
సాక్షి, తిరుపతి : పోలీసుశాఖకు విశేష సేవలు అందించిన బిట్టు (తిరుపతి టాస్క్ ఫోర్స్ డాగ్) ఇక లేదు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బిట్టు.. ఆదివారం మృతి చెందింది. గత నాలుగేళ్లుగా బిట్టు తిరుపతి పోలీసులకు సేవలు అందించింది. అడవుల్లో స్మగ్లర్లు దాచిన ఎర్రచందనం దుంగలను గుర్చించడంలో బిట్టు దిట్ట. అలాగే చాలా సార్లు నక్కి ఉన్న స్మగ్లర్లను కూడా పోలీసులకు పట్టించింది. 2016 జనవరిలో జన్మించిన బిట్టు కు మొయినబాద్ లో 8 నెలల పాటు పోలీసులు శిక్షణ ఇచ్చారు. 2017 ఫిబ్రవరి నుంచి తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఉంది. ఇప్పుడు తీవ్ర అనారోగ్యము తో చనిపోయింది. పోస్ట్ మార్టం చేయించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏ ఎస్పీ రవిశంకర్ సిబ్బంది నివాళులు అర్పించారు.


Comments
Please login to add a commentAdd a comment