Police Dog
-
ఆస్కార్ రిటైరయ్యింది..!
ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం ముంబైలోని అంటీలియా వద్ద పేలుడు పదార్థాలను కనిపెట్టి పెను ప్రమాదాన్ని నివారించిన పోలీసు జాగిలం ‘ఆస్కార్’విధుల నుంచి విశ్రాంతి తీసుకుంది. మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న అంబానీ నివాసం సమీప పార్కింగ్ ప్లేస్‌లో 2021 ఫిబ్రవరి 25న ఆగంతకులు ఉంచిన జిలెటిన్ స్టిక్స్‌ను ఇది పసిగట్టింది. అప్పట్లో ఈ విషయం దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది. ఆస్కార్ బుధవారం తోటి శునకం మిలోతోపాటు రిటైరయ్యింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకకు అదనపు కమిషనర్ వినీత్ సాహూ సహా పలువురు అధికారులు హాజరై జాగిలాలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ముంబై పోలీసు విభాగం బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీడీఎస్)లో 2014లో చేరిన ఆస్కార్ పదేళ్లపాటు వీఐపీ భద్రతతోపాటు బెదిరింపులు, బెదిరింపు కాల్స్ సమయంలో విధులను సమర్ధవంతంగా నిర్వహించిందని ఓ అధికారి తెలిపారు. మిలో కూడా వీఐపీలు, కీలక సంస్థల భద్రతతోపాటు అనుమానాస్పద బ్యాగుల తనిఖీ విధుల్లో పాల్గొందని చెప్పారు. రిటైరయ్యాక ఈ రెండు జాగిలాలకు ఏసీ వసతి సౌకర్యంతోపాటు రవాణా సమయంతో ఏసీతో కూడిన వాహనం సమకూర్చుతామని, ఇవి అందించిన సరీ్వసులకు గుర్తింపుగా ‘వాల్ ఆఫ్ ఫేమ్’ను ఏర్పాటు చేశామని చెప్పారు. -
కొండగట్టు చోరీ కేసు: ఛేదనలో పోలీస్ డాగ్ ప్రధాన పాత్ర
సాక్షి, కరీంనగర్: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో చోరీచేసింది కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన దొంగలని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నారని గుర్తించారు. అందులో ముగ్గురిని అరెస్ట్ చేసి, వారినుంచి 5 కేజీల వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగతావారి కోసం మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ మేరకు జగిత్యాల ఎస్పీ భాస్కర్ కొండగట్టు చోరీ, నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు. దొంగల ముఠా కర్ణాటక నుంచి కొండగట్టుకు మోటార్ సైకిళ్లపై ఫిబ్రవరి 2న రాత్రి చేరుకుంది భక్తుల మాదిరిగా తెలుపు, కాషాయ వస్త్రాలు ధరించి అదేరోజు రాత్రి అంజన్నను దర్శించుకుంది. మరుసటిరోజు (ఫిబ్రవరి 23)న మరోసారి స్వామివారిని దర్శించుకుంది. ఈ సమయంలోనే పరిసరాలపై రెక్కీ నిర్వహించింది. అదేరోజు అర్ధ రాత్రి(శుక్రవారం వేకువజామున) దాటాక ఆలయం వెనకాల అటవీ ప్రాంతం నుంచి ఆలయంలోకి ప్రవేశించింది. స్వామివారిపై ఉన్న మకర తోరణం, కిరీటం, ఆలయంలోని రెండు శఠగోపాలు, ఒకవెండి గొడుగు, రామరక్ష. ద్వారాలకు ఉన్న కవచ ముఖాలు దొంగిలించింది. ఆ తర్వాత మళ్లీ మోటార్ సైకిళ్లపైనే కర్ణాటకకు బయలుదేరి వెళ్లింది. దాదాపు రూ.3 లక్షల విలువైన 15 కేజీల వెండి అభరణాలు చోరీకి గురైనట్టు పూజారులు మల్యాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇటీవల కొండగట్టు ఆలయానికి సీఎం కేసీఆర్ వచ్చి వెళ్ళిన తరవాత దొంగతనం జరగడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. జగిత్యాల ఎస్పీ భాస్కర్.. డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో 10 పోలీసు బృందాలను నియమించారు.దొంగలను పట్టుకునేందుకు గాలింపులు తీవ్రతరం చేశారు. అంతకుముందే ఫింగర్ ప్రింట్, డాగ్ స్క్వాడ్ ఆధునిక శాస్త్ర, సాంకేతిక సాయంతో 24 గంటల్లోనే దొంగలపై అవగాహనకు వచ్చారు. కర్ణాటకకు చెందిన దొంగల ముఠా పనేనంటూ, వారిని పట్టుకునేందుకు ఆ రాష్ట్రంలో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏడుగురు నిందితుల్లో ఎ-1 బాలాజీ కేశవ రాథోడ్, ఎ-5 నర్సింగ్ జాదవ్ ఏ-7 విజయ్ కుమార్ రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నారు.. వారినుంచి 3.50 లక్షల విలువైన 5 కిలోల వెండి ఆభరణాలు (వెండి శఠగోపం, ఒకవెండి గొడుగు. ఒకవెండి పెద్ద రామరక్ష, రెండు ద్వారాలకు గల కవచం ముఖాలు, మోటార్ సైకిల్, రెండు సెల్ ఫోన్ల)ను స్వాధీనం చేసుకున్నారు. ఎ-2 రామరావు జాదవ్, ఎ-3 రాంశెట్టి జాదవ్, ఎ-4 విక్రమ్ జాదవ్, ఎ-6 దేవిదాస్ జాదవ్ ఆచూకీ కోసం మూడు. పోలీసు బృందాలు కర్ణాటక రాష్ట్రంలో గాలింపు చేస్తున్నాయి.. పోలీస్ డాగ్ది ప్రధాన పాత్ర కొండగట్టు దొంగల పట్టుకోవడంలో పోలీసు డాగ్ పాత్ర ప్రధానం అని చెప్పాలి.. దొంగలు కొండగట్టు ఆలయానికి భక్తుల్లాగా వచ్చి రెక్కీ నిర్వహించారు.. బస్టాండ్ ప్రాంతం నుంచి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని చుట్టుపక్కల కలియ తిరిగారు. గుడిలోకి ఏవి ధంగా ప్రవేశించవచ్చనే విషయమై క్షుణ్నంగా పరిశీలించారు. ఆలయానికి వచ్చేది.. వెళ్లేది.. రెక్కీ నిర్వహించే దృశ్యాలన్ని సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. వాటన్నింటిని పోలీసులు సేకరించారు. దొంగలు చోరీ చేసిన అనంతరం ఆలయం వెనకవైపు వెళ్లి మద్యం సేవించారు.. పోలీసు జాగిలం ఆలయం నుంచి వెనకవైపు పడేసిన ఖాళీ బీరు సీసాల వరకూ వెళ్లి గుర్తించింది.. పోలీసులు వాటిపై వెలిముద్రలను సేకరించారు. వాటి ఆధారంగా ఆధార్ కార్డును గుర్తించేసరికి అసలు నిందితుల ఆచూకీ దొరికింది. వెంటనే కర్ణాటక రాష్ట్రం బీదర్ వెళ్లి ఏడుగు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకు పట్టుకొచ్చారు. ఆలయంలో చోరీ చేసిన నిందితులు కేవలం వెండి వస్తువులు, ఆభరణాలు మినహా బంగారం, ఇతర వస్తువులు ముట్టుకోలేదు.. నిందితులు అంతా రక్త సంబంధీకులు కావడం మరో చెప్పుకోదగ్గ విషయం. ఏడుగురూ రక్త సంబంధీకులే కొండగట్టు చోరీ చేసిన ఏడుగురు రక్త సంబంధీకులు కావడం చెప్పుకోదగ్గ విషయం. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా ఔరద్ తాలుకా హులియట్ తండాకు చెందిన బాలాజీ కేశవ రాథోడ్, రామరావు జాదవ్, రాంశెట్టి జాదవ్, విక్రమ్ జాదవ్, నర్సింగ్ జాదవ్, దేవిదాస్ జాదవ్, విజయ్ కుమార్ రాథోడ్ ఒకే. ప్రాంతానికి చెందిన రక్తసంబంధీకులు. వీరు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో దొంగతనాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఇప్పటికే మహారాష్ట్రలోని పండరీపురం, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని చాముం డేశ్వరి తదితర ఆలయాల్లో చోరీచేశారు.. కొండగట్టు ఆలయంలో జరిగిన చోరీలోనూ వీరు పాల్గొన్నారు. ఇందులో తండ్రీకొడుకులు కూడా ఉండటం గమనార్హం. 24 గంటల్లోనే దొంగలను గుర్తించిన పోలీసులు కొండగట్టు చోరీ కేసును చాలెంజ్‌గా తీసుకుని, 24 గంటల్లోనే దొంగలను గుర్తించి, నాలుగైదు రోజుల్లోనే ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ భాస్కర్ అభినందించారు. ఆపరేషన్ లో పాల్గొన్న 27 మంది పోలీసులకు ప్రభుత్వం తరఫున రివార్డులు అందించనున్నట్లు చెప్పారు. -
Police Dogs: బాంబులను పసిగట్టి.. నేరగాళ్ల పనిపట్టి...
సాక్షి, హైదరాబాద్: పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు, నేరగాళ్ల జాడలను చిటికెలో పట్టేస్తాయి... కదులుతున్న వాహనాల్లోంచి సైతం దూకి ‘టార్గెట్’ను అడ్డుకుంటాయి... శిక్షకుడి కమాండ్స్‌ను స్పష్టంగా అర్థం చేసుకోవడంతోపాటు తూ.చ. తప్పకుండా పాటిస్తాయి... ఎన్నిసార్లు మొరగమంటే అన్నిసార్లే మొరుగుతాయి... ఇదీ మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైౖ నింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో శిక్షణ పొందిన పోలీసు జాగిలాల సామర్థ్యం. ఎనిమిది నెలల సుదీర్ఘ శిక్షణ అనంతరం ఐదు జాతులకు చెందిన 48 జాగిలాలు, 64 మంది శిక్షకుల 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ తాజాగా ఐఐటీఏలో జరిగింది. వీటిలో 36 జాగిలాలు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందినవి కాగా మిగిలిన 12 అరుణాచల్ప్రదేశ్వి. ఈ నేపథ్యంలో పోలీసు జాగిలాలపై ప్రత్యేక కథనం. సగం సమయం మచ్చిక కోసమే... ప్రతి పోలీసు జాగిలానికీ ఇద్దరు వరకు హ్యాండ్లర్స్ ఉంటారు. జాగిలాన్ని ఎంపిక చేసుకున్నప్పుడే వీరినీ ఎంపిక చేస్తారు. జాగిలంతో కలిపే వీరికి సైతం శిక్షణ ఉంటుంది. మొత్తం 8 నెలల శిక్షణా కాలంలో 2 నెలలు హ్యాండ్లర్కు జాగిలానికీ మధ్య సఖ్యత కలి్పంచడానికి, మరో 2 నెలలు జాగిలాన్ని హ్యాండ్లర్ మచి్చక చేసుకోవడానికి కేటాయిస్తారు. మిగిలిన నాలుగు నెలల్లోనే వివిధ రకాల శిక్షణ ఇస్తారు. శిక్షణలో 4 రకాలు.. లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, బెల్జియం మలినాయిస్, బీగల్, గోల్డెన్ రిట్రీవర్, డాబర్‌మ్యాన్, కోకోర్ స్పానియల్ జాతి శునకాల్లోని సహజ లక్షణాలు, పనితీరు, సమకాలీన అవసరాలను పరిగణనలోకి తీసుకొని నాలుగు విభాగాల్లో శిక్షణ ఇస్తుంటారు. ఒక రకమైన సేవలకు తర్ఫీదు పొందిన జాగిలం మరో పనికి ఉపకరించదు. పేలుడు పదార్థాలు/అనుమానిత వస్తువుల గుర్తింపు, నేర పరిశోధన, మాదకద్రవ్యాల గుర్తింపు, ముష్కరులపై దాడి చేసే సామర్థ్యంలో 4 నెలలపాటు శిక్షణ 48 జాగిలాలకు సాగింది. జాతీయ భాషలోనే కమాండ్స్... జాగిలాలకు ఇచ్చే కమాండ్స్‌లో 95 శాతం హిందీలోనే ఉంటాయి. కేవలం రెండు మాత్రం ఆంగ్లంలో ఉంటాయి. ఎదుటి వారికి నమస్కరించడానికి ‘సెల్యూట్’, పడుకొని గుండ్రంగా దొర్లడానికి ‘రోల్’పదాలు వినియోగిస్తారు. వీటితోపాటు అరుదుగా మాత్రమే సిట్, కమ్, స్టాండ్ వంటి ఆంగ్ల పదాలు వాడుతున్నారు. మరికొన్ని ప్రత్యేకతలు... ► ఈ జాగిలాలు నిత్యం ఇష్టంగా తినే ఆహారాన్ని సైతం ఎవరు పడితే వాళ్లు పెడితే ముట్టవు. కేవలం హ్యాండ్లర్ లేదా మాస్టర్ ఇస్తేనే స్వీకరిస్తాయి. విషప్రయోగాలకు ఆస్కారం లేకుండా ఈ శిక్షణ ఇస్తారు. ► చైనా, పాకిస్తాన్ తదితర దేశాల పటాల మధ్య ఉన్న ఇండియా మ్యాప్‌ను స్పష్టంగా గుర్తించడంతోపాటు రెండు కాళ్లు పైకెత్తి నమస్కరిస్తాయి. వాటి జ్ఞాపక, సంగ్రహణ శక్తులకు ఉదాహరణ ఇది. ► పాకిస్తాన్ లోని అబోటాబాద్‌లో అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనడంలో అమెరికా నేవీ సీల్స్కు దోహదపడ్డ బెల్జియం మలినాయిస్ జాతి జాగిలాలు రాష్ట్ర పోలీసు విభాగంలోనూ ఉన్నాయి. 2015 నుంచి అందుబాటులోకి వచి్చన వీటిని మాదకద్రవ్యాలను గుర్తించేందుకు శిక్షణ ఇచ్చి, వినియోగిస్తున్నారు. ► మాదకద్రవ్యాలను పసిగట్టేందుకు బీగల్ జాతి జాగిలాలను అందుబాటులోకి తీసుకువచి్చన తొలి పోలీసు విభాగంగా తెలంగాణ రికార్డులకెక్కింది. ► ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపా విభాగమైన ఆక్టోపస్‌లో 2015 నుంచి బెల్జియం మలినాయిస్ జాగిలాలను వాడుతున్నారు. ఈ జాగిలాలకు పెట్టే పేర్లు, హ్యాండ్లర్లు ఇచ్చే ఆదేశాలు (కమాండ్స్/కాషన్స్) గరిష్టంగా మూడు అక్షరాలకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వీటిలో అత్యధికం రెండు అక్షరాలతో కూడినవే ఉంటాయి. జాగిలం గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు, తక్కువ సమయంలో ఆదేశం పూర్తి చేయడానికి ఈ ప్రమాణాలను నిర్దేశించుకున్నారు. చదవండి: మెట్రోకు సమ్మర్ ఫీవర్.. పగుళ్లకు కోటింగ్..పట్టాలకు లూబ్రికేషన్! -
పోలీస్ జాగిలాలకు పాసింగ్ అవుట్ పరేడ్.. మొత్తం 48 జాగిలాలకు శిక్షణ పూర్తి
-
కుక్కను కరిచాడు!
ఫెయిర్‌ఫీల్డ్: మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, మనిషే కుక్కను కరిస్తే వార్త అనే మాటను అక్షరాలా నిజం చేసాడో ప్రబుద్ధుడు. అమెరికాలో ఒక దొంగ మంచి టైమ్ చూసుకొని వృద్ధులున్న ఇంటికి కన్నం వేశాడు. దొంగతనం పూర్తయి పారిపోదామనుకునే సమయంలో ఆ ఇంటికి అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చాడు. తను పారిపోయేందుకు డెలివరీ ట్రక్కును, లేదంటే చంపేస్తానని బాయ్‌ను దొంగ బెదిరించాడు. దీంతో భయపడిన అమెజాన్ బాయ్ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు సదరు ఇంటిని చుట్టుముట్టారు. ఎంత ప్రయత్నించినా దొంగను బయటకు రప్పించలేకపోవడంతో చివరకు పోలీసు జాగిలం కార్ట్(కే9)తో కలిసి ఇంట్లోకి వెళ్లారు. దొంగను గుర్తించిన కుక్క అతన్ని పట్టుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ దొంగ కుక్కను కరిచి, కత్తితో పొడిచాడని పోలీసులు ప్రకటించారు. చికిత్స కోసం కుక్కను ఆస్పత్రికి పంపారు. దొంగ మత్తు పదార్థాలు వాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిపై పాత కేసులున్నా యని పోలీసులు గుర్తించారు. కొత్తగా కుక్కను కరిచినందుకు, ట్రక్కు దొంగతనానికి, ఇంట్లో దొంగతనానికి కేసులు నమోదు చేశారు. -
శభాష్.. డాగ్ స్క్వాడ్!
మిస్టరీగా మారిన కేసుల్లో నిందితుల ఆచూకీ కనుగొనడంలో పోలీసు జాగిలాల పాత్ర కీలకంగా ఉంటోంది. మనుషులకు సాధ్యం కాని పనిని జాగిలాలు చేస్తూ నేర పరిశోధనలో పోలీసులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. వైఎస్సార్ జిల్లా పోలీసు యంత్రాంగం వీటికి ప్రత్యేక శిక్షణ ఇప్పించడమే గాక.. పోషణ బాధ్యతలను పక్కాగా నిర్వర్తిస్తోంది. కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని డాగ్ స్క్వాడ్ వింగ్ (డీఎస్డబ్లు్య) లేదా (డిస్ట్రిక్ట్ కెనైన్ స్క్వాడ్) జాగిలాలు నేర సంఘటన స్థలంలో లభించిన ఆధారాల ద్వారా నిందితులకు సంబంధించిన ఆనవాళ్లను పసిగట్టడంలో విశేష ప్రతిభ చాటుతున్నాయి. తద్వారా సంబంధిత పోలీసు అధికారులు తమ విచారణను వేగవంతం చేసి కేసుల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. జాగిలాల ప్రత్యేకతలివే శునకాలకు ఘ్రాణ శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు 10 రెట్లు అధికం. పోలీసు శాఖకు నేర పరిశోధనలో ఇవి కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. 8 నెలల పాటు కఠోర శిక్షణ లూసీతో షేక్‌హ్యాండ్ తీసుకుంటున్న ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ (ఫైల్‌ఫోటో) గుంటూరు జిల్లా మంగళగిరి బెటాలియన్‌లోని కెనైన్ ట్రైనింగ్ సెంటర్లో మూడు లేదా నాలుగు నెలల వయసున్న పప్పిస్కు (పిల్లలు) హ్యాండ్లర్స్(శిక్షకులు) నేర పరిశోధనకు సంబంధించిన శిక్షణ ఇస్తారు. 8 నెలల పాటు కొనసాగే ఈ శిక్షణ ఇచ్చేందుకు జంతు ప్రేమికులుగా ఉన్న ఏఆర్ పోలీసులను ఎంపిక చేస్తారు.ఈ శిక్షణ కాలంలో రెండు నెలల పాటు కాలకృత్యాలు, ఆహారం, ప్రేమగా చూసుకోవడం, పిలిచిన వెంటనే వచ్చేందుకు ప్రేమానురాగాలను నేర్పిస్తారు. తరువాత రెండు నెలల్లో సాధారణ మర్యాదలైన సిట్, స్టాండ్, కమ్, రోల్, సెల్యూట్లను నేర్పిస్తారు. ఆ తరువాత మరో నాలుగు నెలల పాటు పేలుడు పదార్థాలను గుర్తించేందుకు గన్‌పౌడర్‌ను వాసన చూపించడంతో పాటు, బాక్స్‌లో గన్‌పౌడర్‌ను వేసి దానిని విసిరేసి తీసుకు వచ్చే విధంగా రోజు సాధన చేయిస్తారు. 12 జాతుల వినియోగం ప్రధానంగా 12 జాతులకు చెందిన జాగిలాలను పోలీసు శాఖ తమ నేర పరిశోధన అవసరాలకు వినియోగించుకుంటోంది. జిల్లాలో 10 జాగిలాలు డాగ్‌స్క్వాడ్ వింగ్‌లో ఉన్నాయి. వీటిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఒక్కో డాగ్‌కు ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటిలో ఉన్న లాబ్రడార్ జాతికి చెందిన 5 జాగిలాలను పేలుడు పదార్థాలను కనుకొనేందుకు, ట్రాకర్ డాగ్స్‌గా పిలువబడే జర్మన్ షెపర్డ్, లాబ్రడార్ జాతులకు చెందిన రెండు జాగిలాలను నేరపరిశోధనకు వినియోగిస్తారు. అలాగే మరో 3 జర్మన్‌షెపర్డ్, బెల్జియం మెలనాయిస్, లాబ్రడార్లను ఎర్రచందనం దుంగలను కనుగొనేందుకు వినియోగిస్తారు. అలాగే వీఐపీల భద్రత, అజ్ఞాతంగా వచ్చే బెదిరింపు కాల్స్, పేలుడు పదార్థాలను గుర్తించడం, ఇలా వివిధ సందర్భాల్లో జాగిలాల సేవలను పోలీసు శాఖ వినియోగించుకుంటోంది. ప్రతిభ.. పతకాలు డ్యూటీమీట్‌లో ప్రతిభ చాటిన డాగ్‌తో హ్యాండ్లర్స్ (ఫైల్‌ఫొటో) రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే డ్యూటీమీట్స్, శిక్షణలలో జాగిలాలు ప్రతిభ చాటి అనేక పతకాలను సాధిస్తున్నాయి. పోలీసులకు సవాల్‌గా మారిన పలు కేసులను ఛేదించడంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ కీలకంగా వ్యవహరించి ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాయి. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం అభినందనలు పొందుతున్నాయి. 2017 చండీఘర్‌లో, 2019లో మైసూరులో నిర్వహించిన ఆల్ ఇండియా డ్యూటీమీట్‌లో ట్రాకర్ డాగ్ డాన్న్రెండుసార్లు పాల్గొంది. 2014లో నిర్వహించిన శిక్షణ పోటీల్లో ట్రాకర్ డాగ్ డాన్ ట్రాకింగ్‌లో ప్రథమ బహుమతి సాధించి గోల్డ్‌మెడల్ పొందింది. డాగ్ వాగా ఎక్స్‌ప్లోజివ్‌లో ద్వితీయ బహుమతితో సిల్వర్ మెడల్ పొందింది. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నాలుగు డాగ్స్ పాల్గొన్నాయి. ఇందులో ట్రాకర్‌లో డాగ్ డాన్, ఎక్స్‌ప్లోజివ్‌లో జాగిలం వాగ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రిఫ్రెషర్ కోర్సులో పోలీసు జాగిలం లూసీ ప్రతిభ చాటింది. లాబ్రడార్ జాతికి చెందిన లూసీ పేలుడు పదార్థాలను గుర్తించడంలో దిట్టగా పేరొందింది. రాష్ట్ర స్థాయిలో పేలుడు పదార్థాల గుర్తింపునకు సంబంధించిన పోటీలో లూసీ సత్తా చాటింది. వైఎస్సార్ జిల్లాలో పోలీస్ డాగ్స్ ఛేదించిన క్లిష్టమైన కేసుల వివరాలిలా.. 2017 సంవత్సరం ఆగస్టు 14న పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యువ జంట మిస్సింగ్ కేసు గత ఏడాది మార్చి 14న సింహాద్రిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య గత ఏడాది ఆగస్టు 29న పెండ్లిమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య గత ఏడాది నవంబర్ 18న రామాపురం హత్య కేసు ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన చెన్నూరులోని దేవాలయంలో జరిగిన చోరీ ఈ ఏడాది జూన్ 2న కడప నగరం చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీ ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఖాజీపేట ఆలయంలో జరిగిన చోరీ కేసులను ఛేదించి నిందితులను కనుగొనడంలో విశేష ప్రతిభ చాటాయి. నేరపరిశోధనలో డాగ్స్ ఉత్తమ ప్రతిభ జిల్లాలో నేరపరిశోధనలో డాగ్స్ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాయి. పోలీసు డ్యూటీమీట్స్లో ప్రతిభ చాటి బహుమతులు పొందుతున్నాయి. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. – కేకేఎన్ అన్బురాజన్,జిల్లా ఎస్పీ -
సిక్కోలు భైరవసేన..
దొంగతనం జరిగినా.. బాంబు బెదిరింపు వచ్చినా.. ప్రముఖుల పర్యటనకు విచ్చేసినా ఆ ప్రదేశాల్లో ముందుగా కనిపించేది పోలీస్ జాగిలం. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా.. ఆధారాల సేకరణలో కీలకంగా వ్యవహరిస్తోంది సిక్కోలు భైరవ సేన. రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చూపి సిక్కోలు ఖ్యాతిని పెంచుతోంది ఈ ‘ఐదో సింహం’. సాక్షి,శ్రీకాకుళం: శాంతి భద్రతల పరిరక్షణలో జాగిలాలది కీలక పాత్ర. ఆధారాల సేకరణలో, పేలుడు పదార్థాల గుర్తింపులో శిక్షణ పొందిన శునకాలు పోలీసులకు సహకరిస్తున్నాయి. పోలీసు తరహా తరీ్ఫదు పొంది ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ నేరాల నియంత్రణకు తోడ్పాటునందిస్తున్నాయి. జిల్లా పోలీస్ శాఖలో 8 జాగిలాలు సేవలందిస్తున్నాయి. అందులో కైరో, లైకా అనే రెండు జాగిలాలు ఈ నెల 5 నుంచి 19 వరకు మంగళగిరిలో జరిగిన కెనైన్ అండ్ డాగ్ హ్యాండ్లర్ రిఫ్రెష్ కోర్సులో ప్రతిభను చూపాయి. రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. కైరో నేరపరిశోధన విభాగంలో.. లైకా పేలుడు పదార్థాల అన్వేషణలో ప్రతిభను చాటాయి. ఈ నేపథ్యంలో సిక్కోలుకు సేవలందిస్తున్న జాగిలాల ఆహార్యం.. ఆహారం.. ఆరోగ్యం.. ఇతర అంశాలపై ‘సాక్షి’ కథనం. వీఐపీ డాగ్.. లైకా.. చిత్రంలోని ఈ జాగిలం పేరు లైకా. 2019లో పుట్టింది. లాబ్రాడర్ జాతికి చెందిన శునకం. హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ అనంతరం శ్రీకాకుళం పోలీస్ శాఖలో చేరింది. స్పెషలైజేషన్: పేలుడు పదార్థాలు పసిగట్టడంలో నేర్పరి. వీవీఐపీల బందోబస్తులో కీలకం. అతిథులు ఎవరైనా జిల్లాను సందర్శిస్తున్నారంటే లైకా రంగంలోకి దిగుతుంది. మంగళగిరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ద్వితీయ స్థానాన్ని సాధించింది. ఆహారం నెలకు ఒక్కో జాగిలం ఆహారం కోసం రూ.5 వేల నుంచి రూ.6 వేలు వెచ్చిస్తారు. ప్రత్యేకంగా తయారు చేసే రోయల్ కెనైన్ ఆహారం అందజేస్తారు. ఆవాసం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక డాగ్ హౌస్ ఉంది. ప్రతి జాగిలానికి ఒక గదిని కేటాయిస్తారు. పూర్తి సదుపాయాలతో ఆ గది ఉంటుంది. ఆరోగ్యం వీటి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. చురుకుదనం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. మరిన్ని ప్రత్యేకతలివే.. ►ప్రతి డాగ్‌కు ఒక హ్యాండ్లర్‌ను కేటాయి స్తారు. వీటి శిక్షణ, వసతి, ఆరోగ్యం, ఇతర కార్యక్రమాలన్నీ హ్యాండ్లర్ పర్యవేక్షిస్తారు. ►వీటి సేవలు జిల్లాకే పరిమితం కాదు. అవసరమైతే పక్క జిల్లాలకు కూడా వినియోగిస్తారు. పరిశోధన పుట్ట.. కైరో చిత్రంలోని చురుగ్గా చూస్తున్న ఈ డాగ్ పేరు కైరో. 2018లో పుట్టింది. డాబర్ మేన్ జాతికి చెందినది. హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ అనంతరం శ్రీకాకుళం డాగ్స్కాడ్లో చేరింది. స్పెషలైజేషన్: నేర పరిశోధన కోసం ఈ జాగిలాన్ని వినియోగిస్తున్నారు. జిల్లాలోని కీలకమైన కేసులు పరిశోధనలో పోలీస్‌శాఖకు సాయపడింది. ట్రాక్ రికార్డ్.. పలాసలో బాలుడి హత్య, రాజాంలో వ్యక్తి హత్య, శ్రీకాకుళంలో వివిధ చోరీ కేసుల్లో నిందితుల అన్వేషణలో కైరో సమర్థంగా సేవలందించింది. 2020లో రాష్ట్రవ్యాప్తంగా మంగళగిరిలో జరిగిన పోలీస్ డాగ్ నైపుణ్య పరీక్షల్లో గోల్డ్ మెడల్ సాధించింది. పోలీస్ శాఖలో కైరోకు మంచి గుర్తింపు ఉంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు సైతం నేరపరిశోధన విషయంలో కైరో సేవల్ని వినియోగిస్తున్నారు. నిరంతరం నైపుణ్య శిక్షణ.. జిల్లాలోని ఎనిమిది జాగిలాలకు ఉదయం, మధ్యా హ్నం రెండు గంటల పాటు శిక్షణ ఉంటుంది. మారుతు న్న సాంకేతిక పరిజ్ఞానం, నేరాలకు అనుగుణంగా స్టేట్ ఇంటెలిజన్స్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది. ముఖ్యంగా నేర పరిశోధన, పేలుడు పదార్థాల అన్వేషణలో తరీ్ఫదు ఉంటుంది. డాగ్‌స్కా్వడ్ పనితీరును ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. – శిస్టు రాజేశ్వరరావు, డాగ్ స్క్వాడ్ హ్యాండ్లర్ -
పోలీసు జాగిలం ప్రత్యేకతలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నేర దర్యాప్తు, విపత్తుల సమయంలో పోలీసు జాగిలాల సేవలు ఎంతో కీలకమని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో మంగళవారం జరిగిన 50 పోలీసు జాగిలాలు, 80 మంది జాగిలాల శిక్షకుల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, సంక్లిష్టమైన కేసుల పరిశోధన, ఛేదనలో అత్యంత కీలక పాత్ర వహించేలా ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు జాగిలాలు విధుల్లో మరింత ప్రతిభ కనబరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పోలీసు జాగిలాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు జాగిలాలు, శిక్షకులతో కలసి ప్రదర్శించిన విన్యాసాలు, సాహస కృత్యాలు ఆకట్టుకున్నాయి. 8 నెలల పాటు కఠోర శిక్షణ.. మొయినాబాద్ శిక్షణ కేంద్రంలో 50 జాగిలాలకు 8 నెలల పాటు 80 మంది హాండ్లర్స్ (శిక్షకులు) ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 50 జాగిలాలలో ప్రధానంగా లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, బెల్జియం మాలినాయిస్, కొకర్ స్పానియల్, గోల్డెన్ రిట్రీవర్ జాతులకు చెందినవి ఉన్నాయి. హోం శాఖకు చెందిన పీఎం డివిజన్ పోలీస్ కె–9 డివిజన్ కన్సల్టింగ్ డైరెక్టర్ పీకే ఛుగ్ ఈ బ్యాచ్ తుది పరీక్షకు ఎగ్జామినర్‌గా హాజరయ్యారు. 12 జాతుల వినియోగం.. ప్రపంచవ్యాప్తంగా 435 రకాల జాతులు ఉన్నాయి. ప్రధానంగా 12 జాతులకు చెందిన జాగిలాలను పోలీసు శాఖ తమ నేర పరిశోధనల అవసరాలకు వినియోగించుకుంటోంది. మన రాష్ట్రంలో లాబ్రడార్, డాబర్మన్, ఆల్సీషియన్, గోల్డెన్ రిట్రీవర్, డాల్మేషన్, జర్మన్ షెపర్డ్ జాతుల జాగిలాల సేవలను మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఎయిర్‌పోర్టులో తనిఖీల కోసం చిన్నగా ఉండే కొకర్ స్పానియల్ జాతి కుక్కలను పోలీసులు వినియోగిస్తున్నారు. కాగా, అకాడమీలో బిహార్‌కు చెందిన 20 జాగిలాలకు అక్రమ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కేంద్రంలో ఇప్పటివరకు 669 జాగిలాలు, 965 హ్యాండ్లర్లు శిక్షణ పొందారు. కార్యక్రమంలో ఏడీజీ (లా అండ్ ఆర్డర్) జితేందర్, ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావు, సైబరాబాద్ సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. జాగిలాల ప్రత్యేకతలివే.. శునకాలకు ఘ్రాణ శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు 10 రెట్లు అధికం. పోలీసు శాఖకు నేర పరిశోధనలో ఇవి కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. చదవండి: డిప్యూటీ స్పీకర్ పద్మారావు వ్యాఖ్య చదవండి: అయ్యా నీకో దండం.. -
12 కిలోమీటర్లు పరిగెత్తి పట్టేసింది!
బనశంకరి(కర్ణాటక): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 కిలోమీటర్లు ఏకధాటిగా పరిగెత్తి పోలీసు జాగిలం నేరస్తుడిని పట్టుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నేరస్తుడిని పట్టుకోవడంలో తమకు సహకరించిన శునకాన్ని పోలీస్ బాస్‌లు సముచితరీతిలో సన్మానించారు. దావణగెరె పోలీస్ డాగ్‌స్క్వాడ్‌లో ఉన్న తొమ్మిదేళ్ల తుంగా అనే డాబర్‌మెన్ శునకం రెండుగంటల్లో 12 కిలోమీటర్లు వెళ్లి హంతకుడి ఆచూకీ కనిపెట్టింది. చేతన్ అనే వ్యక్తి తన స్నేహితుడు చంద్రానాయక్ తదితరులతో కలిసి ధారవాడ జిల్లాలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఒక సర్వీస్ రివాల్వర్, బంగారు నగలు దోచుకెళ్లి అందరూ సమానంగా పంచుకున్నారు. కానీ చంద్రానాయక్ తనకు వాటా ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో చేతన్ ఆ సర్వీస్ రివాల్వర్‌తో అతన్ని కాల్చి చంపి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటనాస్థలాన్ని జాగిలం తుంగాతో కలిసి పరిశీలించారు. వాసన పసిగట్టిన తుంగా పరుగులు తీస్తూ రెండు గంటల తర్వాత కాశీపుర తాండాలో వైన్‌షాప్ వద్దకు వెళ్లి అక్కడ హోటల్ వద్ద నిలబడింది. సమీపంలోని ఇంటి ముందుకు వెళ్లి గట్టిగా మొరగసాగింది. ఆ ఇల్లు చేతన్ బంధువుది కాగా, చేతన్ అక్కడే మొబైల్లో మాట్లాడుతున్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా చోరీ, హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నాడని చెన్నగిరి డీఎస్పీ ప్రశాంత్ మున్నోళ్లి తెలిపారు. పోలీసు జాగిలాలు గరిష్టంగా 8 కిలోమీటర్ల వరకూ వెళ్తాయి. కానీ తుంగా అంతదూరం వెళ్లడం గొప్ప విషయమని ఎస్పీ హనుమంతరాయ కొనియాడుతూ శునకాన్ని సన్మానించారు. తుంగా ఘనత కొద్ది నెలల క్రితమే దావణగెరె పోలీస్ డాగ్‌స్క్వాడ్‌లో చేరిన తుంగా కీలక కేసులను ఛేదించడంలో ప్రధానపాత్ర పోషించింది. 30 హత్య కేసులతో 60 కేసుల్లో పోలీసులకు సహాయపడింది. ప్రతిరోజు ఉదయం 5 గంట నుంచే తుంగా దినచర్య ప్రారంభమతుంది. సుమారు 8 కిలోమీటర్ల వరకు నడక, జాగింగ్ చేస్తుంది. (చిరుత కోసం రిస్క్, ‘రియల్ హీరో’పై ప్రశంసలు) -
మిస్ యూ రాజా
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): పరిస్థితులను పసిగట్టేతత్వం.. ఎదుటి వ్యక్తుల కదలికలను నిశితంగా గమనించే నైజం.. నిరంతరం నేర పరిశోధనా దృష్టితో పోలీసులకు సైతం అంతుచిక్కని అనేక చిక్కుముళ్లతో కూడిన కేసులను కూడా సునాయాసంగా ఛేదించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు అందుకున్న జిల్లాకు చెందిన పోలీస్ జాగిలం(రాజా)శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. (అప్రమత్తతతోనే ముప్పు తప్పింది ) ప్రతిభకు పట్టం.. పోలీసు జాగిలం రాజా వయస్సు ఆరేళ్లు. 2015లో జిల్లా పోలీసుల వద్దకు చేరిన ఈ డాగ్.. దాదాపు 17 కేసులను ఛేదించింది. అంతేకాక రాష్ట్ర, జాతీయస్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని జిల్లా పోలీసు డాగ్ టీంకు పతకాలు తెచ్చిపెట్టి జిల్లా పోలీసు ప్రతిష్టను దశదిశలా చాటింది. 2014లో హైదరాబాదు మోయినాబాద్ పోలీసు డాగ్ శిక్షణ కేంద్రంలో ఎనిమిది నెలల పాటు ప్రత్యేక తర్ఫీదు పొందిన రాజా.. శిక్షణలో మంచి ప్రతిభ కనబరచి సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకుంది. 2015లో హర్యానాలో జరిగిన ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్లో పాల్గొని 29 రాష్ట్రాల్లోని పోలీసు జాగిలాలతో తలపడి తృతీయస్థానంలో బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. లక్ష రూపాయల రివార్డుతో పాటు ఒక ఇంక్రిమెంట్‌ను సాధించింది. 2016లో జరిగిన ఉమ్మడి రాష్ట్రాల రీఫ్రెష్ కోర్సులో 2014లో తీసుకున్న శిక్షణకు సంబంధించి నిర్వహించిన పోటీలో ప్రతిభ కనబరచి ప్రథమస్థానంలో షీల్డును అందుకుంది. నేరపరిశోధనలో హంతకుల ఆచూకీ పసిగట్టటంతో పాటు శిక్షణలో నేర్చుకున్న అనేక అంశాలతో పాటు జిల్లా పోలీసు ప్రాంగణంలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అనేక విన్యాసాలు చేసి అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులతో పాటు పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఐదు నిమిషాల్లో కేసు ఛేదన.. అది 2018 జూలై 29న ఏ కొండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ హత్య జరిగింది. మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను పచ్చడిబండతో దారుణంగా కొట్టి చంపింది. ఈ హత్యను మృతుని భార్య, తమ్ముడు కలిసి చేశారు. మరుసటి రోజు ఏ పాపం తెలియని అమాయకుల్లా శవం వద్ద కూర్చుని విలపిస్తున్నారు. ఈ హత్యపై పోలీసులకు ఎలాంటి ఆధారాలు అందలేదు. అసలు హత్య ఎందుకు జరిగి ఉంటుందనే విషయం అంతు చిక్కలేదు. అలాంటి సమయంలో పోలీసు డాగ్ రాజా రంగంలోకి దిగి.. ఐదే ఐదు నిముషాల్లో హత్య చేసిన భార్యతో పాటు మృతుని తమ్ముడిని పూర్తి ఆధారాలతో పట్టించి అధికారుల చేత శభాష్ అనిపించుకుంది. అధికార లాంఛనాలతో.. పోలీసు డాగ్ రాజాకు శుక్రవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు పుష్పగుచ్ఛంతో నివాళులు అర్పించారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ మోకా సత్తిబాబు, ఏఆర్ ఏఎస్పీ బి. సత్యనారాయణ, డీఎస్పీలు మహబూబ్‌బాషా, ఉమామహేశ్వరరావు, ధర్మేంద్ర, ఇతర సిబ్బంది నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
బిట్టు ఇకలేదు
సాక్షి, తిరుపతి : పోలీసుశాఖకు విశేష సేవలు అందించిన బిట్టు (తిరుపతి టాస్క్ ఫోర్స్ డాగ్) ఇక లేదు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బిట్టు.. ఆదివారం మృతి చెందింది. గత నాలుగేళ్లుగా బిట్టు తిరుపతి పోలీసులకు సేవలు అందించింది. అడవుల్లో స్మగ్లర్లు దాచిన ఎర్రచందనం దుంగలను గుర్చించడంలో బిట్టు దిట్ట. అలాగే చాలా సార్లు నక్కి ఉన్న స్మగ్లర్లను కూడా పోలీసులకు పట్టించింది. 2016 జనవరిలో జన్మించిన బిట్టు కు మొయినబాద్ లో 8 నెలల పాటు పోలీసులు శిక్షణ ఇచ్చారు. 2017 ఫిబ్రవరి నుంచి తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఉంది. ఇప్పుడు తీవ్ర అనారోగ్యము తో చనిపోయింది. పోస్ట్ మార్టం చేయించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏ ఎస్పీ రవిశంకర్ సిబ్బంది నివాళులు అర్పించారు. -
టాస్క్ ఫోర్స్ డాగ్ మృతి
-
కోరపళ్ల తుపాకులు
మనకు పోలీసుల, సైనికుల శిక్షణ మాత్రమే తెలుసు. వారు చేసే సాహసాలు తెలుసు. ప్రమాదాల్లో అర్పించే ప్రాణాలు తెలుసు. కాని వారితో సమానంగా వివిధ రక్షణ దళాలలో శునకాలు సేవలు అందిస్తాయి. త్యాగాలూ చేస్తాయి. కాకుంటే అవి పెద్దగా అందరికీ తెలియవు. పోలీసులకు, సైనికులకు శిక్షణ విభాగాలు ఉన్నట్టే ఈ దళాలతో పని చేసే శునకాలకు శిక్షణ ఇచ్చే విభాగం కూడా ఒకటి ఉంది. దానిని ‘ఇండియన్ ఆర్మీ రిమౌంట్ వెటర్నరి కోర్’ అంటారు. ఇది మీరట్‌లో ఉంది. ఇక్కడే భారత దేశంలోని సాయుధ రక్షణబృందాలకు అవసరమైన అశ్వాలకు, శునకాలకు శిక్షణ ఇస్తారు. ఇది కాకుండా బి.ఎస్.ఎఫ్.ఏ వాళ్ల ‘నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్’ కూడా ఉంది. ఆయా రాష్ట్రాల పోలీసు విభాగాల కింద నడిచే ట్రయినింగ్ సెంటర్లూ ఉన్నాయి. ఇవన్నీ విధి నిర్వహణ కోసం, ప్రజా రక్షణ కోసం శునకాలకు శిక్షణ ఇచ్చి వాటి సేవలు తీసుకుంటాయి. సి.ఆర్.పి.ఎఫ్ వారి సరిహద్దు సేవల కోసం శిక్షణ పొందిన శునకాలు ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తాయి ∙పోలీసులు, సైనికులకు శిక్షణ ఉన్నట్టే డాగ్ స్క్వాడ్‌లో పని చేసే శునకాలకూ శిక్షణ ఉంటుంది. ∙ట్రాకర్ డాగ్స్ అంటే నిందితులు వాడిన వస్తువుల వాసనను బట్టి నిందితులను వెతుక్కుంటూ వెళ్లే శునకాలకు 36 వారాలు, పేలుడు పదార్థాలను గుర్తించడం కోసం 24 వారాలు, మాదక ద్రవ్యాలను గుర్తించడానికి 24 వారాలు, ప్రమాదాల్లో బాధితులను గుర్తించే శిక్షణ 24 వారాలు, అటవీ సంపద రక్షణకు పని చేసే వీలుగా 24 వారాలు... ఇలా శిక్షణ ఇస్తూ వెళతారు ∙ఈ శునకాలను ఉపయోగించే వ్యక్తిని (పోలీస్/సైనికుడు) డాగ్ హ్యాండ్లర్ అంటారు. డాగ్, డాగ్ హ్యాండ్లర్ ఒక జట్టుగా పని చేస్తారు. సైగలూ, శబ్దాలూ ఉపయోగించి డాగ్ హ్యాండ్లర్ వాటికి పనులు చెబుతాడు. డాగ్ హ్యాండ్లర్ జీతం 31 వేల నుంచి మొదలవుతుంది ∙మొరగడం కుక్క సహజ లక్షణం. కాని కొన్ని సందర్భాలలో అవి మొరగడం వల్ల శత్రువు అప్రమత్తం కావచ్చు. అందుకే వాటిని మొరగకుండా కూడా శిక్షణ ఇస్తారు ∙ఒక డాగ్ స్క్వాడ్ శునకం వృత్తి జీవితం 8 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత అవి రిటైర్ అవుతాయి. ఎన్నో సేవలు... భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు తప్పిపోయిన, శిథిలాల కింద చిక్కుకున్నవారిని ఎందరినో ఈ రక్షణ శునకాలు పసిగట్టి కాపాడాయి. ప్రధాని, రాష్ట్రపతి వంటి వి.వి.ఐ.పిలు ప్రయాణించే దారులను ఈ శునకాలే మొదటగా ప్రయాణించి క్లియర్ చేస్తాయి. గతంలో భూటాన్ రాజుకు మన దగ్గర శిక్షణ పొందిన శునకాన్ని కాపలా కోసంగా ఇచ్చారు. రాజు మీద హత్యాయత్నం చేద్దామని వచ్చిన వ్యక్తి జారవిడిచిన రుమాలును వాసన పట్టిన శునకం కొన్ని మైళ్లు ప్రయాణించి మరీ ఆ దుండగుణ్ణి పట్టించింది. జమ్ము–కాశ్మీరు సరిహద్దుల్లో శత్రువు రాకను ఈ శునకాలే పసిగట్టి ఆచూకీ ఇస్తాయి. సి.ఆర్.పి.ఎఫ్ దళాలు తాజాగా తమ శునకాలకు కెమెరాలు బిగించడానికి నిర్ణయించాయి. వాటిని వదిలిపెట్టి శత్రుశిబిరాల వైపు చొచ్చుకెళ్లేలా చేసి అవి చూపిన దృశ్యాల ఆధారంగా దాడులు చేయొచ్చని ఆలోచన. తమ ధైర్యం, తెగువ, విశ్వాసంతో ఎన్నో శునకాలు ప్రజలను కాపాడటమే కాదు తమ ప్రాణాలు కూడా త్యాగం చేశాయి. వాటి త్యాగం చాలామందికి పట్టదు. పెద్దగా ప్రచారానికి నోచుకోదు. వీటిని కుక్కబతుకు కాదు. నిజంగా గొప్ప బతుకు. -
మట్టికుప్పల కింద మనిషి.. బతికాడా..!
శ్రీనగర్ : విశ్వాసానికి మారుపేరు కుక్క. ఈ విషయం మనందరికీ తెలుసు. యజమాని ప్రమాదంలో ఉన్నప్పుడు పసిగట్టి.. ప్రాణాలు కాపాడిన ఘటనలు చూశాం. ఇక పోలీస్ జాగిలమైతే మరింత అలర్ట్‌గా ఉంటుంది. కొండచరియలు మీదపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలను ఓ జాగిలం నిలుపగలిగింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జమ్మూ కశ్మీర్ జాతీయ రహదారిలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రామ్‌బన్ జిల్లా లుధ్వాల్ గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్ మంగళవారం రాత్రి రోడ్డు పక్కన వెళ్తున్నాడు. ఉన్నట్టుండి ఓ భారీ కొండచరియ విరిగిపడింది. అతను ప్రమాదాన్ని గ్రహించి అక్కడ నుంచి పరుగెత్తాడు. అయినప్పటికీ మట్టిపెళ్లలు అతన్ని కప్పెట్టేశాయి. అయితే, రెగ్యులర్ చెకింగ్‌లో భాగంగా ప్రదీప్ కూరుకుపోయిన 147 నెంబర్ మైలురాయి వద్దకు సీఆర్పీఎఫ్ జవాన్లు బుధవారం తెల్లవారుజామున చేరుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడటం అక్కడ మామూలే కావడంతో.. తిరుగుపయనమయ్యారు. కానీ, అప్పుడే.. వారి జాగిలం ‘అజాక్షి’ మట్టికుప్పల కింద మనిషి ఆనవాళ్లు పసిగట్టింది. మొరుగుతూ... అక్కడే చక్కర్లు కొట్టడంతో జవాన్లు అలర్ట్ అయ్యారు. పై అధికారులకు సమాచారమిచ్చారు. మరింతమంది సిబ్బందిని రప్పించి.. జాగ్రత్తగా మట్టిని తొలగించడం మెదలుపెట్టారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ప్రదీప్ వారి కంటబడ్డాడు. అతన్ని బయటికి తీసి హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతనింకా షాక్ నుంచి తేరుకోలేదని, కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. కొండచరియలు విరిగి పడుతుంటడంతో ఎన్‌హెచ్ 44 మూసివేశారు. ఇక ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవడంతో.. ఇటీవల నిర్మించిన కొత్త దారిలో కాకుండా.. సంప్రదాయ పురాతన మార్గం నుంచే భక్తులకు అనుమతిస్తున్నారు. -
18వ బ్యాచ్ జాగిలాల పాసింగ్ అవుట్ పెరెడ్
-
‘పోలీస్ జాగిలం కూడా సైనికుడిలా పని చేస్తుంది’
సాక్షి, అమరావతి : మంగళగిరి ఆరవ బెటాలియన్‌లో జాగిలాల శిక్షణ ముగింపు సభకు ముఖ్య అతిథిగా డీజీపీ ఠాకూర్ హాజరయ్యారు. 18వ బ్యాచ్ కింద 30జాగిలాలకు వివిధ అంశాల్లో పోలీస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ ఠాకూర్ మాట్లాడుతూ..'శిక్షణ పొందిన జాగిలాలు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. జాగిలాలకు మంచి శిక్షణ అందించిన వారిని అభినందిస్తున్నా. పోలీస్ విధుల్లో సిబ్బందే కాదు.. జాగిలాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవడంలో జాగిలాల పని తీరు అభినందనీయం. ఆధారాలు లేని ఎన్నో కేసులను కూడా జాగిలాల కారణంగా చేధించారు. బాంబులను పసిగట్టి, నిర్వీర్యం చేసేందుకు జాగిలాలు ఎంతో సహకరిస్తాయి. సమాజంలో ప్రజల భద్రతలో పోలీస్ జాగిలం కూడా సైనికుడిలా పని చేస్తుంది. 30జాగిలాలకు శిక్షణ పూర్తి కావడంతో వివిధ విభాగాలకు అప్పగిస్తున్నాం' అని తెలిపారు. -
నన్ వేషంలో డ్రగ్స్ సరఫరా.. పట్టేసిన పోలీస్ డాగ్
అరిజోనా : చేతిలో బైబిల్ పట్టుకుని, నన్ వేషధారణలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ మహిళను పోలీస్ డాగ్ పట్టేసింది. అరిజోనాలోని యుమాకు చెందిన ఈస్తెర్ గొమేజ్ డీ అగులార్(53) తన భర్తతో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా నన్ వేషంలో డ్రగ్స్ సరఫరా చేయాలనుకుంది. 90 వేల డాలర్ల(దాదాపు రూ.63 లక్షలు) విలువైన సింథటిక్ ఓమియాడ్ డ్రగ్ ఫెంటానిల్‌ను అక్రమంగా సరఫరా చేయడానికి అగులార్ నన్ వేషాన్ని ఎంచుకుంది. అయితే పినాల్ కౌంటీలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినందుకు ఓ పోలీసు అధికారి వారి కారును అడ్డుకుని కిందకు దింపి మాట్లాడారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న పోలీస్ డాగ్ డ్రగ్స్ వాసన పసిగట్టి అగులార్పైకి అరవసాగింది. దీంతో అమెను చెక్ చేయగా హ్యాండ్‌బ్యాగ్‌లో, వస్త్రాల్లో డ్రగ్స్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిద్దరూ 8.5 పౌండ్ల డ్రగ్స్‌ను తీసుకెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. -
పోలీస్ లాంఛనాలతో ‘ప్రాంకీ’ అంత్యక్రియలు !
గుంటూరు: నిత్యం విధినిర్వహణలో పోలీసులకు చేదోడు వాదోడుగా నిలిచింది. ఎన్నో సాహసాలకు ప్రతీకగా గుర్తింపుపొందింది. మావోయిస్టులు పెట్టిన మందుపాతరలను ముందే పసిగట్టి మన్ననలు పొందింది. పదేళ్ల పాటు పోలీసు శాఖలో సేవలందించి శాశ్వత విశ్రాంతిలోకి వెళ్లిపోయింది. పోలీస్ జాగిలం ప్రాంకీ(13) అనారోగ్యం కారణంగా బుధవారం తెల్లవారు జామున మృతి చెందింది. పోలీస్ క్వార్టర్స్‌లో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి సంతాపం తెలిపారు. ఆర్మడ్ రిజర్వ్ అదనపు ఎస్పీ ప్రసాద్, డీఎస్పీ బి.సత్యనారాయణ, ఆర్ఎస్సైలు, సిబ్బంది గౌరవ వందనం చేసి తుది వీడ్కోలు పలికారు. దటీజ్ ప్రాంకీ.. ప్రాంకీ 2007లో పోలీస్‌శాఖలోకి అడుగుపెట్టి హైదరాబాద్‌లోని మొయినాబాద్ శిక్షణా కేంద్రంలో ఎక్స్‌ప్లోజీవ్స్ ఐడెంటిఫికేషన్ విభాగంలో 9 నెలల శిక్షణను పూర్తి చేసుకుంది. అనంతరం 2008లో జిల్లా పోలీస్ బలగాల్లో చేరింది. 2010లో బెల్లంకొండ మండలంలో మూడు ప్రాంతాల్లో మవోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్స్‌ను గుర్తించి ప్రశంసలు పొందింది. 2011లో రాజుపాలెం మండలంలో రెండు ప్రాంతాల్లో మావోయిస్టులు పెట్టిన మందుపాతరను గుర్తించి పోలీస్‌శాఖలో తనకంటూ ప్రత్యేకను తెచ్చుకుంది. ఈ క్రమంలో మంగళవారం అనారోగ్యానికిగురైన ప్రాంకీ చికిత్స పొందుతూ మృతి చెందింది. -
స్వీటీతో కేటీఆర్..
వరంగల్: జిల్లాల పర్యటనలో భాగంగా తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు(కేటీఆర్) బుధవారం వరంగల్ పట్టణానికి విచ్చేశారు. కుడా కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో చోటుచేసుకున్న ఒక దృశ్యాన్ని ‘ఫేవరెట్ పిక్ ఆఫ్‌ది డే’ గా అభివర్ణిస్తూ మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. స్వీటీతో షేక్‌హ్యాండ్: సమీక్షా సమావేశానికి వచ్చిన జిల్లా పోలీసు అధికారులు కూడా స్వీటీ అనే జాగిలాన్ని కూడా తీసుకొచ్చారు. సుశిక్షితురాలైన స్వీటీ.. ఎంచక్కా ముందరికాళ్లను పైకెత్తి మంత్రిగారికి విష్ చెప్పి అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. ప్రతిగా కేటీఆర్ సైతం స్వీటీకి షేక్‌హ్యాడ్ ఇచ్చారు. సంబంధిత ఫొటోలను ట్విటర్లో షేర్చేసిన కేటీఆర్.. వాటిని ఫేవరెట్ పిక్ ఆఫ్ ది డేగా పేర్కొన్నారు. My fave pic of the day from Warangal today: ran into ‘Sweety’, a police canine who offered a warm handshake😊 pic.twitter.com/5JwhgZRglR — KTR (@KTRTRS) 4 April 2018 -
వారేవా... నీ స్టైలే వేరయ్యా..!
సాక్షి, అనంతపురం: శూనకాన్ని విశ్వాసానికి మారుపేరుగా చెప్పవచ్చు. ఎన్నో అంతుచిక్కని కేసులను ఛేదించడంలో పోలీసు డాగ్‌ల పాత్ర కూడా ఉంది. యాజమాని పట్ల చాలా ఆదారాభిమానలు కలిగి ఉంటుంది శూనకం. ఓ పోలీసు డాగ్ విన్యాసాలు చేసి అందరీనీ అకట్టుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా పోలీసు కార్యాలయంలో గత వారం రోజులుగా ఓపెన్‌హౌస్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం పోలీసు డాగ్ చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ డాగ్ డాలీ విన్యాసాలను వారు ఆసక్తిగా తిలకించారు. వీటితోపాటు వివిధ రకాల ఆయుధాలను పరిశీలించారు. -
ట్రైనర్ కోసం బుల్లెట్‌కు ఎదురెళ్లింది
విధి నిర్వహణలో ప్రాణాలను లెక్కచేయని పోలీస్ డాగ్ హూస్టన్: శిక్షణ పొందిన పోలీస్ కుక్క క్రమశిక్షణలో సైనికుడికి ఏమాత్రం తీసిపోదని మరోమారు నిరూపితమైంది. అమెరికాలోని హూస్టన్ నగరంలో కె9 కాస్పర్ అనే ఈ జాగిలం ఉంది. ఇది గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణ విభాగంలో విధులు నిర్వహించింది. పామ్ బీచ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడిన ఈ జాగిలం ప్రస్తుతం కోలుకుంటోంది. ఫిలిప్ ఓషియా అనే వ్యక్తి శుక్రవారం ఫ్లోరిడాలోని జుపిటర్‌లో దోపిడీకి పాల్పడి అడ్డొచ్చినవారిపై కాల్పులకు దిగాడు. మరుసటిరోజు తనని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులపై కాల్పులకు దిగాడు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో కాస్పర్ తన ట్రైనర్‌ను రక్షించే క్రమంలో తీవ్రంగా గాయపడిందని, ప్రస్తుతం కోలుకుంటోందని పోలీస్ కార్యాలయం అధికారిక ఫేస్బుక్ పేజీలో వెల్లడించారు. చికిత్స పొందుతున్న జాగిలం ఫొటోలను కూడా అందులో పెట్టారు. -
కెర్సీకి పోలీసు లాంఛనాలతో..
శునకం అంటే విశ్వాసానికి మారుపేరు. అందులోనూ శిక్షణ పొందిన పోలీసు శునకాలైతే నేరగాళ్ల పాలిట సింహస్వప్నంగా ఉంటాయి. ఎక్కడ నేరం జరిగినా వెంటనే అక్కడకు వెళ్లి వాసన పసిగట్టి పోలీసులకు నేర పరిశోధనలో మంచి క్లూలు అందిస్తాయి. బాంబులను గుర్తించడం, డ్రగ్స్ అక్రమరవాణా గుట్టును రట్టు చేయడం కూడా వాటికి బాగా తెలిసిన విద్య. ఇలా పలు రంగాల్లో గత 12 ఏళ్లుగా పశ్చిమగోదావరి జిల్లా పోలీసులకు సేవలు అందించిన 'కెర్సీ' గురువారం ప్రాణాలు వదిలింది. ఇంతకాలం తమకు చేదోడు వాదోడుగా ఉండటమే కాక.. ఏలూరులోని పోలీసులకు ఎంతో చేరువైన కెర్సీ మరణించడంతో.. దానికి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
పోలీసు జాగిలాన్ని ఎత్తుకెళ్లారు!
చెన్నై, సాక్షి ప్రతినిధి: దొంగలను పట్టుకునేందుకు అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చిన ఓ పోలీసు జాగిలాన్ని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. తాంబరం రైల్వేపోలీస్ ఇన్స్పెక్టర్ శేఖర్ మేలుజాతి కుక్కకు భారతి అని పేరు పెట్టుకుని పెంచుకుంటున్నారు. విధి నిర్వహణలో ఎక్కడికి వెళ్లినా దీన్ని వెంటపెట్టుకుని దర్యాప్తు చేయడం ఆయనకు అలవాటు. రాత్రి గస్తీల్లో ఆ జాగిలం సేవలను తప్పకుండా ఉపయోగిస్తుంటారు. తాంబరం రైల్వేస్టేషన్‌లోని సిబ్బందికి ఆ జాగిలం బాగా అలవాటు. రైల్వే ప్లాట్‌ఫాంపైకి బిచ్చగాళ్లు వచ్చినా, మందుబాబులు సంచరించినా తరిమివేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఈనెల ఒకటో తేదీన భారతిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లారు. అంత తొందరగా ఎవరికీ లొంగని ఈ జాగిలాన్ని కొత్తవాళ్లు పట్టుకెళ్లడం వీలు కాదని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. భారతి కనిపించకపోవడంతో ఇన్స్పెక్టర్ శేఖర్‌తో పాటు రైల్వే పోలీసులు కూడా బాగా డల్ అయ్యారు. -
ఎయిర్ టెల్ ఉద్యోగి మాయం
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం వేముల సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. వేంపల్లె, రాయచోటి, కడప ప్రాంతాల్లో ఎయిర్ టెల్ టవర్స్ మేనేజర్‌గా పనిచేసే శివభాస్కర్‌రెడ్డి (35) శనివారం కడపలో స్నేహితుల వద్ద నుంచి బైక్ తీసుకుని వేముల కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల వద్ద పని ఉందని చెప్పి బయల్దేరాడు. సాయంత్రమైనా శివభాస్కర్‌రెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆరా తీశారు. స్నేహితులు ఇచ్చిన సమాచారంతో కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం వెతకగా, ఓ గుంటలో బైక్‌ను కనిపించింది. శివభాస్కర్‌రెడ్డి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో పోలీసులు జాగిలాన్ని రప్పించి దర్యాప్తు చేస్తున్నారు.