thirupati
-
తిరుపతి తొక్కిసలాట ఘటన : ‘దైవ సన్నిధిలో అసువులు బాసడం అదృష్టం’
సాక్షి,విశాఖ : తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారిపై జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దైవ సన్నిధిలో అసువులు బాసడం ఒక రకంగా అదృష్టమని వ్యాఖ్యానించారు. చనిపోయిన వారిని ఉద్దేశించి మాట్లాడిన జ్యోతిల నెహ్రూ.. టీటీడీ చేతగానితనాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తిరుమల శ్రీవారి సేవలో మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర
సాక్షి, తిరుపతి: మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కోచ్ చాముండేశ్వరినాథ్‌తోతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. అదే విధంగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కాగా హైదరాబాద్ క్రికెట్ టీమ్‌కు ఆడుతున్న ప్రణవి చంద్ర మాట్లాడుతూ.. టీ20 క్రికెట్ లీగ్‌ల ద్వారా కొత్త వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయన్నారు. ప్రతిభ నిరూపించుకుంటే.. అంతర్జాతీయ క్రికెటర్‌టగా ఎదగడానికి ఉపయోగపడుతుందని ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్‌గా రాణిస్తున్న ప్రణవి చంద్ర పేర్కొన్నారు. చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి? NZ Vs Eng: మరీ ఇలా కూడా అవుట్ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా? -
BGT 2023: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav Tirumala Visit Ahead Ind Vs Aus 3rd Test: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సమేతంగా తిరుపతికి విచ్చేసిన సూర్య.. మంగళవారం స్వామి వారి దర్శనం చేసుకున్నాడు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నాడు. శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యను సత్కరించారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 నేపథ్యంలో టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్.. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు. తొలి టెస్టులో విఫలం అయితే, నాగ్‌పూర్ మ్యాచ్‌లో విఫలం(8 పరుగులు మాత్రమే) కావడంతో.. రెండో టెస్టులో సూర్యను పక్కనపెట్టారు. ఇదిలా ఉంటే.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజృంభణతో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టును కూడా రెండున్నర రోజుల్లోనే ముగించింది టీమిండియా. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. దీంతో చాలా మంది టీమిండియా ప్లేయర్లు స్వస్థలాలకు వెళ్లగా సూర్య కుటుంబంతో కలిసి ఇలా దైవ దర్శనం చేసుకోవడం విశేషం. టెస్టుల్లో అరంగేట్రం సందర్భంగా కుటుంబ సభ్యులతో సూర్య చదవండి: BGT 2023: రెండున్నర రోజుల్లోనే టెస్టు ముగిస్తే ఇంతే! అయినా.. గాయం సంగతి ఏమైంది? Ind Vs Aus: ఆసీస్‌తో మ్యాచ్ అంటే ఆ మజానే వేరు.. రోహిత్ సేన మాదిరి మీరు కూడా! Joe Root: 'రూట్' దారి తప్పింది.. 'నా రోల్ ఏంటో తెలుసుకోవాలి' -
విశిష్ట దర్శనానికి వేళాయే..
-
గిరిజన బిడ్డను ఎత్తుకొని ఆడించిన నిత్యామీనన్..ఫోటో వైరల్
ప్రముఖ సినీ నటి, హీరోయిన్ నిత్యామీనన్ మంగళవారం తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ట్రస్టుకు చెందిన ఏకం ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వరదయ్యపాళెం మండలం కాంబాకం గిరిజనకాలనీలో పర్యటించారు. స్థానికులు, గిరిజన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ఓ గిరిజన బిడ్డని ఎత్తుకొని ఆడించారు. పల్లెటూరి పాటలతో సరదాగా గడిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘వండర్ విమెన్’తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది నిత్యా. అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటిటీ సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
వైకుంఠ ఏకాదశి సందర్బంగా టీటీడీ భారీ ఏర్పాట్లు
-
టీటీడీ కీలక నిర్ణయాలు.. బ్రేక్ దర్శన సమయంలో మార్పు
-
తిరుపతిలో అదృశ్యమైన ఐదుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యం
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
-
పండగ వేళ : ఆరవరోజు లక్ష్మీదేవిగా అవతారం
-
ఆంధ్రప్రదేశ్ కు జాతీయ అవార్డులు
-
ఘనంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
బెళగావి లోక్‌సభ సీటు బీజేపీ కైవసం
న్యూఢిల్లీ: కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని 3 లోక్‌సభ స్థానాలు, 10 రాష్ట్రాల్లోని 12 అసెంబ్లీ సీట్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. కర్ణాటకలో బెళగావి లోక్‌సభ స్థానంలో దివంగత కేంద్రమంత్రి సురేష్ అంగడి భార్య, బీజేపీ అభ్యర్థి అయిన మంగళ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ స్థానాన్ని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గెలిచారు. కేరళలో మళప్పురం లోక్‌సభ స్థానాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి అయిన అబ్దుస్సమాద్ సమాదాని గెలిచారు. తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానంలో బీజేపీ నేత పొన్ రాధాకృష్ణన్ కంటే కాంగ్రెస్ నేత విజయ్ వసంత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక, కర్ణాటకలోని బసవకళ్యాణ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి శరణు సలగర గెలిచారు. మస్కిలో కాంగ్రెస్ అభ్యర్థి బసవనగౌడ తురివనహాల్ గెలిచారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ 2 చోట్ల, మరో చోట బీజేపీ గెలిచాయి. గుజరాత్లో మర్వా హదాప్ స్థానంలో బీజేపీ నేత నిమిషా సత్తార్ గెలుపొందారు. ఉత్తరాఖండ్‌లోని సాల్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మహేష్ గెలిచారు. తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ నేత నోముల భగత్ గెలిచారు. జార్ఖండ్‌లోని మధుపూర్‌లో జేఎఎం అభ్యర్థి హఫీజుల్ విజయం సాధించారు. -
అంతులేని విషాదం: చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది
కలకడ : భర్త అంత్యక్రియలకు ఆరురోజుల పసికందుతో యువతి హాజరు కావడం కలకడలో ఆదివారం విషాదాన్ని నింపింది. ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న యువతిని విధి చిన్నచూపు చూసింది. ప్రమాదంలో గాయపడిన భర్త ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటాడని ఎదురు చూసిన భార్య కు విగతజీవుడై రావడంతో చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది. కలకడవాసులను కళ్లు చెమర్చిన ఈ ఘటన వివరాలు .. కలకడ ఇందిరమ్మ కాలనీకి చెందిన పి.గంగాధర (25) శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురికాగా, శనివారం తిరుపతిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే దుఃఖాన్ని మింగుకుని తల్లిదండ్రులు ఈ విషయం కోడలు మంగమ్మతో చెప్పకుండా దాచారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడని నమ్మబలికారు. ఆదివారం భర్త మృతదేహం ఇంటికి చేర డంతో మంగమ్మ చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది. భర్త లేని జీవితం తనకు వద్దంటూ ఆమె విలపించడం అక్కడి వారిని కంటతడిపెట్టించింది. ఆరు రోజుల పసికందుతో భర్త అంత్యక్రియల్లో పాల్గొంది. మూడు కిలోమీటర్లు నడచి సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని చెల్లెలు భవాని శ్మశానం వరకు నలుగురిలో ఒకరుగా మోసింది. ఈ దృశ్యాలు కలకడవాసుల కలచివేశాయి.(చదవండి: పాపం ఆమెకు తెలియదు.. భర్త శవమై వస్తున్నాడని..!!) వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి రైలు నుంచి జారిపడి వృద్ధుడు.. చంద్రగిరి: మండలంలోని ముంగళిపట్టు వద్ద రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. అతనికి సుమారుగా 70 ఏళ్లు ఉంటాయని, చంద్రగిరి–ముంగళిపట్టు మధ్య రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఉంటాడని పాకాల రైల్వే హెడ్‌కానిస్టేబుల్ గౌరీశంకర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పాకాల రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. శ్రీసిటీలో ఇంజినీర్ సత్యవేడు: శ్రీసిటీలోని ఈఎంపీ రోడ్డు వద్ద ఆదివారం లారీ ఢీకొని జమిల్ కంపెనీ ఇంజినీర్ ఎస్ మహ్మద్‌హుసేన్(30) మృతి చెందారు. రాయచూర్(కర్ణాటక)కు చెందిన ఎస్.మహ్మద్‌హుసేన్ శ్రీసిటీలోని జెమిల్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం తడలో స్నేహితుని ఇంటికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా ఈఎంపీ రోడ్డు వద్ద లారీ ఢీకొంది. మహ్మద్ హుసేన్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని సత్యవేడు క మ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. భార్య రాయచూర్‌లో ఉంటోంది. ఏడాది కిందటే వివాహమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వేట కొడవలితో వీరంగం పెద్దతిప్పసముద్రం: మండలంలోని మద్దయ్యగారిపల్లె పంచాయతీ పులగంటివారిపల్లెలో ఓ వ్యక్తి వేటకొడవలితో ఆదివారం సాయంత్రం వీరంగం సృష్టించడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్ తన పొలంలోని పంటను ఇతరుల మూగజీవాలు మేశాయని ఆ గ్రహం చెందాడు. వేటకొడవలితో గ్రామానికి చెందిన సుబ్బమ్మ, వెంకటనారాయణ, గణేశ్, రమణ, శ్రీనివాసులు, హరిపై దాడి చే సి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన గణేశ్(22)ను వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బిట్టు ఇకలేదు
సాక్షి, తిరుపతి : పోలీసుశాఖకు విశేష సేవలు అందించిన బిట్టు (తిరుపతి టాస్క్ ఫోర్స్ డాగ్) ఇక లేదు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బిట్టు.. ఆదివారం మృతి చెందింది. గత నాలుగేళ్లుగా బిట్టు తిరుపతి పోలీసులకు సేవలు అందించింది. అడవుల్లో స్మగ్లర్లు దాచిన ఎర్రచందనం దుంగలను గుర్చించడంలో బిట్టు దిట్ట. అలాగే చాలా సార్లు నక్కి ఉన్న స్మగ్లర్లను కూడా పోలీసులకు పట్టించింది. 2016 జనవరిలో జన్మించిన బిట్టు కు మొయినబాద్ లో 8 నెలల పాటు పోలీసులు శిక్షణ ఇచ్చారు. 2017 ఫిబ్రవరి నుంచి తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఉంది. ఇప్పుడు తీవ్ర అనారోగ్యము తో చనిపోయింది. పోస్ట్ మార్టం చేయించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏ ఎస్పీ రవిశంకర్ సిబ్బంది నివాళులు అర్పించారు. -
టాయిలెట్స్ వద్ద పసికందును వదిలి..
సంతానలేమితో బాధపడుతున్న వారెందరో ఉన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత గర్భం దాల్చికు బిడ్డజన్మనిస్తే తమ ప్రతిరూపాన్ని ఆ బిడ్డలో చూసుకుంటూ మురిసిపోయే వారు కోకొల్లలు. అయితే ఆరోగ్యంగా ఉన్నా ఓ పసికందును రైల్లో వదిలేశారు. ఆడ శిశువనో.. తమకు భారమని తలచి వదిలేశారో..లేదా ఏడుకొండల వాడే పసికందుకు దారి చూపుతాడోనని తెలియదుగానీ..అదృష్టం బావుండి ఆ పసికందు రుయా ఒడికి చేరింది. సాక్షి, తిరుపతి అర్బన్ : రైలులోని టాయిలెట్స్ వద్ద పసికందును వదిలిపెట్టిన ఘటన శుక్రవారం తిరుపతి రైల్వే స్టేషన్లో వెలుగులోకి వచ్చింది. వివరాలు..తిరుపతి రైల్వే స్టేషన్‌కు మధ్యాహ్నం 1.30గంటలకు కోయంబత్తూరు రైలులో వచ్చింది. ప్రయాణికులు అందరూ దిగి వెళ్లాక పారిశుధ్య కార్మికులు బోగీలను శుభ్రం చేయడానికి పూనుకున్నారు. ఓ బోగీలోని టాయిలెట్స్ వద్ద పసికందు ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూశారు. నెలరోజుల వయస్సు ఉన్న ఓ ఆడశిశువును గుర్తించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా అక్కడ పడుకోబెట్టి వదిలేసి వెళ్లారని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. ఆ పసికందును ఎత్తుకుని లాలించారు. వెంట నే రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రగతి ట్రస్ట్ చైల్డ్‌లైన్–1098 పోలీసుల సహకారంతో ఆ బిడ్డను అందుకుంది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం చేర్పించింది. మరోవైపు పోలీసులు ఆ పసికందు తల్లిదండ్రులున్నారేమోనని రైల్లోనే కాకుండా స్టేషన్ ప్రాంతంలో గాలించారు. మైక్‌లో కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఈలోపు పాపకు పాలు సైతం పట్టించారు. అయితే ఎవరూ ఆ పసికందు కోసం వారిని సంప్రదించలేదు. ఇక చేసేదేమీ లేక చిత్తూరులోని బాల ల సంరక్షణ సమితి నిర్వాహకులను సంప్రదించారు. శనివారం రుయా ఆస్పత్రి అధికారులు పాపకు సంబం ధించి వైద్యపరీక్షల ప్రక్రియ పూర్తి చేసి చిత్తూరు బాలల సంరక్షణ సమితికి అప్పగించనున్నారు. వైద్యపరీక్షల్లో ఆ పసికందు ఏమైనా అనారోగ్యంతో బాధపడుతోందా? అనేది తేలాల్సి ఉంది. ఇక బోసినవ్వులతో పసికందు అందరినీ ఆకర్షిస్తోంది. ఇదలా ఉంచితే, రైలు కోయంబత్తూరు నుంచి తిరుపతికి చేరేలోపు పలు స్టాపింగ్స్ ఉన్నాయి.ఈ పసికందును తీసుకుని ఏ రైల్వేస్టేషన్లో ఎక్కి ఉంటారో తెలుసుకునే ప్రయత్నాల్లో రైల్వే పోలీసులు పడ్డారు. ఆయా రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఈ ఏదేని క్లూ లభిస్తోందేమోననే దిశగా యోచిస్తున్నారు. ప్రయాణికులు అందరూ దిగిన తర్వాతే పసికందును టాయిలెట్ వద్ద వదలి వెళ్లి ఉంటారని, ఒకవేళ పసికందును అపహరించి తీసుకెళ్లేందుకు వీలుకాక ఇక్కడ వదిలేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలేమిటో తేలాల్సి ఉంది. -
చిత్తూరులో 65వ వన్యప్రాణి వారోత్సవం
-
‘సమీర్- రాణి’ పిల్లలకు నామకరణం!
సాక్షి, తిరుపతి: శ్రీవెంకటేశ్వర జూ పార్కులో ఐదు తెల్లపులి పిల్లలు జన్మించాయి. జూ పార్కుకు చెందిన తెల్ల పులులు సమీర్, రాణిలకు పుట్టిన సంతానానికి రాష్ట్ర అటవీశాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం నామకరణం చేశారు. మూడు మగ పులి పిల్లలకు వాసు, సిద్ధాన్, జగన్ అని... ఆడ పులి పిల్లలకు విజయ, దుర్గ అనే పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరెడ్డితో పాటు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్. ప్రదీప్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు నళినీ మోహన్, ఏకే ఝా, ఆర్కే సుమన్, శరవణన్, జూ క్యూరేటర్ బబిత తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం పేరుతో ఘరానా మోసం
సాక్షి, తిరుపతి : ఉద్యోగం పేరుతో ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసగించాడని బాధితులు అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. అర్బన్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఉదయం 9నుంచి సాయంత్రం వరకు అదనపు ఎస్పీ నుంచి ఎస్ఐ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని ఆన్లైన్లో నమోదు చేసి, రశీదు అందించారు. ఇందులో ఎస్పీ కార్యాలయానికి 60 ఫిర్యాదులు, జిల్లా వ్యాప్తంగా 21 ఫిర్యాదులు అందాయని ఎస్పీ వెల్లడించారు. తిరుపతి సంజయ్‌గాంధీకాలనీలో నివాసముంటున్న రూప్‌కుమార్ బీవీఎం డిగ్రీ చదివాడు. ఆన్లైన్లో విదేశాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ట్రూవిన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రన్, ఆ సంస్థ సభ్యులు కాల్చేసి ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. రూ.లక్ష డిపాజిట్ చేయాలని కోరారు. దీంతో వారిని నమ్మి మెడికల్, ఇతర ఖర్చుల కోసం రూ.5.50లక్షలు అకౌంట్లో డిపాజిట్ చేశానని రూప్‌కుమార్ తెలిపాడు. అయితే వారు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయాడు. దీనిపై స్పందించిన ఎస్పీ, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి కేసును అలిపిరి పోలీసుస్టేషన్‌కు సిఫార్సు చేశారు. పోలీసుస్టేషన్ల నుంచి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. దీంతోపాటు ప్రతి ఫిర్యాదు సంబంధిత పోలీస్‌స్టేషన్‌కి పంపి చర్యలు తీసుకునేలా ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. కేసులపై తీసుకున్న చర్యలు తిరిగి ఎస్పీ కార్యాలయానికి అందేలా ఆదేశాలు జారీ చేశారు. -
తిరుపతిలో రిజిస్ట్రేషన్ల కుంభకోణం?
తిరుపతిలోని హథీరాంజీ మఠం భూములను ఇష్టారాజ్యంగా కబ్జాచేశారు. గత ఐదేళ్ల కాలంలో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు పప్పూబెల్లంలా పంచుకుతినేశారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అడ్డదారుల్లో రిజిస్ట్రేషన్లు చేసి జేబులు నింపుకునేశారు. సర్వే నం.13లోనే 110 ఎకరాలకు సంబంధించి సుమారు 602 అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై కూలంకుషంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాక్షి, తిరుపతి : తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలో వందలాది ఎకరాలు హథీరాంజీ మఠం భూములు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు హథీరాంజీ మఠం భూములపై దృష్టి సారించారు. ఆ భూములను ఐదుగురు వ్యక్తులు కలిసి పంచుకునేశారు. ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టారు. కొనుగోలుదారులు రిజి స్ట్రేషన్ స్థలాలు కావాలని అడగడంతో అక్రమార్కులు సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో కొందరిని సంప్రదించారు. అక్రమార్కులకు రిజిస్టార్ కార్యాలయంలోని కొందరు అధికారులు తోడవడంతో విక్రయాలు సులభతరమయ్యాయి. అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అడ్డదిడ్డంగా మఠం భూములను రిజిస్ట్రేషన్ చేసి అమ్మి సొమ్ముచేసుకోవడం ప్రారంభించారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. 2014వ సంవత్సరం నుంచి 2019 మధ్య కాలంలో తిరుపతి రూరల్ పరిధిలోని సర్వే నంబర్ 13, 14, 15, 17, 18లోని 275 ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఒకే ఒక్క సర్వే నెంబర్ 13లో మాత్రమే 110 ఎకరాలకు సంబంధించి 602 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో తేలింది. మిగిలిన సర్వే నంబర్లలో మరో 165 ఎకరాలకు సంబంధించి 500 వరకు రిజిస్ట్రేషన్లు చేపినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే అడ్డదారిలో 1,102 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. చేతులు మారిన కోట్ల రూపాయలు మఠం భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నాయకులు, అప్పటి రెవెన్యూ, సబ్ రిజిస్టార్ కార్యాలయంలోని కొందరు, ట్రాన్స్‌కోలో పనిచేసే మరికొందరు కుమ్ముక్కై కోట్ల రూపాయలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని శ్రీవారి కైంకర్యాల కోసం కేటాయించిన మఠం భూములను ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఈ అక్రమాలు అధికం కావడంతో ఇటీవల రెవెన్యూ, పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన తాత్కాలిక గృహాలను తొలగించినట్లు తెలుస్తోంది. అమ్మి సొమ్ముచేసుకున్న వారు మాత్రం పరారీలో ఉంటే.. అక్రమార్కుల ధన దాహానికి అప్పులుచేసి కొనుగోలు చేసుకున్న సామాన్యులు మాత్రం బలయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారించి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారినుంచి డబ్బులు వసూళ్లు చేసి స్థలాలు కొనుగోలుచేసి మోసపోయిన సామాన్యులకు తిరిగి ఇప్పించమని కోరుతున్నారు. చేసుకుని అడ్డదిడ్డంగా మఠం భూములను రిజిస్ట్రేషన్ చేసి అమ్మి సొమ్ము చేసుకోవడం ప్రారంభిం చారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. 2014వ సంవత్సరం నుంచి 2019 మధ్య కాలం లో తిరుపతి రూరల్ పరిధిలోని సర్వే నంబర్ 13, 14, 15, 17, 18లోని 275 ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఒకే ఒక్క సర్వే నెంబర్ 13లో మాత్రమే 110 ఎకరాలకు సంబంధించి 602 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో తేలింది. మిగిలిన సర్వే నంబర్లలో మరో 165 ఎకరాలకు సంబంధించి 500 వరకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే అడ్డదారిలో 1,102 రిజిస్ట్రేషన్లు జరిగి నట్లు గుర్తించారు. చేతులు మారిన కోట్ల రూపాయలు మఠం భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నాయకులు, అప్పటి రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు, ట్రాన్స్‌కోలో పనిచేసే మరికొందరు కుమ్మక్కై కోట్ల రూపాయలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని శ్రీవారి కైంకర్యాల కోసం కేటాయించిన మఠం భూములను ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఈ అక్రమాలు అధికం కావడంతో ఇటీవల రెవెన్యూ, పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన తాత్కాలిక గృహాలను తొలగించినట్లు తెలుస్తోంది. అమ్మి సొమ్ము చేసుకున్న వారు మాత్రం పరారీలో ఉంటే అక్రమార్కుల ధన దాహానికి అప్పులుచేసి కొనుగోలు చేసుకున్న సామాన్యులు మాత్రం బలయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారినుంచి డబ్బులు వసూలు చేసి స్థలాలు కొనుగోలు చేసి మోసపోయిన సామాన్యులకు తిరిగి ఇప్పించమని కోరుతున్నారు. -
పరిశ్రమలను ఆదుకుంటాం : గౌతమ్ రెడ్డి
సాక్షి, తిరుపతి : రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే వారికి అన్ని వసతులు కల్పించి, పరిశ్రమల అభివృద్ధికి అన్ని విధాలా దోహదపడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. తిరుపతి ఎస్వీయూ సెనేట్ హాల్లో శుక్రవారం జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, పరిశ్రమల ఏర్పాటులో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిజిటల్‌తో పాటు ఐటీబీసీ కంపెనీని మంత్రి ప్రారంభించారు. ఈ సదస్సులో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఏపీఐసీసీ చైర్మన్ రోజా, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
త్రిపుర రాష్ట్ర సీఎస్‌గా తెలుగోడే!
సాక్షి, తిరుపతి : త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఉసురుపాటి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు తిరుపతిలోని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర్లు స్వస్థలం కార్వేటినగరం మండలం సుద్ధగుంట గ్రామం. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం తిరుపతిలోని నెహ్రు మున్సిపల్ హైస్కూల్లో సాగింది. శ్రీవెంకటేశ్వర జూనియ ర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. అనంతరం ఎస్వీ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్, ఐఏఆర్ఐ (న్యూఢిల్లీ)లో ఎంఎస్సీ, పీహెచ్డీ పూర్తి చేశారు.1986లో ఐఏఎస్‌గా సెలెక్టయ్యారు. వెంకటేశ్వర్లు ఉమ్మడి రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ టూ సెక్రటరీ, వ్యవసాయశాఖలో జాయింట్ సెక్రటరీ, విద్యాశాఖ జాయింట్ సెక్రటరీగా పనిచేసి కేంద్ర సర్వీసులకు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి వద్ద పీఎస్‌గా బాధ్యతలు నిర్వహించారు. -
ఆస్తి కోసం తండ్రిపై దాడి చేసిన కొడుకు,కోడలు
-
కారంపొడితో మామపై కోడలు దాడి
సాక్షి, తిరుపతి : తిరుపతి అనంత వీధిలో దారుణం చోటుచేసుకుంది. కొడుకు, కోడలు కలిసి ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డారు. భర్త సహకారంతో రెచ్చిపోయిన వృద్ధుడి కోడలు..మామగారి ముఖంపై కారంపొడితో దాడి చేసింది. ఇందుకు ఆమె తమ్ముడు కూడా సహకరించాడు. ఈ క్రమంలో బాధితుడిని రుయా ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అమిత్‌షాపై దాడిలో భద్రతా వైఫల్యం!
సాక్షి, అమరావతి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై తిరుపతిలో శుక్రవారం జరిగిన టీడీపీ కార్యకర్తల దాడితో ఏపీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 నుంచి జడ్ ప్లస్ కేటగిరి రక్షణ వ్యవస్థ కలిగిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటనలో భద్రతను గాలికొదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అలిపిరి వద్ద చోటుచోసుకున్న ఈ ఘటన ఏపీ పోలీసు వ్యవస్థలోని డొల్లతనం బయటపడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమిత్ షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షా కాన్వాయ్‌ను అడ్డుకుని రాళ్లు రువ్వడంతో ముగ్గురు వ్యక్తులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేంద్ర ఇంటెలిజెన్స్ (ఐబీ)వర్గాలు ఆరా తీశాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు బీజేపీ నేతలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గత నెల 12న ఏపీ పోలీస్ టెక్ భవనాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు.. తాను తలుచుకుంటే కేంద్ర వాహనాలు తిరగనివ్వననే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇటీవల పలు సభల్లో చంద్రబాబు నుంచి మంత్రులు వరకు అందరూ బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కార్యకర్తలు కొందరు ఘర్షణ వైఖరి అవలంబిస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు గుర్తించాయి. అలిపిరి ఘటనలో పాల్గొన్నది ఎవరు? వారికి వెన్నుదన్నుగా ఉన్నది ఎవరు? అనే కోణాల్లో కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో పర్యటిస్తే భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసుల తీరుపై కూడా వారు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్టు తెలిసింది. అలాగే, దాడి ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై ఏపీ పోలీసు శాఖను కేంద్ర హోంశాఖ నివేదిక కోరినట్లు తెలిసింది. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడికే రక్షణ లేకపోతే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీ హోం మంత్రి చినరాజప్ప దాడి జరగలేదని ప్రకటించడం వివాదాస్పదమైంది. -
అప్పుల్లో ఇల్లు
జిల్లాలో ఎన్టీఆర్ గృహ పథకం లబ్ధిదారులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించుకోవడం కోసం నానాతంటాలు పడుతున్నారు. నిర్మాణరంగ వ్యయం అధికభారమైంది. ఇంటినిర్మాణానికి ప్రభుత్వమిస్తున్న రూ.1.5లక్షలు ఏమూలకూ సరిపోవడం లేదు. దీనికితోడు నిర్మాణాలకు వెంటనే బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. బి.కొత్తకోట : ఎన్టీఆర్ గృహనిర్మాణానికి బిల్లుల చెల్లింపు శాపమైంది. విపరీత జాప్యం వెంటాడుతోంది. దీంతో పేదలు ఇంటిని నిర్మించుకోలేకపోతున్నారు. గడచిన రెండు నెలలుగా నిర్మాణాల్లో ఆశించిన స్థాయిలో ప్రగతి లేదని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. గత ఫిబ్రవరి 12 నుంచి బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలి చిపోయాయి. లబ్ధిదారులకు అందిస్తున్న సిమెంటుతో నిర్మాణాలు కొంతమేర సాగుతున్నాయి. జిల్లాలో ఎన్టీఆర్ గ్రామీణ, పట్టణ పథకాల కింద 2016–17, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబం ధించి 57,785 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 17,817 పూర్తి చేయించగా 12,046 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమే కాలేదు. మిగిలిన వాటిలో పునాదిలోపు స్థాయిలో 9,728, పునాది స్థాయిలో 9,401, లింటిల్‌లెవల్ స్థాయిలో 261, రూఫ్ లెవల్ స్థాయిలో 2,208 నిర్మాణాలున్నాయి. బిల్లులు రాక క్షేత్రస్థాయిలో లబ్ధి దారులు ఇంటి నిర్మాణ పనులపై ఆసక్తి చూపడంలేదని అంటున్నారు. ఫిబ్రవరి నుంచి నిధులు విడుదల చేయడం లేదు. ఫిబ్రవరి 12 నుంచి ఆ నెలాఖరు వరకు కొద్దిపాటి బిల్లులు చెల్లించినా మార్చి ఒకటి నుంచి ఇప్పటి వరకు బిల్లుల మాటేలేదు. నిర్మాణాలు చేసినా బిల్లులు ఇవ్వరన్న అభిప్రాయంతో పనులపై లబ్ధిదారులు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. పెండింగ్‌లో రూ.35కోట్లు.. మార్చి ఒకటి నుంచి ఇప్పటివరకూ రూ.35కోట్లమేర పెండింగ్ బిల్లులున్నాయని అధికారిక సమాచారం. ఇది మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మండల స్థాయిలో అధికారులు రోజూ నిర్మాణ వివరాలు నమోదు చేస్తూ బిల్లుల మంజూరుకు ఆన్లైన్లో సిఫారసు చేస్తారు. ఇలా నిత్యం సిఫారసులు చేయడమే కనిపిస్తోంది తప్ప డబ్బులు రావడం లేదు. లబ్ధిదారులు గృహనిర్మాణశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మోల్డింగ్ వేసినా పునాది బిల్లే సొంతిల్లు లేకపోవడంతో ఎన్టీఆర్ గృహం మంజూ రు చేశారు. ఇంటి నిర్మాణ పనులు చేపట్టి మోల్డింగ్ చేయించాం. మూడు విడతల బిల్లులు మంజూరు కావాల్సివుండగా పునాది బిల్లు రూ.14,450 మా త్రమే మంజూరైంది. గోడలకు రూ.25వేలు, మోల్డింగ్‌కు రూ.40వేలు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అప్పులకు వడ్డీ పెరుగుతోంది. -
ఉద్యమాలతో చంద్రబాబు గుండెల్లో దడ
తిరుపతి మంగళం : ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు, జనసేనపార్టీలు చేస్తున్న ఉద్యమాలతో చంద్రబాబు గుండెల్లో దడ పుట్టిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ, సీపీఎం, సిపిఐ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వందల బైకు లతో నాలుగుకాళ్ల మండపం, కర్నాలవీధి, భేరివీధి, టౌన్‌క్లబ్, బాలాజికాలనీ, గాంధీరోడ్డు మీదగా తుడా సర్కిల్ వర కు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కరుణాకరరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీతో ఇతర రాజకీయపార్టీలన్నీ జతకట్టి ఉద్యమాలు తీవ్రతరం చేయడంతో చంద్రబాబు గుండెల్లో దడ పుట్టి తాను ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తానంటూ డ్రామాలు ఆడడం మొదలు పెట్టాడని మండిపడ్డారు. 16వతేదీన రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. బంద్ ను అడ్డుకునేందుకు చంద్రబాబు పోలీ సులతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చరిత్రలో ప్రజాద్రోహిగా నిలిచిపోతాడన్నారు. సీపీఎం నాయకులు కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి పుల్లయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, జనసేన నాయకులు కిరణ్‌రాయల్ మాట్లాడారు. వైఎస్సార్సీపీ యువ నాయకులు భూమన అభినయ్, నాయకులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్కే.బాబు, ఎస్కే.ఇమామ్, జ్యోతిప్రకాష్, రాజేంద్ర, కట్టా గోపీయాదవ్, ఆదికేశవులురెడ్డి, బాలిశెట్టి కిషోర్, మా ర్కెట్ వంశీ, తాలూరి ప్రసాద్, నరేంద్రనాథ్, పాముల రమేష్‌రెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, జాఫర్, చాంద్‌బాషా, మాధవనాయుడు, పుష్పాచౌదరి, రమణమ్మ, శ్యామల, పుణీత, సీపీఐ నేతలు పెంచలయ్య, రాధాకృష్ణ, ఎస్ఎఫ్ఐ నేత జయచంద్ర పాల్గొన్నారు. -
కుటుంబమంతా దీక్షా శిబిరంలోనే..
ఐదు కోట్ల ఆంధ్రుల కోసం...విభజన హక్కుల సాధన కోసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం.. ప్రాణాలను పణంగా పెట్టి హస్తినలో ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న ఎంపీలకు సర్వత్రా మద్దతు వెల్లువెత్తుతోంది. జిల్లాకు చెందిన పార్టీ శాసనసభ్యులూ, సమన్వయకర్తలు, వివిధ విభాగాల్లో పార్టీకి సేవలందించే నాయకులంతా మూడు రోజుల ముందే ఢిల్లీ చేరుకున్నారు. ఎంపీలు దీక్ష చేస్తోన్న శిబిరానికి వెళ్లి సంఘీభావం ప్రకటించి హోదా సాధనలో భాగస్వాములవుతున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే..చిత్తూరు జిల్లా నేతలే ఢిల్లీలో కీలకంగా మారి ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీ ఎంపీలందరూ ఈ నెల 6న పదవులకు రాజీనామాలు చేసి ఏపీ భవన్లో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. రోజులు గడుస్తున్నా, దీక్షకు కూర్చున్న వారి ఆరోగ్యం క్షీణిస్తున్నా కేంద్రం నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో ప్రాణాలైనా అర్పిస్తాం, ఉద్యమాన్ని వీడబోమన్న ఎంపీల పిలుపునకు వివిధ జిల్లాల నాయకులందరూ కదిలారు. హస్తిన బాట పట్టి దీక్షా శిబిరాన్ని చేరుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నేతలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏపీ శాసనసభలో ఉప నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు సారథ్యం వహించారు. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కళత్తూరు నారాయణస్వామి, డాక్టర్ సునీల్ కుమార్, చింతల రామచంద్రా రెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, ఆర్కే రోజాలతో పాటు సమన్వయకర్తలు జంగాలపల్లి శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి తదితరులంతా దీక్షా శిబిరానికి చేరుకుని ఎంపీలకు సంఘీభావం ప్రకటించారు. హోదా నినాదంలో గొంతు కలిపారు. రాష్ట్రం తరపున నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. దీక్షలు సంపూర్ణంగా ముగిసే వరకూ ఢిల్లీలోనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. కుటుంబమంతా దీక్షా శిబిరంలోనే.. ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తోన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. వైద్యులు రెండు పూటలా పరీక్షలు నిర్వహించి జాగ్రత్తలు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందిన మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణమ్మ, భార్య దివ్య, సోదరి శ్రీశక్తిలు రెండు రోజులుగా దీక్షా ప్రాంగణాన్ని వీడటం లేదు. దగ్గరుండి మిథున్ రెడ్డికి మద్దతు ప్రకటించి ధైర్యం చెబుతున్నారు. దీక్ష విరమించమని పలువురు మిత్రులు, పార్టీ పెద్దలు చెప్పినా మిథున్ రెడ్డి పట్టువీడటం లేదు. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళ్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు. కాపునాడు నేతల సంఘీభావం.. రాయలసీమ కాపునాడు నేతలు పలువురు మంగళవారం ఢిల్లీ వెళ్లి ఎంపీ మిథున్‌రెడ్డి దీక్షకు మద్దతు ప్రకటించారు. చిత్తూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు వీరికి నేతృత్వం వహించారు. జింకా వెంకటాచలపతి, మిద్దింటి కిషోర్, కొండవీటి నాగభూషణం, కోలా సోము, పీటీఎం శివన్న, సోంపాలెం జయచంద్ర తదితరులు మద్దతు ప్రకటించిన వారిలో ఉన్నారు. అదేవిధంగా తిరుపతికి చెందిన రాయలసీమ విద్యాసంస్థల డైరెక్టర్ వై. ఆనందరెడ్డి, సదుం రవీంద్రనాథ్‌లు కూడా ఢిల్లీ వెళ్లి ఎంపీ మిథున్ రెడ్డికి సంఘీభావాన్ని ప్రకటించారు. -
ఈ కోర్సు పూర్తిచేస్తే..వందశాతం ప్లేస్మెంట్...
యూనివర్సిటీ క్యాంపస్ : హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ కోర్సు పూర్తిచేసే విద్యార్థులకు వందశాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ సంస్థ రీజనల్ డైరెక్టర్ జయప్రకాష్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతిలోని ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత పర్యాటక శాఖ, ఏపీ పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కోర్సు పూర్తిచేసిన వారికి అంతర్జాతీయ హోటళ్లలో ఉద్యోగాలు లభించాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ గిరిబాబు మాట్లాడుతూ 2018–19 సంవత్సరానికి బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇంటర్లో 50 శాతం మార్కులు సాధించిన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులన్నారు. కోర్సులో భాగంగా ఒక సంవత్సరం పాటు దేశవిదేశాల వంటకాలు నేర్పించి ఆరు సంవత్సరాల పాటు ప్రముఖ స్టార్ హోటళ్లలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఫుడ్ అండ్ బేవరేజస్ సర్వీస్‌లకు సంబంధించిన సర్టిఫికెట్ కోర్సులు కూడా ఆఫర్ చేస్తున్నామన్నారు. ఆసక్తి గల వారు జూన్ 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9701343849లో సంప్రదించాలన్నారు. టూరిజం శాఖ అధికారి చంద్రమౌళి మాట్లాడారు. -
ర‘హోదా’రుల దిగ్బంధం
సాక్షి, తిరుపతి : ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పోరాటం ఉధృతం చేస్తున్నారు. కొవ్వొత్తుల ర్యాలీ, మానవహారాలు, ధర్నా, వంటావార్పు, రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపట్ల నిరసన తెలియజేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా మంగళవారం అన్ని చోట్ల జాతీయ రహదారులను దిగ్బంధిం చింది. ప్రత్యేకహోదా కోసం చేపడుతున్న ఆందోళనకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. మదనపల్లె్లలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో అనిబిసెంట్ కూడలిలో రహదారిపై బైఠాయించారు. చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జాతీయ రహదారిపై నిరసన తెలియజేశారు. పూతలపట్టు వావిల్‌తోట క్రాస్, చంద్రగిరి నియోజకవర్గం రామానుజపల్లి చెక్‌పోస్టు వద్ద పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. బంగారుపాళెం వద్ద పలమనేరు–కుప్పం రహదారిపై వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పీలేరు, సత్యవేడు, తంబళ్లపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు రహదారులను దిగ్బంధించా రు. పుంగనూరు, చౌడేపల్లి, సోమలలో నేతలు జాతీయ రహదారిపై బైఠాయించారు. వైఎస్సార్సీపీ నేతలకు మద్దతుగా ఆటో మొబైల్స్ వర్కర్స్ యూనియన్ సభ్యులు మోకా ళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. పుంగనూరులో రిలే నిరాహారదీక్షలు కొనసాగించారు. రిలే దీక్షలకు వైఎస్సా ర్ ఆర్టీసీ యూనియన్ సభ్యులు మద్దతు తెలియజేశారు. కుప్పం, నగరి, పలమనేరు, శ్రీకాళహస్తిలో వైఎస్సార్సీపీ నేతలు జాతీయరహదారిపై ఆందోళన చేశారు. తంబళ్లపల్లి, శ్రీకాళహస్తి, తిరుపతిలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి రిలే దీక్షలు కొనసాగించారు. రిటైర్డ్ ప్రొఫెసర్లు మద్దతు తెలియజేశారు. -
26, 27న తిరుపతిలో అంతర్జాతీయ విద్యాసదస్సు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : తిరుపతిలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 26, 27వ తేదీల్లో అంతర్జాతీయ ఆంగ్ల విద్యాసదస్సు నిర్వహించనున్నట్లు ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) జిల్లా అధ్యక్షుడు నాగం రఘురాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ఆంగ్ల విద్యావేత్తలు పాల్గొని ‘ఆంగ్లభాష, సాహిత్య బోధన–ఆధునిక పోకడ’పై చర్చిస్తారన్నారు. ఆసక్తిగల ఉపాధ్యాయులు ఇందులో పాల్గొనవచ్చన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. -
సన్ హాట్‌హాట్... తిరుమల కూల్‌కూల్