాలున్నాయి. పాడేరు జేటీవోకే ఇక్కడి ఇక్కడ ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. ఈ విషయంపై ఇన్చార్జీ జేటీవో మహ్మాద్‌ను వివరణ కోరగా సాంకేతిక లోపం కారణంగా కొంత అంతరాయం కలుగుతోందని, దీన్ని గుర్తించి లోపాన్ని సరిదిద్దుతామన్నారు.