ఇంగ్లండ్: స్టాఫోర్డ్‌షైర్‌లోని రుగేలీ పవర్ స్టేషన్‌లో 117 మీటర్ల పొడవైన నాలుగు భారీ శీతలీకరణ టవర్లు 10 సెకన్ల కాలంలో నేలమట్టమయ్యాయి. ఇంగ్లండ్‌లో ఈ టవర్లు దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా తమ సేవలను అందించాయి. అయితే బొగ్గుతో నడిచే ఈ విద్యుత్ ప్లాంట్‌ను 2016లో మూసివేశారు. కాగా ప్రస్తుతం అక్కడ గృహ, వ్యాపార స్థలాలకు ఏర్పాటు చేయడానికి వీటిని పడగొట్టినట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా ఈ స్థలం వద్దకు రావద్దని స్థానిక ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అయినప్పటికీ వందలాది మంది సమీపంలోని ఓ కొండపైకి చేరుకుని టవర్ల కూల్చివేతను వీక్షించారు. టవర్లను కూల్చివేస్తున్నపుడు పొగ, ధూళి చుట్టూ కమ్ముకుంది. ఇక వివిధ కోణాల నుంచి చిత్రీకరించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇంగ్లాండ్‌లోని కూల్చివేత కాంట్రాక్టర్ బ్రౌన్, మాసన్ గ్రూప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. 81 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఇక అక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమిని చదును చేయడానికి కార్మికులు శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ పని సంవత్సరం చివరినాటికి ముగిసే అవకాశం ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
(చదవండి: యూఎన్ చీఫ్‌గా మళ్లీ ఆంటోనియా గుటెరస్)
4 భారీ టవర్లు.. 5 దశాబ్దాల సేవ.. 10 సెకన్లలోనే!
Published Wed, Jun 9 2021 11:20 AM | Last Updated on Wed, Jun 9 2021 3:14 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment