
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 సందర్భంగా పాక్ బ్యాటర్ ఆజమ్ ఖాన్‌కు ఓ భయానక అనుభవం ఎదురైంది. మార్క్ వుడ్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో ఆజమ్‌కు దిమ్మతిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయ్యింది. నిప్పులు చెరిగే వేగంతో ముఖంపైకి దూసుకొచ్చిన బౌన్సర్‌ను ఎదుర్కొలేక ఆజమ్ వికెట్ సమర్పించుకున్నాడు.
ఆజమ్ అదృష్టం కొద్ది బంతి గ్లవ్స్‌కు తాకి వికెట్‌కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఒకవేళ బంతి ఆజమ్ ఖాన్ శరీరం లేదా తలకు తాకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఆజమ్ ఔటయ్యాక కాసేపు షాక్‌లో ఉండిపోయాడు. అంతలా రాకాసి బౌన్సర్ అతన్ని బయపెట్టింది. పాక్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ రెండో బంతిని ఎదుర్కొనే క్రమంలో ఆజమ్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. వుడ్ రాకాసి బౌన్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
WHAT A BALL BY MARK WOOD.🤯
- This is Brutal from Wood...!!!!! 🔥 pic.twitter.com/9kTgDdrxpi— Tanuj Singh (@ImTanujSingh) May 30, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్ రషీద్ (4-0-27-2), లివింగ్‌స్టోన్ (3-1-17-2), మార్క్ వుడ్ (4-0-35-2) పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (36), ఉస్మాన్ ఖాన్ (38) ఓ మోస్తరుగా రాణించగా.. మొహమ్మద్ రిజ్వాన్ (23), ఇఫ్తికార్ అహ్మద్ (21), నసీం షా (16) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (45), జోస్ బట్లర్ (39) దూకుడుగా ఆడటంతో 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (20), జానీ బెయిర్‌స్టో (28 నాటౌట్), హ్యారీ బ్రూక్ (17 నాటౌట్) ఇంగ్లండ్ గెలుపుకు తమవంతు సహకారాన్నందించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment