BGT 2023 Ind Vs Aus: Suryakumar Yadav Visits Tirupati Pics Viral - Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌

Published Tue, Feb 21 2023 12:57 PM | Last Updated on Tue, Feb 21 2023 2:16 PM

BGT 2023 Ind Vs Aus: Suryakumar Yadav Visits Tirupati Pics Viral - Sakshi

Suryakumar Yadav Tirumala Visit Ahead Ind Vs Aus 3rd Test: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సమేతంగా తిరుపతికి విచ్చేసిన సూర్య.. మంగళవారం స్వామి వారి దర్శనం చేసుకున్నాడు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నాడు.

శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యను సత్కరించారు. అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 నేపథ్యంలో టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు.  

తొలి టెస్టులో విఫలం
అయితే, నాగ్‌పూర్‌ మ్యాచ్‌లో విఫలం(8 పరుగులు మాత్రమే) కావడంతో.. రెండో టెస్టులో సూర్యను పక్కనపెట్టారు. ఇదిలా ఉంటే.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ విజృంభణతో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టును కూడా రెండున్నర రోజుల్లోనే ముగించింది టీమిండియా. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఇక మార్చి 1 నుంచి ఇండోర్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. దీంతో చాలా మంది టీమిండియా ప్లేయర్లు స్వస్థలాలకు వెళ్లగా సూర్య కుటుంబంతో కలిసి ఇలా దైవ దర్శనం చేసుకోవడం విశేషం.  


టెస్టుల్లో అరంగేట్రం సందర్భంగా కుటుంబ సభ్యులతో సూర్య

చదవండి: BGT 2023: రెండున్నర రోజుల్లోనే టెస్టు ముగిస్తే ఇంతే! అయినా.. గాయం సంగతి ఏమైంది?
Ind Vs Aus: ఆసీస్‌తో మ్యాచ్‌ అంటే ఆ మజానే వేరు.. రోహిత్‌ సేన మాదిరి మీరు కూడా!
Joe Root: 'రూట్‌' దారి తప్పింది.. 'నా రోల్‌ ఏంటో తెలుసుకోవాలి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement