
ప్లేస్‌మెంట్ లెటర్లు అందజేస్తున్న రీజనల్ డైరెక్టర్ జయప్రకాష్
యూనివర్సిటీ క్యాంపస్ : హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ కోర్సు పూర్తిచేసే విద్యార్థులకు వందశాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ సంస్థ రీజనల్ డైరెక్టర్ జయప్రకాష్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతిలోని ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత పర్యాటక శాఖ, ఏపీ పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కోర్సు పూర్తిచేసిన వారికి అంతర్జాతీయ హోటళ్లలో ఉద్యోగాలు లభించాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ గిరిబాబు మాట్లాడుతూ 2018–19 సంవత్సరానికి బీఎస్సీ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
ఇంటర్‌లో 50 శాతం మార్కులు సాధించిన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులన్నారు. కోర్సులో భాగంగా ఒక సంవత్సరం పాటు దేశవిదేశాల వంటకాలు నేర్పించి ఆరు సంవత్సరాల పాటు ప్రముఖ స్టార్ హోటళ్లలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఫుడ్ అండ్ బేవరేజస్ సర్వీస్‌లకు సంబంధించిన సర్టిఫికెట్ కోర్సులు కూడా ఆఫర్ చేస్తున్నామన్నారు. ఆసక్తి గల వారు జూన్ 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9701343849లో సంప్రదించాలన్నారు. టూరిజం శాఖ అధికారి చంద్రమౌళి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment