జాతీయ రహదారుల దిగ్బంధనం సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని ఉప్పరపల్లి హైవేపై రాస్తారోకో చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు
సాక్షి, తిరుపతి : ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పోరాటం ఉధృతం చేస్తున్నారు. కొవ్వొత్తుల ర్యాలీ, మానవహారాలు, ధర్నా, వంటావార్పు, రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపట్ల నిరసన తెలియజేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా మంగళవారం అన్ని చోట్ల జాతీయ రహదారులను దిగ్బంధిం చింది. ప్రత్యేకహోదా కోసం చేపడుతున్న ఆందోళనకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. మదనపల్లె్లలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో అనిబిసెంట్ కూడలిలో రహదారిపై బైఠాయించారు. చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జాతీయ రహదారిపై నిరసన తెలియజేశారు. పూతలపట్టు వావిల్‌తోట క్రాస్, చంద్రగిరి నియోజకవర్గం రామానుజపల్లి చెక్‌పోస్టు వద్ద పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.
బంగారుపాళెం వద్ద పలమనేరు–కుప్పం రహదారిపై వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పీలేరు, సత్యవేడు, తంబళ్లపల్లిలో వైఎస్సార్‌సీపీ నేతలు రహదారులను దిగ్బంధించా రు. పుంగనూరు, చౌడేపల్లి, సోమలలో నేతలు జాతీయ రహదారిపై బైఠాయించారు. వైఎస్సార్‌సీపీ నేతలకు మద్దతుగా ఆటో మొబైల్స్ వర్కర్స్ యూనియన్ సభ్యులు మోకా ళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. పుంగనూరులో రిలే నిరాహారదీక్షలు కొనసాగించారు. రిలే దీక్షలకు వైఎస్సా ర్ ఆర్టీసీ యూనియన్ సభ్యులు మద్దతు తెలియజేశారు. కుప్పం, నగరి, పలమనేరు, శ్రీకాళహస్తిలో వైఎస్సార్‌సీపీ నేతలు జాతీయరహదారిపై ఆందోళన చేశారు. తంబళ్లపల్లి, శ్రీకాళహస్తి, తిరుపతిలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి రిలే దీక్షలు కొనసాగించారు. రిటైర్డ్ ప్రొఫెసర్లు మద్దతు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment