colector
-
కలసికట్టుగా పనిచేస్తేనే ఎన్నికల నిర్వహణ సాధ్యం.. కలెక్టర్..
సూర్యాపేట: జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన టీములు నిబద్ధతతో పనిచేస్తూ రోజు వారీ నివేదికలను అందించాలని కలెక్టర్ యస్. వెంకట్రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఇంటలీజెన్స్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అక్రమ మద్యం, నల్లబెల్లం, నాటుసారా, నగదుపై గట్టి నిఘా ఉంచి తనిఖీలు చేపట్టాలన్నారు. పట్టుకున్న నగదు ను సత్వరమే అకౌంట్లో జమ చేయాలని ఆదేశించారు. రూ. 5 లక్షల విత్‌డ్రాలను నిరంతరం పరిశీలించి నివేదికలు అందించాలన్నారు. చెక్ పోస్ట్‌ల్లో నిఘా పెంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, నగదు దొరికితే గ్రీన్ కమిటీకి అన్ని ఆధారాలతో సమర్పించాలని, రూ. 50 లక్షలకు పైబడి పట్టుబడితే వెంటనే డబ్బులతో పాటు వాహనాన్ని సీజ్ చేయాలని సూచించారు. లావాదేవీలు నిరంతర పరిశీలన చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. రోజూ వాణిజ్య పరమైన లావాదేవీలపై నిరంతరం నిఘా ఉంచాలని , గృహోపకరణ గోదాంలను తని ఖీలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనవు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, అదనవు ఎస్పీ నాగేశ్వర రావు, ఏజీయం జ్యోతి, ఎకై ్సజ్ పర్యవేక్షకురాలు అనిత, ఎల్డీయం బాపూజీ, డీటీఓ రవి కుమార్, డీసీఓ శ్రీధర్, సీటీఓ యాదగిరి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వసతుల పరిశీలనకు టీములు పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల పరిశీలనకు నియోజకవర్గానికి ఒక టీము చొప్పున ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ యస్. వెంకట్రావు ఓ ప్రకటనలో వెల్లడించారు. సూర్యాపేట నియోజక వర్గానికి జెడ్పీ సీఈఓ సురేష్, కోదాడకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావునాయక్, హుజూర్‌నగర్‌కు డీపీఓ యాదయ్య, తుంగతుర్తి నియోజకవర్గానికి డీఆర్డీఓ కిరణ్‌కుమార్‌ను నియమించామని వీరి ఆధ్వర్యంలో టీములు పనిచేస్తాయని తెలిపారు. ఈ టీముల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ అధికారులు ఉంటారని పేర్కొన్నారు. -
గుత్తి ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కలెక్టర్
-
వైఎస్ జగన్ అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు
-
కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ కాన్ఫరెన్స్
-
ఎక్సలెంట్ కలెక్టర్
సిద్దిపేటటౌన్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అందించే రాష్ట్ర ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఐఏఎస్ అధికారుల కేటగిరీలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గోల్కొండ కోటలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో అవార్డుతో పాటు రూ.5 లక్షల క్యాష్ సర్టిఫికెట్ అందుకోనున్నారు. జిల్లాలో చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ, ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణం, హరితహారం, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలలో మంచి పనితీరు కనబర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించనుంది. అవార్డు లభించిన సందర్భంగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని జేసీ, డీఆర్వో, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల అధికారుల, రెవెన్యూ సిబ్బంది, జిల్లా అధికారుల సమిష్టి కృషి ఫలితంగానే తనికీ అవార్డు లభించిందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా అభివృద్ధి పథంలో నడిచేలా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, అభివృద్ధిలో తనను భాగస్వామ్యం చేయడం పట్ల సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
మే 29 వరకు ఎన్నికల నియమావళి అమలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మే 29వ తేదీ వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. ఆదివారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను శనివారం సాయంత్రం జారీ చేసిందన్నారు. జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న కారణంగా ఎలాంటి అధికారిక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజ కీయ నాయకులు, ప్రజలు సహకరిం చాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చట్టపరంగా చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. ఎన్నికలను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు 1,163 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉంటారన్నారు. అందులో జెడ్పీటీసీలు 65 మంది, ఎంపీటీసీలు 884, చిత్తూరు మున్సిపల్ కార్పొరేటర్లు 49 మంది, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లు 34 మంది, మదనపల్లె మున్సిపల్ కౌన్సిలర్లు 33 మంది, పుంగనూరు మున్సిపల్ కౌన్సిలర్లు 24 మంది, నగరి కౌన్సిలర్లు 27 మంది, పలమనేరు కౌన్సిలర్లు 24 మంది, పుత్తూరు కౌన్సిలర్లు 23 మంది ఓటర్లుగా ఉంటారన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్ వ్యవహరిస్తారని తెలియజేశారు. -
ర‘హోదా’రుల దిగ్బంధం
సాక్షి, తిరుపతి : ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పోరాటం ఉధృతం చేస్తున్నారు. కొవ్వొత్తుల ర్యాలీ, మానవహారాలు, ధర్నా, వంటావార్పు, రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపట్ల నిరసన తెలియజేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా మంగళవారం అన్ని చోట్ల జాతీయ రహదారులను దిగ్బంధిం చింది. ప్రత్యేకహోదా కోసం చేపడుతున్న ఆందోళనకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. మదనపల్లె్లలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో అనిబిసెంట్ కూడలిలో రహదారిపై బైఠాయించారు. చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జాతీయ రహదారిపై నిరసన తెలియజేశారు. పూతలపట్టు వావిల్‌తోట క్రాస్, చంద్రగిరి నియోజకవర్గం రామానుజపల్లి చెక్‌పోస్టు వద్ద పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. బంగారుపాళెం వద్ద పలమనేరు–కుప్పం రహదారిపై వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పీలేరు, సత్యవేడు, తంబళ్లపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు రహదారులను దిగ్బంధించా రు. పుంగనూరు, చౌడేపల్లి, సోమలలో నేతలు జాతీయ రహదారిపై బైఠాయించారు. వైఎస్సార్సీపీ నేతలకు మద్దతుగా ఆటో మొబైల్స్ వర్కర్స్ యూనియన్ సభ్యులు మోకా ళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. పుంగనూరులో రిలే నిరాహారదీక్షలు కొనసాగించారు. రిలే దీక్షలకు వైఎస్సా ర్ ఆర్టీసీ యూనియన్ సభ్యులు మద్దతు తెలియజేశారు. కుప్పం, నగరి, పలమనేరు, శ్రీకాళహస్తిలో వైఎస్సార్సీపీ నేతలు జాతీయరహదారిపై ఆందోళన చేశారు. తంబళ్లపల్లి, శ్రీకాళహస్తి, తిరుపతిలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి రిలే దీక్షలు కొనసాగించారు. రిటైర్డ్ ప్రొఫెసర్లు మద్దతు తెలియజేశారు. -
ఓటర్ల సవరణకు పరిశీలకులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ఎన్నికల సంఘం ఓటర్ల సవరణకు ఆదేశాలు జారీ చేసింది. బూత్‌స్థాయిల వారీగా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదు అవకాశం కల్పించింది. ఈ ఓటర్ల జాబితా తదితర ప్రక్రియను పరిశీలించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఐఏఎస్ అధికారి ఎం.జగదీశ్వర్‌ను నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు, సవరణ కోసం క్యాంపెయిన్లు నిర్వహించనున్నారు. బూత్‌స్థాయిలో ఈనెల 4, 11 తేదీల్లో బూత్‌స్థాయి అధికారి (బీఎల్వో) ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓటర్ల మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన ఓటర్లందరూ ఈనెల 14 వరకు తమ దరఖాస్తులు సమర్పిస్తే పరిశీలించి, అంతిమ ఓటర్ల జాబితా 24న ప్రచురిస్తారు. అధికారులతో ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనూప్‌సింగ్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాలకు ఎలక్ట్రోరల్ ఆబ్జర్వర్లను నియమించినట్లు పేర్కొన్న ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి, మహిళా, శిశు, వికలాంగులశాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్‌ను ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. ఎలక్ట్రోరల్ ఆబ్జర్వర్లు జిల్లాలకు వచ్చినప్పుడు గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల ప్రతినిధులు, ఓటరు నమోదు అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. రికార్డులు అన్ని సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎలక్ట్రోరల్ ఆబ్జర్వర్లకు లైజన్ ఆఫీసర్‌ను నియమించుకుని అట్టి వివరాలను సమర్పించాలని తెలిపారు. వీడియో కాన్పరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, డీఆర్వో అయేషామస్రత్ ఖానమ్, జిల్లా పరిషత్ సీఈవో పద్మావతి, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు బి.రాజాగౌడ్, చెన్నయ్య, ఆసెంబ్లీ నియోజక వర్గ సహాయ ఓటరు నమోదు అధికారి, తహసీల్దార్లు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపెన్ తేదీలు : కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా సవరణలో నమోదు మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు తొలగింపు ప్రక్రియకు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 14వరకు అవకాశముందని, ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపైన్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అంతిమ ఓటర్ల జాబితా మార్చి 24న ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. -
ఇది వైకల్యం కాదట
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో) : ఈ వ్యక్తి శారీరక వైకల్యం అందరికీ కనిపిస్తుంది. చూసిన ప్రతి ఒక్కరికీ అయ్యో అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తిని పరిశీలించిన వైద్యునికి మాత్రం వైకల్యం కనిపించలేదు. ఫలితంగా ఆ నిర్భాగ్యుడు ప్రభుత్వం నుంచి పొందాల్సిన ప్రయోజనాలను అందుకోలేకపోతున్నాడు. చేసేదిలేక చివరకు జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్‌కు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఏలూరు మస్తానమన్యం కాలనీకి చెందిన బర్లా గొల్ల అనే వ్యక్తి చిన్నప్పుడు ప్రమాదంలో తన ఎడమచేతిని కోల్పోయాడు. అప్పటి నుంచి వికలాంగునిగానే ఉండిపోయాడు. వికలాంగులకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు పొందాలంటే ప్రభుత్వ వైద్యులు గుర్తించి సదరం ధ్రువీకరణ పత్రం జారీ చేయాల్సి ఉంది. ఇది జారీ చేసేందుకు ఎన్నిసార్లు వైద్యుల వద్దకు తిరిగినా పట్టించుకోవడం లేదు. ఇటీవల సదరం ధ్రువీకరణ పత్రానికి జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. గొల్లను పరీక్షించిన వైద్యులు ప్రమాదానికి గురైన చేతిని కదిలించమని చెప్పడంతో ఆ మొండి చేతినే కదిలించాడు. చేయి కదులుతుంది కాబట్టి వికలాంగునిగా ధ్రువీకరణ పత్రం ఇవ్వడం వీలుపడదని సదరు వైద్యుడు తిప్పి పంపించేశారు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని మీ కోసంలో కలెక్టర్ భాస్కర్‌కు విషయాన్ని వివరించాడు. కలెక్టర్ స్పందించి వైద్యారోగ్యశాభాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్‌తో మాట్లాడి తక్షణమే సదరం ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని ఆదేశించారు. -
ఈజీఎస్ పనులు శాశ్వతంగా ఉంటాయి
కలెక్టర్ వాకాటి కరుణ ఉపాధిహామీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు పంపిణీ హన్మకొండ అర్బన్l: జిల్లాల విభజన జరిగి ఉద్యోగులు ప్రాంతాలుగా విyì పోయినా ఉపాధి హామీ పనులు మా త్రం శాశ్వతంగా ఉంటాయని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. కాజీపేట దర్గారోడ్డులోని డ్వామా కార్యాల యంలో శుక్రవారం 380 మంది ఈజీఎస్ ఉద్యోగులకు ఆమె హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 30వేల ఫారం పాండ్స్ నిర్మాణాలు లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివ కు 13వేలు పూర్తయ్యాయన్నారు. నవం బర్ వరకు ఫాంపాండ్స్ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. అలాగే వాటి నిర్మాణాలతో లబ్ధి పొందుతున్న వారి వివరాలు వారంలో అందజేయాలన్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన బచ్చన్నపేట ఏపీఓ మల్లేశం కుటుంబ సభ్యులకు కార్యాలయం ఉద్యోగులు సేకరించిన రూ. 50 వేలు, ఏపీఓల సంఘం నుంచి సేకరించిన రూ. 36 వేలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. కాగా, ఇ టీవల రాష్ట్రస్థాయి హరితహారం అవార్డు అందుకున్న ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, ఏపీడీ శ్రీనివాస్‌కుమార్, ఏపీడీలు, ఏపీఓలు పాల్గొన్నారు. -
ఆరోగ్య రక్ష కార్డుల పంపిణీ పరిశీలన
మంగపేట : మంగపేట మండలం బాలన్నగూడెం, లక్ష్మీనర్సాపురం గ్రామాల్లో జరుగుతున్న ఆరోగ్య సంరక్షణ కార్డుల పంపిణీ కార్యక్రమ నిర్వహణను కలెక్టర్ కరుణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలకు వచ్చిన ఆయా గ్రామాల ప్రజలతో ఆమె మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సంరక్షణ కార్డులలో వైద్యులు పొందపరుస్తున్న సమాచార వివరాలను ఆమె పరిశీలించారు. వైద్యాధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రధానంగా వర్షాకాలం పూర్తయ్యే వరకు గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వైద్యులను ఆదేశించారు. రేషన్ కార్డులు ఇప్పించాలి l కలెక్టర్‌కు బిల్ట్ కార్మికుల వినతి మండలానికి వచ్చిన కలెక్టర్‌ను బిల్ట్ జేఏసీ నాయకులు వడ్లూరి రాంచందర్, చొక్కారావు, శ్రీనివాస్, కుర్బాన్ అలీ కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. బిల్ట్ కర్మాగారం మూతపడి రెండేళ్లు గడుస్తొందని, 15 నెలలు గడుస్తున్నా కార్మికులకు యాజమాన్యం వేతనాలు చెల్లించక పోవడంతో కార్మికులకు పూటగడవడం కష్టంగా మారిందని, సమస్యపై జేసీఎల్‌తో సమావేశం నిర్వహించేలా చూడాలని వేడుకున్నారు. స్పందిం చిన కలెక్టర్ ప్రభుత్వం బిల్ట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేం దుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ పథకం విషయంపై పరిశీలిస్తామన్నారు. తల్లి, బిడ్డల ఆరోగ్యం మీ చేతుల్లోనే... ఏటూరునాగారం : తల్లి, బిడ్డల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని, వారి ఆరోగ్యాన్ని రక్షిస్తే సమాజాన్ని రక్షించి నట్లే అవుతుందని కలెక్టర్ వాకాటి కరుణ అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం మండల కేం ద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తే ఎలాంటి రోగాలు రావన్నారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాల్లో తల్లులు, చిన్నారులు పోషకాహారం లోపంతో ఉన్నారని పరీక్షల్లో తేలిందన్నారు. పోషకాలను అందించే అంగన్వాడీ సెంటర్ల పని తీరును మెరుగుపర్చాల్సిన బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలపై ఉందన్నారు. ఖాళీల భర్తీ, ఇతర సమస్యలను అంగన్వాడీ కార్యకర్తలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వలియాబీ, సర్పంచ్ ఇర్సవడ్ల ఝాన్సీరాణి, ఎంపీటీసీలు కొప్పుల అనిత, నర్సింగరావు, ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ మహేందర్‌జీ, ఐసీడీఎస్ పీడీ శైలజ, సీడీపీఓలు రాజ మణి, మల్లేశ్వరి, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
పోలవరం హెడ్‌వర్క్స్ ఏఈ సస్పెన్షన్
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : పోలవరం ప్రాజెక్టు భూసేకరణ పనుల్లో అలసత్వం వహించిన హెడ్‌వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మునిరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ తాను చేపట్టిన సమీక్షలకు పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు హాజరు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఎల్పీ షెడ్యూళ్లు, డిజైన్లు అందించడంలో జాప్యం చేస్తున్న గాయత్రి ఏజెన్సీ మరో 15 రోజుల్లో మెయిన్ కెనాల్ డిజైన్లు సమర్పించాలని, లేకుంటే ఏజెన్సీ తొలగిస్తామని కలెక్టర్ ఆ కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం, తణుకు వంటి ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ రోడ్లను గుర్తించి నిర్మించాలని ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజనీర్‌ను కలెక్టరు ఆదేశించారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, జేసీ–2 ఎంహెచ్. షరీఫ్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్, డీఆర్ఓ కె.ప్రభాకరరావు, నర్సాపురం సబ్ కలెక్టరు ఎ.ఎస్.దినేష్ కుమార్, ఐటీడీఏ పీఓ షాన్మోహన్, జిల్లా అధికారులు, ఆర్డీవోలు పాల్గొన్నారు.