
సాక్షి, అనంతపురం: శూనకాన్ని విశ్వాసానికి మారుపేరుగా చెప్పవచ్చు. ఎన్నో అంతుచిక్కని కేసులను ఛేదించడంలో పోలీసు డాగ్‌ల పాత్ర కూడా ఉంది. యాజమాని పట్ల చాలా ఆదారాభిమానలు కలిగి ఉంటుంది శూనకం. ఓ పోలీసు డాగ్ విన్యాసాలు చేసి అందరీనీ అకట్టుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లా పోలీసు కార్యాలయంలో గత వారం రోజులుగా ఓపెన్‌హౌస్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం పోలీసు డాగ్ చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ డాగ్ డాలీ విన్యాసాలను వారు ఆసక్తిగా తిలకించారు. వీటితోపాటు వివిధ రకాల ఆయుధాలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment