వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం వేముల సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. వేంపల్లె, రాయచోటి, కడప ప్రాంతాల్లో ఎయిర్ టెల్ టవర్స్ మేనేజర్‌గా పనిచేసే శివభాస్కర్‌రెడ్డి (35) శనివారం కడపలో స్నేహితుల వద్ద నుంచి బైక్ తీసుకుని వేముల కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాల వద్ద పని ఉందని చెప్పి బయల్దేరాడు.
సాయంత్రమైనా శివభాస్కర్‌రెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆరా తీశారు. స్నేహితులు ఇచ్చిన సమాచారంతో కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం వెతకగా, ఓ గుంటలో బైక్‌ను కనిపించింది. శివభాస్కర్‌రెడ్డి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో పోలీసులు జాగిలాన్ని రప్పించి దర్యాప్తు చేస్తున్నారు.